ఆర్డర్ ఆఫ్ ది నైల్: మోదీకి ఈజిప్ట్ అత్యున్నత పురస్కారం

ప్రధాని నరేంద్రమోదీని 'ఆర్డర్ ఆఫ్ ది నైల్' గౌరవంతో ఈజిప్ట్ ప్రభుత్వం సత్కరించింది. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతే అల్-సిసి ఆదివారం మోదీకి ఈ గౌరవాన్ని అందించారు.

లైవ్ కవరేజీ

  1. సీజేపీ నిరసన ప్రదర్శనల రిపోర్టింగ్‌లో జర్నలిస్టులకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి?

  2. జంతర్ మంతర్ ఇక నిరసనల వేదిక కాదు: దిల్లీ పోలీసులు

    దిల్లీ ప్రదర్శనలు,  జంతర్ మంతర్
    ఫొటో క్యాప్షన్, దిల్లీలో నిరసన ప్రదర్శనలకు చేపట్టేందుకు జంతర్ మంతర్‌కు బదులుగా మూడు ప్రత్యామ్నాయ ప్రదేశాలను ఎంపిక చేసినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు.

    దిల్లీలో నిరసనలు, ధర్నాలు నిర్వహించడానికి నిర్దేశించిన ప్రదేశాల జాబితా నుంచి జంతర్ మంతర్‌ను తొలగించారు .

    కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

    దిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ దీని గురించి నోటీస్ జారీ చేశారు.

    జంతర్ మంతర్‌కు బదులుగా తూర్పు దిల్లీలోని రామ్‌లీలా మైదాన్, బురారీ మైదాన్, సీబీడీ మైదాన్‌లలో నిరసనలు చేపట్టవచ్చని ఆ నోటీస్‌లో తెలిపారు.

    “పౌరులకు నిరసనలు, ప్రదర్శనలు నిర్వహించే హక్కును దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుతం ఉన్న నిర్దేశిత స్థలాలకు ప్రత్యామ్నాయాలను సమీక్షించే బాధ్యతను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీకి అప్పగించారు” అని ఆ నోటీస్‌లో పేర్కొన్నారు.

    ఈ మూడు ప్రదేశాలలో నిరసనలు, ధర్నాలు నిర్వహించడానికి విడివిడిగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ విడుదల చేస్తామని ఆ నోటీసులో పేర్కొన్నారు.

  3. జ్ఞానేశ్‌ కుమార్‌ను వదిలేది లేదు. వేచి చేస్తున్నాం: రాహుల్ గాంధీ

    రాహుల్ గాంధీ, నరేంద్రమోదీ, జ్ఞానేశ్ కుమార్
    ఫొటో క్యాప్షన్, నరేంద్రమోదీ ప్రభుత్వం జ్ఞానేశ్ కుమార్‌ను రక్షించేందుకు మిగతా వ్యవస్థలను కూడా దుర్వినియోగం చేస్తోందని రాహుల్ అన్నారు.

    ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌ కుమార్ అవినీతి గురించి తనకు తెలుసని, ఆయన్ను వదిలేది లేదని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు.

    “ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అడిగిన ప్రశ్నలనే మేం కూడా అడుగుతున్నాం. జ్ఞానేశ్ కుమార్ ఎందుకు రాజీనామా చేయడం లేదు? జ్ఞానేశ్ కుమార్ జీ.. మీ పరిస్థితేంటో మాకు తెలుసు. మీకు నిద్ర పట్టడం లేదు. మేం మిమ్మల్ని వదిలిపెట్టం. మీరు తప్పించుకోలేరు. మీ గతం మీ అవినీతి గురించి మాకు తెలుసు. మేం కేవలం వేచి చేస్తున్నాం” అని రాహుల్ గాంధీ అన్నారు.

    దిల్లీలో నిరసనకారులపై జరుగుతున్న పోలీసు చర్యల గురించి రాహుల్ స్పందిస్తూ, ప్రభుత్వం చాలా పెద్ద తప్పు చేస్తోందని అన్నారు.

    “ఓట్ల చోరీకి వ్యతిరేకంగా దిల్లీలో చాలా రోజులుగా నిరసనలు జరుగుతున్నాయి. అసలు ప్రశ్న ఏమిటంటే దిల్లీని ఎందుకు జైలుగా మార్చారు? నగరంలోకి రాకుండా ప్రజలను అడ్డుకుంటున్నారు. రైళ్లు, బస్సుల్లోనే వారిని నిలిపివేస్తున్నారు. ప్రభుత్వం చాలా పెద్ద తప్పు చేస్తోంది” అన్నారు.

