ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.5 నుంచి 8.1 శాతానికి తగ్గింపు

ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) వడ్డీ రేటును ప్రభుత్వం తగ్గించింది. 2021-22 సంవత్సరానికి ఈపీఎఫ్‌ వడ్డీ రేటును 8.1 శాతంగా ఆమోదించింది. గత నాలుగు దశాబ్దాలలో ఇదే కనిష్టం.

లైవ్ కవరేజీ

  1. ఆదర్శ కుటుంబం- ఏకే 47 మూవీ రివ్యూ: వెంకటేశ్,త్రివిక్రమ్ కాంబో మ్యాజిక్ చేసిందా?

  2. అంతర్వేది తీరానికి చేరిన భారీ ఓడకు ఏమైంది? ఒడ్డుకు సమీపంలో ఎలా చిక్కుకుంది? అందులో ఏం ఉంది

  3. ‘పాతికేళ్ల కుర్రాళ్లకూ పక్షవాతం రావొచ్చు’.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి

  4. తెలంగాణలో నాలుగు రోజులపాటు వానలు, వాతావరణ శాఖ లేటెస్ట్ బులెటిన్

    తెలంగాణలో నాలుగు రోజులపాటు వానలు, వాతావరణ శాఖ లేటెస్ట్ బులెటిన్ ఇదే.
    ఫొటో క్యాప్షన్, తెలంగాణలో నాలుగు రోజులపాటు వానలు, వాతావరణ శాఖ లేటెస్ట్ బులెటిన్ ఇదే.

    ఇవాళ వర్షం కురిసే జిల్లాలు: సిద్ధిపేట, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, ములుగు, జనగాం, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం,

    రేపు(31 అక్టోబర్ 2026)వర్షం కురిసే జిల్లాలు: సిద్ధిపేట, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, ములుగు, జనగాం, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, నాగర్‌ కర్నూల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి,

    ఎల్లుండి(1 నవంబర్ 2026)వర్షం కురిసే జిల్లాలు: తెలంగాణ వ్యాప్తంగా చెదురుమదురు వానలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది

    సోమవారం(2 నవంబర్ 2026 )వర్షం కురిసే జిల్లాలు: కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాల్ పల్లి జిల్లాల్లో వానలు పడతాయని మిగతా జిల్లాల్లో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

  5. ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో నేషనల్ హైవేపై వరద నీరు.. ఇచ్ఛాపురానికి రెండు వైపులా రాకపోకలకు అంతరాయం

    శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతున్న వరద ఉద్ధృతి- ఇచ్చాపురంలో మొదటి అంతస్తుకు చేరిన నీరు
    ఫొటో క్యాప్షన్, శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతున్న వరద ఉద్ధృతి- ఇచ్చాపురంలో మొదటి అంతస్తుకు చేరిన నీరు

    అర్నబ్ తుపాను తీరం దాటిన తరువాత కూడా కురుస్తున్న భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

    దీంతో శ్రీకాకుళంలోని నాగావళి, వంశధార, మహేంద్రతనయ, బాహుదా నదులు ఉప్పొంగాయి.

    ముఖ్యంగా మహేంద్ర తనయ, బాహుదా నదులకు ఎగువన ఒడిశా నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వస్తుండడంతో దిగువ ప్రాంతాలన్నీ నీట మునిగాయి.

    ఒడిశా సరిహద్దుల్లోని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పట్టణం ఇచ్ఛాపురంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి.

    ఇక్కడి బెల్లుపడలోని పలు ఇళ్లు నీట మునిగాయి. జాతీయ రహదారికి వెళ్లే మార్గం కూడా వరద నీటిలో మునిగిపోయింది.

    పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారిందంటే.. సుమారు పది ఇళ్లు మొదటి అంతస్తు వరకు వరద నీరు చేరింది. ప్రాణాలు కాపాడుకునేందుకు బాధితులు ఇళ్ల పైఅంతస్తులు, డాబాలపైకి చేరుకున్నారు.

