మీరు ఈ వెబ్‌సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్‌సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.

నన్ను ప్రధాన వెబ్‌సైట్‌కు తీసుకెళ్లండి

క్రికెట్ వరల్డ్ కప్-2023 తాజ్ మహల్ దగ్గర... ఏంటీ కథ?

తాజ్ మహల్ వద్ద ఉంచిన ప్రపంచకప్ చిత్రాన్ని ఐసీసీ తన ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. ప్రపంచకప్‌ పోటీలకు ఇంకా 50 రోజులే ఉంది అంటూ దానికి వ్యాఖ్యను జోడించింది.

లైవ్ కవరేజీ

  1. 58 మంది పిల్లలున్న ఓ తండ్రి కథ.. ‘రాత్రి పడుకునే ముందు అందరూ ఉన్నారో లేదో లెక్కపెడతాను’

  2. మూత్రనాళ ఇన్ఫెక్షన్‌: గర్భిణులు తీసుకోవాల్సిన 8 జాగ్రత్తలు

  3. ‘ఐ డోంట్‌ కేర్‌.. గెలిస్తే గెలుస్తా, లేదంటే ఓడిపోతా.. ఫైట్ అయితే తప్పదు’.. ఏబీ వెంకటేశ్వరరావు బీబీసీ ఇంటర్వ్యూలో ఇంకా ఏమేం చెప్పారు?

  4. Ind vs Nz: భారత్ టార్గెట్ 226, పది ఓవర్లకు 119/3

    క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్ వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో 226 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. పది ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది.

    భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు జట్టుకు శుభారంభాన్ని ఇచ్చారు. మొదటి ఐదు ఓవర్లలో 16 రన్ రేట్‌తో పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో సంజూ శామ్సన్ 33 బంతుల్లో 67 పరుగులు, అభిషేక్ శర్మ 12 బంతుల్లో 29 పరుగులు చేసి ఔటయ్యారు. తిలక్ వర్మ 6 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. క్రీజులో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ ఉన్నారు.

    ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. న్యూజీలాండ్ ఓపెనర్లు ఫిన్ అలెన్, టిమ్ సీఫర్ట్ దూకుడుగా బ్యాటింగ్ చేసి జట్టుకు శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 49 పరుగులు జోడించారు. అలెన్ 24 బంతుల్లో 45 పరుగులు చేయగా, సీఫర్ట్ 24 పరుగులు సాధించాడు. డారిల్ మిచెల్ 19 బంతుల్లో 28 పరుగులు చేశాడు.

    నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన గ్లెన్ ఫిలిప్స్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఫిలిప్స్, నాలుగో వికెట్‌కు బెవన్ జాకబ్స్‌తో కలిసి 32 బంతుల్లో 73 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఫిలిప్స్ 40 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, మూడు సిక్సర్లతో 82 పరుగులు చేశాడు.

    జాకబ్స్ 16 బంతుల్లో మూడు సిక్సర్ల సాయంతో 31 పరుగులు చేశాడు. దీంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోరు సాధించింది.

    భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు.

    ఈ మ్యాచ్‌తో పేసర్ భువనేశ్వర్ కుమార్ 2022 తర్వాత తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడాడు.

  5. దసరా పండుగను అక్కడ 76 రోజుల పాటు జరుపుకుంటారు, కానీ రావణ దహనం మాత్రం ఉండదు

  6. స్థానిక సంస్థల ఎన్నికలు: తెలుసుకోవాల్సిన కీలక విషయాలు

  7. 82 ఏళ్ల కిందట గల్లంతైన జర్మన్ జలాంతర్గామి ఇప్పుడు కనిపించింది

  8. ఏపీ మున్సిపల్ ఎన్నికలు: నామినేషన్ల గడువుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

  9. ‘ఫోటో ఆధారంగా అనారోగ్యాన్ని, ఎంత కాలం జీవించే అవకాశముందో చెప్పేసే ఏఐ టూల్’

  10. రోటీ, రైస్ తింటూ బరువు తగ్గొచ్చా? 9 ప్రశ్నలు - జవాబులు

  11. ఆత్మగౌరవ భావన ఉన్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది – ప్రధాని మోదీ

    దిల్లీ ఐపీ ఎక్స్‌టెన్షన్‌లోని డీడీఏ గ్రౌండ్‌లో నిర్వహించిన రావణ దహన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.

    ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఆ దేశ ప్రజల్లో ఆత్మగౌరవ భావన ఉండాలని ప్రధాని మోదీ అన్నారు.

    ఆత్మగౌరవాన్ని పెంపొందించడంలో దేశ వారసత్వ సంపద కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.