  4. బీజేపీ వ్యతిరేక ఓట్లనే తొలగిస్తున్నారు: రేవంత్ రెడ్డి

    కాంగ్రెస్ తెలంగాణ, రేవంత్ రెడ్డి
    ఫొటో క్యాప్షన్, సోమవారం జరగనున్న ర్యాలీ కోసం దిల్లీకి చేరుకున్న రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

    బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) అమలుచేసిన రాష్ట్రాలలోనే ఆ పార్టీ గెలిచిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

    సోమవారం జరగనున్న కాంగ్రెస్ పాదయాత్ర కోసం దిల్లీకి చేరుకున్న రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

    "ముఖ్యంగా బీజేపీని వ్యతిరేకిస్తున్నది ఎవరంటే..దళితులు, ఆదివాసీలు, గిరిజనులు, మైనార్టీలు, యువత. బీజేపీని ఓడించాలనుకున్న ప్రజల ఓటు హక్కును తొలగించడానికి కుట్ర చేశారు. జ్ఞానేశ్‌కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని కమిషన్ సభ్యులు చెప్పారు. తప్పులు జరుగుతున్నాయని తెలిసినపుడు, ఆ అధికారిని తొలగించడానికి మోదీకి అభ్యంతరం ఏమిటి?, ఆయనకు అండగా ఎందుకు నిలబడుతున్నారు" అని రేవంత్ రెడ్డి అన్నారు.

  5. ఒమన్‌ సమీపంలో భారతీయ సిబ్బంది ఉన్న ట్యాంకర్‌పై డ్రోన్‌ దాడి

    ఒమన్, భారత నౌకలపై డ్రోన్ దాడి
    ఫొటో క్యాప్షన్, ఇద్దరు భారతీయులు గల్లంతైనట్లు కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్‌ ఆదివారం రాత్రి ధ్రువీకరించారు (ప్రతీకాత్మక చిత్రం).

    ఒమన్‌ సమీపంలో భారతీయ సిబ్బంది ఉన్న ట్యాంకర్‌పై ఆదివారం డ్రోన్‌ దాడి జరిగింది. నౌకలో ఉన్న 11 మంది భారతీయ నావికుల్లో తొమ్మిది మందిని రక్షించగా.. మరో ఇద్దరు గల్లంతయ్యారు. ఇద్దరు నావికులు కనిపించకుండా పోయిన విషయాన్ని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్‌ ఆదివారం రాత్రి ధ్రువీకరించారు.

    "అక్టోబర్ 11న సోహార్ యాంకరేజ్ వద్ద భారతీయ ట్యాంకర్ ఎం.టి. పెట్రో డాల్ఫిన్‌పై డ్రోన్ దాడి జరిగింది. ట్యాంకర్‌పై 11 మంది భారతీయ నావికులు ఉన్నారు. తొమ్మిది మందిని రక్షించారు, ఇద్దరు గల్లంతయ్యారు" అన్నారు.

    స్థానిక తీర రక్షక దళం గాలింపు, సహాయక చర్యలు చేపట్టిందని మంత్రి వివరించారు.

    గల్లంతైన వారిని గుర్తించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, సహాయక చర్యలకు పూర్తి మద్దతు అందించేందుకు సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని సర్బానంద సోనోవాల్‌ పేర్కొన్నారు.

  6. సీజేపీ: బాండ్‌పై సంతకం చేస్తే నిరసనలకు దూరంగా ఉంచగలరా? చట్టం ఏం చెబుతోంది?

  7. యువత ఆగ్రహం ఎవరి మీద? ఎన్నికల సంఘంపైనా, మోదీ పైనా?

  8. సీజేపీ ఆందోళనలు: పోలీసులు విమానంలోకి వచ్చి అరెస్టు చేయవచ్చా?

  9. జిబూటి తీరంలో పడవ మునగడంతో పిల్లలు సహా 139 మంది మృతి, హఫ్సా ఖలీల్

    జిబూటి తీరం, పడవ మునిగిపోవడం
    ఫొటో క్యాప్షన్, ఓబాక్ ఓడరేవు పట్టణానికి ఉత్తరాన ఉన్న గుహెరె సమీపంలో వలసదారులకు సహాయం చేస్తున్న ఐఓఎం సిబ్బంది

    జిబూటి తీరంలో పడవ మునిగిపోవడంతో కనీసం 139 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయారని, అందులో 15 మంది పిల్లలున్నారని ఐక్యరాజ్యసమితి వలసల విభాగం తెలిపింది. పలువురి ఆచూకీ ఇంకా తెలియడం లేదని తెలిపింది.

