మీరు ఈ వెబ్‌సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్‌సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.

నన్ను ప్రధాన వెబ్‌సైట్‌కు తీసుకెళ్లండి

క్రికెట్ వరల్డ్ కప్-2023 తాజ్ మహల్ దగ్గర... ఏంటీ కథ?

తాజ్ మహల్ వద్ద ఉంచిన ప్రపంచకప్ చిత్రాన్ని ఐసీసీ తన ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. ప్రపంచకప్‌ పోటీలకు ఇంకా 50 రోజులే ఉంది అంటూ దానికి వ్యాఖ్యను జోడించింది.

లైవ్ కవరేజీ

  1. అంకితా భండారీ తల్లిదండ్రులను నిర్బంధించడాన్ని ఖండించిన రాహుల్ గాంధీ

    అంకితా భండారీ తల్లిదండ్రులను నిర్బంధించడాన్ని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఖండించారు.

    బాధితుల గొంతును ఈ ప్రభుత్వం నొక్కేస్తోందని, ప్రశ్నించేవారిని తప్పిస్తోందని ఆయన ఆరోపించారు.

    "ఉదయం 4 గంటలు, ప్రపంచమంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో అంకితా భండారీ తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. వారు చేసిన తప్పు ఏంటి?, ఇండియా గేట్ వద్ద ఎలాంటి హాంగామా లేకుండా, బాధతో నిశ్శబ్ధంగా కూర్చొని, సీబీఐ విచారణ పూర్తి అయ్యే వరకు దుష్యంత్ గౌతమ్‌ను గవర్నర్‌గా నియమించొద్దని కోరారు" అని ఎక్స్‌లో రాహుల్ గాంధీ పోస్టు చేశారు.

    "నేను, ప్రియాంక నిన్న వారిని కలిశాం. సీబీఐ దర్యాప్తు ఫలితాలు రాకముందే హడావుడిగా నియమాకాలు పూర్తి చేశారు. ప్రశ్నించిన తల్లిదండ్రులను చీకటిలో అదుపులోకి తీసుకున్నారు. బాధితుల గొంతును అణిచివేయడం, ప్రశ్నించే వారిని పక్కన పెట్టడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారింది.

    "న్యాయం కోసం జరుగుతున్న పోరాటాన్ని ఎవరూ అణచివేయలేరు, ఆపలేరు. అంకితా భండారీ కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటుంది. వారికి న్యాయం జరిగే వరకు మద్దతు ఇస్తుంది" అని తెలిపారు.

    ఇండియా గేట్ దగ్గర నిరసన చేస్తున్న అంకితా భండారీ తల్లిదండ్రులతోపాటు పలువురిని దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    కొంత సమయం వారిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఉదయం ఐదు గంటలకు విడుదల చేసినట్టు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.

  2. టీవీకే ఎమ్మెల్యే పల్లవి: ‘‘చంటి పిల్లాడిని సభలు సమావేశాలకు తిప్పుతూ పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నారు’’ అంటూ ఆమెపై విమర్శలేంటి?

  3. గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్‌‌కు భయపడాలా? బహిష్టు సమస్యల నుంచి సంతానలేమి వరకు.. దీనివల్ల కలిగే పరిణామాలు ఏంటి?

  4. ప్రధాని మోదీ ముందున్న 10 సవాళ్లు ఏంటి?

  5. అంకిత భండారీ హత్య కేసు: ఇండియా గేటు వద్ద తల్లిదండ్రుల ఆందోళన, అంకిత తండ్రి చేస్తున్న 5 డిమాండ్లు ఏమిటి?

  6. భర్తను హత్య చేసి బ్లూ డ్రమ్‌లో దాచిన మహిళకు, ఆమె ప్రియుడికి ఉరిశిక్ష

  7. సిక్కిం గవర్నర్‌గా దుష్యంత్ గౌతమ్ నియామకంపై నిరసనకు మద్దతు తెలిపిన రాహుల్ గాంధీ, దుష్యంత్ గౌతమ్ సిక్కిం కొత్త గవర్నర్‌గా నియమిస్తున్నట్టు ఈ నెల 12నరాష్ట్రపతి భవన్ పత్రికాప్రకటన జారీచేసింది.

    సిక్కిం గవర్నర్‌గా దుష్యంత్ గౌతమ్‌ను నియమించడాన్ని వ్యతిరేకిస్తూ ఇండియా గేట్ దగ్గర నిరసన తెలుపుతున్న అంకితా భండారీ తల్లిదండ్రులను కాంగ్రెస్ నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ పరామర్శించారు.

