'కేసీఆర్ దోచుకున్న సొమ్ము ప్రజల జేబుల్లో వేస్తా' - కల్వకుర్తి సభలో రాహుల్ గాంధీ

ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరకు వెళ్లి సమీక్ష జరపాలని రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. కేసీఆర్ దోచుకున్న సొమ్మును కాంగ్రెస్ ప్రజల జేబుల్లో వేస్తుందని అన్నారు.

లైవ్ కవరేజీ

  1. కొలంబస్ కన్నా ముందే అమెరికాను చేరుకున్న వైకింగ్స్ ఎవరు?

  2. పారా ఆసియా క్రీడలు: ఒకే ఈవెంట్‌లో భారత్‌కు స్వర్ణం, రజతం

    పారా ఆసియా క్రీడలు
    ఫొటో క్యాప్షన్, అవని లేఖరా(ఎడమ), మోనా అగర్వాల్(కుడి)(ఫైల్ ఫోటో)

    జపాన్‌లోని నాగోయాలో జరుగుతున్న పారా ఆసియా క్రీడల్లో భారత షూటర్ మోనా అగర్వాల్ స్వర్ణ పతకం గెలుచుకోగా, అవని లేఖరా రజత పతకం సాధించింది.

    ఆర్2 మహిళల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్‌లోని ఎస్‌హెచ్1 విభాగంలో ఇద్దరూ ఈ ఘనతను సాధించారు. ఫైనల్‌లో ఇద్దరు షూటర్ల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది.

    మోనా 250.0 పాయింట్లు సాధించి స్వర్ణ పతకం గెలుచుకోగా, అవని 249.6 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.

    దక్షిణ కొరియాకు చెందిన యున్రి లీ 227.9 పాయింట్లతో కాంస్య పతకాన్ని గెలుచుకుంది.

    ఈ ఘనత సాధించినందుకు ఇద్దరు భారత షూటర్లను ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) అభినందించింది.

  3. సల్మాన్ నుంచి టైగర్ దాకా.. బాలీవుడ్ నటులపై దాడులతో ఆందోళన

  4. వెస్ట్ బ్యాంక్‌లో యూరోపియన్ దౌత్యవేత్తల బృందంపై దాడి

    వెస్ట్ బ్యాంక్‌, యూరోపియన్ దౌత్యవేత్తల బృందంపై దాడి
    ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం ఈ ఘటనపై సందేహం వ్యక్తం చేసింది (ఫైల్ ఫోటో).

    పశ్చిమాసియాలోని వెస్ట్ బ్యాంక్‌లో యూరోపియన్ దౌత్యవేత్తల బృందంపై ముసుగులు ధరించిన కొందరు ఇజ్రాయెలీ సెటిలర్లు దాడి చేశారు.

    బెల్జియం తమ కాన్సుల్ జనరల్‌తో పాటు ఇతర దౌత్యవేత్తలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించింది. ఈ దాడికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్‌ను కోరింది.

    ఇజ్రాయెల్ సైన్యం కూడా దీన్ని ‘తీవ్రమైన హింసాత్మక చర్య’గా అభివర్ణిస్తూ, దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించింది.

    ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం అనుమానాలు వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు జరుగుతున్న ‘ప్రచారంలో’ భాగమై ఉండొచ్చని అభిప్రాయపడింది.

    దీనికి ఒక రోజు ముందు వెస్ట్ బ్యాంక్‌లోని మరో గ్రామంలో పాలస్తీనీయులతో పాటు వాషింగ్టన్ పోస్ట్ ఫొటో జర్నలిస్ట్ హెడీ లెవిన్‌పై దాడి జరిగింది. ఈ ఘటనలో లెవిన్‌తో పాటు పలువురు పాలస్తీనా పౌరులు గాయపడ్డారు.

    ఈ దాడి ఆందోళనకరమని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు ఇజ్రాయెల్ ప్రతిష్ఠకు కూడా మంచివి కావని ఆయన అన్నారు.

  5. ట్రంప్ నిర్ణయంతో భారత్‌కు భారీ ఊరట, అమెరికాలో వ్యతిరేకత పెరగనుందా?

