కేజ్రీవాల్‌ను మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి అనుమతించిన కోర్టు
దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను మార్చి 28వ తేదీ వరకు ఈడీ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది.
లైవ్ కవరేజీ
అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్న దిల్లీ పోలీసులు

ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, అభిజీత్ దీప్కేను దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ నాయకుడు అభిజీత్ దీప్కేను దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
దిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లోని సెంట్రల్ పార్క్‌లో ‘లెహ్రా దో తిరంగా-(జాతీయ జెండాను రెపరెపలాడించండి)’పేరుతో నిరసన కార్యక్రమానికి సీజేపీ పిలుపునిచ్చింది.
కన్నాట్‌ప్లేస్‌లో భారతీయ నాగరిక్ సురక్షాసంహిత(బీఎన్ఎన్ఎస్)లోని 163వ సెక్షన్ అమల్లో ఉంది. సీజేపీ నిరసనకు న్యూదిల్లీ మున్సిపల్ కౌన్సిల్ అనుమతి ఇవ్వలేదు.
‘‘మిమ్మల్ని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నిర్బంధిస్తున్నాం. కన్నాట్ ప్లేస్‌లో 163వ సెక్షన్ అమల్లో ఉంది. అందుకే మిమ్మల్ని అదుపులోకి తీసుకుంటున్నాం’’అని ఓ పోలీస్ అధికారి అభిజిత్ దీప్కేతో చెప్పారు. ఆ సమయంలో దీప్కే ఎన్సీపీ శరద్ పవార్ వర్గం అధికార ప్రతినిధి అనీశ్ గవాండే నివాసం నుంచి బయటకు వస్తున్నారు.
అక్కడకు చేరుకున్న దిల్లీ పోలీసులు అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్నారు.
దిల్లీ పోలీసులు దీప్కేకు రెండు నోటీసులిచ్చారు. బీఎన్ఎస్ 163వ సెక్షన్ అమల్లో ఉన్నందున సెంట్రల్ పార్క్‌కు వెళ్లొద్దని దీప్కేను ఓ నోటీసులో ఆదేశించారు. సౌత్ వెస్ట్ దిల్లీ పోలీసులు ఇచ్చిన రెండో నోటీసులో అభిజీత్, ఆశుతోష్, సౌరభ్‌ను ఎయిర్‌పోర్టులో ముందస్తుగా అదుపులోకి తీసుకుని క ోర్టు ముందు హాజరుపర్చినప్పుడు కోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రస్తావించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా, ప్రజల శాంతికి భంగం కలిగించేలా ఎలాంటి చర్యలకు పాల్పడకూడదని ఆదేశించారు.
దీప్కేను ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని దిల్లీ ఏడీసీపీ జైదేశ్ సింగ్ చెప్పారు.
అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసి నియోజకవర్గాల పునర్విభజనపై చర్చించండి: మోదీకి ఖర్గే లేఖ

ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, మల్లికార్జున్ ఖర్గే నియోజకవర్గాల పునర్విభజనపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
"2026 ఆగస్టు 13న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వాయిదా పడ్డాయి. 64 రోజులు గడిచినా, పార్లమెంటు ఉభయ సభలను ఇంకా అధికారికంగా నిరవధిక వాయిదా వేయలేదు. ఇలాంటిది గతంలో ఎప్పుడూ జరగలేదు" అని ఖర్గే ఆ లేఖలో రాశారు.
"నియోజకవర్గాల పునర్విభజనపై రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టే ముందు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయమని కోరుతూ ఏప్రిల్ 11, 2026న మీకు నేను లేఖ రాసిన విషయం గుర్తుండే ఉంటుంది. కానీ మీరు అలా చేయలేదు"
‘‘ఆ తర్వాత 2026 ఏప్రిల్ 14వ తేదీ రాత్రి ఆలస్యంగా ఆ బిల్లులను బహిరంగంగా అందుబాటులోకి తెచ్చి ఏప్రిల్ 16వ తేదీన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నియోజకవర్గాల పునర్విభజనపై రాజ్యాంగ సవరణ బిల్లు 2026 ఏప్రిల్ 17వ తేదీన లోక్‌సభలో అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీని సాధించలేకపోయింది. దీంతో ఆ బిల్లు భారీ తేడాతో వీగిపోయింది.
ఆ తర్వాత అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్న నా అభ్యర్థనను పునరుద్ఘాటిస్తూ జూలై 16, ఆగస్టు 27తేదీల్లో మీకు మళ్ళీ లేఖ రాశాను. ఇప్పుడు నాలుగోసారి ఇదే విజ్ఞప్తి చేస్తున్నా" అని ఖర్గే ఆ లేఖలో రాశారు.
అభిజిత్ దీప్కే ఉంటున్న ఇంటికి చేరుకున్న దిల్లీ పోలీసులు

ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, అభిజిత్ దీప్కే ఉంటున్న ఇంటికి చేరుకున్న దిల్లీ పోలీసులు కాక్రోచ్ జనతా పార్టీ నాయకుడు అభిజీత్ దీప్కే బస చేస్తున్న ప్రదేశానికి దిల్లీ పోలీసు బృందం చేరుకుంది.
అభిజీత్ దీప్కే.. ఎన్‌సిపి శరద్ పవార్ వర్గం అధికార ప్రతినిధి అనీష్ గవాండే నివాసంలో ఉంటున్నారు.
దిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో ఉన్న సెంట్రల్ పార్క్‌లో శుక్రవారం ‘లహరా దో తిరంగా’ కార్యక్రమంతో నిరసనలకు దీప్కే పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలో దిల్లీ పోలీసులు ఆయన ఉంటున్న ‘గవాండే’ నివాసానికి చేరుకున్నారు.
రణబాలి రివ్యూ: పెళ్లయిన తర్వాత రష్మికతో తొలి చిత్రం.. విజయ్ దేవరకొండ పంట పండిందా?
ఆహారం తినగానే ‘షుగర్ లెవెల్స్’ పెరగడం ప్రమాదకరమా?
మేం పోటీకి భయపడం: ఎలాన్ మస్క్ ఆరోపణలపై రిలయన్స్ ప్రకటన

ఫొటో సోర్స్, Prakash Singh/Bloomberg via Getty Images
ఫొటో క్యాప్షన్, ఎలాన్ మస్క్ ఆరోపణలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. స్టార్ లింక్ వ్యవహారంలో అమెరికా వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ ఆరోపణలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పందించింది. శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసిన ఆ సంస్థ, తాము ఎప్పుడూ పోటీకి భయపడలేదని పేర్కొంది.
భారతదేశంలో స్టార్‌లింక్ ప్రవేశాన్ని అడ్డుకుంటున్నారని ఎలాన్ మస్క్ ఇటీవల ఆరోపించారు.
పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీని "ప్రధాన మంత్రి అంబానీ" అని సంబోధించిన మస్క్, భారత్‌లో స్టార్‌లింక్‌కు నిష్పాక్షికంగా పోటీపడే అవకాశం ఇస్తారా? అని ప్రశ్నించారు.
రిలయన్స్ ప్రకటనలో, "ప్రతి భారతీయ కంపెనీలాగే రిలయన్స్ కూడా దేశీయ విదేశీ పెట్టుబడులతో పాటు సరికొత్త ఆలోచనలకు స్వాగతం పలికే దేశంలో అభివృద్ధి చెందింది. ముఖ్యంగా ప్రజల జీవితాలను మెరుగుపరిచే పనులను ఆహ్వానిస్తుంది"
స్టార్‌లింక్‌తో సహా ఉపగ్రహ సమాచార రంగంలో పోటీని స్వాగతిస్తున్నట్లు రిలయన్స్ తెలిపింది. జియోతో సహా ప్రతి కంపెనీ భారత ప్రజలకు సేవలు అందించాలని, దేశ చట్టాలు, విధానాలను పాటించాలని ఆ ప్రకటనలో పేర్కొంది.
నన్ను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది - అభిజిత్ దీప్కే

ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, దిల్లీ పోలీసులు తనను అదుపులోకి తీసుకోవచ్చని అభిజిత్ దీప్కే అన్నారు. దిల్లీ పోలీసులు, ఐబీ సిబ్బంది తన ఇంటిని చుట్టుముట్టారని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే అన్నారు.
"ఇంటి చుట్టూ ఉన్న నాలుగు వీధుల్లో ఐబీ సిబ్బంది, దిల్లీ పోలీసు అధికారులు తిరుగుతున్నారు. నేను బయటకు వెళ్లినప్పుడల్లా నంబర్ ప్లేట్లు లేని వాహనాలు నన్ను అనుసరిస్తున్నాయి. నేను తిరిగి రాగానే, ఐబీ, పోలీసు సిబ్బంది మా వాచ్‌మన్‌తో మాట్లాడి వివరాలు సేకరిస్తున్నారు. కాబట్టి, దిల్లీ పోలీసులు నన్ను అదుపులోకి తీసుకోవచ్చు" అని మీడియాతో అభిజిత్ చెప్పారు.
భారత్, చైనాలను ఏకతాటిపైకి తేవాలని నేపాల్ ఎందుకు కోరుకుంటోంది?
అమెరికా: స్కూల్లో 16 ఏళ్ల బాలుడి కాల్పులు, ముగ్గురు పిల్లలు సహా టీచర్ మృతి

ఫొటో సోర్స్, Reuters
ఫొటో క్యాప్షన్, బెండ్ నగరంలోని సిల్వర్ రైల్ ప్రాథమిక పాఠశాల వద్ద ఈ ఘటన జరిగింది అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలో ఒక ప్రాథమిక పాఠశాలలో జరిగిన కాల్పులు ఘటనలో టీచర్ సహా 5, 8, 11 ఏళ్ల వయసున్న ముగ్గురు పిల్లలు మరణించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
బెండ్ నగరంలోని సిల్వర్ రైల్ ప్రాథమిక పాఠశాల వద్ద ఈ ఘటన జరిగింది.
కాల్పులు జరిపిన వ్యక్తిని బెండ్ నగరానికి చెందిన 16 ఏళ్ల బాలుడిగా గుర్తించారు.
తాళం వేసి ఉన్న తలుపులపై కాల్పులు జరుపుతూ బాలుడు పాఠశాలలోకి ప్రవేశించారు. పాఠశాలలోకి వెళుతున్న అనుమానితుడిని కమ్యూనిటీలోని ఓ గన్ మెన్ వెంబడించారని, ఆయన చేతిలోనే బాలుడు హతమయ్యాడని పోలీసులు తెలిపారు.
ఘటనా స్థలంలో ఐదుగురు మృతి చెంది ఉన్నట్లు బెండ్ పోలీస్ చీఫ్ మైక్ క్రాంజ్ తెలిపారు.
ఈ ఘటనలో ఏడేళ్ల బాలుడు, మరో ఉపాధ్యాయురాలు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు, ప్రస్తుతం వారిద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
దేశం విడిచి వెళ్లాలని నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు

ఫొటో సోర్స్, Satish Bate/Hindustan Times via Getty Images
ఫొటో క్యాప్షన్, జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు దేశం విడిచి వెళ్లాలని నోటీసులు ఆమిర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్‌కు ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 28 నాటికి భారత్‌ను విడిచి పెట్టాలని అందులో సూచించింది.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లో పాల్గొని విదేశీయుల చట్టాన్ని ఉల్లంఘించినట్టు ఇమ్రాన్ ఖాన్‌పై ఆరోపణలు ఉన్నాయి.
అక్టోబర్ 10న ఆగస్టు రివల్యూషన్ గ్రౌండ్స్‌లో జరిగిన నిరసనల్లో ఇమ్రాన్ ఖాన్ పాల్గొన్నారు. ఆందోళనల్లో పాల్గొన్న ఆయన్ని పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నారు.
ఇమ్రాన్ ఖాన్ అమెరికా పౌరుడని, నిరసనల్లో పాల్గొని విదేశీయుల చట్టాన్ని ఉల్లంఘించారని బీజేపీ నేత కృతి సౌమ్య ఆరోపించారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
"విదేశీయుల చట్టాన్ని ఖాన్ ఉల్లంఘించారని గామ్దేవీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. ఆ తర్వాత ఆ ఫిర్యాదును ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు పంపించాం" అని పోలీసులు తెలిపారు.
ఖాన్‌ను అమెరికా పౌరుడిగా గుర్తించి, ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టంలోని 7, 29 సెక్షన్లు ఉల్లంఘించినట్టు నోటిసుల్లో పేర్కొన్నారు. దీని ఆధారంగానే నిర్దేశించిన గడువులోపు దేశం విడిచి వెళ్లాలని సూచించినట్టు పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక అధికారి వివరించారు.
అంకితా భండారీ తల్లిదండ్రులను నిర్బంధించడాన్ని ఖండించిన రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Sonu Mehta/Hindustan Times via Getty Images
ఫొటో క్యాప్షన్, అంకితా భండారీ తల్లిదండ్రులను నిర్బంధించడాన్ని ఖండించిన రాహుల్ గాంధీ అంకితా భండారీ తల్లిదండ్రులను నిర్బంధించడాన్ని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఖండించారు.
బాధితుల గొంతును ఈ ప్రభుత్వం నొక్కేస్తోందని, ప్రశ్నించేవారిని తప్పిస్తోందని ఆయన ఆరోపించారు.
"ఉదయం 4 గంటలు, ప్రపంచమంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో అంకితా భండారీ తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. వారు చేసిన తప్పు ఏంటి?, ఇండియా గేట్ వద్ద ఎలాంటి హాంగామా లేకుండా, బాధతో నిశ్శబ్ధంగా కూర్చొని, సీబీఐ విచారణ పూర్తి అయ్యే వరకు దుష్యంత్ గౌతమ్‌ను గవర్నర్‌గా నియమించొద్దని కోరారు" అని ఎక్స్‌లో రాహుల్ గాంధీ పోస్టు చేశారు.
"నేను, ప్రియాంక నిన్న వారిని కలిశాం. సీబీఐ దర్యాప్తు ఫలితాలు రాకముందే హడావుడిగా నియమాకాలు పూర్తి చేశారు. ప్రశ్నించిన తల్లిదండ్రులను చీకటిలో అదుపులోకి తీసుకున్నారు. బాధితుల గొంతును అణిచివేయడం, ప్రశ్నించే వారిని పక్కన పెట్టడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారింది.
"న్యాయం కోసం జరుగుతున్న పోరాటాన్ని ఎవరూ అణచివేయలేరు, ఆపలేరు. అంకితా భండారీ కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటుంది. వారికి న్యాయం జరిగే వరకు మద్దతు ఇస్తుంది" అని తెలిపారు.
ఇండియా గేట్ దగ్గర నిరసన చేస్తున్న అంకితా భండారీ తల్లిదండ్రులతోపాటు పలువురిని దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కొంత సమయం వారిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఉదయం ఐదు గంటలకు విడుదల చేసినట్టు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.
టీవీకే ఎమ్మెల్యే పల్లవి: ‘‘చంటి పిల్లాడిని సభలు సమావేశాలకు తిప్పుతూ పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నారు’’ అంటూ ఆమెపై విమర్శలేంటి?
గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్‌కు భయపడాలా? బహిష్టు సమస్యల నుంచి సంతానలేమి వరకు.. దీనివల్ల కలిగే పరిణామాలు ఏంటి?
ఈసీఐకు సుప్రీం కోర్టు నోటీసులు