    వరద ఉద్ధృతి మరింత పెరిగితే ఇళ్లకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

    మరోవైపు, ఇచ్చాపురం 16వ నంబర్ జాతీయ రహదారిపై కూడా వరద తీవ్రత కనిపిస్తోంది. పలు చోట్ల వరద నీట్లో వాహనాలు చిక్కుకుపోయాయి.

    రైలు మార్గంలోనూ కొంతమేర పట్టాలు వరద నీట్లో మునిగిపోయాయి.

    వరద నీరు ఉప్పొంగడంతో బెల్లుపడలోని పలు ఇళ్లు నీట మునిగాయి
    ఫొటో క్యాప్షన్, వరద నీరు ఉప్పొంగడంతో బెల్లుపడలోని పలు ఇళ్లు నీట మునిగాయి
    ఇచ్చాపురం 16వ నంబర్ జాతీయ రహదారిపై కూడా వరద తీవ్రత కనిపిస్తోంది. వరద నీటిలో రెండు లారీలు చిక్కుకుపోయాయి.
    ఫొటో క్యాప్షన్, ఇచ్చాపురం 16వ నంబర్ జాతీయ రహదారిపై కూడా వరద తీవ్రత కనిపిస్తోంది. వరద నీటిలో రెండు లారీలు చిక్కుకుపోయాయి.
    ఒడిశాలో కురిసిన భారీ వర్షాలు కారణంగా వరదలు పోటెత్తాయి.
    ఫొటో క్యాప్షన్, ఒడిశాలో కురిసిన భారీ వర్షాలు కారణంగా వరదలు పోటెత్తాయి.
  6. చంటిబిడ్డను ఎత్తుకొని హాఫ్ మారథాన్‌ పూర్తి చేసిన కశ్మీరీ మహిళ.. ‘సైనికుడి భార్య జీవితం పోరాటమే’ అని ఆమె ఎందుకన్నారు

  7. అంతర్వేదీ తీరానికి కొట్టుకొచ్చిన భారీ షిప్

    అర్నబ్ తుపాను ప్రభావం కొనసాగుతున్న వేళ అంతర్వేది తీరానికి ఒక భారీ షిప్ రావడం చర్చనీయాంశంగా మారింది.

    సాంకేతిక సమస్యల కారణంగానే ఈ ఓడ వచ్చిందని కోస్టుగార్డు అధికారులు చెబుతున్నారు. విశాఖ నుంచి సింగపూర్ బయల్దేరిన ఈ షిప్, తుపాను ధాటికి ఇలా తీరానికి కొట్టుకు వచ్చిందని అంటున్నారు.

    ఇందులో ఉన్న సిబ్బందిని కోస్ట్‌గార్డ్ దళాలు కాపాడాయి.

  8. ‘ప్రతి పెట్టుబడికి నాదీ భరోసా’ ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబ‌ల్ స‌మ్మిట్ -2026 క‌ర్టెన్‌ రైజ‌ర్ కార్య‌క్ర‌మంలో సీఎం రేవంత్‌రెడ్డి

    తెలంగాణ‌ రైజింగ్‌లో భాగ‌స్వాములు కావాల‌ని అంత‌ర్జాతీయ‌ పారిశ్రామిక‌వేత్త‌లను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.

    హైద‌రాబాద్ భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీలో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వ‌హించ‌నున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 స‌న్నాహ‌క కార్య‌క్ర‌మాన్ని దిల్లీలో నిర్వ‌హించారు.

    కార్య‌క్ర‌మానికి కేంద్ర వాణిజ్య‌, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ముఖ్య‌మంత్రిరేవంత్ రెడ్డి మాట్లాడుతూ పారిశ్రామికాభివృద్ధికి అవ‌స‌ర‌మైన విధాన నిర్ణయాలు, ప్రభుత్వ సహకారం అందించేందుకు వ్యక్తిగతంగా కృషి చేస్తానని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అంత‌ర్జాతీయ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.

