కేజ్రీవాల్‌ను మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి అనుమతించిన కోర్టు
దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను మార్చి 28వ తేదీ వరకు ఈడీ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది.
లైవ్ కవరేజీ
రాహుల్ తీరు ప్రజాస్వామ్యానికే అవమానకరం: కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విమర్శ, ఇంకా కాంగ్రెస్ గుణపాఠం నేర్చుకోలేదు అన్న సింధియా

ఫొటో సోర్స్, Hindustan Times via Getty Images
ఫొటో క్యాప్షన్, రాహుల్ గాంధీపై జ్యోతిరాదిత్య సింధియా విమర్శలు దిల్లీలో రాహుల్ గాంధీ, ప్రతిపక్ష నేతలు చేపట్టిన నిరసన ప్రజాస్వామ్యానికే అవమానమని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విమర్శించారు.
" లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నుంచి జిల్లా పంచాయతీలు, సర్పంచుల వంటి స్థానిక సంస్థల ఎన్నికల వరకు నిరంతరం ఎన్నికలు జరిగే దేశంలో, ఆ వ్యవస్థపైనే అనుమానాలు వ్యక్తం చేయడం లేదా మచ్చ తీసుకురావడానికి ప్రయత్నించడం కాంగ్రెస్ పార్టీ అసలు ఉద్దేశాన్ని మరోసారి స్పష్టం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం గురించి మాట్లాడుతుంది, కానీ ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ రాజ్యాంగ వ్యవస్థలోని ప్రతి అంశాన్ని తక్కువ చేసి చూపడానికి లేదా అప్రతిష్టపాలు చేయడానికి వెనుకాడటం లేదు. అత్యవసర పరిస్థితిని (ఎమర్జెన్సీ) విధించి రాజ్యాంగాన్ని కాలరాసిన అదే కాంగ్రెస్ పార్టీ, నేడు ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రశ్నిస్తోంది. న్యాయవ్యవస్థ, ప్రధాన న్యాయమూర్తి, భారత సైన్యం, ఎన్నికల సంఘంపై కూడా ప్రశ్నలు లేవనెత్తిన పార్టీ ఇదే. కాంగ్రెస్ పార్టీ బలహీనపరచడానికి ప్రయత్నించని రాజ్యాంగ సంస్థ అంటూ ఏదీ లేదు" అని ఆయన విమర్శించారు.
బెదిరించినా, భయపెట్టినా వెనక్కి తగ్గబోము: రాహుల్ గాంధీ, సోమవారం ఆందోళనలో పాల్గొన్న వారికి ధన్యవాదాలు చెప్పిన రాహుల్

ఫొటో సోర్స్, Hindustan Times via Getty Images
ఫొటో క్యాప్షన్, సోమవారం నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ గాంధీ, ఇతర నాయకులు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలంతా ఐక్యంగా సాగుతున్నారని రాహుల్ అభిప్రాయపడ్డారు. సోమవారం జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వారికి ధన్యవాదాలు చెప్పిన రాహుల్, మొన్న యువకులపై దాడి చేసిన వారు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.
ప్రధాన మంత్రి మాదిరిగానే వారికి కూడా నిలబడి పోరాడే ధైర్యం లేదన్నారు. కేవలం అధికారం, బలాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే పోరాడుతున్నారని విమర్శించారు./
అందరూ కలిసి ఒక జట్టుగా పని చేస్తున్నారని, జరుగుతున్నవి వేర్వేరు నిరసనలు కావని, ఇదొక ఉద్యమమని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగాన్ని హరించేవారికి, ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కేవారికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ నిలబడతారని, ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గబోరని పేర్కొన్నారు. భారత ప్రజలు భయపడబోరని ప్రభుత్వానికి చూపించాల్సిన అవసరం ఉందన్నారు. కొట్టవచ్చు, బెదిరించవచ్చు, భయపెట్టేందుకు ప్రయత్నించవచ్చు అయినా తగ్గబోమని స్పష్టం చేశారు.
నేడు చంద్రబాబుతో విజయ్ సమావేశం-నదీ జలాలపై చర్చలు, నదుల అనుసంధానంపై నేడు ఏపీ, తమిళనాడు ముఖ్యమంత్రుల భేటీ

ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, నేడు చంద్రబాబుతో విజయ్ సమావేశం మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 2.30 గం.లకు విజయ్ తన క్యాంప్ ఆఫీస్ నుంచి బయల్దేరుతారు. సుమారు 4 గంటల సమయానికి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 4.10 గంటలకు విజయవాడ కనక దుర్గ ఆలయాన్ని సందర్శిస్తారు. దర్శనం తర్వాత 6 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి చేరుకుంటారు.
గోదావరి-కావేరీ నదుల అనుసంధానం, కృష్ణా జలాల విడుదలపై చంద్రబాబుతో చర్చిస్తారు. అనంతరం ఇద్దరూ కలిసి విజయవాడలో జరుగుతున్న ఉత్సవ్ కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో విజయవాడ నుంచి తిరిగి తమిళనాడుకు బయల్దేరి వెళ్తారు విజయ్.
అందరినీ వద్దని బెదిరించిన ట్రంప్.. తాను మాత్రం రష్యా నుంచి డీజిల్ కొనే ఒప్పందం ఎందుకు చేసుకున్నారు?
సీజేపీ నిరసన ప్రదర్శనల రిపోర్టింగ్‌లో జర్నలిస్టులకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి?
జంతర్ మంతర్ ఇక నిరసనల వేదిక కాదు: దిల్లీ పోలీసులు

ఫొటో సోర్స్, Arun SANKAR / AFP via Getty Images
ఫొటో క్యాప్షన్, దిల్లీలో నిరసన ప్రదర్శనలకు చేపట్టేందుకు జంతర్ మంతర్‌కు బదులుగా మూడు ప్రత్యామ్నాయ ప్రదేశాలను ఎంపిక చేసినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు. దిల్లీలో నిరసనలు, ధర్నాలు నిర్వహించడానికి నిర్దేశించిన ప్రదేశాల జాబితా నుంచి జంతర్ మంతర్‌ను తొలగించారు .
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
దిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ దీని గురించి నోటీస్ జారీ చేశారు.
జంతర్ మంతర్‌కు బదులుగా తూర్పు దిల్లీలోని రామ్‌లీలా మైదాన్, బురారీ మైదాన్, సీబీడీ మైదాన్‌లలో నిరసనలు చేపట్టవచ్చని ఆ నోటీస్‌లో తెలిపారు.
“పౌరులకు నిరసనలు, ప్రదర్శనలు నిర్వహించే హక్కును దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుతం ఉన్న నిర్దేశిత స్థలాలకు ప్రత్యామ్నాయాలను సమీక్షించే బాధ్యతను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీకి అప్పగించారు” అని ఆ నోటీస్‌లో పేర్కొన్నారు.
ఈ మూడు ప్రదేశాలలో నిరసనలు, ధర్నాలు నిర్వహించడానికి విడివిడిగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ విడుదల చేస్తామని ఆ నోటీసులో పేర్కొన్నారు.
జ్ఞానేశ్ కుమార్‌ను వదిలేది లేదు. వేచి చేస్తున్నాం: రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Rahul Gandhi
ఫొటో క్యాప్షన్, నరేంద్రమోదీ ప్రభుత్వం జ్ఞానేశ్ కుమార్‌ను రక్షించేందుకు మిగతా వ్యవస్థలను కూడా దుర్వినియోగం చేస్తోందని రాహుల్ అన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ అవినీతి గురించి తనకు తెలుసని, ఆయన్ను వదిలేది లేదని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు.
“ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అడిగిన ప్రశ్నలనే మేం కూడా అడుగుతున్నాం. జ్ఞానేశ్ కుమార్ ఎందుకు రాజీనామా చేయడం లేదు? జ్ఞానేశ్ కుమార్ జీ.. మీ పరిస్థితేంటో మాకు తెలుసు. మీకు నిద్ర పట్టడం లేదు. మేం మిమ్మల్ని వదిలిపెట్టం. మీరు తప్పించుకోలేరు. మీ గతం మీ అవినీతి గురించి మాకు తెలుసు. మేం కేవలం వేచి చేస్తున్నాం” అని రాహుల్ గాంధీ అన్నారు.
దిల్లీలో నిరసనకారులపై జరుగుతున్న పోలీసు చర్యల గురించి రాహుల్ స్పందిస్తూ, ప్రభుత్వం చాలా పెద్ద తప్పు చేస్తోందని అన్నారు.
“ఓట్ల చోరీకి వ్యతిరేకంగా దిల్లీలో చాలా రోజులుగా నిరసనలు జరుగుతున్నాయి. అసలు ప్రశ్న ఏమిటంటే దిల్లీని ఎందుకు జైలుగా మార్చారు? నగరంలోకి రాకుండా ప్రజలను అడ్డుకుంటున్నారు. రైళ్లు, బస్సుల్లోనే వారిని నిలిపివేస్తున్నారు. ప్రభుత్వం చాలా పెద్ద తప్పు చేస్తోంది” అన్నారు.
బీజేపీ వ్యతిరేక ఓట్లనే తొలగిస్తున్నారు: రేవంత్ రెడ్డి

