మీరు ఈ వెబ్‌సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్‌సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.

నన్ను ప్రధాన వెబ్‌సైట్‌కు తీసుకెళ్లండి

క్రికెట్ వరల్డ్ కప్-2023 తాజ్ మహల్ దగ్గర... ఏంటీ కథ?

తాజ్ మహల్ వద్ద ఉంచిన ప్రపంచకప్ చిత్రాన్ని ఐసీసీ తన ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. ప్రపంచకప్‌ పోటీలకు ఇంకా 50 రోజులే ఉంది అంటూ దానికి వ్యాఖ్యను జోడించింది.

లైవ్ కవరేజీ

  1. "రైలు ఎక్కి తనిఖీలు చేశారు, పోలీసుల నిర్బంధాలు చూస్తే భయమేస్తోంది"-తెలుగు రాష్ట్రాల యువకులు ఇంకా ఏం చెప్పారు?

  2. దిల్లీ: జంతర్ మంతర్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రత, కఠిన ఆంక్షలు

    కాక్రోచ్ జనతా పార్టీ నిరసన ప్రదర్శన నేపథ్యంలో జంతర్-మంతర్ అలాగే దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో దిల్లీ పోలీసులు భారీగా భద్రతా బలగాలు ఏర్పాటు చేయడంతో పాటు, ఆంక్షలను కఠినతరం చేశారు.

    పోలీసు బలగాలు, సెక్యూరిటీ ఫోర్సులు, పోలీసు వ్యాన్‌లు కనిపిస్తున్న కొన్ని ఫోటోలను ఏఎన్‌ఐ వార్తా సంస్థ విడుదల చేసింది.

    సీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసనకు అనుమతి లభించలేదు. అయినా తాము జంతర్-మంతర్‌కు చేరుకుంటామని సీజేపీ నాయకులు చెబుతున్నారు. చరిత్ర సృష్టిస్తామని పార్టీ సహ కన్వీనర్ అశుతోష్ రాంకా శుక్రవారం రాత్రి పేర్కొన్నారు.

    "ప్రియమైన కాక్రోచ్‌లు.. మనం ఇప్పటివరకు ఎంత దూరం ప్రయాణించామో తలచుకుంటే గర్వంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ మనం కచ్చితంగా చరిత్ర సృష్టిస్తాం" అని అశుతోష్ రాంకా ఎక్స్ పోస్టులో తెలిపారు.

    అలాగే, "ఒకటే గుర్తుంచుకోండి - చేతిలో రాజ్యాంగం, గుండెల్లో గాంధీ. ఏం జరిగినా మన చేయి ఎత్తరాదు. భారత్ మాతా కీ జై" అని రాశారు.

    ఆయనతో పాటు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్, సామాజిక రాజకీయ కార్యకర్త యోగేంద్ర యాదవ్, ఐసా అధ్యక్షురాలు నేహా బోరా, ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ కూడా ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు.

  3. కాక్రోచ్ జనతా పార్టీ నిరసన నేపథ్యంలో 250కి పైగా రైళ్లు రద్దు

    కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసన ప్రదర్శన నేపథ్యంలో, న్యూదిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే 250కి పైగా రైళ్లను అధికారులు రద్దు చేశారు.

    పీటీఐ వార్తాసంస్థ కథనం ప్రకారం, అక్టోబర్ 9న మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఆయా ప్రారంభ స్టేషన్ల నుంచి బయలుదేరాల్సిన ప్యాసింజర్ రైళ్లను రైల్వేబోర్డు ఆదేశాల మేరకు రద్దు చేశారు.

    అంతేకాకుండా, అక్టోబర్ 10న ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య న్యూదిల్లీ లేదా హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్‌కు చేరుకోవాల్సిన రైళ్లు కూడా రద్దయ్యాయి.

    రైల్వే మాజీ అధికారులు, ప్రయాణికుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఈ చర్యను తప్పుబట్టాయి.

    "ఇంత భారీ సంఖ్యలో రైళ్లను రద్దు చేయడం ఆందోళనకారుల ముందు తలవంచడమే" అని రైల్వే బోర్డు మాజీ సభ్యుడు (ఇంజనీరింగ్) సుబోధ్ జైన్ పేర్కొన్నారు.

    దేశంలోని ఏదైనా ప్రాంతంలో నిరసనలు లేదా ఉద్యమాల కారణంగా ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దు కావడం తన అనుభవంలో లేదని ఆల్ ఇండియా రైల్వేమెన్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి శివ్ గోపాల్ మిశ్రా పీటీఐతో అన్నారు.

    అకస్మాత్తుగా రైళ్లు రద్దు కావడం వల్ల వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

    మరోవైపు, దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) కూడా 57 మెట్రో స్టేషన్ల ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను మూసివేసింది.

  4. జంతర్‌ మంతర్ నిరసన: ముందస్తు అరెస్టులు, భారీ సంఖ్యలో కేంద్ర బలగాలు

  5. ‘మోదీ సూత్రధారి.. అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్ పాత్రధారులు.. రాష్ట్రపతి కూడా దీన్ని ఖండించలేదు: రాహుల్ గాంధీ

    రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన అనంతరం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు.

    ‘ఓట్లు చోరీకి గురవుతున్నాయని దేశమంతటికీ తెలుసు. నరేంద్ర మోదీ దీనికి సూత్రధారి. అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్ దీన్ని అమలు చేస్తున్నారు. ఈ నిజాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు ఖండించలేదు’ అని రాహుల్ గాంధీ అన్నారు.

    కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ఇండియా కూటమి నాయకులు రాష్ట్రపతిని కలిసి మెమొరాండం సమర్పించినట్లు చెప్పారు. దేశంలో ఓట్ల చోరీ గురించి, తాము చేస్తున్న నిరసనల గురించి తెలిపామన్నారు. అన్ని వివరాలూ రాష్ట్రపతికి చెప్పామన్నారు. ఈవీఎంలను పక్కనపెట్టి బ్యాలట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్రపతిని కోరామన్నారు.

    ఓట్ల చోరీకి ఆధారాలు చూపించాలని రాష్ట్రపతి అడిగారని, త్వరలో సమర్పిస్తామని ఖర్గే చెప్పారు.

  6. రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీగా వెళ్లిన విపక్ష ఎంపీలు

    ఇండియా కూటమి ఎంపీలు శుక్రవారం రాత్రి భేటీ అయిన తరువాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశానికి బయల్దేరారు.

    దారిలో వారు విజయ్ చౌక్ వద్ద బైఠాయించి సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.

    అక్కడి నుంచి 10 మంది విపక్ష ఎంపీలు రాష్ట్రపతిని కలవడానికి వెళ్తున్నట్లు ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది.

  7. ఎలాన్ మస్క్ విషయంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు కాంగ్రెస్ వైఖరికి భిన్నంగా ఉన్నాయా?

  8. ఉప ఎన్నికలు: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఆధిక్యం, తమిళనాడులో టీవీకే ముందంజ, నందిగ్రామ్ అత్యంత చర్చనీయాంశమైన స్థానాల్లో ఒకటిగా పరిగణిస్తున్నారు. అందుకే అందరి దృష్టి ఈ స్థానంపైనే ఉంది.

    దేశంలోని ఆరు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. భారత ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఇచ్చిన ఫలితాల ప్రకారం, పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్ అసెంబ్లీ స్థానంలో భారతీయ జనతా పార్టీకి చెందిన హసీ రాణి రథ్, కాంగ్రెస్ పార్టీకి చెందిన మిలన్ ప్రధాన్‌పై 41,937 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

    హసి రాణి రథ్‌కు ఇప్పటివరకు 55,665 ఓట్లు రాగా, మిలన్ ప్రధాన్‌కు కేవలం 13,728 ఓట్లు మాత్రమే వచ్చాయి.

    నందిగ్రామ్ అత్యంత చర్చనీయాంశమైన స్థానాలలో ఒకటిగా పరిగణిస్తున్నారు. అందుకే అందరి దృష్టి ఈ స్థానంపైనే ఉంది.

    భారత ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ప్రకారం, పశ్చిమ బెంగాల్‌లోని రెజినగర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుల్లా కాఫీపై బీజేపీ అభ్యర్థి శంఖరవ్ చౌదరి ఆధిక్యంలో ఉన్నారు.

    అస్సాంలోని నాగావ్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నిక ఓట్ల లెక్కింపులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దేవాశిష్ శర్మ ఆధిక్యంలో ఉన్నారు. ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ బద్రుద్దీన్ అజ్మల్ ఆయనకంటే సుమారు 45 వేల ఓట్ల తేడాతో వెనుకబడి ఉన్నారు.

    తమిళనాడులో రెండు నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరిగాయి. ఇందులో మదురాంతకం, ధరాపురం అసెంబ్లీ స్థానాలో టీవీకే అభ్యర్థులు లీడింగ్‌లో ఉన్నారు.

    పుదుచ్చేరిలోని తట్టంచవాడి నియోజకవర్గంలో ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ ఆనంద్ విజయం సాధించారు.

    పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్, రెజీనగర్, తమిళనాడులోని మదురాంతకం, ధరాపురం, అస్సాంలోని నాగావ్ లోక్‌సభ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది.

  9. ఇన్ఫోసిస్‌తో సహా ఈ టెక్ కంపెనీలపై తీసుకున్న చర్యలను సమర్థించిన జేడీ వాన్స్, అమెరికా పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ నుంచి కంపెనీల తొలగింపు

    గ్రీన్ కార్డ్, అమెరికా పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ నుంచి ఎనిమిది టెక్ కంపెనీలను తొలగించడాన్ని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సమర్థించారు.

    కంపెనీలకు చౌకైన విదేశీ కార్మికుల సరఫరాకు విమర్శకులు సహాయం చేయాలనుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

    ఈ నిర్ణయాన్ని డెమొక్రాటిక్ కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్ ప్రశ్నించిన తర్వాత, వాన్స్ ' సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో విమర్శలు చేశారు. ‘సోషలిజం' అంటే పెద్ద కంపెనీలకు చౌకగా కార్మికుల సరఫరా ఎప్పటికీ ఆగకుండా ఉండేలా చూడటానికి సర్వశక్తులు ఒడ్డి పోరాడటమే అనిపిస్తోంది."

    మైక్రోసాఫ్ట్, అడోబ్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), విప్రో, హెచ్‌సీఎల్, క్యాప్‌జెమిని అనే ఎనిమిది కంపెనీలను సస్పెండ్ చేయాలన్న నిర్ణయం చుట్టూ నెలకొన్న రాజకీయ వివాదానికి ఈ ప్రకటన మరింత ఆజ్యం పోసింది.

  10. స్మిత్ మచ్చర్‌కు అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించిన ఇజ్రాయెల్ అధ్యక్షుడు, స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత పురస్కారం

    ఫ్లైదుబాయ్ విమానం కాక్‌పిట్‌లో కో-పైలట్ దాడి చేసినప్పటికీ, ధైర్యసాహసాలతో 174 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలను కాపాడిన భారత పైలట్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత పురస్కారం ప్రదానం చేయనున్నారు.

    భారత పైలట్ కోలుకున్న తర్వాత ఆయన ఇజ్రాయెల్ అత్యున్నత పురస్కారం అందజేస్తామని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ తెలిపారు.

    "ఈ రోజు మనం గౌరవిస్తున్న ఇజ్రాయెల్ వీరులతోపాటు, భారత్‌కు చెందిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ కూడా త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. కెప్టెన్ మచ్చర్ అపారమైన ధైర్యం, అత్యుత్తమ వృత్తి నైపుణ్యం ఒక పెద్ద విపత్తును నివారించడంలో సహాయపడ్డాయి. ఆయన కోలుకున్న తర్వాత, ఇజ్రాయెల్ ప్రజల తరపున ఇచ్చే అత్యున్నత పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేయడం నాకు గౌరవంగా ఉంటుంది" అని ఆయన అన్నారు.

    భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై ఒమన్‌కు చెందిన కో-పైలట్ దాడి చేయగా, ఆయన ధైర్యంగా ఎదుర్కొని 174 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలను కాపాడారు.

