మీరు ఈ వెబ్‌సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్‌సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.

నన్ను ప్రధాన వెబ్‌సైట్‌కు తీసుకెళ్లండి

క్రికెట్ వరల్డ్ కప్-2023 తాజ్ మహల్ దగ్గర... ఏంటీ కథ?

తాజ్ మహల్ వద్ద ఉంచిన ప్రపంచకప్ చిత్రాన్ని ఐసీసీ తన ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. ప్రపంచకప్‌ పోటీలకు ఇంకా 50 రోజులే ఉంది అంటూ దానికి వ్యాఖ్యను జోడించింది.

లైవ్ కవరేజీ

  1. ‘పచ్చని గడ్డి రక్తంతో తడిసి ఎర్రగా మారింది’

  2. ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ 2026: ఈశా సింగ్‌కు బంగారు పతకం.. మను భాకర్‌కు కాంస్యం

    ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ 2026 మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో భారత యువ షూటర్ ఈశా సింగ్ బంగారు పతకం సాధించింది. ఇదే పోటీలో, మను భాకర్ కాంస్య పతకం గెలిచింది.

    21 ఏళ్ల ఈశా సింగ్ ఫైనల్ పోరులో 40 హిట్స్ స్కోరుతో మొదటి స్థానంలో నిలిచింది. చైనాకు చెందిన జాంగ్ యుయును వెనక్కి నెట్టి ఆమె గోల్డ్ మెడల్ గెలవగా, చైనా షూటర్ 37 హిట్స్ స్కోరుతో సిల్వర్ మెడల్‌కే పరిమితమైంది.

    కాంస్య పతకం కోసం జరిగిన షూట్-ఆఫ్‌లో మను భాకర్ విజయం సాధించింది. ఆ తర్వాత ఫైనల్లో 28 స్కోరుతో ఆమె మూడో స్థానాన్ని దక్కించుకుంది.

    ఈశా సింగ్‌కు ఈ ఏడాది ఇది రెండో పెద్ద టైటిల్. అంతకుముందు మే నెలలో జరిగిన మ్యూనిచ్ వరల్డ్ కప్ మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లోనూ ఆమె గోల్డ్ మెడల్ గెలుచుకుంది.

    మరోవైపు, మ్యూనిచ్‌లో నిర్వహించిన అదే పోటీల్లో 10 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో కూడా ఆమె సిల్వర్ మెడల్ సాధించింది.

  3. నరేంద్ర మోదీ: పరాజయం లేని రాజకీయ జీవితంలో ఇప్పుడు ఎందుకు ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు...

  4. E20 వివాదం: ఎక్స్, మెటా, గూగుల్‌లపై సివిల్ దావాకు గడ్కరీకి హైకోర్టు అనుమతి

    సోషల్ మీడియా, ఇంటర్నెట్‌లో తనకు పరువు నష్టం కలిగించేలా ఉన్న డీప్‌ఫేక్, ఏఐ పోస్టులపై సివిల్ దావా దాఖలు చేయడానికి కేంద్ర మంత్రి, సీనియర్ బీజేపీ నాయకుడు నితిన్ గడ్కరీకి బాంబే హైకోర్టు సోమవారం అనుమతి ఇచ్చింది.

    లైవ్ లా వెబ్ సైట్ అందించిన సమాచారం ప్రకారం జస్టిస్ అభయ్ అహూజా ధర్మాసనం ఈ కేసును విచారించింది. గడ్కరీ తరఫున న్యాయవాది సందీప్ ఎస్. లడ్డా హాజరై, ఈ దావా వేయడానికి కోర్టు అనుమతి కోరారు.

    దాంతో ఎక్స్, మెటా, గూగుల్‌తో పాటు ఇతర గుర్తుతెలియని వ్యక్తులపై సివిల్ కేసు దాఖలు చేయడానికి కోర్టు గడ్కరీకి అనుమతినిచ్చింది. ఈ వివాదాస్పద పోస్టులను వెంటనే తొలగించాలని, తనకు తగిన ఉపశమనం కలిగించాలని ఆయన కోర్టును ఆశ్రయించారు.

