సోషల్
మీడియా, ఇంటర్నెట్లో
తనకు పరువు నష్టం కలిగించేలా ఉన్న డీప్‌ఫేక్, ఏఐ పోస్టులపై సివిల్ దావా దాఖలు చేయడానికి కేంద్ర
మంత్రి, సీనియర్
బీజేపీ నాయకుడు నితిన్ గడ్కరీకి బాంబే హైకోర్టు సోమవారం అనుమతి ఇచ్చింది.
లైవ్ లా వెబ్ సైట్ అందించిన సమాచారం ప్రకారం జస్టిస్
అభయ్ అహూజా ధర్మాసనం ఈ కేసును విచారించింది. గడ్కరీ తరఫున న్యాయవాది సందీప్ ఎస్. లడ్డా హాజరై, ఈ దావా
వేయడానికి కోర్టు అనుమతి కోరారు.
దాంతో
ఎక్స్, మెటా, గూగుల్‌తో పాటు ఇతర గుర్తుతెలియని వ్యక్తులపై
సివిల్ కేసు దాఖలు చేయడానికి కోర్టు గడ్కరీకి అనుమతినిచ్చింది. ఈ వివాదాస్పద
పోస్టులను వెంటనే తొలగించాలని, తనకు
తగిన ఉపశమనం కలిగించాలని ఆయన కోర్టును ఆశ్రయించారు.
రూ. 11
కోట్ల నష్టపరిహారం డిమాండ్
ఇథనాల్
బ్లెండింగ్ ప్రోగ్రామ్ ద్వారా గడ్కరీ, ఆయన కుటుంబ సభ్యులు ఆర్థికంగా లాభపడ్డారంటూ ఈ పోస్టుల ద్వారా తప్పుడు
ప్రచారం చేశారని పిటిషన్లో పేర్కొన్నారు.
ఈ ప్రకటనల్లో అవినీతి, పక్షపాతం,
స్వార్థ ప్రయోజనాలు, పదవి దుర్వినియోగం వంటి తీవ్రమైన
ఆరోపణలు చేశారనీ గడ్కరీ తన పిటిషన్లో పేర్కొన్నారు. పరువు నష్టం కలిగించేలా ఉన్న ఇలాంటి 24 పోస్టులను గడ్కరీ తన పిటిషన్లో ప్రస్తావిస్తూ,
వాటిని తొలగించాలని కోరారు. తన
అనుమతి లేకుండా డీప్‌ఫేక్ రూపంలో తన గుర్తింపును, ప్రతిష్ఠను వాడుకోవడం వ్యక్తిగత హక్కుల ఉల్లంఘనే
అవుతుందని ఆయన వాదించారు. ఈ మేరకు రూ. 11 కోట్ల నష్టపరిహారం కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు.
E20 కి వ్యతిరేకంగా పోరాడుదాం: కేజ్రీవాల్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత, ఇకపై ‘E20’ కి వ్యతిరేకంగా గళం విప్పుతామని దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ "దేశ యువత ఒక అహంకార ప్రభుత్వాన్ని తలవంచేలా చేసింది, దాంతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ సందర్భంలోనే E20 ఇంధనం సమస్యను కూడా పరిష్కరించాలని ప్రధానమంత్రి మోదీని కోరుతున్నాను. ప్రజలు దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు, వారి వాహనాలు పాడవుతున్నాయి" అన్నారు.
"ఈ అంశంపై అందరినీ ఒక తాటిపైకి తీసుకురావడానికి, ఈ శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి E20కి వ్యతిరేకంగా నేషనల్ టౌన్‌హాల్ నిర్వహిస్తున్నాం" అన్నారు.