'కేసీఆర్ దోచుకున్న సొమ్ము ప్రజల జేబుల్లో వేస్తా' - కల్వకుర్తి సభలో రాహుల్ గాంధీ

ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరకు వెళ్లి సమీక్ష జరపాలని రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. కేసీఆర్ దోచుకున్న సొమ్మును కాంగ్రెస్ ప్రజల జేబుల్లో వేస్తుందని అన్నారు.

లైవ్ కవరేజీ

  1. రూ. 450.42 కోట్ల భారీ ధరకు అమ్ముడుపోయిన డైనోసార్ అస్థిపంజరం... ఏమిటి దీని ప్రత్యేకత?

  2. IND vs Nz: భారత్‌పై 7 వికెట్ల తేడాతో న్యూజీలాండ్ గెలుపు, 3-2తో సిరీస్ భారత్ వశం

    భారత్, న్యూజీలాండ్ మధ్య జరిగిన అయిదో టి20 మ్యాచ్ దృశ్యం
    ఫొటో క్యాప్షన్, భారత్, న్యూజీలాండ్ మధ్య జరిగిన అయిదో టి20 మ్యాచ్ దృశ్యం

    హామిల్టన్ వేదికగా ఆదివారం న్యూజీలాండ్‌తో జరిగిన చివరిదైన అయిదో టి20లో భారత్ 7 వికెట్ల తేడాతో న్యూజీలాండ్ చేతిలో ఓడిపోయింది.అయితే ఈ సిరీస్‌లో భారత్ మొత్తం మూడు మ్యాచ్‌లు గెలిచి 3-2తో సిరీస్ సొంతం చేసుకుంది.

    ఇక ఆదివారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 191 పరుగులు చేసింది.

    ఇషాన్ కిషన్ (32 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు) 61 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 23 బంతుల్లో 50 పరుగులు చేశాడు.

    ఓపెనర్లు సంజూ శామ్సన్ (4), అభిషేక్ శర్మ (1), తిలక్ వర్మ (6) సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరిగారు.

    నమన్ ధిర్ (33), నితీశ్ కుమార్ రెడ్డి (22) రాణించారు.

    ప్రత్యర్థి బౌలర్లలో ఆడమ్ మిల్నే 4 వికెట్లు పడగొట్టాడు. నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్‌నర్ చెరో 2 వికెట్లు తీశారు.

    అనంతరం న్యూజీలాండ్ 18 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసి విజయాన్నిఅందుకుంది.

    ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ 50 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు.

    గ్లెన్ ఫిలిప్స్ అజేయంగా 65 పరుగులు చేశాడు.

    భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, నితీశ్ కుమార్ రెడ్డి తలా ఓ వికెట్ తీశారు.

  3. విద్యార్థుల బర్త్ డే పార్టీ : 'పోలీసు సైరన్ విని భయంతో పరుగులు, ఇద్దరు విద్యార్థుల మృతి’ - అసలేం జరిగింది?

  4. మురసు తుపాను: సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటన రద్దు, అధికారులతో సమీక్ష

    నారా చంద్రబాబు నాయుడు

    పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడే అవకాశమున్న ‘మురసు’ తుపాను ప్రభావంపై ఆదివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. రాష్ట్రంపై తుపాను ప్రభావం, వర్షాలు, గాలుల అంచనా, జలాశయాల పరిస్థితిపై చర్చించారు. మురసు తుపాను నేపథ్యంలో ఆయన తన దిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు.

    విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం ప్రకారం..నవంబరు 2 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు అంచనా. నవంబరు 3న ఉదయం బాపట్ల సమీపంలో తీవ్ర తుపానుగా తీరం దాటే అవకాశం

    • తీరం దాటే సమయంలో గంటకు 100–110 కిలోమీటర్ల వేగంతో గాలులు
    • నవంబరు 2న దక్షిణ, మధ్య కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, అక్కడక్కడ అతిభారీ వర్షాలు.
    • నవంబరు 3, 4 తేదీల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు
    • అత్యంత భారీ వర్షాల అంచనా ఉన్న 20 మండలాల్లో ఏలూరు జిల్లాలో 9, కృష్ణాలో 5, ఎన్టీఆర్‌లో 5, బాపట్లలో ఒక మండలం ఉన్నాయి.
    • నవంబరు 3న జిల్లా సగటు వర్షపాతం ఏలూరులో సుమారు 179 మిల్లీ మీటర్లు, కృష్ణాలో 163, ఎన్టీఆర్‌లో 161, పశ్చిమ గోదావరిలో 147, గుంటూరులో 119, బాపట్లలో 104 మిల్లీమీటర్ల వర్షపాతం ఉండవచ్చని అంచనా
    • బుడమేరు వద్ద నవంబరు 3న సుమారు 32,500 క్యూసెక్కుల ప్రవాహం రావచ్చని అంచనా. ఎర్రకాల్వ, గోనెలవాగు, జల్లేరు, పంపా తదితర జలాశయాల్లో భారీ వరదకు అవకాశం
    • బలమైన గాలుల వల్ల 12 జిల్లాల్లో సుమారు 12,102 నుంచి 15,128 విద్యుత్‌ స్తంభాలు దెబ్బతినే అవకాశం ఉన్నట్లు ముందస్తు అంచనా
  5. ఏపీ వైపు ముంచుకొస్తున్న ‘మురసు’ తుపాను

    మురసు తుపాను

    బంగాళాఖాతంలో మురసు తుపాను గడిచిన ఆరు గంటల్లో గంటకు 23 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.

    ప్రస్తుతం చెన్నైకి 560 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 660 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 640 కిలోమీటర్లు, నెల్లూరుకు 630 కిలోమీటర్లు, ఒంగోలుకు 680 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది.

    ఇది రేపు ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉంది.

    రేపు అర్ధరాత్రి నుంచి ఎల్లుండి తెల్లవారుజాము మధ్య నెల్లూరు, నరసాపురం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ పీఎల్ఎన్ మూర్తి తెలిపారు.

    తుపాను ప్రభావంతో రానున్న మూడు రోజులు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

    మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

  6. దిల్లీ: రామ్‌లీలా మైదాన్ వద్ద నేడు ప్రతిపక్షాల ర్యాలీ.. దిల్లీలో పరిస్థితిని చూపే 9 ఫోటోలు..

  7. రామ్‌లీలా: కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఇక్కడ చేస్తున్న ఆందోళన లక్ష్యం ఏంటి? బీజేపీ ఏం చేస్తోంది?

  8. సంక్షోభాలు వస్తే ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎలా సిద్ధమవుతున్నారు? ఏం చేస్తున్నారు?

  9. ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థలకు ప్రారంభమైన పోలింగ్

    92 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్
    ఫొటో క్యాప్షన్, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది.

    ఆంధ్రప్రదేశ్‌లో 92 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.

    13 నగరపాలక సంస్థలు (మున్సిపల్ కార్పొరేషన్లు), 79 పురపాలక సంస్థలు/నగర పంచాయతీలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి.

    ఎన్నికల అధికారులు పోలింగ్ ఏర్పాట్లను పూర్తి చేయగా, పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చూసేందుకు పోలీసులు సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

    ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

  10. ‘భారత్‌లో పేదరికం తగ్గింది, కానీ..’

  11. ‘2024 ఎన్నికలు అక్రమం’ - మాక్ పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ

  12. రాప్తాడు: తరగతి గదిలోకి వచ్చి రంపంతో విద్యార్థినిపై దాడి.. అసలేం జరిగింది?

    రోదిస్తున్న బాలిక బంధువులు
    ఫొటో క్యాప్షన్, రోదిస్తున్న బాలిక బంధువులు

    రాప్తాడులోని జడ్పీ హైస్కూల్లో తరగతి గదిలో పాఠాలు జరుగుతుండగా ఓ వ్యక్తి ఎలక్ట్రిక్ రంపంతో ప్రవేశించి ఓ బాలికపై దాడి చేశాడు. నిందితుడి కోసం గాలిస్తున్నట్టు అనంతపురం ఎస్పీ జగదీశ్ బీబీసీకి చెప్పారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక్కడ క్లిక్ చేసి పూర్తి కథనం చదవండి

  13. రాప్తాడు: తరగతి గదిలోకి వచ్చి రంపంతో విద్యార్థినిపై దాడి.. అసలేం జరిగింది?