    రూ. 11 కోట్ల నష్టపరిహారం డిమాండ్

    ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ ద్వారా గడ్కరీ, ఆయన కుటుంబ సభ్యులు ఆర్థికంగా లాభపడ్డారంటూ ఈ పోస్టుల ద్వారా తప్పుడు ప్రచారం చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

    ఈ ప్రకటనల్లో అవినీతి, పక్షపాతం, స్వార్థ ప్రయోజనాలు, పదవి దుర్వినియోగం వంటి తీవ్రమైన ఆరోపణలు చేశారనీ గడ్కరీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. పరువు నష్టం కలిగించేలా ఉన్న ఇలాంటి 24 పోస్టులను గడ్కరీ తన పిటిషన్‌లో ప్రస్తావిస్తూ, వాటిని తొలగించాలని కోరారు. తన అనుమతి లేకుండా డీప్‌ఫేక్ రూపంలో తన గుర్తింపును, ప్రతిష్ఠను వాడుకోవడం వ్యక్తిగత హక్కుల ఉల్లంఘనే అవుతుందని ఆయన వాదించారు. ఈ మేరకు రూ. 11 కోట్ల నష్టపరిహారం కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు.

    E20 కి వ్యతిరేకంగా పోరాడుదాం: కేజ్రీవాల్

    ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత, ఇకపై ‘E20’ కి వ్యతిరేకంగా గళం విప్పుతామని దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

    సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ "దేశ యువత ఒక అహంకార ప్రభుత్వాన్ని తలవంచేలా చేసింది, దాంతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ సందర్భంలోనే E20 ఇంధనం సమస్యను కూడా పరిష్కరించాలని ప్రధానమంత్రి మోదీని కోరుతున్నాను. ప్రజలు దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు, వారి వాహనాలు పాడవుతున్నాయి" అన్నారు.

    "ఈ అంశంపై అందరినీ ఒక తాటిపైకి తీసుకురావడానికి, ఈ శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి E20కి వ్యతిరేకంగా నేషనల్ టౌన్‌హాల్ నిర్వహిస్తున్నాం" అన్నారు.

  5. పాములకు పాలు తాగించడం వాటి ప్రాణాలకు ప్రమాదకరమా, బలవంతంగా తాగిస్తే వాటి శరీరంలో ఏం జరుగుతుంది?

  6. లంబర్ జాక్: మొద్దులు నరికే వరల్డ్ కప్‌లో రికార్డులు సృష్టించిన అమ్మాయి...

  7. వయసు 92... 68 ఏళ్లుగా ఆపరేషన్లు చేస్తున్న సర్జన్

  8. గుండెకు స్టెంట్ వేస్తే ఎన్ని రోజుల తరువాత నుంచి సెక్స్‌లో పాల్గొనవచ్చు?

  9. మగవాళ్లకు కనిపించని రంగులు మహిళలకు కనిపిస్తాయా?

  10. స్మృతి ఇరానీ, ప్రకాశ్ జావదేకర్, రమేశ్ పోఖ్రియాల్, ధర్మేంద్ర ప్రధాన్.. విద్యా శాఖలో ఏ మంత్రీ ఎక్కువ కాలం ఎందుకు నిలవలేకపోయారు?

  11. పబ్లిక్ ఎగ్జామినేషన్స్(ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం

    ప్రశ్నపత్రాల లీకేజ్‌లను నివారించడానికి, పబ్లిక్ ఎగ్జామినేషన్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) యాక్ట్, 2024కు సవరణలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇవాళ లోక్‌సభలో ఒక బిల్లును ప్రవేశపెట్టనుంది.

    కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు.

    ప్రశ్నాపత్రాలను లీక్ కేసుల్లో దోషులు వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష, ఐదు నుంచి పది కోట్ల రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. ఇలాంటి కేసుల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనుంది. పరీక్షకు అయిన ఖర్చును కూడా దోషుల నుంచి వసూలు చేస్తారు. వారిని ఎనిమిదేళ్లపాటు ఎలాంటి ప్రభుత్వ పరీక్షలు రాయకుండా నిషేధిస్తారు. గతంలో జరిమానా కోటిరూపాయలుగా ఉండేది. నిషేధం నాలుగేళ్లు ఉండేది.