    వారసత్వాన్ని, గుర్తింపును పరిరక్షించుకోవడానికి భారత్ ప్రస్తుతం అంకితభావంతో పనిచేస్తోందని ప్రధాని మోదీ చెప్పారు.

    "శతాబ్దాలుగా మన వారసత్వ సంపదను దోచుకుని విదేశాలకు తరలించారు. కానీ ఇప్పుడు వాటిని తిరిగి మనదేశానికి తీసుకొస్తున్నాం’’ అని ఆయన చెప్పారు.

    12 ఏళ్లలో 650కి పైగా పురాతన విగ్రహాలను భారత్‌కు తిరిగి తీసుకొచ్చినట్టు ప్రధాని తెలిపారు.

    "భారత్‌లోని సాంస్కృతిక కేంద్రాలకు ప్రపంచవ్యాప్తంగా కొత్త గుర్తింపు తీసుకొస్తున్నాం. గత కొన్నేళ్లలో దేశంలోని అనేక ప్రదేశాలకు యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు లభించింది’’ అని ఆయన అన్నారు.

    గతేడాది దీపావళికి కూడా యునెస్కో మానవాళి అమూర్త సాంస్కృతిక వారసత్వ జాబితాలో చోటు లభించిందని చెప్పారు.

    "ఇది కోట్లాది మంది భారతీయుల సమష్టి సంకల్పానికి ఫలితం" అని మోదీ అభివర్ణించారు. ఇదే నిబద్ధతతో దేశం భవిష్యత్తులోనూ ముందుకు సాగాలని అన్నారు.

    ‘‘ఇది విజయానికి ప్రతీక అయిన పండుగ. గెలుపును వేడుకగా జరుపుకునే సందర్భం’’ అని మోదీ పేర్కొన్నారు.

    శత్రువు ఎంత శక్తిమంతుడైనా సరే.. మనం సత్యం,మానవత్వంవైపు నిలబడితే చివరికి విజయం సాధిస్తామనే ధైర్యాన్ని ఈ పండుగ ఇస్తుందని అన్నారు.

    విజయదశమి అందించే ఈ సందేశం ఎప్పటినుంచో భారత మౌలిక భావనల్లో అంతర్భాగంగా ఉందని ప్రధాని మోదీ చెప్పారు.

  12. గరివిడి లక్ష్మి: ‘మూణ్నాలుగు జిల్లాలకు తెలిసిన నన్ను మొత్తం ప్రపంచానికి పరిచయం చేశారు’

  13. పుట్టిన రోజు సందడి తరువాత రాత్రి 9 గంటలకు అమ్మ పక్కన పడుకున్న ఆరేళ్ల పాప తెల్లారేసరికి మాయమైంది.. 8 రోజులైనా దొరకని ఆచూకీ

  14. కనిగిరి: మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి వచ్చిన మహిళ ఎందుకు ఏడ్చారు? మరో మహిళ పోలీసుల కాళ్లు ఎందుకు పట్టుకున్నారు?

  15. ‘భారత్‌ను లక్ష్యంగా చేసుకున్నారు.. మనం అప్రమత్తంగా ఉండాలి’ - మోహన్ భగవత్

  16. దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు.. ఫోటోల్లో

  17. ‘‘నన్ను బలవంతంగా టాయ్‌లెట్‌లోకి లాక్కెళ్లాడు, నేను కళ్లు మూసుకుని అక్కడ లేననుకున్నా’’

  18. దసరా: మీకు పాలపిట్ట కనిపించిందా?

  19. పారా ఆసియా క్రీడలు: ఒకే ఈవెంట్‌లో భారత్‌కు స్వర్ణం, రజతం

    జపాన్‌లోని నాగోయాలో జరుగుతున్న పారా ఆసియా క్రీడల్లో భారత షూటర్ మోనా అగర్వాల్ స్వర్ణ పతకం గెలుచుకోగా, అవని లేఖరా రజత పతకం సాధించింది.

    ఆర్2 మహిళల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్‌లోని ఎస్‌హెచ్1 విభాగంలో ఇద్దరూ ఈ ఘనతను సాధించారు. ఫైనల్‌లో ఇద్దరు షూటర్ల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది.

    మోనా 250.0 పాయింట్లు సాధించి స్వర్ణ పతకం గెలుచుకోగా, అవని 249.6 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.

    దక్షిణ కొరియాకు చెందిన యున్రి లీ 227.9 పాయింట్లతో కాంస్య పతకాన్ని గెలుచుకుంది.

    ఈ ఘనత సాధించినందుకు ఇద్దరు భారత షూటర్లను ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) అభినందించింది.