ఆర్డర్ ఆఫ్ ది నైల్: మోదీకి ఈజిప్ట్ అత్యున్నత పురస్కారం
ప్రధాని నరేంద్రమోదీని 'ఆర్డర్ ఆఫ్ ది నైల్' గౌరవంతో ఈజిప్ట్ ప్రభుత్వం సత్కరించింది. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతే అల్-సిసి ఆదివారం మోదీకి ఈ గౌరవాన్ని అందించారు.
లైవ్ కవరేజీ
ప్రధాని మోదీ ముందున్న 10 సవాళ్లు ఏంటి?
‘‘5 నెలల్లోనే బియ్యం బస్తా రూ.700 పెరిగింది’’ - తెలుగు రాష్ట్రాల్లో బియ్యం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
ఇంద్రకీలాద్రి: అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మేళతాళాలు, మంగళవాయిద్యాలు, పూర్ణకుంభంతో రాష్ట్రపతికి ఘన స్వాగతం

ఫొటో సోర్స్, I& PR AP
ఫొటో క్యాప్షన్, ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారిని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. రాష్ట్రపతి ఇంద్రకీలాద్రికి చేరుకున్న సందర్భంగా ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు.
విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, దుర్గగుడి చైర్మన్ బొర్రా గాంధీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితులు పూజా కార్యక్రమాలు నిర్వహించి రాష్ట్రపతికి వేద మంత్రోచ్ఛారణల నడుమ వేద ఆశీర్వచనం అందజేశారు.
అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ అధికారులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కనకదుర్గ అమ్మవారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. అలాగే అమ్మవారి చిత్రపటాన్ని అందించి గౌరవపూర్వకంగా సత్కరించారు.
భర్తను హత్య చేసి బ్లూ డ్రమ్‌లో దాచిన మహిళకు, ఆమె ప్రియుడికి ఉరిశిక్ష
జనసేనలో చేరిన వంగవీటి రాధ

ఫొటో సోర్స్, JANASENA
ఫొటో క్యాప్షన్, జనసేనలో చేరిన వంగవీటి రాధ టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరారు. పార్టీ కండువా కప్పి వంగవీటి రాధను పవన్ కల్యాణ్ సాదరంగా ఆహ్వానించారు.
పార్టీలో చేరేందుకు జనసేన కేంద్ర కార్యాలయానికి బుధవారం సాయంత్రం వచ్చిన వంగవీటి రాధాకృష్ణను పవన్ కల్యాణ్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు.
అనంతరం వంగవీటి రాధ తన అనుచరులను పవన్ కల్యాణ్‌కు పరిచయం చేశారు. జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం కలసికట్టుగా పని చేద్దామని, ప్రజాసేవలో సమష్టిగా ముందుకు వెళ్దామని పవన్ వారితో అన్నారు.
ఒక ఫేస్‌బుక్ పోస్టుకు వేసిన మరణ శిక్షను రద్దు చేసిన సౌదీ అరేబియా
వద్దన్నా కుప్పలు తెప్పలుగా ‘క్యాష్ ఆన్ డెలివరీ’ పార్సిళ్లు, తట్టుకోలేక విదేశాలకు వెళ్లిపోయిన ఇన్‌ఫ్లూయెన్సర్
జాతీయ జెండా ఎగురవేసినవారిని జైల్లో పెట్టడం పిరికితనం -రాహుల్