    ప్రతిపాదిత బిల్లు ప్రకారం పేపర్ లీకేజ్ కేసుల దర్యాప్తును సీబీఐ లేదా సిట్ రెండు నెలల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది.

  12. దేశం కోసం స్వర్ణం గెలవడం కన్నా ఆనందకరమైనది ఏదీ లేదు: మీరాబాయి చనూ

    గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల 48 కేజీల విభాగంలో మీరాబాయి చనూ స్వర్ణపతకం గెలుచుకుంది. దేశం కోసం స్వర్ణం సాధించడం కంటే ఆనందకరమైనది మరొకటి లేదని వరుసగా మూడోసారి కామన్‌వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం గెలుచుకున్న అనంతరం మీరాబాయి చనూ చెప్పింది.

    "నేను చాలా సంతోషంగా ఉన్నాను. కామన్వెల్త్ గేమ్స్‌లో ఇది నా మూడో స్వర్ణ పతకం. మొత్తంగా ఇది నా నాలుగో పతకం. 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం గెలుచుకోవడంతో నా ప్రయాణం మొదలైంది" అని మీరాబాయి చెప్పినట్టు న్యూస్ ఏజెన్సీ పీటీఐ తెలిపింది.

    జుట్టులోని త్రివర్ణ పతాక రంగుల్లో క్లిప్పు పెట్టుకోవడానికి గల కారణాన్ని మీరాబాయి చెప్పింది.

    "ఈ త్రివర్ణ క్లిప్పులను నేనే స్వయంగా తయారు చేసుకున్నాను. మన జాతీయ పతాకానికి ప్రాతినిధ్యం వహించేలా ఏదైనా ప్రత్యేకంగా ఉండాలనుకున్నా. ఏదైనా తయారు చేయాలని అకస్మాత్తుగా అనిపించింది. అందుకే ఈ సీతాకోకచిలుక ఆకారపు క్లిప్పులను పోటీల ముందురోజు నేనే స్వయంగా తయారు చేసుకున్నాను. త్రివర్ణ పతాకాన్ని నాతో పాటు తీసుకువెళ్లడం నాకు అపారమైన ఆనందాన్ని ఇస్తుంది. ఇవాళ నేను చాలా భావోద్వేగానికి లోనై చాలా ఏడ్చాను. అయితే భావోద్వేగాలతో నిండి ఉన్నప్పటికీ ఈ క్షణం నాకు అంతే ఆనందాన్ని కూడా ఇచ్చింది" అని మీరాబాయి తెలిపింది.

  13. కామన్‌వెల్త్ గేమ్స్: వరుసగా మూడోసారి స్వర్ణం గెలిచిన మీరాబాయి చనూ

  14. ఫ్యాటీ లివర్ ఉన్నవారు మద్యం పూర్తిగా మానేయాలా? ఎన్నో ప్రశ్నలు - సమాధానాలు

  15. ‘చట్టబద్ధమైన పనులను కూడా నేరంగా మారుస్తున్నారు, నిరసన తెలిపితే జైలుకు పంపుతున్నారు’: సుప్రీం కోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలపై తీవ్ర చర్చ

  16. అస్సాంలో వరద బీభత్సం, 66కి చేరిన మృతులు

    అస్సాంలో వరద తీవ్రత కొనసాగుతోంది. గత 24 గంటల్లో మరో నలుగురు మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 66కి చేరినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ శనివారం రాత్రి ఒక ప్రకటనలో పేర్కొంది.

    పది జిల్లాల్లోని 810 గ్రామాలు ఇంకా వరదనీటిలో చిక్కుకుని ఉన్నాయని అందులో తెలిపింది. ఈ వరదల వల్ల దాదాపు 6.54 లక్షల మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు.

    నిరాశ్రయులైన వారి కోసం వివిధ జిల్లాల్లో మొత్తం 274 సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వీటిలో సుమారు 19,000 మంది ఆశ్రయం పొందుతున్నారు.

