మీరు ఈ వెబ్‌సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్‌సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.

నన్ను ప్రధాన వెబ్‌సైట్‌కు తీసుకెళ్లండి

ఆదివాసీ యువకుడిపై మూత్రం పోసిన కేసు: బాధితుడి కాళ్లు కడిగి క్షమాపణ చెప్పిన సీఎం శివరాజ్ సింగ్

బాధితుడిని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ భోపాల్‌కు పిలిపించి మాట్లాడారు. అనంతరం ఆయన కాళ్లు కడగడంతో పాటు పూలమాల వేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఆ యువకుడికి ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పారు.

లైవ్ కవరేజీ

  1. జంతర్‌ మంతర్ నిరసన: ముందస్తు అరెస్టులు, భారీ సంఖ్యలో కేంద్ర బలగాలు

  2. గరివిడి లక్ష్మి ఈవిడే.. ‘ఆమె పాటల క్యాసెట్ లేని ఇల్లు ఉండేది కాదు’

  3. కామ్రేడ్ కళ్యాణ్: లవ్ స్టోరీకి నక్సలిజం టచ్ ఇచ్చి కామెడీ పండించేందుకు చేసిన ప్రయత్నం ఫలించిందా?

  4. ఎలాన్ మస్క్ విషయంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు కాంగ్రెస్ వైఖరికి భిన్నంగా ఉన్నాయా?

  5. ఉప ఎన్నికలు: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఆధిక్యం, తమిళనాడులో టీవీకే ముందంజ, నందిగ్రామ్ అత్యంత చర్చనీయాంశమైన స్థానాల్లో ఒకటిగా పరిగణిస్తున్నారు. అందుకే అందరి దృష్టి ఈ స్థానంపైనే ఉంది.

    దేశంలోని ఆరు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. భారత ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఇచ్చిన ఫలితాల ప్రకారం, పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్ అసెంబ్లీ స్థానంలో భారతీయ జనతా పార్టీకి చెందిన హసీ రాణి రథ్, కాంగ్రెస్ పార్టీకి చెందిన మిలన్ ప్రధాన్‌పై 41,937 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

    హసి రాణి రథ్‌కు ఇప్పటివరకు 55,665 ఓట్లు రాగా, మిలన్ ప్రధాన్‌కు కేవలం 13,728 ఓట్లు మాత్రమే వచ్చాయి.

    నందిగ్రామ్ అత్యంత చర్చనీయాంశమైన స్థానాలలో ఒకటిగా పరిగణిస్తున్నారు. అందుకే అందరి దృష్టి ఈ స్థానంపైనే ఉంది.

    భారత ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ప్రకారం, పశ్చిమ బెంగాల్‌లోని రెజినగర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుల్లా కాఫీపై బీజేపీ అభ్యర్థి శంఖరవ్ చౌదరి ఆధిక్యంలో ఉన్నారు.

    అస్సాంలోని నాగావ్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నిక ఓట్ల లెక్కింపులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దేవాశిష్ శర్మ ఆధిక్యంలో ఉన్నారు. ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ బద్రుద్దీన్ అజ్మల్ ఆయనకంటే సుమారు 45 వేల ఓట్ల తేడాతో వెనుకబడి ఉన్నారు.

    తమిళనాడులో రెండు నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరిగాయి. ఇందులో మదురాంతకం, ధరాపురం అసెంబ్లీ స్థానాలో టీవీకే అభ్యర్థులు లీడింగ్‌లో ఉన్నారు.

    పుదుచ్చేరిలోని తట్టంచవాడి నియోజకవర్గంలో ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ ఆనంద్ విజయం సాధించారు.

    పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్, రెజీనగర్, తమిళనాడులోని మదురాంతకం, ధరాపురం, అస్సాంలోని నాగావ్ లోక్‌సభ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది.

  6. ఇన్ఫోసిస్‌తో సహా ఈ టెక్ కంపెనీలపై తీసుకున్న చర్యలను సమర్థించిన జేడీ వాన్స్, అమెరికా పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ నుంచి కంపెనీల తొలగింపు

    గ్రీన్ కార్డ్, అమెరికా పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ నుంచి ఎనిమిది టెక్ కంపెనీలను తొలగించడాన్ని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సమర్థించారు.