ఫొటో సోర్స్, @RahulGandhi
ఫొటో క్యాప్షన్, సీజేపీ నేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ అరెస్టుపై స్పందించిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ జంతర్ మంతర్‌లో జాతీయ జెండా ఎగరేయడం నేరం కాదు, కానీ ఆ పనిచేసిన కొందరిని జైల్లో పెట్టడం పిరికితనమే అన్నారు లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ.
సీజేపీ నేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌ను దిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి, జ్యుడిషియల్ కస్టడీకి పంపడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన ఎక్స్ ఖాతాలో స్పందించారు.
“జంతర్ మంతర్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి శాంతియుతంగా నిరసన తెలపడం నేరం కాదు. యువకులను జైల్లో వేయడం పిరికితనం” అని రాహుల్ గాంధీ విమర్శించారు.
"విద్యార్థులు, యువతరం, జర్నలిస్టులు, ‘ఇండియా’ బ్లాక్ పార్టీల బ్యానర్లు వేర్వేరు కావచ్చు. కానీ లక్ష్యం మాత్రం ఒక్కటే. ఒకే విషయం గురించి నిరసనలు జరుగుతున్నాయి. పౌరులు తమ రాజ్యాంగబద్ధమైన హక్కులను కోరుతున్నారు. జంతర్ మంతర్ దేశ ప్రజలది. దాన్ని తిరిగి సాధించుకుంటాం’’ అని రాహుల్ స్పష్టం చేశారు.
ఇదే అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ కూడా సోషల్ మీడియాలో విమర్శించారు.
"త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి, భారత్ మాతాకి జై అని నినాదాలు చేసిన సీజేపీ నేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌ను మీరు జైలుకు పంపించారు. యువతతో పెట్టుకోవద్దు మోదీజీ, త్వరలోనే మీ నియంతృత్వానికి ముగింపు పలుకుతారు" అని సంజయ్ సింగ్ రాసుకొచ్చారు.
మంగళవారం జంతర్ మంతర్‌లోకి అక్రమంగా చొరబడ్డారని సీజేపీ నాయకులపై దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.
మనం మాట్లాడుకోవడం తగ్గిస్తున్నామా? దారి తెలియకపోతే అడగడం కూడా మానేశామా?
నీటిలో మునిగిపోయిన ఈ గ్రామానికి కోహినూరు వజ్రానికి లింకేంటి, జనం ఇంకా అక్కడ ఎందుకు తవ్వుతున్నారు?
గుడ్ మార్నింగ్, బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం,
నేను బీబీసీ ప్రతినిధి ఖగేశ్. మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమైన వార్తలను మీకు అందిస్తాను.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.
కాంగ్రెస్‌లో నేహా బోరా వంటి నాయకులు ఎందుకు రాలేకపోతున్నారు?
నల్లులను నిర్మూలించడానికి ప్రత్యేకమైన వాక్యూమ్ క్లీనర్.. అసలు ఇంట్లో నల్లులు చేరాయని తెలుసుకోవడం ఎలా?
చిన్నారుల్లో క్యాన్సర్.. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి
నంబర్ ప్లేటే కదా అనుకోవద్దు.. ఇవన్నీ తెలుసుకోండి
ప్రజాస్వామ్యానికి భారత్ తల్లి, ఇక్కడ సమస్యలపై బహిరంగంగా చర్చ జరుగుతుందన్న మోదీ, బ్లూమ్‌బెర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్‌లో ప్రసంగించిన ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, Narendra Modi
ఫొటో క్యాప్షన్, బ్లూమ్‌బెర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్‌లో ప్రసంగించిన ప్రధాని మోదీ ప్రజాస్వామ్యానికి తల్లిలాంటి భారత్‌లో వివిధ అంశాలపై బహిరంగంగా చర్చ జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు.
మంగళవారం దిల్లీలో జరిగిన బ్లూమ్‌బెర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు.
"ప్రజాస్వామ్యానికి భారత్ తల్లి. ఈ దేశంలో 100కు పైగా భాషలు ఉన్నాయి. సుమారు 80,000 రిజిస్టర్డ్ వార్తాపత్రికలు, పబ్లిషర్స్ ఉన్నారు. 1,000కి పైగా శాటిలైట్ టీవీ చానెళ్లు ఉన్నాయి. అంతేకాకుండా, సోషల్ మీడియా యుగంలో, దేశంలో 50 కోట్లకుపైగా యూట్యూబ్ వినియోగదారులు ఉన్నారు. 50 కోట్లకు పైగా ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు ఉన్నారు. వివిధ అంశాలపై బహిరంగ చర్చలు జరుగుతాయి, వివిధ విషయాలపై చర్చిస్తారు. ఇందులో డిజిటల్ పవర్ కీలకం" అని ఆయన అన్నారు.
భారత్‌లో తొలిసారిగా జరుగుతున్న బ్లూమ్‌బెర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్ కార్యక్రమం అక్టోబర్ 15వ తేదీన ముగుస్తుంది.
మరోసారి దిల్లీ పోలీసుల అదుపులో సీజేపీ నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా, జంతర్ మంతర్ వద్దకు వెళ్లేందుకు సీజేపీ నాయకులు ప్రయత్నం