    లైంగిక వేధింపుల బాధితుల తరఫున పోరాడే సామాజిక కార్యకర్త యోగితా భయానా కూడా వారితో ఉన్నారు.

    "మేమింకా ఇండియా గేట్ దగ్గరే ఉన్నాం. సీబీఐ దర్యాప్తు పూర్తయ్యే వరకు దుష్యంత్ కుమార్ గౌతమ్ నియామకాన్ని తక్షణమే నిలిపివేయాలని అంకితా భండారీ కుటుంబం డిమాండ్ చేస్తోంది" అని యోగితా భయానా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

    దుష్యంత్ కుమార్‌ను జైలులో పెట్టాలని అంకితా భండారీ తండ్రి వీరేంద్ర సింగ్ భండారీ డిమాండ్ చేశారు.

    దుష్యంత్ గౌతమ్ సిక్కిం కొత్త గవర్నర్‌గా నియమిస్తున్నట్టు ఈ నెల 12నరాష్ట్రపతి భవన్ పత్రికాప్రకటన జారీచేసింది.

    పౌరీ గఢ్వాల్ జిల్లాలోని గంగా-భోగ్‌పూర్ ప్రాంతంలో ఉన్న వనంతర టూరిస్ట్ రిసార్ట్‌లో అంకితా భండారీ రిసెప్షనిస్ట్‌గా పనిచేసేవారు. 2022లో ఆమెపై లైంగిక దాడి చేసి, ఆమెను హత్య చేసినట్టు ఆరోపణలొచ్చాయి.

    ఈ కేసులో తన పేరు వెలుగులోకి వచ్చిన తర్వాత అప్పటి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఉత్తరాఖండ్ రాష్ట్ర ఇన్‌చార్జ్ దుష్యంత్ కుమార్ గౌతమ్ తనపై ఆరోపణలను ఖండిస్తూ ఫిర్యాదు చేశారు. దీనిపై ఎఫ్‌ఐఆర్ దాఖలయింది.

    హరిద్వార్‌లోని జ్వాలాపూర్ మాజీ ఎమ్మెల్యే సురేశ్ రాథోర్, నటి ఊర్మిళ సనావర్‌ కొందరు గుర్తుతెలియని వ్యక్తులతో కలిసి తనపై పక్కా ప్రణాళికతో నేరపూరిత కుట్ర పన్నారని దెహ్రాడూన్‌లోని దలన్‌వాలా పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఫిర్యాదులో దుష్యంత్ గౌతమ్ ఆరోపించారు.

    అంకితా భండారీ హత్య కేసు దర్యాప్తు, చార్జిషీట్, కోర్టు విచారణ ప్రక్రియలన్నింటిలో తన పేరు ఎక్కడా ప్రస్తావనకు రాలేదని కూడా దుష్యంత్ గౌతమ్ చెప్పారు.

    ఫిర్యాదులో కాంగ్రెస్ పార్టీపై కూడా ఆయన ఆరోపణలు చేశారు.

  8. ‘‘మహిళలపై లైంగిక వేధింపులను బయటపెడుతున్నా, అందుకే నన్ను చంపాలని చూస్తున్నారు.. ’’

  9. వద్దన్నా కుప్పలు తెప్పలుగా ‘క్యాష్ ఆన్ డెలివరీ’ పార్సిళ్లు, తట్టుకోలేక విదేశాలకు వెళ్లిపోయిన ఇన్‌ఫ్లూయెన్సర్

  10. జాతీయ జెండా ఎగురవేసినవారిని జైల్లో పెట్టడం పిరికితనం -రాహుల్

    జంతర్ మంతర్‌లో జాతీయ జెండా ఎగరేయడం నేరం కాదు, కానీ ఆ పనిచేసిన కొందరిని జైల్లో పెట్టడం పిరికితనమే అన్నారు లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ.

    సీజేపీ నేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌ను దిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి, జ్యుడిషియల్ కస్టడీకి పంపడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన ఎక్స్‌ ఖాతాలో స్పందించారు.

    “జంతర్ మంతర్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి శాంతియుతంగా నిరసన తెలపడం నేరం కాదు. యువకులను జైల్లో వేయడం పిరికితనం” అని రాహుల్ గాంధీ విమర్శించారు.

