మీరు ఈ వెబ్‌సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్‌సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.

నన్ను ప్రధాన వెబ్‌సైట్‌కు తీసుకెళ్లండి

క్రికెట్ వరల్డ్ కప్-2023 తాజ్ మహల్ దగ్గర... ఏంటీ కథ?

తాజ్ మహల్ వద్ద ఉంచిన ప్రపంచకప్ చిత్రాన్ని ఐసీసీ తన ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. ప్రపంచకప్‌ పోటీలకు ఇంకా 50 రోజులే ఉంది అంటూ దానికి వ్యాఖ్యను జోడించింది.

లైవ్ కవరేజీ

  1. నల్లులను నిర్మూలించడానికి ప్రత్యేకమైన వాక్యూమ్ క్లీనర్.. అసలు ఇంట్లో నల్లులు చేరాయని తెలుసుకోవడం ఎలా?

  2. ‘మేం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను చాలా గౌరవిస్తాం, ఆయన తన బాధ్యతను నిర్వర్తిస్తారని ఆశిస్తున్నాం’.. రాహుల్ గాంధీ

    ఇండియా కూటమి నేతలతో తేనీటీ విందు అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌కు వ్యతిరేకంగా తమ నిరసన కొనసాగుతుందని రాహుల్ గాంధీ తెలిపారు.

    “భారత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు, భారత న్యాయవ్యవస్థపై మాకు అపారమైన గౌరవం ఉంది. వారు తమ పాత్రను పోషించాల్సి ఉంది. వారు ఆ పాత్రను పోషిస్తారని ఆశిస్తున్నాం. అయితే, మేం రాజకీయాల్లో ఉన్నవాళ్లం. ఏం జరిగినా రాజకీయంగా మా ప్రతిఘటన కొనసాగుతుంది. ప్రజల నిరసన కూడా కొనసాగుతుంది. అంతిమంగా ఈ నిరసన విజయం సాధిస్తుంది” అని ఆయన అన్నారు.

    కాగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.

    స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌‌లో తీసుకున్న అనేక నిర్ణయాల గురించి ఎన్నికల కమిషనర్లకు సమాచారం ఇవ్వలేదని, ఈ నిర్ణయాలపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు పదేపదే అభ్యంతరాలు వ్యక్తం చేశారని పేర్కొంటూ ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ప్రచురించిన కథనం నేపథ్యంలో ఈ డిమాండ్ తెరపైకి వచ్చింది.

  3. చిన్నారుల్లో క్యాన్సర్‌.. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి

  4. రాహుల్ గాంధీ ఇంట్లో ఇండియా బ్లాక్ నేతలకు టీ పార్టీ

    కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మంగళవారం ఇండియా కూటమి నేతలను తన ఇంట్లో తేనీటి విందుకు ఆహ్వానించారు.

    “ఈ రోజు ఇండియా కూటమి నేతలు, ప్రతిపక్ష ఎంపీలు, విద్యార్థి సంఘాలు, పౌర సమాజానికి చెందిన మిత్రులను మా ఇంటికి తేనీటి విందుకు ఆహ్వానించాను” అని ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

    “ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సాగుతున్న ఈ ప్రజా ఉద్యమంలో మనమంతా కలిసే ఉన్నాం. ఈ ఉద్యమం కొనసాగుతుంది” అని ఆయన పేర్కొన్నారు.

    సమావేశం అనంతరం నేతలందరూ మీడియాతో కూడా మాట్లాడతారని రాహుల్ గాంధీ తెలిపారు.

    రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్, జనతా పార్టీ నేతలు సహా ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

    గతేడాది చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో తీసుకున్న అనేక నిర్ణయాల గురించి ఎన్నికల కమిషనర్లకు సమాచారం ఇవ్వలేదని, ఈ నిర్ణయాలపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారని ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ప్రచురించిన కథనం నేపథ్యంలో ఈ డిమాండ్ తెరపైకి వచ్చింది.

    రాహుల్ గాంధీ ఇంట్లో తేనేటి విందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు.

  5. ప్రజాస్వామ్యానికి భారత్ తల్లి, ఇక్కడ సమస్యలపై బహిరంగంగా చర్చ జరుగుతుందన్న మోదీ, బ్లూమ్‌బెర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్‌లో ప్రసంగించిన ప్రధాని మోదీ

    ప్రజాస్వామ్యానికి తల్లిలాంటి భారత్‌లో వివిధ అంశాలపై బహిరంగంగా చర్చ జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు.