    పారిశ్రామిక‌వేత్త‌లు త‌మ‌ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రభుత్వం నుంచి ఏం కావాలో చెప్పాలని, విధానపరమైన మార్పుల నుంచి అవసరమైన సహకారం వరకు అన్నింటినీ అందించేందుకు వ్యక్తిగతంగా తాను బాధ్యత తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

    "2047 నాటికి 'వికసిత్ భారత్' లక్ష్యాన్ని సాధించేందుకు భారతీయులందరూ కలిసి కృషి చేయాలి. ప్రస్తుతం మనం దసరా, కర్వా చౌత్, దీపావళి వంటి పండుగల సీజన్‌లో ఉన్నాం. ఈ సమ్మిట్ మనకు మరో పండుగ వంటిది. 700 ఏళ్లకు పైగా క్రితమే, కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు సముద్ర వాణిజ్యానికి సంబంధించి 'మోటుపల్లి శాసనం'ను జారీ చేశారు" అని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు.

    ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబ‌ల్ స‌మ్మిట్ -2026 క‌ర్టెన్‌ రైజ‌ర్ కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి హామీ
    ఫొటో క్యాప్షన్, ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబ‌ల్ స‌మ్మిట్ -2026 క‌ర్టెన్‌ రైజ‌ర్ కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి హామీ
  9. వందేళ్లపైబడిన చెట్లు కూడా కూలిపోయాయి

    వీడియో క్యాప్షన్, వందేళ్ల పైబడి వయసున్న చెట్లు అర్నబ్ తుపాను తీవ్రతకు కూలిపోాయాయి.

    అర్నబ్ తుపాను నర్సాపురం పట్టణంపై తీవ్ర ప్రభావం చూపింది.

    చిరంజీవితో పాటు మరికొందరు ప్రముఖులు చదువుకున్న పట్టణంలోని వైఎన్ కాలేజీ తుపాను వల్ల తీవ్రంగా నష్టోయింది.

    వందేళ్లపైబడిన చెట్లు కూడా తుఫాన్ తీవ్రతకు కూకటివేళ్లతో సహా పడిపోయాయి.

  10. పాదాలలో తిమ్మిరి, సూదులతో గుచ్చినట్టు మంట.. ఇవి డయాబెటిక్ పెరిఫరల్ న్యూరోపతి లక్షణాలా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

  11. తుపాన్లు ఎక్కువవుతున్నాయా, లేక వాటి తీవ్రత పెరుగుతోందా? తుపాను, హరికేన్, టైఫూన్ మధ్య తేడా ఏమిటి?

  12. కాకినాడ తీరంలో గల్లంతైన మత్స్యకారులు సురక్షితం

    కాకినాడ తీరంలో గల్లంతైన మత్స్యకారులు సురక్షితం
    ఫొటో క్యాప్షన్, కాకినాడ తీరంలో గల్లంతైన మత్స్యకారులు సురక్షితం

    కాకినాడ జిల్లాలోని తీర ప్రాంతంలో మత్స్యకారులకు చెందిన బోటు మంగళవారం బోల్తా పడింది.

    ఈ ఘటనలో గల్లంతైన మత్స్యకారులను రెస్క్యూ సిబ్బంది కాపాడి ఒడ్డుకు చేర్చారు.

    తాళ్లరేవు మండలం చొల్లంగిపేటకు చెందిన ముగ్గురు మత్స్యకారులు వేటకు వెళ్లారని.. వారు వెళ్తున్న బోటు సముద్రంలో బోల్తా పడడంతో వారంతా ఈదుకుంటూ వెళ్లి హోప్ ఐలాండ్‌కు చేరుకున్నారని అధికారులు చెప్పారు.

    దీనికి సంబంధించిన సమాచారం మత్స్యశాఖ, ఆర్టీజిఎస్, విపత్తుల నిర్వహణ సంస్థలకు చేరింది.

    వెంటనే అప్రమత్తమై రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది 10 బోట్ల సహాయంతో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. చివరకు ఇవాళ వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

  13. ‘గత 30 ఏళ్లలో ఇంత తీవ్రమైన గాలులు చూడలేదు’.. అర్నబ్ తుపాను తీవ్రతను వివరించిన 88 ఏళ్ల వృద్ధుడు

  14. అండమాన్‌కు సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడినట్టు ప్రకటించిన ఐఎండీ

    అండమాన్‌కు సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడినట్టు ప్రకటించిన ఐఎండీ
    ఫొటో క్యాప్షన్, అండమాన్‌కు సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడినట్టు ప్రకటించిన ఐఎండీ

    దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాలపై అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని ఐఎండీ పేర్కొంది.

    ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతుందని తెలిపింది.

    దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకుని ఉన్న అండమాన్ & నికోబార్ దీవులపై ప్రభావం చూపుతుంది. మరో 24 గంటల్లో ఇది వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది.

    మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో విధ్వంసం సృష్టించిన అర్నబ్ తుపాను ఇప్పుడు అల్పపీడనంగా మారింది.

    ఆంధ్రప్రదేశ్, దాన్ని ఆనుకొని ఉన్న దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఈశాన్య తెలంగాణ ప్రాంతాల మీదుగా గంటకు 22 కిలోమీటర్ల వేగంతో దాదాపు ఉత్తరం వైపు కదిలుతోంది.

    గురువారం ఉదయం 5.30 గంటలకు, దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఆనుకొని ఉన్న దక్షిణ ఒడిశా వద్ద కేంద్రీకృతమై ఉంది.

    ఇది జగదల్‌పూర్ (ఛత్తీస్‌గఢ్)కు పశ్చిమాన సుమారు 20 కిలోమీటర్లు, భవానీపట్నానికి (ఒడిశా) నైరుతి దిశలో 170 కిలోమీటర్లు, టిట్లాగఢ్ (ఒడిశా)కు నైరుతి దిశలో 210 కిలోమీటర్లు, రాయ్‌పూర్‌కు దక్షిణాన 250 కిలోమీటర్ల దూరంలో ఉంది.

    ఇది ఉత్తరం వైపు కదులుతూ సాయంత్రానికి బలహీనపడి స్పష్టమైన అల్పపీడన ప్రాంతంగా మారే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.

  15. జియో: చౌక ఇంటర్నెట్ కాలం ముగియనుందా? మొబైల్ రీచార్జ్‌ ధరలు పెరుగుతాయా

  16. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

    కాసేపట్లో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన
    ఫొటో క్యాప్షన్, తుపాను కారణంగా అనేక చోట్ల వరి పంట నేలవాలింది.

    అర్నబ్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం పర్యటించనున్నారు.

    మధ్యాహ్నం కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరులో పంటలు పరిశీలిస్తారు. అక్కడే రైతులతో మాట్లాడుతారు. అనంతరం తుపాను షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్న ముంపు బాధితులతో మాట్లాడనున్నారు.

    అంతకంటే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుపాను కారణంగా ఇళ్లు, పంటలు, దుకాణాలు,ఇతర ఆస్తులు నష్టపోయిన వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సీఎం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం- సీఎం చంద్రబాబు ముంపు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరిన బాధితులకు 25కిలోల బియ్యం అందించాలని ఆదేశించినట్లు చెప్పారు.

    చేనేత కార్మికులు, మత్స్యకారులకు 50 కిలోల బియ్యంతోపాటు కిలో చొప్పున ఉల్లి, వంటనూనె, కందిపప్పు అందిస్తామని ప్రకటించారు. షెల్టర్ క్యాంపుల్లో ఆశ్రయం పొందిన వారికి రూ.1,000చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు.

    పంట నష్టాన్ని మినహాయించి,ఇతర నష్టాలకు సంబంధించి అర్హులైన బాధితులకు గురువారం నుంచే ఆర్థిక సాయం అందించేలా చర్యలు చేపడతామని చెప్పారు. సుమారు 30వేల మంది క్షేత్రస్థాయి అధికారులు,సిబ్బందితో టెలి కాన్ఫరెన్సుల ద్వారా నిరంతరం సమన్వయం చేసుకున్నామని తెలిపారు.

    కాసేపట్లో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన
    ఫొటో క్యాప్షన్, కాసేపట్లో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన
  17. కోనసీమలో అర్నబ్ తుపాను బీభత్సం

    కోనసీమలో అర్నబ్ తుపాను బీభత్స దృశ్యాలు
    ఫొటో క్యాప్షన్, కోనసీమలో అర్నబ్ తుపాను బీభత్స దృశ్యాలు

    కోనసీమలో అర్నబ్ తుపాను బీభత్సం సృష్టించింది.