ఫొటో సోర్స్, I&PR Telangana
ఫొటో క్యాప్షన్, సోమవారం జరగనున్న ర్యాలీ కోసం దిల్లీకి చేరుకున్న రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) అమలుచేసిన రాష్ట్రాలలోనే ఆ పార్టీ గెలిచిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
సోమవారం జరగనున్న కాంగ్రెస్ పాదయాత్ర కోసం దిల్లీకి చేరుకున్న రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
"ముఖ్యంగా బీజేపీని వ్యతిరేకిస్తున్నది ఎవరంటే..దళితులు, ఆదివాసీలు, గిరిజనులు, మైనార్టీలు, యువత. బీజేపీని ఓడించాలనుకున్న ప్రజల ఓటు హక్కును తొలగించడానికి కుట్ర చేశారు. జ్ఞానేశ్‌కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని కమిషన్ సభ్యులు చెప్పారు. తప్పులు జరుగుతున్నాయని తెలిసినపుడు, ఆ అధికారిని తొలగించడానికి మోదీకి అభ్యంతరం ఏమిటి?, ఆయనకు అండగా ఎందుకు నిలబడుతున్నారు" అని రేవంత్ రెడ్డి అన్నారు.
ఒమన్ సమీపంలో భారతీయ సిబ్బంది ఉన్న ట్యాంకర్‌పై డ్రోన్ దాడి

ఫొటో సోర్స్, Fatemeh Bahrami/Anadolu via Getty Images
ఫొటో క్యాప్షన్, ఇద్దరు భారతీయులు గల్లంతైనట్లు కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ ఆదివారం రాత్రి ధ్రువీకరించారు (ప్రతీకాత్మక చిత్రం). ఒమన్ సమీపంలో భారతీయ సిబ్బంది ఉన్న ట్యాంకర్‌పై ఆదివారం డ్రోన్ దాడి జరిగింది. నౌకలో ఉన్న 11 మంది భారతీయ నావికుల్లో తొమ్మిది మందిని రక్షించగా.. మరో ఇద్దరు గల్లంతయ్యారు. ఇద్దరు నావికులు కనిపించకుండా పోయిన విషయాన్ని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ ఆదివారం రాత్రి ధ్రువీకరించారు.
"అక్టోబర్ 11న సోహార్ యాంకరేజ్ వద్ద భారతీయ ట్యాంకర్ ఎం.టి. పెట్రో డాల్ఫిన్‌పై డ్రోన్ దాడి జరిగింది. ట్యాంకర్‌పై 11 మంది భారతీయ నావికులు ఉన్నారు. తొమ్మిది మందిని రక్షించారు, ఇద్దరు గల్లంతయ్యారు" అన్నారు.
స్థానిక తీర రక్షక దళం గాలింపు, సహాయక చర్యలు చేపట్టిందని మంత్రి వివరించారు.
గల్లంతైన వారిని గుర్తించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, సహాయక చర్యలకు పూర్తి మద్దతు అందించేందుకు సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని సర్బానంద సోనోవాల్ పేర్కొన్నారు.
సీజేపీ: బాండ్‌పై సంతకం చేస్తే నిరసనలకు దూరంగా ఉంచగలరా? చట్టం ఏం చెబుతోంది?
మియన్మార్‌లో పెరుగుతున్న బలవంతపు సైనిక నియామకాలు..
విపక్ష ఎంపీలతో భేటీకి సీజేఐ సూర్యకాంత్ నిరాకరణ

ఫొటో సోర్స్, Arun Kumar/ The India Today Group via Getty Images
ఫొటో క్యాప్షన్, ప్రతిపక్ష పార్టీల ఎంపీలను కలవకపోవడానికి సీజేఐ కొన్ని కారణాలు చెప్పారు (ఫైల్ ఫోటో). విపక్ష పార్టీల ఎంపీలతో సమావేశమయ్యేందుకు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్ నిరాకరించారు. వారిని కలవలేకపోవడానికి కొన్ని కారణాలను సీజేఐ వివరించినప్పటికీ, లేఖ గోప్యతను దృష్టిలో ఉంచుకుని వాటిని బహిర్గతం చేసేందుకు నిరాకరించారు.
“విపక్ష నేతల లేఖ నాకు నిన్న అందింది. దానికి నిన్న రాత్రే సమాధానం ఇచ్చాను. కొన్ని కారణాలను వివరిస్తూ వారిని కలవలేనని తెలియజేశాను” అని సీజేఐ సూర్యకాంత్ సోమవారం మీడియాతో చెప్పారు.
‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’పై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సుప్రీంకోర్టు పర్యటన రద్దు కావడంపై కూడా సీజేఐని ప్రశ్నించగా, ఆయన స్పందిస్తూ.. “ఆ విషయంలో కోర్టులో విరుద్ధ ప్రయోజనాల (కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్) పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. అందుకే, మేం దీనిపై చర్చించాం. ఎలాంటి విరుద్ధ ప్రయోజనాలకైనా దూరంగా ఉండాలని నా సీనియర్ న్యాయ సహచరులు, నేను ఒకే అభిప్రాయానికి వచ్చాం” అని తెలిపారు.
సీజేఐను కలిసేందుకు సమయం కోరుతూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో కలిసి లేఖ రాసినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదివారం తెలిపారు.
యువత ఆగ్రహం ఎవరి మీద? ఎన్నికల సంఘంపైనా, మోదీ పైనా?
నేహా బోరా గురించి దర్శకుడు దేవా కట్టా ట్వీట్