    ఎగువ అస్సాంలోని శివసాగర్ జోర్హాట్ జిల్లాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. శివసాగర్ జిల్లాలో మరణాలు అత్యధికంగా నమోదయ్యాయి. ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలు వేగవంతం చేయాలని అస్సాం ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు.

    మరోవైపు, బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి.

    ప్రస్తుత పరిస్థితి గురించి ప్రధాని నరేంద్ర మోదీ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మతో ఫోన్‌లో మాట్లాడారు. అస్సాంలో ఏటా రుతుపవనాల సమయంలో వరదలు సంభవిస్తుంటాయి,

    అయితే, ఈసారి తీవ్ర వరదలకు నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో సంభవించిన క్లౌడ్ బరస్ట్' కూడా ఓ కారణమని భావిస్తున్నారు.

  17. 'పాక్‌ పాలిత కశ్మీర్‌‌‌'లో చెలరేగిన హింసపై ఐక్యరాజ్యసమితి ఆందోళన, భారత్ వాదనేంటి, పాకిస్తాన్ ఏమంటోంది?

  18. సీజేపీ: వీధి పోరాటం నుంచి విద్యాశాఖ మంత్రి రాజీనామా వరకు.. ఎప్పుడెప్పుడు, ఏం జరిగింది?

  19. ఫ్రాన్స్, స్పెయిన్‌‌లో అడవులు, ఆవాసాలను కాల్చి బూడిద చేస్తున్న కార్చిచ్చు, 11 ఫోటోల్లో..

  20. అమిత్ షాకు రాహుల్ గాంధీ లేఖ

    దిల్లీలో నిరసన చేస్తున్న విద్యార్థులపై బలగాలను ప్రయోగించిన ఘటనకు బాధ్యత ఎవరిదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఆయన ఓ లేఖ రాశారు.

    నిరసన చేస్తున్న ప్రజలను రక్షించడం, చర్చల ద్వారా వారి సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత అని రాహుల్ గాంధీ అన్నారు.

    "మా విద్యార్థులు నిష్పక్షపాతమైన, జవాబుదారీతనం ఉన్న విద్యా వ్యవస్థను కోరుతున్నారు. వారి మాట వినడానికి బదులుగా , భద్రతా దళాలు వారిపై బలప్రయోగం చేశాయి. ప్రాణాంతక ఆయుధాలు, టియర్ గ్యాస్ ప్రయోగించాయి. వందలాది మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మహిళా విద్యార్థులపైనా దాడి చేశారు. వారి ప్రైవేట్ పార్టులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని కూడా దాడి చేశారు’’ అని ఆ లేఖలో రాహుల్ గాంధీ రాశారు.

    "ప్రాణాంతకమైన పెల్లెట్ గన్‌లను ఉపయోగించడం అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం. ఒక జర్నలిస్టుతో సహా చాలా మంది తీవ్రంగా గాయపడ్డారని మీడియా, సోషల్ మీడియాలో కథనాలొచ్చాయి. నేను 19 ఏళ్ల విద్యార్థి సాహిల్ లోచాబ్‌ను కలిశాను.పెల్లెట్ గన్‌తో కాల్చడంతో ఆయనిప్పుప్పుడు తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారు. ఒక కన్ను కోల్పోయే ప్రమాదం కూడా ఉంది’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

    లేఖలో రాహుల్ గాంధీ రెండు ప్రశ్నలు అడిగారు.

    " విద్యార్థులపై పెల్లెట్ గన్‌లతో సహా ప్రాణాంతకమైన బలప్రయోగానికి హోం మంత్రిగా మీరు అనుమతిచ్చారా? ఒకవేళ మీరు కాకపోతే ఎవరు అనుమతిచ్చారు?

    సాధారణ దుస్తుల్లో విద్యార్థులను లాఠీలతో కొడుతున్నట్టు కనిపించిన వారు పోలీసులా లేక వాలంటీర్లా? వారిని మోహరించడానికి ఎవరు అధికారం ఇచ్చారు?"

    దేశ భవిష్యత్తు అయిన యువత, విద్యార్థులు ఈ ఘటనపై సమాధానాలు, జవాబుదారీతనం కోరుతున్నారని రాహుల్ గాంధీ లేఖలో రాశారు.