    "విద్యార్థులు, యువతరం, జర్నలిస్టులు, ‘ఇండియా’ బ్లాక్ పార్టీల బ్యానర్లు వేర్వేరు కావచ్చు. కానీ లక్ష్యం మాత్రం ఒక్కటే. ఒకే విషయం గురించి నిరసనలు జరుగుతున్నాయి. పౌరులు తమ రాజ్యాంగబద్ధమైన హక్కులను కోరుతున్నారు. జంతర్ మంతర్ దేశ ప్రజలది. దాన్ని తిరిగి సాధించుకుంటాం’’ అని రాహుల్ స్పష్టం చేశారు.

    ఇదే అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ కూడా సోషల్ మీడియాలో విమర్శించారు.

    "త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి, భారత్ మాతాకి జై అని నినాదాలు చేసిన సీజేపీ నేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌ను మీరు జైలుకు పంపించారు. యువతతో పెట్టుకోవద్దు మోదీజీ, త్వరలోనే మీ నియంతృత్వానికి ముగింపు పలుకుతారు" అని సంజయ్ సింగ్ రాసుకొచ్చారు.

    మంగళవారం జంతర్ మంతర్‌లోకి అక్రమంగా చొరబడ్డారని సీజేపీ నాయకులపై దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.

  11. పాకిస్తాన్‌: ఇమ్రాన్ ఖాన్ కంచుకోటలో ఎమర్జెన్సీ, ప్రభుత్వం తప్పు చేస్తోందంటున్న నిపుణులు

  12. సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్‌కు 5 రోజుల కస్టడీ

    జంతర్ మంతర్‌లోకి అనుమతి లేకుండా ప్రవేశించారనే ఆరోపణలపై సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాను మందిర్ మార్గ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అనంతరం వారిని 5 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

    అంతకు ముందు సీజేపీ నేతల అరెస్టుపై కాక్రోచ్ జనతా పార్టీకి చెందిన న్యాయ వ్యవహారాల చీఫ్ రత్న సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    "న్యాయవాదులను కలిసేందుకు కూడా వారిని అనుమతించలేదు. తెల్లవారుజామున 3 గంటలకు ఒక ప్రైవేట్ వాహనంలో వారిని పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చారు. అయితే ఎన్ని ఇబ్బందులు పెట్టినా వారి మనోధైర్యం ఏమాత్రం తగ్గలేదు." అని పేర్కొన్నారు.

    "అనుమతి లేకుండా ప్రవేశించడం, బాండ్ షరతులు ఉల్లంఘించడం, ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించడం వంటి అభియోగాలు సీజేపీ నేతలపై మోపారు" అని రత్న సింగ్ 'ఎక్స్'లో పోస్ట్‌ చేశారు.

  13. నీటిలో మునిగిపోయిన ఈ గ్రామానికి కోహినూరు వజ్రానికి లింకేంటి, జనం ఇంకా అక్కడ ఎందుకు తవ్వుతున్నారు?

  14. గుడ్ మార్నింగ్, బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం,

    నేను బీబీసీ ప్రతినిధి ఖగేశ్. మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమైన వార్తలను మీకు అందిస్తాను.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

  15. మాజీ సీఎం మమతపై దాడికి యత్నం - పోలీసులు ఏం చెప్పారు?

    పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఒక మహిళా దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

    మమతా బెనర్జీ ఒక పూజను ప్రారంభించడానికి వెళ్తుండగా, కాళీఘాట్‌లోని ఆమె నివాసం సమీపంలో తనిష్ఠా సాహా (38) అనే మహిళ దాడి చేసినట్టు టీఎంసీకి చెందిన డోలా సేన్ ఆరోపించారు.

    టీఎంసీ కార్యకర్తలు ఆ మహిళను పోలీసులకు అప్పగించి, కాళీఘాట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

    మమతా బెనర్జీని దూషించి, కత్తితో దాడి చేయడానికి సాహా ప్రయత్నించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

    ఆ మహిళ మద్యం మత్తులో ఉన్నట్టు కూడా ఆరోపించారు.

    మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ నేతలు ఫిర్యాదు చేసినట్టు పోలీసులు కూడా అంగీకరించారు. కానీ మహిళ వద్ద ఎలాంటి ఆయుధం లభించలేదని తెలిపారు. ఘటనా స్థలంలో పౌర స్వచ్ఛంద కార్యకర్తలు, టీఎంసీ శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగినట్లు వెల్లడించారు.