ఫొటో సోర్స్, Sonu Mehta/Hindustan Times via Getty Images
ఫొటో క్యాప్షన్, కాక్రోచ్ జనతా పార్టీ కో కన్వీనర్లు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాను మరోసారి అదుపులోకి తీసుకున్న పోలీసులు జంతర్ మంతర్ వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సీజేపీ నాయకులను దిల్లీ పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు. సీజేపీ కో కన్వీనర్లు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్ తోపాటు అజింక్య షిండే సహా అనేకమంది మద్దతుదారులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి, సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో, పార్టీకి చెందిన కొందరు మద్దతుదారులు జంతర్ మంతర్‌కు చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు ఉంది. "ఈ రోజు తెల్లవారుజామున త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని జంతర్ మంతర్‌లోకి ప్రవేశించిన వారిని దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అశుతోష్ రంకా, సౌరవ్ దాస్, అజింక్య షిండే బృందంలోని ఇతర సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. నరేంద్ర మోదీ, మీరు ఈ నిరసనలను ఆపలేరు" అని ఆపోస్టులో దీప్కే రాశారు.
రాహుల్ తీరు ప్రజాస్వామ్యానికే అవమానకరం: కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విమర్శ, ఇంకా కాంగ్రెస్ గుణపాఠం నేర్చుకోలేదు అన్న సింధియా

ఫొటో సోర్స్, Hindustan Times via Getty Images
ఫొటో క్యాప్షన్, రాహుల్ గాంధీపై జ్యోతిరాదిత్య సింధియా విమర్శలు దిల్లీలో రాహుల్ గాంధీ, ప్రతిపక్ష నేతలు చేపట్టిన నిరసన ప్రజాస్వామ్యానికే అవమానమని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విమర్శించారు.
" లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నుంచి జిల్లా పంచాయతీలు, సర్పంచుల వంటి స్థానిక సంస్థల ఎన్నికల వరకు నిరంతరం ఎన్నికలు జరిగే దేశంలో, ఆ వ్యవస్థపైనే అనుమానాలు వ్యక్తం చేయడం లేదా మచ్చ తీసుకురావడానికి ప్రయత్నించడం కాంగ్రెస్ పార్టీ అసలు ఉద్దేశాన్ని మరోసారి స్పష్టం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం గురించి మాట్లాడుతుంది, కానీ ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ రాజ్యాంగ వ్యవస్థలోని ప్రతి అంశాన్ని తక్కువ చేసి చూపడానికి లేదా అప్రతిష్టపాలు చేయడానికి వెనుకాడటం లేదు. అత్యవసర పరిస్థితిని (ఎమర్జెన్సీ) విధించి రాజ్యాంగాన్ని కాలరాసిన అదే కాంగ్రెస్ పార్టీ, నేడు ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రశ్నిస్తోంది. న్యాయవ్యవస్థ, ప్రధాన న్యాయమూర్తి, భారత సైన్యం, ఎన్నికల సంఘంపై కూడా ప్రశ్నలు లేవనెత్తిన పార్టీ ఇదే. కాంగ్రెస్ పార్టీ బలహీనపరచడానికి ప్రయత్నించని రాజ్యాంగ సంస్థ అంటూ ఏదీ లేదు" అని ఆయన విమర్శించారు.
బెదిరించినా, భయపెట్టినా వెనక్కి తగ్గబోము: రాహుల్ గాంధీ, సోమవారం ఆందోళనలో పాల్గొన్న వారికి ధన్యవాదాలు చెప్పిన రాహుల్

ఫొటో సోర్స్, Hindustan Times via Getty Images
ఫొటో క్యాప్షన్, సోమవారం నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ గాంధీ, ఇతర నాయకులు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలంతా ఐక్యంగా సాగుతున్నారని రాహుల్ అభిప్రాయపడ్డారు. సోమవారం జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వారికి ధన్యవాదాలు చెప్పిన రాహుల్, మొన్న యువకులపై దాడి చేసిన వారు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.
ప్రధాన మంత్రి మాదిరిగానే వారికి కూడా నిలబడి పోరాడే ధైర్యం లేదన్నారు. కేవలం అధికారం, బలాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే పోరాడుతున్నారని విమర్శించారు./
అందరూ కలిసి ఒక జట్టుగా పని చేస్తున్నారని, జరుగుతున్నవి వేర్వేరు నిరసనలు కావని, ఇదొక ఉద్యమమని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగాన్ని హరించేవారికి, ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కేవారికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ నిలబడతారని, ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గబోరని పేర్కొన్నారు. భారత ప్రజలు భయపడబోరని ప్రభుత్వానికి చూపించాల్సిన అవసరం ఉందన్నారు. కొట్టవచ్చు, బెదిరించవచ్చు, భయపెట్టేందుకు ప్రయత్నించవచ్చు అయినా తగ్గబోమని స్పష్టం చేశారు.