ఫొటో సోర్స్, ani
ఫొటో క్యాప్షన్, భారత ఎన్నికల సంఘానికి నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు భారత ఎన్నికల సంఘం సహా పలువురికి సుప్రీంకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసిందని ఏఐఎన్ వార్తాసంస్థ పేర్కొంది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీసహా పలు ప్రతిపక్షాలు వేసిన పిటిషన్ విచారణలో భాగంగా నోటీసులు ఇచ్చింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపిస్తూ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై స్పందన తెలియజేయాలని ఎన్నికల సంఘం, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషీకి కోర్టు సూచించింది. ఈసీ సర్‌ను నిర్వహిస్తున్న తీరును సవాలు చేస్తూ 13 పిటిషన్లు దాఖలు కాగా వారి ఒక పిటిషనర్ వైఖరిపై కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
“పిటిషన్ దాఖలు చేసిన ఒక పిటిషనర్ ప్రవర్తన గురించి వచ్చే విచారణలో అడగాలనుకుంటున్నాం” అని రాహుల్ గాంధీ, ఇతర ప్రతిపక్ష నాయకుల పిటిషన్‌పై నోటీసులు జారీ చేస్తూ ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
లోక్‌సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇతర 'ఇండియా' బ్లాక్ నాయకులతో కలిసి, భారత ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా అక్టోబర్ 12న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సర్‌కు సంబంధించి భారత ఎన్నికల సంఘం తీసుకుంటున్న నిర్ణయాలను సవాలు చేస్తూ ఈ పిటిషన్లు వేశారు.
ప్రధాని మోదీ ముందున్న 10 సవాళ్లు ఏంటి?
‘‘5 నెలల్లోనే బియ్యం బస్తా రూ.700 పెరిగింది’’ - తెలుగు రాష్ట్రాల్లో బియ్యం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
అంకిత భండారీ హత్య కేసు: ఇండియా గేటు వద్ద తల్లిదండ్రుల ఆందోళన, అంకిత తండ్రి చేస్తున్న 5 డిమాండ్లు ఏమిటి?
జర్నలిస్ట్‌పై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ నమోదు

ఫొటో సోర్స్, linkedin
ఫొటో క్యాప్షన్, జర్నలిస్టులపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు, కేసు నమోదు చేసిన దిల్లీ పోలీసులు దిల్లీలోని బూటాసింగ్ రౌండ్ అబౌట్ వద్ద అక్టోబరు 3న జరిగిన నిరసన ప్రదర్శనలలో తన అధికారిక విధులకు ఆటంకం కలిగించారని, కులం పేరుతో అవమానించి, బెదిరించారంటూ దిల్లీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వివేక్ భగత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలలో శాంతి భద్రతల పరిరక్షణలో విధులలో ఉన్న తనను ఓ జర్నలిస్టు కులంపేరుతో దూషించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని తాను, తన ఆపరేటర్, కానిస్టేబుల్ రవి దహియా విన్నారని తెలిపారు.
అయితే అక్టోబర్ 3న దిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్భంగా ఇద్దరు మహిళా జర్నలిస్టులతోపాటు ఓ యువతి పోలీసులపై లైంగిక వేధింపులు, దుష్ప్రవర్తన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులలో ఏసీపీ వివేక్ భగత్ కూడా ఉన్నారు.
ఇంద్రకీలాద్రి: అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మేళతాళాలు, మంగళవాయిద్యాలు, పూర్ణకుంభంతో రాష్ట్రపతికి ఘన స్వాగతం

ఫొటో సోర్స్, I& PR AP
ఫొటో క్యాప్షన్, ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారిని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. రాష్ట్రపతి ఇంద్రకీలాద్రికి చేరుకున్న సందర్భంగా ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు.
విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, దుర్గగుడి చైర్మన్ బొర్రా గాంధీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితులు పూజా కార్యక్రమాలు నిర్వహించి రాష్ట్రపతికి వేద మంత్రోచ్ఛారణల నడుమ వేద ఆశీర్వచనం అందజేశారు.
అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ అధికారులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కనకదుర్గ అమ్మవారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. అలాగే అమ్మవారి చిత్రపటాన్ని అందించి గౌరవపూర్వకంగా సత్కరించారు.