    మంగళవారం దిల్లీలో జరిగిన బ్లూమ్‌బెర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు.

    "ప్రజాస్వామ్యానికి భారత్‌ తల్లి. ఈ దేశంలో 100కు పైగా భాషలు ఉన్నాయి. సుమారు 80,000 రిజిస్టర్డ్ వార్తాపత్రికలు, పబ్లిషర్స్ ఉన్నారు. 1,000కి పైగా శాటిలైట్ టీవీ చానెళ్లు ఉన్నాయి. అంతేకాకుండా, సోషల్ మీడియా యుగంలో, దేశంలో 50 కోట్లకుపైగా యూట్యూబ్ వినియోగదారులు ఉన్నారు. 50 కోట్లకు పైగా ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు ఉన్నారు. వివిధ అంశాలపై బహిరంగ చర్చలు జరుగుతాయి, వివిధ విషయాలపై చర్చిస్తారు. ఇందులో డిజిటల్ పవర్ కీలకం" అని ఆయన అన్నారు.

    భారత్‌లో తొలిసారిగా జరుగుతున్న బ్లూమ్‌బెర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్ కార్యక్రమం అక్టోబర్ 15వ తేదీన ముగుస్తుంది.

  6. రాజస్థాన్: మాజీ ఎమ్మెల్యేను గ్రామ ప్రజలే కొట్టి చంపారని కేసు, క్రషర్ వివాదంలో రాజస్థాన్ మాజీ ఎమ్మెల్యేను గ్రామస్తులు కొట్టిచంపినట్టు కేసు నమోదు

    రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో బయానా మాజీ ఎమ్మెల్యే అత్తర్ సింగ్ భదానా ఆదివారం నాడు హత్యకు గురయ్యారు.

    "కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు, సోమవారం 33 మంది వ్యక్తులపై, మరో 70 నుంచి 80 మందిపై కేసు నమోదు చేశాం" అని భరత్‌పూర్ జిల్లా ఎస్పీ రాజేశ్ మీనా బీబీసీ న్యూస్ హిందీతో ఫోన్‌లో మాట్లాడుతూ చెప్పారు.

    "గత రెండేళ్లుగా వేయిర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భోండా గ్రామంలో ఉన్న క్రషర్‌కు వెళ్లే దారి విషయంలో గ్రామస్థులకు, క్రషర్ యజమానికి (మరణించిన అత్తర్ సింగ్ భదానా) మధ్య వివాదం నడుస్తోంది. ఆ క్రషర్‌ను గ్రామస్థులు వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది" అని రాజేశ్ మీణా తెలిపారు.

    ఈ హత్య జరిగినప్పటి నుంచి గ్రామంలోని చాలా మంది పరారీలో ఉన్నారు, చాలా ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయి. "పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నాం. ముందుజాగ్రత్త చర్యగా పోలీసు బలగాలను గ్రామంలో మోహరించాం" అని వేయిర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ ధీరేంద్ర బీబీసీతో ఫోన్‌లో మాట్లాడుతూ చెప్పారు.

    మరణించిన అత్తర్ సింగ్ భదానా ఫరీదాబాద్‌లోని పాలి గ్రామానికి చెందిన వ్యక్తి. ఆయన బయానా నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా పనిచేశారు, ఆ తర్వాత కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. ఆయన ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో క్రషర్ వద్దకు వెళ్లారు. అప్పుడే పెద్ద సంఖ్యలో గ్రామస్థులు వచ్చి కర్రలతో అత్తర్ సింగ్‌పై దాడి చేశారని చెబుతున్నారు.

  7. మరోసారి దిల్లీ పోలీసుల అదుపులో సీజేపీ నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా, జంతర్ మంతర్ వద్దకు వెళ్లేందుకు సీజేపీ నాయకులు ప్రయత్నం

    జంతర్ మంతర్ వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సీజేపీ నాయకులను దిల్లీ పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు. సీజేపీ కో కన్వీనర్లు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్ తోపాటు అజింక్య షిండే సహా అనేకమంది మద్దతుదారులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి, సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో, పార్టీకి చెందిన కొందరు మద్దతుదారులు జంతర్ మంతర్‌కు చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు ఉంది. "ఈ రోజు తెల్లవారుజామున త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని జంతర్ మంతర్‌లోకి ప్రవేశించిన వారిని దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అశుతోష్ రంకా, సౌరవ్ దాస్, అజింక్య షిండే బృందంలోని ఇతర సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. నరేంద్ర మోదీ, మీరు ఈ నిరసనలను ఆపలేరు" అని ఆపోస్టులో దీప్కే రాశారు.

  8. రాహుల్ తీరు ప్రజాస్వామ్యానికే అవమానకరం: కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విమర్శ, ఇంకా కాంగ్రెస్ గుణపాఠం నేర్చుకోలేదు అన్న సింధియా

    దిల్లీలో రాహుల్ గాంధీ, ప్రతిపక్ష నేతలు చేపట్టిన నిరసన ప్రజాస్వామ్యానికే అవమానమని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విమర్శించారు.

    " లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నుంచి జిల్లా పంచాయతీలు, సర్పంచుల వంటి స్థానిక సంస్థల ఎన్నికల వరకు నిరంతరం ఎన్నికలు జరిగే దేశంలో, ఆ వ్యవస్థపైనే అనుమానాలు వ్యక్తం చేయడం లేదా మచ్చ తీసుకురావడానికి ప్రయత్నించడం కాంగ్రెస్ పార్టీ అసలు ఉద్దేశాన్ని మరోసారి స్పష్టం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం గురించి మాట్లాడుతుంది, కానీ ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ రాజ్యాంగ వ్యవస్థలోని ప్రతి అంశాన్ని తక్కువ చేసి చూపడానికి లేదా అప్రతిష్టపాలు చేయడానికి వెనుకాడటం లేదు. అత్యవసర పరిస్థితిని (ఎమర్జెన్సీ) విధించి రాజ్యాంగాన్ని కాలరాసిన అదే కాంగ్రెస్ పార్టీ, నేడు ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రశ్నిస్తోంది. న్యాయవ్యవస్థ, ప్రధాన న్యాయమూర్తి, భారత సైన్యం, ఎన్నికల సంఘంపై కూడా ప్రశ్నలు లేవనెత్తిన పార్టీ ఇదే. కాంగ్రెస్ పార్టీ బలహీనపరచడానికి ప్రయత్నించని రాజ్యాంగ సంస్థ అంటూ ఏదీ లేదు" అని ఆయన విమర్శించారు.

  9. బెదిరించినా, భయపెట్టినా వెనక్కి తగ్గబోము: రాహుల్ గాంధీ, సోమవారం ఆందోళనలో పాల్గొన్న వారికి ధన్యవాదాలు చెప్పిన రాహుల్

    రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలంతా ఐక్యంగా సాగుతున్నారని రాహుల్ అభిప్రాయపడ్డారు. సోమవారం జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వారికి ధన్యవాదాలు చెప్పిన రాహుల్, మొన్న యువకులపై దాడి చేసిన వారు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.

    ప్రధాన మంత్రి మాదిరిగానే వారికి కూడా నిలబడి పోరాడే ధైర్యం లేదన్నారు. కేవలం అధికారం, బలాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే పోరాడుతున్నారని విమర్శించారు./

    అందరూ కలిసి ఒక జట్టుగా పని చేస్తున్నారని, జరుగుతున్నవి వేర్వేరు నిరసనలు కావని, ఇదొక ఉద్యమమని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగాన్ని హరించేవారికి, ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కేవారికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ నిలబడతారని, ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గబోరని పేర్కొన్నారు. భారత ప్రజలు భయపడబోరని ప్రభుత్వానికి చూపించాల్సిన అవసరం ఉందన్నారు. కొట్టవచ్చు, బెదిరించవచ్చు, భయపెట్టేందుకు ప్రయత్నించవచ్చు అయినా తగ్గబోమని స్పష్టం చేశారు.

  10. దిల్లీ: ఇండియా కూటమి సుప్రీంకోర్ట్ పాదయాత్ర - 7 ఫోటోలలో

  11. ఇండియా కూటమి ‘సుప్రీంకోర్ట్ మార్చ్’కు పెద్దసంఖ్యలో జనం

    విపక్ష ఇండియా కూటమి సోమవారం బారాఖంబా నుంచి సుప్రీం కోర్టుకు మార్చ్ చేపట్టింది.

    కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్, నేహా బోరా సహా ఇతర ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు ఈ యాత్రలో పాల్గొన్నారు.

