మీరు ఈ వెబ్‌సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్‌సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.

నన్ను ప్రధాన వెబ్‌సైట్‌కు తీసుకెళ్లండి

క్రికెట్ వరల్డ్ కప్-2023 తాజ్ మహల్ దగ్గర... ఏంటీ కథ?

తాజ్ మహల్ వద్ద ఉంచిన ప్రపంచకప్ చిత్రాన్ని ఐసీసీ తన ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. ప్రపంచకప్‌ పోటీలకు ఇంకా 50 రోజులే ఉంది అంటూ దానికి వ్యాఖ్యను జోడించింది.

లైవ్ కవరేజీ

  1. ‘2024 ఎన్నికలు అక్రమం’ - మాక్ పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ

  2. ఖర్గే నివాసంలో ‘మాక్ పార్లమెంట్’, జ్ఞానేశ్ కుమార్‌పై ‘ప్రజా అభిశంసన’

    ఇండియా కూటమితో పాటు ఇతర ప్రతిపక్షాలు కూడా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌పై ఆరోపిస్తున్నాయి. ఈ ప్రక్రియ కారణంగా దాదాపు 13 కోట్ల మంది ఓటర్ల పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించారని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఇది ప్రజల ప్రజాస్వామిక హక్కులపై నేరుగా జరిగిన దాడిగా ఆరోపిస్తున్నాయి. మరిన్ని వివరాలు ఇక్కడ క్లిక్ చేసి చదవండి

  3. ఇంటి నుంచి బయలుదేరి మూడు దశాబ్దాలు, కాలినడకనే ఖండాలు దాటిన సాహసికుడు

  4. జస్టిస్ ఫర్ జెహన్నే: 15వ శతాబ్దపు లైంగిక దాడి బాధితురాలి న్యాయపోరాటం ఏమైంది?

  5. ఆంధ్రప్రదేశ్‌ను 'బిహార్ ఆఫ్ సౌత్' అంటూ ఉత్తరాది రాష్ట్రంతో ఎందుకు పోలుస్తున్నారు?

  6. 'రామాయణ' సినిమాలో సీతగా నటించిన సాయిపల్లవిపై ఆన్‌లైన్‌లో విమర్శలేంటి?

  7. ఇమ్మోర్టల్ జెల్లీఫిష్: చంపినా మళ్లీ పుట్టే ఈ జీవిలాగా మనుషులు కూడా మారొచ్చా? పరిశోధకులు ఏం చేస్తున్నారు?

  8. జీఎస్‌ఎల్‌వీ ద్వారా కక్ష్యలోకి చేరిన ఎన్‌వీఎస్‌-03 నావిగేషన్ ఉపగ్రహం

    శ్రీహరికోట నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్18 రాకెట్ ద్వారా ఎన్‌వీఎస్-03 నావిగేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు ఇస్రో ప్రకటించింది.

    శుక్రవారం శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్18 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.ఈ రాకెట్ ఎన్‌వీఎస్-03 ఉపగ్రహాన్ని విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి చేర్చింది.

    జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్18/ఎన్‌వీఎస్-03 ప్రయోగం విజయవంతం కావడంతో శ్రీహరికోటలోనిసతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఇస్రో శాస్త్రవేత్తలుఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు.

    తదుపరి తరం నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థలో ఎన్‌వీఎస్-03 మూడో ఉపగ్రహం. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ సిరీస్ ద్వారా అందించే నావిగేషన్ సేవలను నిరంతరాయంగా కొనసాగించేందుకు దీన్ని రూపొందించారు.

    దేశానికి స్థానం, నావిగేషన్, సమయ నిర్ధరణ సేవలను స్వతంత్రంగా పొందే అవకాశం కల్పించే వ్యూహాత్మక ఉపగ్రహం ఇదని ఇస్రో చీఫ్ డాక్టర్ వి. నారాయణన్ అన్నారు.

    నావిగేషన్ ఉపగ్రహాలను సాధారణ ప్రజలకు ఉపయోగపడే పనుల కోసం కూడా వినియోగిస్తారని ఆయన తెలిపారు. రైళ్లను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడంతో పాటు వాహనాలు, సముద్ర నౌకల కదలికలను పర్యవేక్షించేందుకు ఇవి ఉపయోగపడతాయని చెప్పారు. 'వన్ నేషన్ వన్ టైమ్' ప్రాజెక్టులోనూ ఈ ఉపగ్రహం కీలక భాగమని వివరించారు.

    'గగన్' వ్యవస్థతో కలిసి నావిగేషన్ సేవలు అందించడం ద్వారా ప్రపంచ నావిగేషన్ వ్యవస్థలో భారత్ తన వంతు పాత్ర పోషిస్తోందని ఇస్రో చీఫ్ పేర్కొన్నారు.

  9. జస్టిస్ కౌల్ రాసిన పుస్తకంలో మాజీ సీజేఐ చంద్రచూడ్‌ గురించి ఏముంది?