    అయితే మమతా బెనర్జీకి ఉన్న జెడ్-ప్లస్ భద్రతను ఉల్లంఘించారని ఆ పార్టీ ఆరోపించింది.

    దాడికి యత్నించిన మహిళ పేరును తనిష్ఠ సాహాగా టీఎంసీ పేర్కొంటే, ఆమె పేరును అనూష సాహాగా పోలీసులు తెలిపారు.

    "ఘటనా స్థలంలో ఒక మహిళను అదుపులోకి తీసుకున్నాం. ప్రాథమిక నివేదికల ప్రకారం ఆమె మానసిక పరిస్థితి బాగాలేదని తెలుస్తోంది. ఆమె ఎందుకు ఎలా చేసిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం" అని కోల్‌కతా పోలీస్ కమిషనర్ అజయ్ నందా వెల్లడించారు.

  16. కాంగ్రెస్‌లో నేహా బోరా వంటి నాయకులు ఎందుకు రాలేకపోతున్నారు?

  17. నల్లులను నిర్మూలించడానికి ప్రత్యేకమైన వాక్యూమ్ క్లీనర్.. అసలు ఇంట్లో నల్లులు చేరాయని తెలుసుకోవడం ఎలా?

  18. ‘మేం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను చాలా గౌరవిస్తాం, ఆయన తన బాధ్యతను నిర్వర్తిస్తారని ఆశిస్తున్నాం’.. రాహుల్ గాంధీ

    ఇండియా కూటమి నేతలతో తేనీటీ విందు అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌కు వ్యతిరేకంగా తమ నిరసన కొనసాగుతుందని రాహుల్ గాంధీ తెలిపారు.

    “భారత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు, భారత న్యాయవ్యవస్థపై మాకు అపారమైన గౌరవం ఉంది. వారు తమ పాత్రను పోషించాల్సి ఉంది. వారు ఆ పాత్రను పోషిస్తారని ఆశిస్తున్నాం. అయితే, మేం రాజకీయాల్లో ఉన్నవాళ్లం. ఏం జరిగినా రాజకీయంగా మా ప్రతిఘటన కొనసాగుతుంది. ప్రజల నిరసన కూడా కొనసాగుతుంది. అంతిమంగా ఈ నిరసన విజయం సాధిస్తుంది” అని ఆయన అన్నారు.

    కాగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.

    స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌‌లో తీసుకున్న అనేక నిర్ణయాల గురించి ఎన్నికల కమిషనర్లకు సమాచారం ఇవ్వలేదని, ఈ నిర్ణయాలపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు పదేపదే అభ్యంతరాలు వ్యక్తం చేశారని పేర్కొంటూ ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ప్రచురించిన కథనం నేపథ్యంలో ఈ డిమాండ్ తెరపైకి వచ్చింది.

  19. చిన్నారుల్లో క్యాన్సర్‌.. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి

  20. రాహుల్ గాంధీ ఇంట్లో ఇండియా బ్లాక్ నేతలకు టీ పార్టీ

    కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మంగళవారం ఇండియా కూటమి నేతలను తన ఇంట్లో తేనీటి విందుకు ఆహ్వానించారు.

    “ఈ రోజు ఇండియా కూటమి నేతలు, ప్రతిపక్ష ఎంపీలు, విద్యార్థి సంఘాలు, పౌర సమాజానికి చెందిన మిత్రులను మా ఇంటికి తేనీటి విందుకు ఆహ్వానించాను” అని ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

    “ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సాగుతున్న ఈ ప్రజా ఉద్యమంలో మనమంతా కలిసే ఉన్నాం. ఈ ఉద్యమం కొనసాగుతుంది” అని ఆయన పేర్కొన్నారు.

    సమావేశం అనంతరం నేతలందరూ మీడియాతో కూడా మాట్లాడతారని రాహుల్ గాంధీ తెలిపారు.

    రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్, జనతా పార్టీ నేతలు సహా ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

    గతేడాది చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో తీసుకున్న అనేక నిర్ణయాల గురించి ఎన్నికల కమిషనర్లకు సమాచారం ఇవ్వలేదని, ఈ నిర్ణయాలపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారని ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ప్రచురించిన కథనం నేపథ్యంలో ఈ డిమాండ్ తెరపైకి వచ్చింది.

    రాహుల్ గాంధీ ఇంట్లో తేనేటి విందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు.