కర్నాటక సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో
జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి చవిచూసిన వేళ మహారాష్ట్రలోని ఒక
స్థానం గెలవడం చర్చనీయాంశంగా మారుతోంది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్
స్వస్థలంలో జరిగిన ఎమ్మెల్సీ స్థానాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది.
నాగపూర్ డివిజన్ గ్రాడ్యుయేట్ నియోజవర్గం
కాంగ్రెస్ అభ్యర్థి అభిజిత్ వంజారి విజయం సాధించినట్టు ఏఎన్ఐ పేర్కొంది
మొదటి, రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు
తర్వాత అభిజిత్‌కు 67, 231 ఓట్లు రాగా, తన ప్రత్యర్థి, బీజేపీ నేత 63, 960 ఓట్లు
వచ్చాయి.
దీంతో కాంగ్రెస్ అభ్యర్థి 3,271 ఓట్ల
తేడాతో విజయం సాధించారు.
“బీజేపీ బలాన్ని బలగాన్ని మోహరించింది. ఆ పార్టీ నేతలంతా నాగపూర్‌లో తిష్ట
వేశారు. ఎన్ని చేసినప్పటికీ ఓటర్లు మాకు మద్దతు ఇచ్చారు. మా నేతలంతా ఒక్కటిగా నిలబడి
మహా వికాశ్ అఘాడీ బలాన్ని నిరూపించారు” అని అభిజిత్ అభిప్రాయపడ్డారు.
"చాలా సంస్థలు మాకు మద్దతుగా నిలిచాయి. నా ప్రచార సామగ్రిలో కూడా నాకు
48 సంస్థలు మద్దతు ఇస్తున్నాయని పేర్కొన్నాను. ఈ విజయం ఆ సంస్థల కార్యకర్తలకు,
నాయకులకు చెందుతుంది"
మంగళవారం వరకు వచ్చిన ఫలితాల్లో బిహార్,
ఉత్తరప్రదేశ్, బిహార్, కర్నాటక, మహారాష్ట్రలో జరిగిన 28 స్థానాల ఎమ్మెల్సీల్లో ఒక్క
సీటును కూడా కాంగ్రెస్ గెలుచుకోలేకపోయింది.
దీనిపై ప్రధానమంత్రి కూడా ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
నాలుగు రాష్ట్రాల్లో 28 ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికల జరిగాయి. బ్యాలెట్ పేపర్లతోనే ఈ
ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుచుకున్నవి ఎన్ని” అని ప్రశ్నించారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవంద్ర ఫడ్నవీస్
తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పోస్టును షేర్ చేశారు. రాత్రికి దాన్ని తీసేశారు.