ఖతార్ - దహ్రా గ్లోబల్ కేసు: మరణ శిక్ష విధించిన భారత నేవీ మాజీ అధికారులకు శిక్ష తగ్గింపుపై కేంద్రం ఏం చెప్పింది?

ఈ ఎనిమిది మందిలో విశాఖపట్నానికి చెందిన పాకాల సుగుణాకర్ ఒకరు. కేసు అప్పీలుపై విచారణకు ఖతార్‌లో భారత రాయబారి, ఇతర అధికారులు హాజరయ్యారు.

లైవ్ కవరేజీ

  1. రోటీ, రైస్ తింటూ బరువు తగ్గొచ్చా? 9 ప్రశ్నలు - జవాబులు

  2. కావ్యా మారన్, అనిరుధ్ పెళ్లితో బంధువులు కానున్న రజినీ,స్టాలిన్

  3. గరివిడి లక్ష్మి: ‘మూణ్నాలుగు జిల్లాలకు తెలిసిన నన్ను మొత్తం ప్రపంచానికి పరిచయం చేశారు’

  4. పుట్టిన రోజు సందడి తరువాత రాత్రి 9 గంటలకు అమ్మ పక్కన పడుకున్న ఆరేళ్ల పాప తెల్లారేసరికి మాయమైంది.. 8 రోజులైనా దొరకని ఆచూకీ

  5. కనిగిరి: మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి వచ్చిన మహిళ ఎందుకు ఏడ్చారు? మరో మహిళ పోలీసుల కాళ్లు ఎందుకు పట్టుకున్నారు?

  6. హైదరాబాద్: 1000 మందితో సెక్స్ చాటింగ్.. 82 మంది న్యూడ్ వీడియోలు, ఫోటోలు సేకరించిన ‘మహిళ’.. కానీ 'ఆమె' చివరికి 'అతడు' అని ఎలా తెలిసింది?

  7. ‘భారత్‌ను లక్ష్యంగా చేసుకున్నారు.. మనం అప్రమత్తంగా ఉండాలి’ - మోహన్ భగవత్

  8. దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు.. ఫోటోల్లో

  9. వందల కోట్ల రూపాయల విలువైన బ్రా ధరించిన కైలీ జెన్నర్‌పై జరుగుతున్న చర్చ ఏంటి?

  10. దసరా: మీకు పాలపిట్ట కనిపించిందా?

  11. అమిలీయా ఇయర్‌హార్ట్: 90 ఏళ్ల కిందట ప్రపంచాన్ని చుట్టిరావాలని బయల్దేరిన ఈ మహిళ ఎలా అదృశ్యమయ్యారు, ఈ మిస్టరీని ఛేదిస్తారా?

  12. ఇజ్రాయెల్ నుంచి ఆస్ట్రియా వెళ్తున్న విమానానికి బాంబు బెదిరింపు

    ఇజ్రాయెల్, ఆస్ట్రియా, విమాన ప్రయాణం
    ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

    ఇజ్రాయెల్ నుంచి ఆస్ట్రియాకు వెళ్తున్న ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఆ విమానాన్ని బల్గేరియా రాజధాని సోఫియాకు మళ్లించారు.

    ‘‘ఆదివారం రాత్రి (అక్టోబర్ 18) టెల్ అవీవ్ నుంచి వియన్నాకు ప్రయాణిస్తున్న ఎయిర్‌బస్ ఏ320 విమానానికి బాంబు బెదిరింపు వచ్చిందన్న సమాచారం అందడంతో విమానాన్ని సోఫియాకు మళ్లించి అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు’’ అని బల్గేరియా రవాణామంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

    విమానానికి బాంబు బెదిరింపు వచ్చినట్టు బల్గేరియా, ఇజ్రాయెల్ మీడియా సంస్థలు వెల్లడించాయి.

    విమానంలో 51 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారని ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి బీబీసీకి తెలిపారు. బాంబు బెదిరింపు సమాచారం అందిన దాదాపు 30నిమిషాల తర్వాత విమానం సోఫియాలో ల్యాండ్ అయింది.

    ‘‘సోఫియాలో విమానం దిగిన తర్వాత అధికారులు భద్రతా తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి ప్రమాదం లేదని తేలడంతో అనంతరం ఆ విమానంలోనే ప్రయాణీకులందరినీ ఎక్కించారు. విమానం తర్వాత సురక్షితంగా వియన్నాలో ల్యాండ్ అయింది’’ అని ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్ తెలిపింది.

  13. భారత పురుషుల క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా

    క్రికెట్, భారత జట్టు, బీసీసీఐ
    ఫొటో క్యాప్షన్, ప్రజ్ఞాన్ ఓజా

    అజిత్ అగార్కర్ స్థానంలో ప్రజ్ఞాన్ ఓఝాను చీఫ్ సెలెక్టర్‌గా బీసీసీఐ నియమించింది.

    భారత మాజీ క్రికెటర్ రమేశ్ పొవార్‌ను పురుషుల క్రికెట్ జట్టు కొత్త సెలెక్టర్‌గా నియమించింది.

    అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపేలతో కూడిన క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ), పురుషుల సెలక్షన్ కమిటీ సభ్యుని నియామకం కోసం ఎంపిక ప్రక్రియను పూర్తి చేసిందని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

    దరఖాస్తుదారుల పత్రాలను పరిశీలించి, బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించిన అనంతరం రమేశ్ పొవార్ పేరును ఏకగ్రీవంగా సిఫార్సు చేసినట్టు తెలిపింది.

    పురుషుల సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా అజిత్ అగార్కర్ చేసిన సేవలను, ఆయన నిబద్ధతను, కృషిని బీసీసీఐ ప్రశంసించింది.

    2023జూలైలో అగార్కర్‌ చీఫ్ సెలక్టరయ్యాడు.

    అత్యధిక టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ప్రాతిపదిక ఆధారంగా ప్రజ్ఞాన్ ఓఝా సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఉంటాడని బీసీసీఐ తెలిపింది.

    రమేశ్ పొవార్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో భారత్ తరఫున రెండు టెస్టులు, 31 వన్డేలు ఆడాడు. ఆ తర్వాత భారత మహిళల క్రికెట్ జట్టుతో పాటు ముంబై, గుజరాత్‌ జట్లకు ప్రధాన కోచ్‌గా పనిచేశాడు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో బౌలింగ్ కోచ్‌గా కూడా సేవలందించాడు.

  14. పారా ఆసియా క్రీడలు: ఒకే ఈవెంట్‌లో భారత్‌కు స్వర్ణం, రజతం

    పారా ఆసియా క్రీడలు
    ఫొటో క్యాప్షన్, అవని లేఖరా(ఎడమ), మోనా అగర్వాల్(కుడి)(ఫైల్ ఫోటో)

    జపాన్‌లోని నాగోయాలో జరుగుతున్న పారా ఆసియా క్రీడల్లో భారత షూటర్ మోనా అగర్వాల్ స్వర్ణ పతకం గెలుచుకోగా, అవని లేఖరా రజత పతకం సాధించింది.

    ఆర్2 మహిళల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్‌లోని ఎస్‌హెచ్1 విభాగంలో ఇద్దరూ ఈ ఘనతను సాధించారు. ఫైనల్‌లో ఇద్దరు షూటర్ల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది.

    మోనా 250.0 పాయింట్లు సాధించి స్వర్ణ పతకం గెలుచుకోగా, అవని 249.6 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.

    దక్షిణ కొరియాకు చెందిన యున్రి లీ 227.9 పాయింట్లతో కాంస్య పతకాన్ని గెలుచుకుంది.

    ఈ ఘనత సాధించినందుకు ఇద్దరు భారత షూటర్లను ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) అభినందించింది.

  15. సల్మాన్ నుంచి టైగర్ దాకా.. బాలీవుడ్ నటులపై దాడులతో ఆందోళన

  16. ఉత్తర కొరియా: 50 మీటర్ల ఈత కొలను, జారుడు బల్లలున్న ఆ విలాస నౌక ఎవరిది?

  17. క్యాన్సర్, ఎర్లీ మెనోపాజ్‌ను ఎదుర్కొని.. 23 ఏళ్ల నాటి అండాశయ కణజాలంతో ఈమె ఎలా తల్లయ్యారు

  18. వెస్ట్ బ్యాంక్‌లో యూరోపియన్ దౌత్యవేత్తల బృందంపై దాడి

    వెస్ట్ బ్యాంక్‌, యూరోపియన్ దౌత్యవేత్తల బృందంపై దాడి
    ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం ఈ ఘటనపై సందేహం వ్యక్తం చేసింది (ఫైల్ ఫోటో).

    పశ్చిమాసియాలోని వెస్ట్ బ్యాంక్‌లో యూరోపియన్ దౌత్యవేత్తల బృందంపై ముసుగులు ధరించిన కొందరు ఇజ్రాయెలీ సెటిలర్లు దాడి చేశారు.

    బెల్జియం తమ కాన్సుల్ జనరల్‌తో పాటు ఇతర దౌత్యవేత్తలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించింది. ఈ దాడికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్‌ను కోరింది.

    ఇజ్రాయెల్ సైన్యం కూడా దీన్ని ‘తీవ్రమైన హింసాత్మక చర్య’గా అభివర్ణిస్తూ, దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించింది.

    ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం అనుమానాలు వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు జరుగుతున్న ‘ప్రచారంలో’ భాగమై ఉండొచ్చని అభిప్రాయపడింది.

    దీనికి ఒక రోజు ముందు వెస్ట్ బ్యాంక్‌లోని మరో గ్రామంలో పాలస్తీనీయులతో పాటు వాషింగ్టన్ పోస్ట్ ఫొటో జర్నలిస్ట్ హెడీ లెవిన్‌పై దాడి జరిగింది. ఈ ఘటనలో లెవిన్‌తో పాటు పలువురు పాలస్తీనా పౌరులు గాయపడ్డారు.

    ఈ దాడి ఆందోళనకరమని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు ఇజ్రాయెల్ ప్రతిష్ఠకు కూడా మంచివి కావని ఆయన అన్నారు.

  19. ట్రంప్ నిర్ణయంతో భారత్‌కు భారీ ఊరట, అమెరికాలో వ్యతిరేకత పెరగనుందా?

  20. ప్రేమ్ వత్సా: 8 డాలర్లతో కెనడా వెళ్లిన ఈ హైదరాబాద్ వ్యక్తి 52వేల కోట్లకు ఐడీబీఐ బ్యాంకును ఎలా కొన్నారు?