  14. ఖర్గే నివాసంలో ‘మాక్ పార్లమెంట్’, జ్ఞానేశ్ కుమార్‌పై ‘ప్రజా అభిశంసన’

    ప్రజా అభిశంసన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
    ఫొటో క్యాప్షన్, ప్రజా అభిశంసన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ

    ఇండియా కూటమితో పాటు ఇతర ప్రతిపక్షాలు కూడా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌పై ఆరోపిస్తున్నాయి. ఈ ప్రక్రియ కారణంగా దాదాపు 13 కోట్ల మంది ఓటర్ల పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించారని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఇది ప్రజల ప్రజాస్వామిక హక్కులపై నేరుగా జరిగిన దాడిగా ఆరోపిస్తున్నాయి. మరిన్ని వివరాలు ఇక్కడ క్లిక్ చేసి చదవండి

  15. పాకిస్తాన్ ప్రధానిపై ట్రోలింగ్- 'టాస్ గెలిచినా అభినందనలు చెబుతారేమో' అంటూ వ్యాఖ్యలు చేస్తున్న యూజర్లు

  16. ఆంధ్రప్రదేశ్‌ను 'బిహార్ ఆఫ్ సౌత్' అంటూ ఉత్తరాది రాష్ట్రంతో ఎందుకు పోలుస్తున్నారు?

    ఆంధ్రప్రదేశ్, బిహార్
    ఫొటో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్, బిహార్

    ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చెలరేగిన హింసాత్మక ఘటనలపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ మొదలైంది. ''ఏపీని దక్షిణాది బిహార్‌గా మార్చేశారు'' అంటూ ట్రోలింగ్, విమర్శలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.‌ హింసాత్మక ఘటనల ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఏపీ, బిహార్ మధ్య పోలికలు పెడుతూ కామెంట్లు పెడుతున్నారు.పూర్తి కథనం కోసం ఇక్క క్లిక్ చేయండి.

  17. ఆంధ్రప్రదేశ్‌ను 'బిహార్ ఆఫ్ సౌత్' అంటూ ఉత్తరాది రాష్ట్రంతో ఎందుకు పోలుస్తున్నారు?

  18. యుక్రెయిన్‌కు 500 పేట్రియాట్ క్షిపణుల విక్రయానికి అమెరికా ఆమోదం

    యుక్రెయిన్, అమెరికా, ఆయుధాల కొనుగోలు
    ఫొటో క్యాప్షన్, ఆధునిక పీఏసీ-3 ఇంటర్‌సెప్టర్ క్షిపణుల విలువ సుమారు 2.1 బిలియన్ డాలర్లు ఉంటుందని అమెరికా విదేశీ వ్యహహారాల శాఖ వెల్లడించింది.

    రష్యా వైమానిక దాడులు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో యుక్రెయిన్‌‌‌కు 2.1 బిలియన్ డాలర్ల విలువైన 500 పేట్రియాట్ క్షిపణులను విక్రయించేందుకు అమెరికా ఆమోదం తెలిపింది.

    ఇటీవల నెలల్లో ఈ క్షిపణుల సరఫరాలో జాప్యం జరుగుతోందని యుక్రెయిన్ పేర్కొన్న నేపథ్యంలో అమెరికా నిర్ణయం వెలువడింది.

    ఆధునిక పీఏసీ-3 ఇంటర్‌సెప్టర్ క్షిపణుల విలువ సుమారు 2.1 బిలియన్ డాలర్లు ఉంటుందని అమెరికా విదేశీ వ్యహహారాల శాఖ వెల్లడించింది. వీటి కొనుగోలు ఖర్చును ఐరోపాలోని యుక్రెయిన్ మిత్రదేశాలు, కెనడా భరించనున్నాయనితెలిపింది.

    పేట్రియాట్ క్షిపణుల సరఫరాను వేగవంతం చేయాలని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్ స్కీ పలుమార్లు అమెరికాను కోరారు. రష్యా ప్రయోగించే ప్రమాదకర బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకోవడానికి ఇవే సమర్థమైన ఆయుధాలని యుక్రెయిన్ భావిస్తోంది.

    అమెరికా విదేశీ వ్యహహారాల శాఖ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ కొనుగోలుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. 'జంప్‌స్టార్ట్' కార్యక్రమం ద్వారా కెనడా, జర్మనీ, నార్వే అందించే విరాళాలు, యూరోపియన్ యూనియన్ 'యుక్రెయిన్ సపోర్ట్ లోన్' ద్వారా సమకూరే నిధులతో ఈ కొనుగోలుకు చెల్లింపులు చేయనున్నట్లు తెలిపింది.

    ఈ ఒప్పందంలో ప్రధాన కాంట్రాక్టర్‌గా అమెరికాకు చెందిన లాక్‌హీడ్ మార్టిన్ వ్యవహరించనుంది. ఈ విక్రయంలో అమెరికా ప్రభుత్వ నిధులు ఏవీ వినియోగించడం లేదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

  19. జీఎస్‌ఎల్‌వీ ద్వారా కక్ష్యలోకి చేరిన ఎన్‌వీఎస్‌-03 నావిగేషన్ ఉపగ్రహం

    శ్రీహరికోట నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్18 రాకెట్
    ఫొటో క్యాప్షన్, తదుపరి తరం నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థలో ఎన్‌వీఎస్-03 మూడో ఉపగ్రహం.

    శ్రీహరికోట నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్18 రాకెట్ ద్వారా ఎన్‌వీఎస్-03 నావిగేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు ఇస్రో ప్రకటించింది.

    శుక్రవారం శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్18 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.ఈ రాకెట్ ఎన్‌వీఎస్-03 ఉపగ్రహాన్ని విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి చేర్చింది.

    జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్18/ఎన్‌వీఎస్-03 ప్రయోగం విజయవంతం కావడంతో శ్రీహరికోటలోనిసతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఇస్రో శాస్త్రవేత్తలుఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు.

    తదుపరి తరం నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థలో ఎన్‌వీఎస్-03 మూడో ఉపగ్రహం. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ సిరీస్ ద్వారా అందించే నావిగేషన్ సేవలను నిరంతరాయంగా కొనసాగించేందుకు దీన్ని రూపొందించారు.

    దేశానికి స్థానం, నావిగేషన్, సమయ నిర్ధరణ సేవలను స్వతంత్రంగా పొందే అవకాశం కల్పించే వ్యూహాత్మక ఉపగ్రహం ఇదని ఇస్రో చీఫ్ డాక్టర్ వి. నారాయణన్ అన్నారు.

    నావిగేషన్ ఉపగ్రహాలను సాధారణ ప్రజలకు ఉపయోగపడే పనుల కోసం కూడా వినియోగిస్తారని ఆయన తెలిపారు. రైళ్లను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడంతో పాటు వాహనాలు, సముద్ర నౌకల కదలికలను పర్యవేక్షించేందుకు ఇవి ఉపయోగపడతాయని చెప్పారు. 'వన్ నేషన్ వన్ టైమ్' ప్రాజెక్టులోనూ ఈ ఉపగ్రహం కీలక భాగమని వివరించారు.

    'గగన్' వ్యవస్థతో కలిసి నావిగేషన్ సేవలు అందించడం ద్వారా ప్రపంచ నావిగేషన్ వ్యవస్థలో భారత్ తన వంతు పాత్ర పోషిస్తోందని ఇస్రో చీఫ్ పేర్కొన్నారు.

  20. జస్టిస్ కౌల్ రాసిన పుస్తకంలో మాజీ సీజేఐ చంద్రచూడ్‌ గురించి ఏముంది?