    నేలకొరిగిన కొబ్బరి చెట్లు, విద్యుత్ స్తంభాలు, ధ్వంసమైన ఇళ్లు ఇక్కడ క్లిక్ చేసి చూడొచ్చు.

    డా.బీఆర్ అంబేడ్కర్ జిల్లాలో పలుచోట్ల భారీ గాలులతో కూడిన వర్షాలు కురిశాయి.

    మంగళవారం రాత్రి బాసర్లపూడిలో ఓ ఇంటి పైకప్పు ఎగిరిపోయింది.

    యానాం నుంచి అమలాపురం వెళ్లే మార్గంలో కొబ్బరిచెట్లు నేలకొరిగాయి.

    పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగి సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ శాఖ అధికారులు సరఫరా పునరుద్ధరించే పనులు చేపట్టారు.

  18. పశ్చిమగోదావరి జిల్లాల్లో సాయంత్రానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ- మంత్రి గొట్టిపాటి రవి ప్రకటన

    పశ్చిమగోదావరి జిల్లాల్లో సాయంత్రానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ
    ఫొటో క్యాప్షన్, పశ్చిమగోదావరి జిల్లాల్లో సాయంత్రానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ

    అర్నబ్ తుపాను ప్రభావంతో పశ్చిమగోదావరి జిల్లాలో దెబ్బతిన్న పంటల నష్టాలను తక్షణమే అంచనా వేసి, బాధిత రైతులకు అవసరమైన సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు మంత్రిగొట్టిపాటి రవి ప్రకటించారు.

    తుపాను సహాయక చర్యలు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణపై పశ్చిమగోదావరి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి, దెబ్బతిన్న 3,700 విద్యుత్ స్తంభాల మరమ్మతులు చేపట్టి, విద్యుత్ అంతరాయం ఏర్పడిన సుమారు 400 గ్రామాలకు గురువారం సాయంత్రంలోగా సరఫరాను పునరుద్ధరించాలని స్పష్టం చేశారు.

    తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు ఆటంకం కలగకుండా చూడటంతోపాటు, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలకు నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, బాధితులకు తక్షణ సహాయం అందిస్తూ సాధారణ పరిస్థితులు త్వరగా నెలకొనేలా అన్ని శాఖలు సమన్వయంతో అప్రమత్తంగా పనిచేయాలని స్పష్టం చేసినట్టు తెలిపారు.

  19. అర్నబ్ ప్రభావంతో ఒడిశాలోనూ వానలు

    అర్నబ్ ప్రభావంతో ఒడిశాలోనూ వానలు
    ఫొటో క్యాప్షన్, అర్నబ్ ప్రభావంతో ఒడిశాలోనూ వానలు

    అర్నబ్ తుపాను ప్రభావం ఒడిశాపై కూడా ఉంది. అందుకే అక్కడక్కడ ఇంకా వర్షాలు పడుతూనే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

    ఒడిశా రాష్ట్రంలో రాయగడ జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి ఏఎన్ఐతో మాట్లాడుతూ... గత 24 గంటల వ్యవధిలో రాయగడలో 40 మిమీ వర్షపాతం నమోదైందని తెలిపారు.

    ఇది ఊహించిన దానికంటే చాలా తక్కువని పేర్కొన్నారు.

    ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పెద్దగా ప్రమాదమేమీ లేదని, అయినప్పటికీ, అత్యంత అప్రమత్తంగా ఉన్నామని వెల్లడించారు.

    రాయగడలో ఇంకా కొంత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.

  20. తెలంగాణలోనూ వర్షాలు

    తెలంగాణ, అర్నబ్, ఆంధ్రప్రదేశ్, వాతావరణం
    ఫొటో క్యాప్షన్, తెలంగాణలోనూ వర్షాలు పడే అవకాశం

    తెలంగాణలో వాతావరణం పరిశీలిస్తే పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌లోనివాతావరణ శాఖ తెలిపింది.

    భద్రాద్రి గూడెం, ఖమ్మం, సూర్యపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

    ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

    మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటలకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది.