మీరు ఈ వెబ్‌సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్‌సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.

నన్ను ప్రధాన వెబ్‌సైట్‌కు తీసుకెళ్లండి

క్రికెట్ వరల్డ్ కప్-2023 తాజ్ మహల్ దగ్గర... ఏంటీ కథ?

తాజ్ మహల్ వద్ద ఉంచిన ప్రపంచకప్ చిత్రాన్ని ఐసీసీ తన ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. ప్రపంచకప్‌ పోటీలకు ఇంకా 50 రోజులే ఉంది అంటూ దానికి వ్యాఖ్యను జోడించింది.

లైవ్ కవరేజీ

  1. ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో భారీవర్షాలతోపాటు ఫ్లాష్‌ఫ్లడ్స్ వచ్చే అవకాశం- విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక

    గురువారం శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

    మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

    గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

    లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

    వర్షాల కారణంగా వాగులు, కాలువలు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున వాటిని దాటేందుకు ప్రయత్నించద్దని ప్రఖర్ జైన్ సూచించారు. విపత్తు పరిస్థితుల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు 16 ఎన్‌డీఆర్‌ఎఫ్‌, 11 ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

  2. కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు ఫస్ట్ క్లాస్ ఆర్డర్ ఆఫ్ జాయెద్ II అవార్డు ప్రదానం

    కాక్‌పిట్‌లో జరిగిన దాడిని ధైర్యంగా ఎదిరించి ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన ఇండియన్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను, ప్లైదుబై సిబ్బందిని యూఏఈ అధ్యక్షుడు సత్కరించారు.

    దుబయ్-టెల్ అవీవ్ విమానం ప్రయాణిస్తున్న సమయంలో ప్రయాణికులను రక్షించడానికి చూపిన ధైర్యసాహసాలకు గుర్తింపుగా భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్, ఫ్లైదుబయ్ సిబ్బందికి ఫస్ట్ క్లాస్ ఆర్డర్ ఆఫ్ జాయెద్ II పురస్కారాన్ని యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ప్రదానం చేశారు.

    దుబయ్ క్రౌన్ ప్రిన్స్, ఉప ప్రధానమంత్రి, రక్షణమంత్రి షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఈ పతకాలను అందజేశారని, సిబ్బందిని ప్రశంసించారని దుబయ్ మీడియా కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.

  3. Cyclone Arnab: 'పీకలదాకా నీరొచ్చేసింది.. ఇల్లొదిలి వచ్చేశాం'

  4. అర్నబ్ తుపాను ధాటికి ఏపీలో అయిదుగురి మృతి

  5. ఆంధ్రప్రదేశ్‌లో హుద్ హుద్ కంటే బీభత్సం సృష్టించిన తుపాను.. అప్పుడు 10 వేల మందికి పైగా చనిపోయారు.. అది ఏంటంటే..

  6. కర్ణాటక ఎంఎల్సీ ఎన్నికల్లో నాలుగు స్థానాలను కోల్పోయిన కాంగ్రెస్

    కర్ణాటకలో పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చూసింది. ఈ స్థానాల్లో బీజేపీకి ఇప్పటికే గట్టి పట్టు ఉంది. గతంలోనూ పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాల కోటా కింద జరిగిన పలు ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించింది.

    అయితే, ఈసారి బెంగళూరు ఉపాధ్యాయుల నియోజకవర్గంలో కూటమి సాధించిన విజయం అత్యంత కీలకంగా నిలిచింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి పుట్టణ్ణ వరుసగా ఐదుసార్లు ఎన్నికల్లో గెలుస్తూ వచ్చారు.

    ఈసారి ఆయనను జనతాదళ్ సెక్యులర్ అభ్యర్థి, బెంగళూరు అడ్వొకేట్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఏపీ రంగనాథ్ ఓడించారు. 918 ఓట్ల మెజారిటీతో రంగనాథ్ విజయం సాధించారు.

    ఈ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్వయంగా ప్రచారం చేశారు. మిగిలిన మూడు స్థానాల్లోనూ బీజేపీ అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించారు.

    ఈ ఫలితాలపై రాష్ట్ర హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే స్పందిస్తూ, “ఫలితాలు మా అంచనాలకు అనుగుణంగా లేవు. దీని నుంచి మేము పాఠం నేర్చుకున్నాం. ఇకపై మరింత కష్టపడి పనిచేస్తాం. అయితే, ఈ ఫలితాలను మా ప్రభుత్వ పనితీరుకు అద్దంగా భావించలేం” అని అన్నారు.

  7. జుల్ఫికర్ అలీ భుట్టో: ‘నేను భారత పౌరుడిని’ అంటూ బెనజీర్ భుట్టో తండ్రి భారతీయ కోర్టుల్లో ఎందుకు పోరాడారు?

  8. అర్నబ్ తుపాను బీభత్సం - కూకటివేళ్లతో చెట్లను పెకిలించేంత గాలి...

  9. అర్నబ్ తుపానుతో పంటలకు తీవ్ర నష్టం: అమిత్ షాకు సీఎం లేఖ

    కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. అర్నబ్ తుపాను తీవ్రతను గుర్తించి నష్టాలను అంచనా వేసేందుకు కేంద్ర బృందాలను త్వరగా పంపించాలని విజ్ఞప్తి చేశారు.

    తుపాను వేళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను అమిత్ షాకు చంద్రబాబు వివరించారు.

    ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ప్రాణ నష్టం లేకుండా చూశామని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు.

    ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఉన్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఇతర కేంద్ర సిబ్బంది సహాయం మరింత కాలం అందించాలని విజ్ఞప్తి చేశారు.

  10. స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లోకి జియో ఫ్లాట్‌ఫామ్స్.. ధర ఎంతంటే?

    నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్‌కు చెందిన ఒక్కో షేరు రూ. 1,358 చొప్పున లిస్ట్ అయ్యింది.

    ఈ సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇషా అంబానీ మాట్లాడుతూ, 1977లో రిలయన్స్ తొలి పబ్లిక్ ఇష్యూకి వచ్చినప్పుడు తన తండ్రి ముఖేష్ అంబానీ ఎంతో శ్రమించారని తెలిపారు.రిలయన్స్‌ను సామాన్య ప్రజల వద్దకు తీసుకెళ్లాలనే నిర్ణయాన్ని మా తాత ధీరూభాయ్ అంబానీ తీసుకున్నారు. ఆ సమయంలో కంపెనీ రూ. 10 కోట్ల వాల్యుయేషన్‌తో రూ. 2.82 కోట్లు సమీకరించింది" అన్నారు.

    జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ స్టాక్ మార్కెట్ లిస్టింగ్ కోసం జరిగిన గంట మోగించే కార్యక్రమానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ నీతా అంబానీ, ఎన్‌ఎస్‌ఈ ఎండీ & సీఈఓ ఆశిష్ చౌహాన్ హాజరయ్యారు.

  11. నరసాపురం సమీపంలో తీరం దాటిన అర్నబ్ తుపాను

    అర్నబ్ తుపాను నర్సాపురానికి సమీపంలో తీరాన్ని దాటినట్టు ఆంధ్రప్రదేశ్ విపత్తుల సంస్థ ప్రకటించింది.

    రాత్రి 2 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య యానాంకు నైరుతిగా, నర్సాపురం సమీపంలో తీరం దాటినట్టు కొద్దిసేపటి కిందట ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఎక్స్ వేదికగా ప్రకటించారు.

    తీరం దాటిన తర్వాత ప్రస్తుతం ఈ తుపాను బలహీనపడిందని తెలిపారు. అర్నబ్ తీరం దాటినప్పటికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

    దీని ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ప్రఖర్ జైన్ తెలిపారు.

  12. ‘నర్సాపురం-యానాం మధ్య తీరాన్ని తాకిన అర్నబ్ తుపాను’

    ఈ తీవ్ర తుపాను నర్సాపురం, యానాం మధ్య ప్రాంతంలో తీరాన్ని తాకినట్టు మూర్తి ఏఎన్ఐకి చెప్పారు.

    అర్నబ్ తుపాను పూర్తిగా తీరం దాటేందుకు మరో రెండు మూడు గంటల సమయం పడుతుందని ఆయన పేర్కొన్నారు.

    "ప్రస్తుతం ఈ తీవ్ర తుపాను నర్సాపురం, యానాం మధ్య తీర ప్రాంతంలో ఉంది. ఇది గంటకు మూడు కిలోమీటర్ల అతి తక్కువ వేగంతో కదులుతోంది. తుపాను కేంద్రం ఇప్పటికే తీరాన్ని తాకింది. పూర్తిగా తీరం దాటడానికి ఒకటి నుంచి రెండు గంటలు, లేదా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టవచ్చు. తీరం దాటిన తర్వాత, ఈ తుపాను ఉత్తర-వాయవ్య దిశగా పయనించే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 125 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి, ఇవి గంటకు 140 కిలోమీటర్ల వేగం వరకు కూడా ఉండవచ్చు. తీరం దాటిన తర్వాత ఈ గాలుల తీవ్రత క్రమంగా తగ్గుతుంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల తీవ్రత ఈ సాయంత్రం వరకు కొనసాగుతుంది; సాయంత్రం నుంచి వర్షాల తీవ్రత నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంది, అదే సమయంలో గాలుల వేగం కూడా క్రమంగా తగ్గుతుంది" అని తెలిపారు.

  13. అర్నబ్ తుపాను తీవ్రతను చూపే 11 ఫోటోలు

  14. ‘మధ్యాహ్నానికి గాలుల వేగం తగ్గే అవకాశం’ : ఏపీ వాతావరణ శాఖ

    అర్నబ్ తుపాను ప్రస్తుతానికి ఒకే చోట నిలిచి ఉందని, ఒకట్రెండు గంటల్లో తీరం దాటుతుందని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం చెప్పారు. ఏఎన్ఐతో మాట్లాడిన ఆమె తుపాను తీరం దాటే సమయంలో 150 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పారు.

    "ప్రస్తుతం ఈ తుపాను తీవ్రతను గమనిస్తే, కోనసీమ, కాకినాడ పరిసర ప్రాంతాలతోపాటు ఇతర తీరప్రాంత జిల్లాల్లో గాలి వేగం గంటకు 125 నుంచి 135 కిలోమీటర్ల వరకు ఉంది. ఇది గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం తుపాను దాదాపు ఒకే చోట నిలిచి ఉంది. ఒకటి రెండు గంటల్లో ఇది తీరాన్ని దాటే అవకాశం ఉంది. రాబోయే కొద్ది గంటల్లో ఈ తుపాను తీరాన్ని దాటుతుందని అంచనా. ఆ తర్వాత దీని తీవ్రత తగ్గి, 'తీవ్ర తుపాను'గా మారుతుంది. మధ్యాహ్నానికి ఇది మరింత బలహీనపడి కేవలం 'తుపాను'గా మారే అవకాశం ఉంది. తీరాన్ని దాటే సమయంలో ఇది 'అత్యంత తీవ్ర తుపాను' స్థితిలో ఉంటుంది. కొన్ని గంటల తర్వాత గాలి వేగం గంటకు 90 నుంచి 120 కిలోమీటర్ల వరకు ఉండవచ్చు. మధ్యాహ్నానికి గాలి వేగం మరింత తగ్గి, గంటకు 60 నుంచి 70 కిలోమీటర్లకు చేరుకుంటుందని అంచనా" అని నాగరత్నం తెలిపారు.

  15. అర్నబ్ తుపాను: ఇవాళ, రేపు, ఎల్లుండి పలు రైళ్లు రద్దు

    అర్నబ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే దీనికి సంబంధించిన తాజా వివరాలతో ఒక ప్రకటన విడుదల చేసింది.

    దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన వివరాల ప్రకారం ఇవాళ రేపు రద్దు అయిన రైళ్ల వివరాలు ఇవే

    ఇవాళ రద్దు అయిన రైళ్లు (28 అక్టోబర్)

    • 12727 విశాఖపట్నం- సికింద్రాబాద్
    • 12739 విశాఖపట్నం- సికింద్రాబాద్
    • 17206 కాకినాడ పోర్టు- సాయినగర్ షిర్డీ
    • 12737 కాకినాడ పోర్టు – లింగంపల్లి
    • 20707 సికింద్రాబాద్- విశాఖపట్నం
    • 20708 విశాఖపట్నం- సికింద్రాబాద్
    • 20833 విశాఖపట్నం- సికింద్రాబాద్
    • 12787 నర్సాపురం- నాగర్‌సోల్
    • 17255 నర్సాపురం- లింగంపల్లి
    • 20834 సికింద్రాబాద్- విశాఖపట్నం

    రేపు రద్దు అయిన రైళ్లు(29 అక్టోబర్)

    • 12703 హౌరా- సికింద్రాబాద్ ట్రైన్
    • 17015 భువనేశ్వర్ – సికింద్రాబాద్
    • 22881 పుణె- భువనేశ్వర్
    • 17205 సాయినగర్ షిర్డీ- కాకినాడ పోర్ట్

    శుక్రవారం రద్దు అయిన రైళ్లు(30 అక్టోబర్)

    • 20809 సంబల్‌పూర్- హెచ్ఎస్ నాందేడ్
    • రీ షెడ్యూల్ అయిన రైళ్లు(బయల్దేరాల్సిన సమయానికి కంటే మూడు గంటలు ఆలస్యంగా నడుస్తాయి)
    • 12805 విశాఖపట్నం- లింగంపల్లి
    • 17221 కాకినాడ పోర్టు – ఎల్టీటీ ముంబై
    • 12806 లింగంపల్లి- విశాఖపట్నం
    • 18046 చర్లపల్లి- షాలీమర్
    • 18519 విశాఖపట్నం- ముంబై ఎల్టీటీ (నిన్న బయల్దేరాల్సిన రైలు ఇవాళ ఉదయం నాలుగు గంటలకు రీ షెడ్యూల్ చేశారు)
  16. ఇజ్రాయెల్ ఎన్నికలు: ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి, నెతన్యాహు ఏమన్నారు?

  17. అర్నబ్: కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదలు - ఐఎండీ హెచ్చరిక

  18. భారత్ విడిచి వెళ్లాలంటూ ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసుపై బాంబే హైకోర్టు తాజా స్పందనేంటి?

    ‘భారత్ విడిచి వెళ్లాలనే నోటీసు’ను సవాలు చేస్తూ ఇమ్రాన్ ఖాన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను బాంబే హైకోర్టు నవంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది.

    ఆ నోటీసులో ఇమ్రాన్ ఖాన్ అక్టోబర్ 28వ తేదీలోగా భారత్ విడిచి వెళ్లాలని పేర్కొన్నారు.

    కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ), తదుపరి విచారణ జరిగే వరకు ఇమ్రాన్ ఖాన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోబోమని కోర్టుకు మౌఖికంగా హామీ ఇచ్చారు.

    తదుపరి విచారణ వరకు ఈ కేసులో తదుపరి చర్యలను కూడా కోర్టు నిలిపివేసింది.

    ముంబైలోని ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్(ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ) అక్టోబర్ 14న జారీ చేసిన ‘భారత్ విడిచి వెళ్లాలనే నోటీసు’ను సవాలు చేస్తూ ఇమ్రాన్ ఖాన్ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

    ఒక నిరసన కార్యక్రమంలో పాల్గొన్నందున ఈ నోటీసు జారీ చేసినట్లు ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ పేర్కొంది.

  19. చీర కట్టుకుని చెప్పులు లేకుండా పరుగెత్తిన కవితా దేవి ‘హోంగార్డ్’ కల ఎందుకు నెరవేరలేదు?

  20. అర్నబ్ తుపాను ప్రభావంతో రద్దైన రైళ్లు ఇవే- దక్షిణమధ్య రైల్వే అధికారిక ప్రకటన

    అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతల గుండా రాకపోకలు సాగించే రైళ్లు రద్దు చేసినట్టు దక్షిణ మధ్యరైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.

    పశ్చిమ- మద్య బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుపాను ప్రభావం రవాణా రంగం తీవ్రంగా ఉంది. ఇప్పటికే విమానాల సర్వీసులపై ఎఫెక్ట్ పడుతుందని జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉండాలని ఎయిర్ ఇండియా తన ప్రయాణికులకు సూచించింది.

    ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే కూడా ఒక ప్రకటన చేసింది. తుపాను ప్రభావిత ప్రాంతాల మీదుగా రాకపోకలు సాగేంచే పలు రైళ్లను రద్దు చేసింది.

    ఇవాళ రద్దు అయిన రైళ్లు ఇవే

    • 12704 సికింద్రబాద్- హౌడా
    • 17016 సికింద్రాబాద్- భువనేశ్వర్ న్యూ
    • 12728 హైదరాబాద్- విశాఖపట్నం
    • 12862 మహబూబ్‌నగర్- విశాఖపట్నం
    • 12740 సికింద్రాబాద్- విశాఖపట్నం
    • 12776 లింగంపల్లి- కాకినాడ టౌన్
    • 17256 లింగంపల్లి- నర్సాపూర్
    • 12738 లింగంపల్లి- కాకినాడ పోర్ట్
    • 20810 హెఎస్ నాందేడ్- సంబల్‌పూర్
    • 07037 చర్లపల్లి- శ్రీకాకుళం రోడ్

    రేపు(28/10/2026) రద్దు అయిన రైళ్లు ఇవే

    • 07038 శ్రీకాకుళం రోడ్ – చర్లపల్లి
    • నాగర్‌సోల్- నర్సాపూర్ మధ్య నడిచే 12788 ట్రైన్‌ను చర్లపల్లి నర్సాపూర్ మధ్య తాత్కాలికంగా రద్దు చేశారు.