  11. ఎన్నికల సంఘానికి మద్దతుగా 42 మంది మాజీ న్యాయమూర్తులు లేఖలు, 42 మంది మాజీలు రాసిన లేఖలో ఏం ఉంది

    'ఎన్నికల కమిషన్‌ను అప్రతిష్టపాలు చేయడానికి' ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని మాజీ న్యాయమూర్తులు ఆరోపించారు.

    'ఎన్నికల సంఘాన్ని బలహీనపరిచే ప్రయత్నాలకు' వ్యతిరేకంగా 42 మంది మాజీ న్యాయమూర్తులు ఒక బహిరంగ లేఖ రాశారని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. ఈ లేఖలో, ఎన్నికల సంఘం, న్యాయవ్యవస్థ, ఇతర రాజ్యాంగ సంస్థలను బలహీనపరిచేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై మాజీ న్యాయమూర్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

    పీటీఐ వార్తా సంస్థ ప్రకారం, ఆ లేఖపై సంతకం చేసిన మాజీ న్యాయమూర్తులు, ఎటువంటి నిర్దిష్ట ఆధారాలు లేకుండా 'ఓట్ల దొంగతనం' ఆరోపణలు చేయడాన్ని ప్రశ్నించారు.

    రాజ్యాంగ సంస్థలను పదేపదే 'దొంగలు', 'కుట్రదారులు' అని ముద్ర వేయడం ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

    "సంస్థలను విమర్శించడం ప్రజాస్వామ్య హక్కు, కానీ వాటిని అపఖ్యాతి పాలు చేయడం కాదు" అని ఆ లేఖలో పేర్కొన్నారు.

    ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు చేపట్టిన నిరసన అక్టోబర్ 8న మూడో రోజుకు కొనసాగింది.

  12. బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నేను, బీబీసీ కరస్పాండెంట్ ఖగేష్, ఇప్పటి నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మీకు ముఖ్యమైన వార్తలను అందిస్తాను.

    నిన్నటి లైవ్ పేజీ వార్తలను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

  13. ‘దేశాన్ని నలుగురు హైజాక్ చేశారు.. శిక్షపడేలా చేస్తాం’.. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో దిల్లీలో మూడో రోజూ ప్రతిపక్షాల నిరసనలు

  14. కాంగ్రెస్‌కు, సీజేపీ మధ్య విభేదాలు ఉన్నాయా? అరవింద్ కేజ్రీవాల్ నిరసనలకు ఎందుకు వెళ్లలేదు?

  15. రొమ్ము క్యాన్సర్: లక్షణాలు లేకపోయినా టెస్ట్‌లు ఎందుకు చేయించుకోవాలి?

  16. భారత్ రక్షణ సమాచారం పాకిస్తాన్ నిఘా సంస్థలకు అందుతోందా?

  17. ‘గంటకు పైగా సీపీఆర్ చేసినా బతకలేదు’ నానా పాటేకర్ చివరిక్షణాలపై వైద్యులు ఏం చెప్పారు?

  18. పిడుగు పడిందా, వడగళ్ల వర్షమా? 104 మందితో వెళ్తున్న ఆ విమానం ఎందుకు దెబ్బతింది?

  19. ‘‘సుమారు 150 ఏళ్లు ప్రపంచానికి దూరంగా ఒక ద్వీపంలో బతికారు, వాళ్లకు షాపులు, డబ్బులు, టీవీలు, సినిమాలు అంటే ఏంటో తెలియదు’’

  20. నిన్న అద్వానీని కలిసిన ప్రధాని మోదీ

    ప్రధాని నరేంద్రమోదీ బీజేపీ సీనియర్ నేత ఎల్.కె. అద్వానీతో సమావేశమయ్యారు.

    ఈ సమావేశం నిన్న(అక్టోబర్ 7) జరిగిన్టటు మోదీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.

    ‘‘అద్వానీని ఆయన నివాసంలో కలిసి ఆశీర్వాదం తీసుకున్నా. దశాబ్దాలుగా అద్వానీ అందించిన ప్రజాసేవ, దేశానికి ఆయన చేసిన కృషి చెరగని ముద్రవేశాయి. దేశ ప్రగతిని బలోపేతం చేయడంలో అద్వానీది కీలకపాత్ర’’ అని మోదీ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.