    ఇండియా కూటమిలో మార్చ్‌లో జనం భారీగా కనిపిస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి.

    మార్చ్‌లో పాల్గొనేందుకు జనం పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారని బీబీసీ ప్రతినిధి దిల్‌నవాజ్ పాషా నిర్ధరించారు.

    ఈ పాదయాత్రకు సంబంధించిన కొన్ని ఫోటోలు మీకోసం..

  12. విపక్షాల పాదయాత్రకు అడ్డంకులు.. దారి మార్చుకుని సుప్రీంకోర్ట్‌కు చేరుకున్న రాహుల్ గాంధీ, ప్రతిపక్షాల నాయకులు

  13. సీజేపీ నిరసన ప్రదర్శనల రిపోర్టింగ్‌లో జర్నలిస్టులకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి?

  14. జంతర్ మంతర్ ఇక నిరసనల వేదిక కాదు: దిల్లీ పోలీసులు

    దిల్లీలో నిరసనలు, ధర్నాలు నిర్వహించడానికి నిర్దేశించిన ప్రదేశాల జాబితా నుంచి జంతర్ మంతర్‌ను తొలగించారు .

    కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

    దిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ దీని గురించి నోటీస్ జారీ చేశారు.

    జంతర్ మంతర్‌కు బదులుగా తూర్పు దిల్లీలోని రామ్‌లీలా మైదాన్, బురారీ మైదాన్, సీబీడీ మైదాన్‌లలో నిరసనలు చేపట్టవచ్చని ఆ నోటీస్‌లో తెలిపారు.

    “పౌరులకు నిరసనలు, ప్రదర్శనలు నిర్వహించే హక్కును దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుతం ఉన్న నిర్దేశిత స్థలాలకు ప్రత్యామ్నాయాలను సమీక్షించే బాధ్యతను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీకి అప్పగించారు” అని ఆ నోటీస్‌లో పేర్కొన్నారు.

    ఈ మూడు ప్రదేశాలలో నిరసనలు, ధర్నాలు నిర్వహించడానికి విడివిడిగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ విడుదల చేస్తామని ఆ నోటీసులో పేర్కొన్నారు.

  15. జ్ఞానేశ్‌ కుమార్‌ను వదిలేది లేదు. వేచి చేస్తున్నాం: రాహుల్ గాంధీ

    ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌ కుమార్ అవినీతి గురించి తనకు తెలుసని, ఆయన్ను వదిలేది లేదని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు.

    “ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అడిగిన ప్రశ్నలనే మేం కూడా అడుగుతున్నాం. జ్ఞానేశ్ కుమార్ ఎందుకు రాజీనామా చేయడం లేదు? జ్ఞానేశ్ కుమార్ జీ.. మీ పరిస్థితేంటో మాకు తెలుసు. మీకు నిద్ర పట్టడం లేదు. మేం మిమ్మల్ని వదిలిపెట్టం. మీరు తప్పించుకోలేరు. మీ గతం మీ అవినీతి గురించి మాకు తెలుసు. మేం కేవలం వేచి చేస్తున్నాం” అని రాహుల్ గాంధీ అన్నారు.

    దిల్లీలో నిరసనకారులపై జరుగుతున్న పోలీసు చర్యల గురించి రాహుల్ స్పందిస్తూ, ప్రభుత్వం చాలా పెద్ద తప్పు చేస్తోందని అన్నారు.

    “ఓట్ల చోరీకి వ్యతిరేకంగా దిల్లీలో చాలా రోజులుగా నిరసనలు జరుగుతున్నాయి. అసలు ప్రశ్న ఏమిటంటే దిల్లీని ఎందుకు జైలుగా మార్చారు? నగరంలోకి రాకుండా ప్రజలను అడ్డుకుంటున్నారు. రైళ్లు, బస్సుల్లోనే వారిని నిలిపివేస్తున్నారు. ప్రభుత్వం చాలా పెద్ద తప్పు చేస్తోంది” అన్నారు.