ఫొటో సోర్స్, Facebook/Deva Katta
ఫొటో క్యాప్షన్, దేవా కట్టా అఖిల భారత విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా గురించి టాలీవుడ్ దర్శకుడు దేవా కట్టా 'ఎక్స్' వేదికగా స్పందించారు.
"ఆమెతో మీరు ఏకీభవించవచ్చు, లేకపోవచ్చు... ఆమె పోరాట స్ఫూర్తితో మీరు మమేకం కావచ్చు, కాకపోవచ్చు... కానీ, మన రాజకీయాలు, రాజకీయ నాయకుల నేరపూరిత, నిరంకుశ పోకడలు సాధారణ విషయంగా మారిపోతుండటంపట్ల ఆమె వ్యక్తం చేస్తున్న ఆక్రోశం, ఆగ్రహాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతే... అప్పుడు నిజమైన 'యాంటీ-నేషనల్’ మీరే!!" అంటూ ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
సీజేపీ ఆందోళనలు: పోలీసులు విమానంలోకి వచ్చి అరెస్టు చేయవచ్చా?
దిల్లీలో నిరసనకారులపై దాడులు, హిందుత్వ సంఘాల ప్రస్తావన ఎందుకు వస్తోంది?
‘నాయనమ్మ చనిపోయిన విషయం దీప్కేకు చెప్పాం’ : దిల్లీ పోలీసులు
అభిజీత్ దీప్కేతో పాటు ఇతర సీజేపీ నాయకుల్ని విమానంలోనే అదుపులోకి తీసుకోవడంపై వస్తున్న విమర్శలకు దిల్లీ పోలీసులు వివరణ ఇచ్చారు
షాదరా జోన్ డీసీపీ నేహా యాదవ్ సీజేపీ ఆరోపణలపై స్పందించారు.
దీప్కేతో పాటు మరో ఇద్దరికి దిల్లీలో నిరసన తెలిపేందుకు అనుమతి లేదని అందుకే వారిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
దీప్కే నాయనమ్మ మరణం గురించి తెలియగానే పోలీసులు ఆ విషయాన్ని ఆయనకు చెబుతున్నప్పుడు రికార్డు చేసిన వీడియోను ఆమె ప్లే చేశారు.
తర్వాత దీప్కేను స్వగ్రామానికి వెళ్లేందుకు అనుమతించారు. కానీ దీప్కే నిరాకరించారని డీసీపీ నేహా యాదవ్ పేర్కొన్నారు.
పునరాలోచించుకోవడానికి పోలీసులు సమయం ఇచ్చారని, అతను తన నిర్ణయాన్ని మార్చుకోలేదని కూడా ఆమె తెలిపారు.
తల్లిదండ్రులతో మాట్లాడేందుకు పోలీసులు అవకాశం కల్పించినా అభిజీత్ దీప్కే దాన్ని కూడా వద్దన్నారనే ఆరోపణలు ఉన్నాయి.
సీజేపీ నాయకులు దిల్లీ పోలీసులపై ప్రజల్లో ప్రతికూల అభిప్రాయాన్ని సృష్టించేందుకు ప్రయత్నించారని పోలీసులు ఆరోపించారు.
గత నిరసనల సమయంలో దీప్కే చట్టాన్ని ఉల్లంఘించారని ఈసారి కూడా అలాగే చేశారని దిల్లీ పోలీసులు ఆరోపించారు.

ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, అభిజీత్ దీప్కేతో పాటు ఇతర సీజేపీ నాయకుల అరెస్ట్‌పై డీసీపీ నేహాయాదవ్ వివరణ ఇచ్చారు ‘స్మైలింగ్ డిప్రెషన్’: మీ చిరునవ్వు వెనుక డిప్రెషన్ కూడా ఉండొచ్చు, ఒకసారి చెక్ చేసుకోండి
ఎవరీ నేహా బోరా? బీజేపీకి మద్దతు ఇచ్చే కుటుంబం నుంచి వచ్చి ఉద్యమాల ముఖచిత్రంగా ఎలా మారారు?