  6. మార్కో రూబియో భారత పర్యటనలో దిల్లీ ఎందుకు లేదు, జై శంకర్ ఆయనను కలవడానికి ముంబయి వెళ్లడంపై విమర్శలు ఏంటి?

  7. కోల్‌కతా: దుర్గా పూజా మండపం వద్ద తొక్కిసలాట.. 19 మంది మృతి

  8. ఎగిరే కారును ప్రదర్శించిన ఎలాన్ మస్క్.. రోడ్డు మీదకు వచ్చే రోజెప్పుడు?

  9. బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రానికి ఒంటరిగా ఆడ తాబేలు సుదీర్ఘ యాత్ర.. చివరికి ఆ ఆలివ్ రిడ్లే ఏమైంది?

  10. గరివిడి లక్ష్మి: వెండితెరపై బుర్రకథ ఎలా ఉంది?

  11. రష్యాపై అమెరికా ఆంక్షలను అడ్డుకున్న ట్రంప్

    డోనల్డ్ ట్రంప్
    ఫొటో క్యాప్షన్, రష్యాపై ఆంక్షల బిల్లుపై సెప్టెంబరులోనే డోనల్డ్ ట్రంప్ సంతకం చేశారు, ఆదివారం నుంచి అమల్లోకి రావాల్సి ఉంది.

    యుక్రెయిన్‌పై యుద్దం చేస్తున్న రష్యాను శిక్షించడానికి అమెరికా కాంగ్రెస్ ఇటీవల ఆమోదించిన రష్యా ఆంక్షల చట్టంలోని పలు ఆంక్షలను అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తన అధ్యక్ష అధికారంతో అడ్డుకున్నారు.

    ఈ ఆంక్షలలో కొన్నింటిని నిలిపివేయడం అమెరికా జాతీయ ప్రయోజాల దృష్ట్యా అవసరమమని శుక్రవారం రాత్రి జారీచేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులలో ట్రంప్ పేర్కొన్నారు.

    ఈ ఆంక్షల బిల్లుపై ట్రంప్ సెప్టెంబర్‌లోనే సంతకం చేయడంతో అది చట్టంగా మారి ఆదివారం నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా శుక్రవారం రాత్రి ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు.

    నవంబర్‌లో జరగబోయే మధ్యంతర ఎన్నిక కంటే ముందే అమెరికాలో ఇంధన ధరలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా రష్యా నుంచి డీజిల్‌ను దిగుమతి చేసుకోనున్నట్లు ట్రంప్ ప్రకటించిన కొన్ని రోజులకే ఈ నిర్ణయం వెలువడింది. ఈ నవంబర్ ఎన్నికలే కాంగ్రెస్‌పై ఏ పార్టీ నియంత్రణ కలిగి ఉంటుందో నిర్ణయిస్తాయి.

    ట్రంప్ తాజా నిర్ణయాన్ని అటు రిపబ్లికన్లు, ఇటు డెమెక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకించారు.

    ఈ ఆంక్షల చట్టానికి దివంగత రిపబ్లికన్ సౌత్ కరోలినా సెనేటర్ లిండ్సే గ్రాహం పేరు పెట్టారు, ఆయన జూలై 11న మరణించడానికి ముందు అమెరికాలో యుక్రెయిన్‌కు బలమైన మద్దతుదారుగా ఉన్నారు.

    ఈ చట్టం ప్రధానంగా రష్యా ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకుంది. అలాగే రష్యా నుంచి చమురు, గ్యాస్‌లను ఎక్కువగా కొనుగోలు చేసే మొదటి ఐదు దేశాలపై ముఖ్యంగా చైనా భారత్‌లపై 100 శాతం వరకు సుంకాలను విధించే విస్తృత అధికారాలను ట్రంప్‌కు కల్పించింది.

    అదనంగా, ఈ చట్టంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, రష్యా ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు, బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థలతో పాటు ప్రస్తుత ఆంక్షల నుండి తప్పించుకోవడానికి రష్యా ఉపయోగిస్తున్న రహస్య నౌకాదళంపై కూడా ఆంక్షలు ఉన్నాయి.

