అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల కోసం ప్రత్యేక కంట్రోల్ రూంలు ఏర్పాటు

పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారిన ‘అర్నబ్’ కోసం అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసినట్టు ఆంధ్రప్రదేశ్రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఫోన్ నెంబర్లను విడుదల చేసింది.
ఈ తుపాను ప్రభావంతో విశాఖ, శ్రీకాకుళం,విజయనగరం, మన్యం, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ప్రకటించారు.
అర్నబ్ తుపాన్ వేళ ప్రభావిత జిల్లాల కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన నెంబర్లను విడుదల చేశారు.
అత్యవసర సహాయం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ నంబర్లు 112 , 1070 , 1800 425 0101 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు. మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా తుపాన్ సమస్యలకు వేగవంతమైన పరిష్కారం పొందవచ్చని ప్రఖర్ జైన్ తెలిపారు.
- శ్రీకాకుళం- 08942240557
- విజయనగరం- 8922236947
- పార్వతీపురం మన్యం- 08963450347
- అల్లూరి సీతారామరాజు- 8935293448
- విశాఖపట్నం- 0891-2590102 / 0891-2590100
- అనకాపల్లి- 08924-222888 / 08924-226599 / 08924-225999
- కాకినాడ-0884-2356801 / 9849903879
- కోనసీమ-8856293104
- తూర్పు గోదావరి-8832944455
- పశ్చిమ గోదావరి-08816-299181
- ఏలూరు-18002331077 / 9494041419
- పోలవరం-18004254225
- తిరుపతి-0877 2236007
- మార్కాపురం-9248702500
- కృష్ణా-08672 252399
- ఎన్టీఆర్- 9154970454
- గుంటూరు- 0863-2234014
- బాపట్ల- 08643-220226
- ప్రకాశం- 08592 295600 / 18004250277
- నెల్లూరు- 7995576699