    కంపెనీలకు చౌకైన విదేశీ కార్మికుల సరఫరాకు విమర్శకులు సహాయం చేయాలనుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

    ఈ నిర్ణయాన్ని డెమొక్రాటిక్ కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్ ప్రశ్నించిన తర్వాత, వాన్స్ ' సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో విమర్శలు చేశారు. ‘సోషలిజం' అంటే పెద్ద కంపెనీలకు చౌకగా కార్మికుల సరఫరా ఎప్పటికీ ఆగకుండా ఉండేలా చూడటానికి సర్వశక్తులు ఒడ్డి పోరాడటమే అనిపిస్తోంది."

    మైక్రోసాఫ్ట్, అడోబ్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), విప్రో, హెచ్‌సీఎల్, క్యాప్‌జెమిని అనే ఎనిమిది కంపెనీలను సస్పెండ్ చేయాలన్న నిర్ణయం చుట్టూ నెలకొన్న రాజకీయ వివాదానికి ఈ ప్రకటన మరింత ఆజ్యం పోసింది.

  7. స్మిత్ మచ్చర్‌కు అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించిన ఇజ్రాయెల్ అధ్యక్షుడు, స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత పురస్కారం

    ఫ్లైదుబాయ్ విమానం కాక్‌పిట్‌లో కో-పైలట్ దాడి చేసినప్పటికీ, ధైర్యసాహసాలతో 174 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలను కాపాడిన భారత పైలట్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత పురస్కారం ప్రదానం చేయనున్నారు.

    భారత పైలట్ కోలుకున్న తర్వాత ఆయన ఇజ్రాయెల్ అత్యున్నత పురస్కారం అందజేస్తామని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ తెలిపారు.

    "ఈ రోజు మనం గౌరవిస్తున్న ఇజ్రాయెల్ వీరులతోపాటు, భారత్‌కు చెందిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ కూడా త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. కెప్టెన్ మచ్చర్ అపారమైన ధైర్యం, అత్యుత్తమ వృత్తి నైపుణ్యం ఒక పెద్ద విపత్తును నివారించడంలో సహాయపడ్డాయి. ఆయన కోలుకున్న తర్వాత, ఇజ్రాయెల్ ప్రజల తరపున ఇచ్చే అత్యున్నత పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేయడం నాకు గౌరవంగా ఉంటుంది" అని ఆయన అన్నారు.

    భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై ఒమన్‌కు చెందిన కో-పైలట్ దాడి చేయగా, ఆయన ధైర్యంగా ఎదుర్కొని 174 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలను కాపాడారు.

  8. ఎన్నికల సంఘానికి మద్దతుగా 42 మంది మాజీ న్యాయమూర్తులు లేఖలు, 42 మంది మాజీలు రాసిన లేఖలో ఏం ఉంది

    'ఎన్నికల కమిషన్‌ను అప్రతిష్టపాలు చేయడానికి' ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని మాజీ న్యాయమూర్తులు ఆరోపించారు.

    'ఎన్నికల సంఘాన్ని బలహీనపరిచే ప్రయత్నాలకు' వ్యతిరేకంగా 42 మంది మాజీ న్యాయమూర్తులు ఒక బహిరంగ లేఖ రాశారని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. ఈ లేఖలో, ఎన్నికల సంఘం, న్యాయవ్యవస్థ, ఇతర రాజ్యాంగ సంస్థలను బలహీనపరిచేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై మాజీ న్యాయమూర్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

    పీటీఐ వార్తా సంస్థ ప్రకారం, ఆ లేఖపై సంతకం చేసిన మాజీ న్యాయమూర్తులు, ఎటువంటి నిర్దిష్ట ఆధారాలు లేకుండా 'ఓట్ల దొంగతనం' ఆరోపణలు చేయడాన్ని ప్రశ్నించారు.

