కేజ్రీవాల్‌ను మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి అనుమతించిన కోర్టు

దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను మార్చి 28వ తేదీ వరకు ఈడీ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది.

లైవ్ కవరేజీ

  1. గరివిడి లక్ష్మి: ‘మూణ్నాలుగు జిల్లాలకు తెలిసిన నన్ను మొత్తం ప్రపంచానికి పరిచయం చేశారు’

  2. పుట్టిన రోజు సందడి తరువాత రాత్రి 9 గంటలకు అమ్మ పక్కన పడుకున్న ఆరేళ్ల పాప తెల్లారేసరికి మాయమైంది.. 8 రోజులైనా దొరకని ఆచూకీ

  3. కనిగిరి: మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి వచ్చిన మహిళ ఎందుకు ఏడ్చారు? మరో మహిళ పోలీసుల కాళ్లు ఎందుకు పట్టుకున్నారు?

  4. హైదరాబాద్: 1000 మందితో సెక్స్ చాటింగ్.. 82 మంది న్యూడ్ వీడియోలు, ఫోటోలు సేకరించిన ‘మహిళ’.. కానీ 'ఆమె' చివరికి 'అతడు' అని ఎలా తెలిసింది?

  5. ఉచిత ప్రచారానికి ధన్యవాదాలు: అభిజిత్ దీప్కే

    కాక్రోచ్ జనతాపార్టీ, దసరా, రావణ దహనం
    ఫొటో క్యాప్షన్, పీతాంపురలో రావణుడు, కుంభకర్ణుడుతో పాటు కాక్రోచ్ దిష్టిబొమ్మ

    రావణునితో పాటు కాక్రోచ్ దిష్టిబొమ్మను దహనం చేస్తామనడంపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకులు అభిజిత్ దీప్కే స్పందించారు.

    దిల్లీ పీతంపురాలోని నేతాజీ సుభాష్ ప్యాలెస్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన కాక్రోచ్ దిష్టిబొమ్మ ఫోటోను అభిజిత్ దీప్కే ‘ఎక్స్’లో షేర్ చేశారు. "ఉచిత ప్రచారానికి ధన్యవాదాలు" అని రాశారు.

    రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుని దిష్టిబొమ్మలతో పాటు30 అడుగుల ఎత్తైన కాక్రోచ్ దిష్టిబొమ్మను కూడా శ్రీ కృష్ణ రామలీలా కమిటీ దహనం చేయబోతోంది.

    "ఈ దేశంలో ఏదైనా సరే... నాటకాలు ఆడించండి చాలు" అని అభిజిత్ దీప్కే వ్యాఖ్యానించారు.

    "దసరా సందర్భంగా కాక్రోచ్ దిష్టిబొమ్మను దహనం చేయడం చూస్తుంటే అధికారంలో ఉన్న పార్టీ ఎంత భయపడుతోందో అర్ధమవుతోంది. మీరు మాకు ఇంత ప్రాధాన్యం ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది. మమ్మల్ని మీకు పోటీగా చూస్తున్నారంటే మేం మీపై ఇంత ప్రభావం చూపిస్తున్నామని తెలుసుకోవడం బాగుంది’’ అని దీప్కే తరఫున స్పందించిన రత్నాసింగ్ అన్నారు.

    తాము సరైనదారిలోనే వెళ్తున్నామని దీనివల్ల అర్ధమవుతోందన్నారు.

  6. ఫ్రాన్స్‌లోని పరిస్థితికి వలసదారులే కారణమని ట్రంప్ ఆరోపణ

    ఫ్రాన్స్, డోనల్డ్ ట్రంప్, అమెరికా, పారిస్, యూరప్,
    ఫొటో క్యాప్షన్, ఫ్రాన్స్‌లోని పరిస్థితికి వలసదారులే కారణమని ట్రంప్ ఆరోపించారు

    ఫ్రాన్స్‌లో జరిగిన హింసాత్మక ఘర్షణలకు వలసదారులు, జిహాదీలు, కమ్యూనిస్టులే కారణమని ట్రంప్ ఆరోపించారు.

    కాన్సాస్‌లోని విచిటాలో జరిగిన ఒక ప్రచార సభలో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, ఫ్రాన్స్‌లో కొనసాగుతున్న ఘర్షణల గురించి ప్రస్తావించారు. రాబోయే మధ్యంతర ఎన్నికల ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. అమెరికాలో అలాంటి పరిస్థితులు రాకుండా నివారించాలని మద్దతుదారులకు సూచించారు.

    ఐరోపా వామపక్ష నాయకులు "పాశ్చాత్య విలువలను దెబ్బతీసే" వలస విధానాలను అనుసరిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. ఐరోపాలో జరిగిన తప్పులు జరగొద్దని అన్నారు.

    "పశ్చిమ దేశాలతో ఏమాత్రం సంబంధం లేని మూడో ప్రపంచ దేశాల వలసదారులను ప్రపంచ వామపక్షం ఐరోపాకు తీసుకువస్తోంది. వారు ఫ్రాన్స్‌లోని ప్రతి విషయాన్నీ ద్వేషిస్తారు. వారు ఆ దేశాన్ని నాశనం చేస్తున్నారు. మన దేశానికి అలా జరగనివ్వం," అని ట్రంప్ అన్నారు.

    విలేకరులతో మాట్లాడుతూ, దేశ సరిహద్దులను మూసివేయడం గురించి తాను ఫ్రాన్స్ అధ్యక్షుడిని ఇప్పటికే హెచ్చరించినట్లు ట్రంప్ చెప్పారు.

    "ఫ్రాన్స్‌లో జరుగుతున్నది పాఠశాలల వల్లనో లేదా మరే ఇతర కారణం వల్లనో కాదు. అది వలసల వల్లే," అని ట్రంప్ అన్నారు.

  7. ‘భారత్‌ను లక్ష్యంగా చేసుకున్నారు.. మనం అప్రమత్తంగా ఉండాలి’ - మోహన్ భగవత్

  8. దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు.. ఫోటోల్లో

  9. ‘‘నన్ను బలవంతంగా టాయ్‌లెట్‌లోకి లాక్కెళ్లాడు, నేను కళ్లు మూసుకుని అక్కడ లేననుకున్నా’’

  10. దసరా: మీకు పాలపిట్ట కనిపించిందా?

  11. అమిలీయా ఇయర్‌హార్ట్: 90 ఏళ్ల కిందట ప్రపంచాన్ని చుట్టిరావాలని బయల్దేరిన ఈ మహిళ ఎలా అదృశ్యమయ్యారు, ఈ మిస్టరీని ఛేదిస్తారా?

  12. భారత పురుషుల క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా

    క్రికెట్, భారత జట్టు, బీసీసీఐ
    ఫొటో క్యాప్షన్, ప్రజ్ఞాన్ ఓజా

    అజిత్ అగార్కర్ స్థానంలో ప్రజ్ఞాన్ ఓఝాను చీఫ్ సెలెక్టర్‌గా బీసీసీఐ నియమించింది.

    భారత మాజీ క్రికెటర్ రమేశ్ పొవార్‌ను పురుషుల క్రికెట్ జట్టు కొత్త సెలెక్టర్‌గా నియమించింది.

    అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపేలతో కూడిన క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ), పురుషుల సెలక్షన్ కమిటీ సభ్యుని నియామకం కోసం ఎంపిక ప్రక్రియను పూర్తి చేసిందని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

    దరఖాస్తుదారుల పత్రాలను పరిశీలించి, బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించిన అనంతరం రమేశ్ పొవార్ పేరును ఏకగ్రీవంగా సిఫార్సు చేసినట్టు తెలిపింది.

    పురుషుల సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా అజిత్ అగార్కర్ చేసిన సేవలను, ఆయన నిబద్ధతను, కృషిని బీసీసీఐ ప్రశంసించింది.

    2023జూలైలో అగార్కర్‌ చీఫ్ సెలక్టరయ్యాడు.

    అత్యధిక టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ప్రాతిపదిక ఆధారంగా ప్రజ్ఞాన్ ఓఝా సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఉంటాడని బీసీసీఐ తెలిపింది.

    రమేశ్ పొవార్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో భారత్ తరఫున రెండు టెస్టులు, 31 వన్డేలు ఆడాడు. ఆ తర్వాత భారత మహిళల క్రికెట్ జట్టుతో పాటు ముంబై, గుజరాత్‌ జట్లకు ప్రధాన కోచ్‌గా పనిచేశాడు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో బౌలింగ్ కోచ్‌గా కూడా సేవలందించాడు.

  13. కొలంబస్ కన్నా ముందే అమెరికాను చేరుకున్న వైకింగ్స్ ఎవరు?

  14. పారా ఆసియా క్రీడలు: ఒకే ఈవెంట్‌లో భారత్‌కు స్వర్ణం, రజతం

    పారా ఆసియా క్రీడలు
    ఫొటో క్యాప్షన్, అవని లేఖరా(ఎడమ), మోనా అగర్వాల్(కుడి)(ఫైల్ ఫోటో)

    జపాన్‌లోని నాగోయాలో జరుగుతున్న పారా ఆసియా క్రీడల్లో భారత షూటర్ మోనా అగర్వాల్ స్వర్ణ పతకం గెలుచుకోగా, అవని లేఖరా రజత పతకం సాధించింది.

    ఆర్2 మహిళల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్‌లోని ఎస్‌హెచ్1 విభాగంలో ఇద్దరూ ఈ ఘనతను సాధించారు. ఫైనల్‌లో ఇద్దరు షూటర్ల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది.

    మోనా 250.0 పాయింట్లు సాధించి స్వర్ణ పతకం గెలుచుకోగా, అవని 249.6 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.

    దక్షిణ కొరియాకు చెందిన యున్రి లీ 227.9 పాయింట్లతో కాంస్య పతకాన్ని గెలుచుకుంది.

    ఈ ఘనత సాధించినందుకు ఇద్దరు భారత షూటర్లను ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) అభినందించింది.

  15. సల్మాన్ నుంచి టైగర్ దాకా.. బాలీవుడ్ నటులపై దాడులతో ఆందోళన

  16. ఉత్తర కొరియా: 50 మీటర్ల ఈత కొలను, జారుడు బల్లలున్న ఆ విలాస నౌక ఎవరిది?

  17. జంతర్ మంతర్ 2.0: ఈ నిరసనలకు ఎజెండాను ఎవరు నిర్దేశిస్తున్నారు, సీజేపీ తప్పటడుగులు వేస్తోందా?

  18. అద్దెకు గర్బా పార్టనర్: ‘నుదుటిపై ముద్దు’, ‘ఆఫ్టర్ పార్టీ’ ఆఫర్ల వెనుక అసలు నిజమేంటి?

  19. క్యాన్సర్, ఎర్లీ మెనోపాజ్‌ను ఎదుర్కొని.. 23 ఏళ్ల నాటి అండాశయ కణజాలంతో ఈమె ఎలా తల్లయ్యారు

  20. ట్రంప్ నిర్ణయంతో భారత్‌కు భారీ ఊరట, అమెరికాలో వ్యతిరేకత పెరగనుందా?