    అమెరికాకు చెందిన 20 మంది ప్రజాప్రతినిధుల ఉమ్మడి బృందం అక్టోబర్ 18 నుండి అమలులోకి రానున్న ఈ కొత్త చట్టాన్ని గౌరవించాలని కోరుతూ గురువారం ట్రంప్‌కు ఒక లేఖ రాసింది.

  12. ‘ఎన్నికల సంఘంలో పరిణామాలపై సైబర్ ఫోరెన్సిక్ విచారణ జరపాలి’ - సుప్రీం కోర్టులో ఖమ్మం వాసి పిటిషన్

  13. ర‌ణ‌బాలి రివ్యూ: పెళ్లయిన తర్వాత రష్మికతో తొలి చిత్రం.. విజయ్ దేవరకొండ పంట పండిందా?

  14. మేం పోటీకి భయపడం: ఎలాన్ మస్క్ ఆరోపణలపై రిలయన్స్ ప్రకటన

    రిలయన్స్ ఇండస్ట్రీస్, స్టార్ లింక్
    ఫొటో క్యాప్షన్, ఎలాన్ మస్క్ ఆరోపణలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

    స్టార్ లింక్ వ్యవహారంలో అమెరికా వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ ఆరోపణలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పందించింది. శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసిన ఆ సంస్థ, తాము ఎప్పుడూ పోటీకి భయపడలేదని పేర్కొంది.

    భారతదేశంలో స్టార్‌లింక్ ప్రవేశాన్ని అడ్డుకుంటున్నారని ఎలాన్ మస్క్ ఇటీవల ఆరోపించారు.

    పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీని "ప్రధాన మంత్రి అంబానీ" అని సంబోధించిన మస్క్, భారత్‌లో స్టార్‌లింక్‌కు నిష్పాక్షికంగా పోటీపడే అవకాశం ఇస్తారా? అని ప్రశ్నించారు.

    రిలయన్స్ ప్రకటనలో, "ప్రతి భారతీయ కంపెనీలాగే రిలయన్స్ కూడా దేశీయ విదేశీ పెట్టుబడులతో పాటు సరికొత్త ఆలోచనలకు స్వాగతం పలికే దేశంలో అభివృద్ధి చెందింది. ముఖ్యంగా ప్రజల జీవితాలను మెరుగుపరిచే పనులను ఆహ్వానిస్తుంది"

    స్టార్‌లింక్‌తో సహా ఉపగ్రహ సమాచార రంగంలో పోటీని స్వాగతిస్తున్నట్లు రిలయన్స్ తెలిపింది. జియోతో సహా ప్రతి కంపెనీ భారత ప్రజలకు సేవలు అందించాలని, దేశ చట్టాలు, విధానాలను పాటించాలని ఆ ప్రకటనలో పేర్కొంది.

  15. భారత్, చైనాలను ఏకతాటిపైకి తేవాలని నేపాల్ ఎందుకు కోరుకుంటోంది?

  16. అమెరికా: స్కూల్లో 16 ఏళ్ల బాలుడి కాల్పులు, ముగ్గురు పిల్లలు సహా టీచర్ మృతి

    బెండ్ నగరంలోని సిల్వర్ రైల్ ప్రాథమిక పాఠశాల, అమెరికాలో కాల్పులు
    ఫొటో క్యాప్షన్, బెండ్ నగరంలోని సిల్వర్ రైల్ ప్రాథమిక పాఠశాల వద్ద ఈ ఘటన జరిగింది

    అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలో ఒక ప్రాథమిక పాఠశాలలో జరిగిన కాల్పులు ఘటనలో టీచర్‌ సహా 5, 8, 11 ఏళ్ల వయసున్న ముగ్గురు పిల్లలు మరణించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

    బెండ్ నగరంలోని సిల్వర్ రైల్ ప్రాథమిక పాఠశాల వద్ద ఈ ఘటన జరిగింది.

    కాల్పులు జరిపిన వ్యక్తిని బెండ్ నగరానికి చెందిన 16 ఏళ్ల బాలుడిగా గుర్తించారు.

    తాళం వేసి ఉన్న తలుపులపై కాల్పులు జరుపుతూ బాలుడు పాఠశాలలోకి ప్రవేశించారు. పాఠశాలలోకి వెళుతున్న అనుమానితుడిని కమ్యూనిటీలోని ఓ గన్ మెన్ వెంబడించారని, ఆయన చేతిలోనే బాలుడు హతమయ్యాడని పోలీసులు తెలిపారు.

    ఘటనా స్థలంలో ఐదుగురు మృతి చెంది ఉన్నట్లు బెండ్ పోలీస్ చీఫ్ మైక్ క్రాంజ్ తెలిపారు.

    ఈ ఘటనలో ఏడేళ్ల బాలుడు, మరో ఉపాధ్యాయురాలు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు, ప్రస్తుతం వారిద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

  17. ప్రధాని మోదీ ముందున్న 10 సవాళ్లు ఏంటి?

  18. ‘‘5 నెలల్లోనే బియ్యం బస్తా రూ.700 పెరిగింది’’ - తెలుగు రాష్ట్రాల్లో బియ్యం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

  19. సౌదీ అరేబియా: వేలకోట్ల డాలర్లు పెట్టి క్షిపణులు కొని కూడా హూతీ దాడులను ఎందుకు అడ్డుకోలేకపోతోంది?

  20. ‘బౌలింగ్ వ్యూహాలే దెబ్బతీశాయి’ - శ్రేయస్ అయ్యర్

    Team India, Shreyas Iyer, West Indies, Bengaluru, Hyderabad
    ఫొటో క్యాప్షన్, “బౌలింగ్ వ్యూహాన్ని అమలు చేయడంలో విఫలమయ్యాం” వెస్టిండీస్‌తో నాల్గో టీ20 మ్యాచ్ ఓటమిపై శ్రేయస్ అయ్యర్ వివరణ

    ఇండియా -విండీస్ మధ్యన హైదరాబాద్ వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. 24 పరుగుల తేడాతో వెస్టీండిస్ గెలిచింది. దీంతో ఐదు మ్యాచుల ఈ సిరీస్ 2-2తో సమమైంది. ఇక ఫలితం తేలేది ఐదో మ్యాచ్‌లోనే. ఈ మ్యాచ్ ఈనెల 17వ తేదీన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది.

    హైదరాబాద్‌లో ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తమ బౌలింగ్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. బౌలింగ్ వ్యూహాన్ని సరిగా అమలు చేయడంలో విఫలమయ్యామని అంగీకరించాడు.

    టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. కెప్టెన్ షై హోప్ అద్భుతమైన బ్యాటింగ్‌తో 50 బంతుల్లోనే 102 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గెలుచుకున్నాడు.

    భారత్ 248 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి 19.3 ఓవర్లలో 223 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. టీమిండియాలో 23 బంతుల్లో 56 పరుగులు చేసిన సంజూ శామ్‌సన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తర్వాత తిలక్ వర్మ 43 , నితీష్ రెడ్డి 41 పరుగులు చేశారు. కీమో పాల్ ఐదు వికెట్లు తీసుకున్నాడు.

    రన్ ఛేజ్‌లో బ్యాట్స్‌మెన్ పోరాటాన్ని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రశంసించాడు. కానీ మ్యాచ్ మధ్యలో బౌలింగ్ ప్రణాళికలను మార్చడంలో తాము విఫలమయ్యామని చెప్పాడు.

    విండీస్ బౌలర్లును శ్రేయస్ ప్రశంసించాడు. “వారు ఫీల్డ్‌ను చాలా తెలివిగా వాడుకున్నారు. ప్రణాళికలను చక్కగా అమలు చేశారు. మ్యాచ్ సాగుతున్న కొద్దీ పిచ్‌పై అదనపు బౌన్స్ కూడా లభించింది. పరిస్థితులను విండీస్ బౌలర్లు బాగా అర్థం చేసుకొన్నారు. మధ్య ఓవర్లలో పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకున్నారు” అన్నారు.