    305 మందితో జిబూటి నుంచి యెమెన్‌కు బయల్దేరిన పడవ.. గురువారం రాత్రి ఓబాక్ ఓడరేవు పట్టణం సమీపంలో తిరగబడింది.

    ఈ ఘటనలో సుమారు 82 మందిని రక్షించినట్లు అంతర్జాతీయ వలసల సంస్థ (ఐఓఎం) తెలిపింది.

    ఆఫ్రికా ఖండంలోని హార్న్ ఆఫ్ ఆఫ్రికా ప్రాంతం నుంచి ఏటా వేలమంది వలసదారులు ప్రాణాలకు తెగించి ఈ ప్రయాణం సాగిస్తున్నారనీ, భద్రత, ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు చేరుకోవాలనే ఆశతో ప్రమాదకరమైన మార్గంలో వెళ్తున్నారని ఐఓఎం తెలిపింది.

  10. రష్యా-యుక్రెయిన్ మధ్య 'ఎనర్జీ సీజ్ ఫైర్' కుదిరిందన్న డోనల్డ్ ట్రంప్

    రష్యా, యుక్రెయిన్, డోనల్డ్ ట్రంప్
    ఫొటో క్యాప్షన్, రష్యా - యుక్రెయిన్ మధ్య ఎనర్జీ సీజ్ ఫైర్ కుదిరిందని డోనల్డ్ ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు.

    రష్యా యుక్రెయిన్‌ల మధ్య “ఇంధన వనరులపై దాడుల విరమణకు అంగీకారం కుదిరిందని ఇది తక్షణమే అమలులోకి వస్తుందని” అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ తెలిపారు.

    దీనిపై రష్యా స్పందించలేదు.

    ట్రంప్ ప్రకటన తనకు “కొత్త వార్త” అని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియన్‌స్కీ అన్నట్లు అమెరికా వార్తా వెబ్‌సైట్ ఆక్సియోస్ తెలిపింది.

    అంతకుముందు రష్యా చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులను “తక్షణమే ఆపాలి” అని అధ్యక్షుడు ట్రంప్ యుక్రెయిన్‌ను హెచ్చరించారు. ట్రంప్- జెలియన్‌స్కీ మధ్య వివాదం నడుస్తున్న తరుణంలో ఈ ప్రకటన వచ్చింది.

    “రష్యా మా ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను ఆపివేస్తే, మేం రష్యా చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులు చేయడం ఆపేస్తాం” అని జెలియన్‌స్కీ ఆదివారం చెప్పారు.

  11. ‘స్మైలింగ్ డిప్రెషన్’: మీ చిరునవ్వు వెనుక డిప్రెషన్ కూడా ఉండొచ్చు, ఒకసారి చెక్ చేసుకోండి

  12. ‘పోలీసులు మా ఫోన్లు లాక్కున్నారు, న్యాయవాదితో మాట్లాడే అవకాశం ఇవ్వలేదు’

    కాక్రోచ్ జనతాపార్టీ, దిల్లీ ఆందోళనలు, నిర్బంధం
    ఫొటో క్యాప్షన్, విలేఖరుల సమావేశంలో ప్రసంగిస్తున్న సీజేపీ నాయకులు

    పోలీసుల నిర్బంధం నుంచి విడుదలైన కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు నేరుగా ప్రధాని మోదీపై విమర్శల దాడి చేశారు.

    అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ రత్నా సింగ్ విలేఖరుల సమావేశంలో ప్రసంగించారు.

    నాయనమ్మ మృతి చెందడంతో అభిజీత్ దీప్కే స్వగ్రామానికి వెళ్లడంతో ఆయన ఈ సమావేశంలో పాల్గొనలేదు.

    “భారతదేశ చరిత్రలోనే నరేంద్ర మోదీ అత్యంత పిరికి ప్రధానమంత్రి” అని అశుతోష్ రాంకా అన్నారు.

    “ఇదే ప్రభుత్వం నీరవ్ మోదీ, విజయ్ మాల్యాలను విమానంలో ఎక్కించి దేశం నుంచి పంపించివేసింది. మమ్మల్ని మాత్రం విమానం నుంచి దించేసింది” అని సౌరవ్ దాస్ ఆరోపించారు.

    “మమ్మల్ని తీసుకెళ్లేటప్పుడు పోలీసులు మాకెలాంటి నోటీసులు ఇవ్వలేదు. మాఫియా డాన్లలా వచ్చి మమ్మల్ని తీసుకుపోయారు. మా ఫోన్లను బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్లను మహిళా పోలీసులు తీసుకున్నారు. కానీ ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదు” అని ఆయన అన్నారు.

    “నన్ను ఆర్‌కే పురంలో అశుతోష్‌ను బల్లభ్‌గఢ్‌కు, అభిజీత్‌ను కూడా ఎక్కడికో తీసుకువెళ్లారు. మమ్మల్ని తీసుకువెళ్తున్నప్పుడు, మా న్యాయవాదితో మాట్లాడటం మా ప్రాథమిక హక్కు అని అడిగా. కానీ నిర్బంధంలో ఉన్నప్పుడు ఎలాంటి హక్కులు ఉండవని మాకు చెప్పారు. నిరసనకారులతో దిల్లీ పోలీసులు ఇంకెంత క్రూరంగా వ్యవహరించారో” అని సౌరవ్ దాస్ అన్నారు.

    “మా ఫోన్‌ను ఏం చేశారోనని మాకు ఆందోళనగా ఉంది. మా ఫోన్‌ను క్లోన్ చేశారని అనుమానంగా ఉంది. రేపు మా ఫోన్‌ను క్లోన్ చేసి సాక్ష్యంగా సమర్పిస్తారు” అని సౌరవ్‌దాస్ అన్నారు.

  13. చీర ధరించి 1600 మీటర్ల పరుగు పందాన్ని 9 నిమిషాల్లో పూర్తి చేసిన కవిత..

  14. భారత టెక్ దిగ్గజాలపై అమెరికా చర్యలు: గ్రీన్ కార్డుల జారీలో తీవ్ర ఆలస్యం తప్పదా?

  15. ‘‘నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వకపోవడం మీ దేశానికే మచ్చ’’ అంటూ నార్వేపై ట్రంప్ విమర్శలు

  16. యుక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు రావాల్సిన సమయమొచ్చింది: డోనల్డ్ ట్రంప్

    అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్
    ఫొటో క్యాప్షన్, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్

    యుక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు రావాల్సిన సమయం ఆసన్నమైందని భావిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్నారు. రష్యాతో అమెరికా కుదుర్చుకున్న డీజిల్ ఒప్పందంపై జెలియెన్ స్కీ చేసిన విమర్శలకు స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

    రష్యా నుంచి లక్షల టన్నుల డీజిల్‌ను అమెరికాకు సరఫరా చేసేందుకు కొత్త ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల.. యుక్రెయిన్‌పై యుద్ధాన్ని కొనసాగించేందుకు మాస్కోకు డబ్బు అందించినట్లవుతుందని జెలియెన్ స్కీ హెచ్చరించారు. ఈ ఒప్పందాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఇచ్చే బహుమతిగా జెలియెన్‌ స్కీ అభివర్ణించారు.

    శనివారం వైట్‌హౌస్‌ వెలుపల విలేఖరులతో ట్రంప్‌ మాట్లాడారు. రష్యా చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులకు జెలియెన్ స్కీ అనుమతులు ఇస్తూ.. ప్రపంచానికి సమస్యలు సృష్టిస్తున్నారని అమెరికా అధ్యక్షుడు ఆరోపించారు.

    ‘‘ఆయన ఈ పని కచ్చితంగా ఆపేయాలి’’ అన్నారు. ఒప్పందం కుదుర్చుకోగల కొత్త నాయకుడిని యుక్రెయిన్‌ ఎన్నుకోవాలని సూచించారు.

  17. ‘నా కోచ్‌లో మగవాళ్లు మద్యం తాగుతున్నారు’ అంటూ కుటుంబ సభ్యులకు చెప్పిన అస్సాం యువతి తర్వాతి రోజు శవంగా కనిపించారు..

  18. తనిఖీలు,నిర్బంధాలు,ఇంటర్‌నెట్ బంద్, ఎక్కడికక్కడ బారికేడ్లు.. దిల్లీలో ఇప్పటిదాకా ఏం జరిగింది, బీజేపీ ఏమంది?

  19. రష్యా నుంచి చమురు దిగుమతికి ట్రంప్ నిర్ణయం: అమెరికన్ల ఆశ్చర్యం, జెలియెన్‌స్కీ ఆగ్రహం

  20. ముకేశ్ అంబానీని 'ప్రధానమంత్రి' అంటూ కామెంట్ చేసిన ఎలాన్ మస్క్, వీరి మధ్య వివాదం ఏంటి?