    రాజ్యాంగ సంస్థలను పదేపదే 'దొంగలు', 'కుట్రదారులు' అని ముద్ర వేయడం ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

    "సంస్థలను విమర్శించడం ప్రజాస్వామ్య హక్కు, కానీ వాటిని అపఖ్యాతి పాలు చేయడం కాదు" అని ఆ లేఖలో పేర్కొన్నారు.

    ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు చేపట్టిన నిరసన అక్టోబర్ 8న మూడో రోజుకు కొనసాగింది.

  9. బస్సులపై రష్యా దాడిలో కనీసం 30 మంది మృతి చెందారని యుక్రెయిన్ తెలిపింది, బస్సులను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు

    "బస్సులను లక్ష్యంగా చేసుకుని రష్యా జరిపిన దాడుల్లో" కనీసం 30 మంది మరణించారని యుక్రెయిన్ అధికారులు చెబుతున్నారు.

    సరిహద్దు నగరమైన క్రమటోర్స్క్‌లో పౌరులతో ప్రయాణిస్తున్న రెండు బస్సులపై రష్యా గ్లైడ్ బాంబులు దాడి చేశాయని అధికారులు తెలిపారు.

    ఈ దాడిలో మరో 18 మంది గాయపడ్డారని డొనెట్స్క్ ప్రాంత అధిపతి వాడిమ్ ఫిల్యాష్కిన్ తెలిపారు.

    సాధ్యమైనంత ఎక్కువ మంది పౌరులను చంపేందుకు, ప్రయాణికులతో వెళ్తున్న బస్సులను రష్యా లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు.

    స్థానిక అధికారులు పోస్ట్ చేసిన చిత్రాలలో రోడ్డుపై శిథిలాలు, మండుతున్న బస్సు కనిపించాయి.

    రష్యా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్న కోట ప్రాంతంలో క్రామటోర్స్క్, దాని పొరుగు నగరమైన స్లోవియాన్స్క్ ఉన్నాయి. యుక్రెయిన్లోని డాన్‌బాస్ పారిశ్రామిక ప్రాంతం మొత్తం తమదేనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వాదిస్తున్నారు.

    దేశవ్యాప్తంగా రష్యా దాడులు అకస్మాత్తుగా పెరిగిన నేపథ్యంలో జరిగిన ఈ తాజా దాడిపై రష్యా ఇంకా స్పందించలేదు.

    ఐక్యరాజ్యసమితి ప్రకారం, ఈ ఏడాది ఆగస్టు నాటికి యుక్రెయిన్‌లో మరణించిన పౌరుల సంఖ్య, 2025 సంవత్సరం మొత్తం మీద మరణించిన పౌరుల సంఖ్యను మించిపోయింది.

  10. బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నేను, బీబీసీ కరస్పాండెంట్ ఖగేష్, ఇప్పటి నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మీకు ముఖ్యమైన వార్తలను అందిస్తాను.

    నిన్నటి లైవ్ పేజీ వార్తలను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

  11. కాంగ్రెస్‌కు, సీజేపీ మధ్య విభేదాలు ఉన్నాయా? అరవింద్ కేజ్రీవాల్ నిరసనలకు ఎందుకు వెళ్లలేదు?

  12. రొమ్ము క్యాన్సర్: లక్షణాలు లేకపోయినా టెస్ట్‌లు ఎందుకు చేయించుకోవాలి?

  13. భారత్ రక్షణ సమాచారం పాకిస్తాన్ నిఘా సంస్థలకు అందుతోందా?

  14. ‘గంటకు పైగా సీపీఆర్ చేసినా బతకలేదు’ నానా పాటేకర్ చివరిక్షణాలపై వైద్యులు ఏం చెప్పారు?

  15. పిడుగు పడిందా, వడగళ్ల వర్షమా? 104 మందితో వెళ్తున్న ఆ విమానం ఎందుకు దెబ్బతింది?