  16. బీజేపీ వ్యతిరేక ఓట్లనే తొలగిస్తున్నారు: రేవంత్ రెడ్డి

    బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) అమలుచేసిన రాష్ట్రాలలోనే ఆ పార్టీ గెలిచిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

    సోమవారం జరగనున్న కాంగ్రెస్ పాదయాత్ర కోసం దిల్లీకి చేరుకున్న రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

    "ముఖ్యంగా బీజేపీని వ్యతిరేకిస్తున్నది ఎవరంటే..దళితులు, ఆదివాసీలు, గిరిజనులు, మైనార్టీలు, యువత. బీజేపీని ఓడించాలనుకున్న ప్రజల ఓటు హక్కును తొలగించడానికి కుట్ర చేశారు. జ్ఞానేశ్‌కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని కమిషన్ సభ్యులు చెప్పారు. తప్పులు జరుగుతున్నాయని తెలిసినపుడు, ఆ అధికారిని తొలగించడానికి మోదీకి అభ్యంతరం ఏమిటి?, ఆయనకు అండగా ఎందుకు నిలబడుతున్నారు" అని రేవంత్ రెడ్డి అన్నారు.

  17. ఒమన్‌ సమీపంలో భారతీయ సిబ్బంది ఉన్న ట్యాంకర్‌పై డ్రోన్‌ దాడి

    ఒమన్‌ సమీపంలో భారతీయ సిబ్బంది ఉన్న ట్యాంకర్‌పై ఆదివారం డ్రోన్‌ దాడి జరిగింది. నౌకలో ఉన్న 11 మంది భారతీయ నావికుల్లో తొమ్మిది మందిని రక్షించగా.. మరో ఇద్దరు గల్లంతయ్యారు. ఇద్దరు నావికులు కనిపించకుండా పోయిన విషయాన్ని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్‌ ఆదివారం రాత్రి ధ్రువీకరించారు.

    "అక్టోబర్ 11న సోహార్ యాంకరేజ్ వద్ద భారతీయ ట్యాంకర్ ఎం.టి. పెట్రో డాల్ఫిన్‌పై డ్రోన్ దాడి జరిగింది. ట్యాంకర్‌పై 11 మంది భారతీయ నావికులు ఉన్నారు. తొమ్మిది మందిని రక్షించారు, ఇద్దరు గల్లంతయ్యారు" అన్నారు.

    స్థానిక తీర రక్షక దళం గాలింపు, సహాయక చర్యలు చేపట్టిందని మంత్రి వివరించారు.

    గల్లంతైన వారిని గుర్తించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, సహాయక చర్యలకు పూర్తి మద్దతు అందించేందుకు సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని సర్బానంద సోనోవాల్‌ పేర్కొన్నారు.

  18. సీజేపీ: బాండ్‌పై సంతకం చేస్తే నిరసనలకు దూరంగా ఉంచగలరా? చట్టం ఏం చెబుతోంది?

  19. మియన్మార్‌లో పెరుగుతున్న బలవంతపు సైనిక నియామకాలు..

  20. విపక్ష ఎంపీలతో భేటీకి సీజేఐ సూర్యకాంత్ నిరాకరణ

    విపక్ష పార్టీల ఎంపీలతో సమావేశమయ్యేందుకు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్ నిరాకరించారు. వారిని కలవలేకపోవడానికి కొన్ని కారణాలను సీజేఐ వివరించినప్పటికీ, లేఖ గోప్యతను దృష్టిలో ఉంచుకుని వాటిని బహిర్గతం చేసేందుకు నిరాకరించారు.

    “విపక్ష నేతల లేఖ నాకు నిన్న అందింది. దానికి నిన్న రాత్రే సమాధానం ఇచ్చాను. కొన్ని కారణాలను వివరిస్తూ వారిని కలవలేనని తెలియజేశాను” అని సీజేఐ సూర్యకాంత్ సోమవారం మీడియాతో చెప్పారు.

    ‘వన్ నేషన్‌–వన్‌ ఎలక్షన్‌’పై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సుప్రీంకోర్టు పర్యటన రద్దు కావడంపై కూడా సీజేఐని ప్రశ్నించగా, ఆయన స్పందిస్తూ.. “ఆ విషయంలో కోర్టులో విరుద్ధ ప్రయోజనాల (కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్) పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. అందుకే, మేం దీనిపై చర్చించాం. ఎలాంటి విరుద్ధ ప్రయోజనాలకైనా దూరంగా ఉండాలని నా సీనియర్ న్యాయ సహచరులు, నేను ఒకే అభిప్రాయానికి వచ్చాం” అని తెలిపారు.

    సీజేఐను కలిసేందుకు సమయం కోరుతూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో కలిసి లేఖ రాసినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదివారం తెలిపారు.