  10. మనీషా భన్వాలా: ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళ రికార్డు

    ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో 59 కిలోల విభాగంలో స్వర్ణ పతకం గెలిచి, ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా మనీషా భన్వాలా నిలిచారు.

    కజకిస్థాన్ రాజధాని అస్తానాలో శుక్రవారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌లో అమెరికాకు చెందిన అబిగైల్ నెట్‌ను 8-6 తేడాతో ఓడించారు.

    ఒలింపిక్స్‌లో లేని ఈ వెయిట్ కేటగిరీలో మనీషా తన పోరును ప్రీ క్వార్టర్ ఫైనల్‌తో ప్రారంభించారు. ఈ దశలో కెనడాకు చెందిన లారెన్స్ బ్యూత్రెగార్డ్‌ను విక్టరీ బై ఫాల్ పద్ధతిలో ఓడించారు.

    క్వార్టర్ ఫైనల్‌లో మంగోలియాకు చెందిన బొలోర్తుయా ఖురెల్ఖూను 6-0 తేడాతో ఓడించారు. ఆ తర్వాత సెమీఫైనల్‌లో స్థానిక రెజ్లర్ అల్టిన్ షగయేవాను సాంకేతిక ఆధిక్యంతో ఓడించి ఫైనల్‌కు చేరుకున్నారు. దీంతో హరియాణాకు చెందిన మనీషా ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో స్వర్ణ పతకం సాధించారు.

    ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన రెండో భారత రెజ్లర్‌గా మనీషా నిలిచారు. అంతకుముందు 2010లో మాస్కోలో జరిగిన పోటీల్లో సుశీల్ కుమార్ 66 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించారు.

    ప్రస్తుత చాంపియన్‌షిప్‌లో మహిళల విభాగంలో పతకాలు సాధించిన నాలుగో భారత రెజ్లర్ మనీషా. ఆమె కంటే ముందు నీలం సిరోహి (50 కిలోలు), కాజల్ ధోచక్ (76 కిలోలు) రజత పతకాలు సాధించగా, తనూ శర్మ (72 కిలోలు) కాంస్య పతకం గెలుచుకున్నారు.

  11. కర్రల గొడుగు: 'ఇది బరువు కాస్తాది, తుపాను వచ్చినా నిలుస్తది'

  12. ‘ఐడీబీఐను ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నిస్తే, ప్రభుత్వం మాట్లాడలేదు’ - రాహుల్ గాంధీ

    ఐడీబీఐ బ్యాంకులో వాటాల విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత, రాహుల్ గాంధీ ఐడిబీఐ ఉద్యోగులకు బహిరంగ లేఖ రాశారు.

    “గతేడాది మార్చిలో మీలో కొందరు పార్లమెంట్ భవనంలో నన్ను కలవడానికి వచ్చారు. మీరు లాభదాయకంగా మార్చిన బ్యాంకును ప్రభుత్వం ఎందుకు అమ్ముతోంది అని నన్ను ఒక సాధారణ ప్రశ్న అడిగారు” అని రాహుల్ తన లేఖలో తెలిపారు.

    “నేను ఈ ప్రశ్నను లోక్‌సభలో లేవనెత్తాను. లాభదాయకమైన ప్రభుత్వ రంగ బ్యాంకును ఎందుకు అమ్ముతున్నారని అడిగాను. దీనికి ప్రభుత్వం ఎలాంటి కారణం చెప్పలేదు. ఇప్పుడు ఐడీబీఐ బ్యాంకును కెనడా కంపెనీ ఫెయిర్‌ఫాక్స్‌కు అమ్మాలని నిర్ణయించింది” అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

    బ్యాంకులో ప్రస్తుతం ప్రభుత్వానికి, ఎల్ఐసీకి 95 శాతం వాటా ఉందని, అమ్మకం తర్వాత ఈ వాటా 34 శాతానికి తగ్గుతుందని ఆయన తన లేఖలో రాశారు. “ఐడీబీఐ ప్రైవేట్ చేతుల్లోకి వెళితే, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల అభ్యర్థులకు ఉన్న రిజర్వేషన్ వ్యవస్థ అంతమైపోతుంది. మీ హక్కులు ఇప్పటికే బలహీనమయ్యాయి. ఇప్పుడు వాటి చివరి రక్షణ కూడా అంతమైపోతుంది” అని రాహుల్ తెలిపారు.

    రాహుల్ గాంధీ లేఖపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎక్స్‌లో స్పందించారు.

    “బ్యాంకులు, ఆర్థిక సంస్థలను తన సొంత ప్రైవేట్ సంస్థల్లా కాంగ్రెస్ ఉపయోగించుకుందని మనందరికీ తెలుసు. తమ ఇష్టానుసారం రుణాలు ఇవ్వాలని బ్యాంకు ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో రుణాలు ఇవ్వడానికి సంబంధించిన ముఖ్యమైన నియమ నిబంధనలను కూడా విస్మరించారు” అని ఆమె ఆరోపించారు.

    ఐడీబీఐ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ సోషల్ మీడియాలో రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపింది.

    “భారత పారిశ్రామికీకరణకు ఆర్థిక సహాయం అందించడానికి ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను నెహ్రూ స్థాపించారు. ఇప్పుడు అదే సంస్థను మోసపూరితంగా అమ్ముతున్నారు” అని ఆ సంస్థ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. “మీ మద్దతుతో మా పోరాట పటిమ రెట్టింపు అయింది. దేశ చారిత్రక సంస్థ అయిన ఐడీబిఐని కాపాడటానికి మా చివరి శ్వాస వరకు పోరాడతాము” అని ఐడీబీఐ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాహుల్ గాంధీని ఉద్దేశించి పోస్ట్ చేసింది.

  13. ‘వన్డేల్లో వారికి చోటు ఇవ్వకపోవడం అన్యాయమే’: యువరాజ్ సింగ్

    అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ వంటి ఆటగాళ్లకు వన్డే జట్టులో రెగ్యులర్ స్థానం ఇవ్వకపోవడం వారి ప్రతిభకు అన్యాయం చేయడమేనని భారత మాజీ ఆల్-రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డారు.

    ముంబయిలో ఆయన పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ , "నిజం చెప్పాలంటే, అభిషేక్ శర్మ వన్డేలు ఆడటం చూడాలని కోరుకుంటున్నా. ఇషాన్ కిషన్, అభిషేక్ వైభవ్ సూర్యవంశీ వంటి ఆటగాళ్లను 50 ఓవర్ల క్రికెట్‌లో ఎంపిక చేయకపోతే, ఎక్కడో ఒకచోట మనం వారి ప్రతిభకు న్యాయం చేయడం లేదని అర్థం అని నేను గతంలోనే చెప్పా’’ అన్నారు.

    "మన దగ్గర కొంతమంది అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. , వారికి జట్టులో స్థానం సంపాదించడం కష్టమని నాకు తెలుసు. కానీ ఈ ఆటగాళ్లు రాణిస్తున్న తీరు చూస్తుంటే, వారికి త్వరలోనే జట్టులో స్థానం లభిస్తుందని ఆశిస్తున్నా" అన్నారు.

    ఈ ఆటగాళ్లు సాధించినదంతా వారి కఠోర శ్రమతోనే సాధ్యమైందని, ఆ ఘనత వారికే దక్కుతుందని యువరాజ్ అన్నారు.

  14. ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న అరబ్బులు ఎవరు?

  15. ‘పిల్లలకు చదువు చెప్పడంలో న్యాయం చేయలేకపోతున్నాం’.. దేశంలో లక్షకుపైగా ఏకోపాధ్యాయ పాఠశాలలు

  16. అంతర్వేది తీరానికి చేరిన భారీ ఓడకు ఏమైంది? ఒడ్డుకు సమీపంలో ఎలా చిక్కుకుంది? అందులో ఏం ఉంది

  17. ‘పాతికేళ్ల కుర్రాళ్లకూ పక్షవాతం రావొచ్చు’.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి

  18. ‘నేను కుప్పకూలే వరకు నాలో ఆ లోపం ఉందనే విషయం తెలియదు’

  19. చంటిబిడ్డను ఎత్తుకొని హాఫ్ మారథాన్‌ పూర్తి చేసిన కశ్మీరీ మహిళ.. ‘సైనికుడి భార్య జీవితం పోరాటమే’ అని ఆమె ఎందుకన్నారు

  20. లాఠీలకు భయపడకండి, మార్చ్‌కు తరలిరండి : రాహుల్ గాంధీ

    ఇండియా కూటమి నిర్వహించే ‘ఛలో దిల్లీ’ మార్చ్‌లో పాల్గొనాలని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రజలకు పిలుపునిచ్చారు.

    పోలీసులకు, వారి లాఠీలకు భయపడొద్దని ‘ఎక్స్‌లో చేసిన పోస్ట్‌లో రాహుల్ గాంధీ ప్రజలను కోరారు.

    ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, ఓట్ల చోరీని అరికట్టడానికి, రాజ్యాంగాన్ని రక్షించడానికి ఈ మార్చ్ నిర్వహిస్తున్నట్టు రాహుల్ గాంధీ చెప్పారు.

    "నరేంద్ర మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్‌ల మీద విసిగిపోయినవారు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, రాజ్యాంగాన్ని రక్షించాలని కోరుకునేవారంతా ఈ మార్చ్‌లో పాల్గొనాలని ఆహ్వానిస్తున్నా’’ అని రాహుల్ గాంధీ అన్నారు.

    రాహుల్ గాంధీ పోస్టును కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా ట్యాగ్ చేశారు.

    ‘‘తెలంగాణకు రైళ్లు ఇవ్వడం నిరాకరించడం నుంచి దిల్లీ వ్యాపారులను రాజకీయ ఆయుధాలుగా ఉపయోగించడంవరకు నవంబర్ ఒకటిన జరిగే మార్చ్‌ను భగ్నం చేయడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావు" అని పవన్ ఖేరా రాశారు.

    .