  16. ‘సర్’ వివాదం: హైదరాబాద్‌లో ‘చలో లోక్ భవన్’ నిర్వహించిన ‘ఇండియా’ కూటమి

    ఓట్ల సవరణ ప్రక్రియలో అక్రమాలకు పాల్పడ్డారంటూ భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి ఇచ్చిన ‘సేవ్ డెమోక్రసీ’ పిలుపులో భాగంగా టీపీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘చలో లోక్‌భవన్ (రాజ్‌భవన్)’ ర్యాలీ జరిగింది.

    నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో, టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, వివేక, అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

    అలాగే వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు.

    ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కును కాపాడాలనే ప్రధాన డిమాండ్‌తో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీగా ముందుకు సాగారు. ఈ ర్యాలీలో ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలైన సీపీఎం, సీపీఐ, సమాజ్‌వాదీ పార్టీ, తెలంగాణ జన సమితి (టీజేఎస్), ఆర్జేడీ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.

    ర్యాలీలో పాల్గొన్న మంత్రులందర్నీ అరెస్టు చేసి పంజాగుట్ట స్టేషన్‌కు , ఇతర నాయకులను వేర్వేరు పోలీసుస్టేషన్లకు తరలించారు.

  17. దిల్లీ: సీమాపురీలో కూలిపోయిన భవనం, నలుగురు మృతి, మరో ఎనిమిది మందికి గాయాలు

    దిల్లీలోని సీమాపురీ ప్రాంతంలో బహుళ అంతస్తుల భవనం కూలిపోయిన ఘటనలో నలుగురు మరణించారు.

    ఈ ఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారని డీఎం అజయ్ కుమార్ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో చెప్పారు.

    "ఇప్పటివరకు ముగ్గురు మహిళల మృతదేహాలను వెలికితీశారు. దీంతో పాటు చిన్నారిదిగా భావిస్తున్న మరో మృతదేహం కూడా లభ్యమైంది" అని ఆయన తెలిపారు.

    "శిధిలాలు రోడ్డుపై పడిపోవడంతో పాదాచారులెవరైనా వాటి కింద చిక్కుకున్నారో లేదో కచ్చితంగా చెప్పలేం. చాలా జాగ్రత్తగా సహాయక చర్యలు చేపడుతున్నాం. దాదాపు 75 శాతం పనులు పూర్తయ్యాయి, ఇంకా 25 శాతం మిగిలి ఉన్నాయి. సహాయకార్యక్రమాలు పూర్తి కావడానికి ఇంకో నాలుగు నుంచి ఐదు గంటల సమయం పట్టొచ్చు" అని ఆయన అన్నారు.

    ‘‘ఇది ఐదారంతస్థుల భవనం. దానిని 25 గజాల స్థలంలో నిర్మితమైంది. ఒకటి లేదా రెండేళ్ల క్రితం కట్టిందని అంచనా వేశారు. ఆ భవనంలో ఒక ముస్లిం కుటుంబం నివసిస్తోంది’’ అని ఆప్ ఎమ్మెల్యే ఒకరు చెప్పారు.

  18. నిన్న అద్వానీని కలిసిన ప్రధాని మోదీ

    ప్రధాని నరేంద్రమోదీ బీజేపీ సీనియర్ నేత ఎల్.కె. అద్వానీతో సమావేశమయ్యారు.

    ఈ సమావేశం నిన్న(అక్టోబర్ 7) జరిగిన్టటు మోదీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.

    ‘‘అద్వానీని ఆయన నివాసంలో కలిసి ఆశీర్వాదం తీసుకున్నా. దశాబ్దాలుగా అద్వానీ అందించిన ప్రజాసేవ, దేశానికి ఆయన చేసిన కృషి చెరగని ముద్రవేశాయి. దేశ ప్రగతిని బలోపేతం చేయడంలో అద్వానీది కీలకపాత్ర’’ అని మోదీ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.

  19. జెన్ జెడ్, విపక్షాల ఉద్యమం: భారత్‌లో ప్రతిపక్షాల భాష ఎంత వేగంగా మారిందంటే..

  20. మోనాల్.. అందమైన ఈ పక్షి తన కూత స్థాయిని ఎందుకు పెంచింది?