ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.5 నుంచి 8.1 శాతానికి తగ్గింపు

ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) వడ్డీ రేటును ప్రభుత్వం తగ్గించింది. 2021-22 సంవత్సరానికి ఈపీఎఫ్‌ వడ్డీ రేటును 8.1 శాతంగా ఆమోదించింది. గత నాలుగు దశాబ్దాలలో ఇదే కనిష్టం.

లైవ్ కవరేజీ

  1. ఆత్మగౌరవ భావన ఉన్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది – ప్రధాని మోదీ

    ప్రధాని మోదీ, దసరా, సంస్కృతి
    ఫొటో క్యాప్షన్, దిల్లీలో రావణ దహనం కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.

    దిల్లీ ఐపీ ఎక్స్‌టెన్షన్‌లోని డీడీఏ గ్రౌండ్‌లో నిర్వహించిన రావణ దహన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.

    ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఆ దేశ ప్రజల్లో ఆత్మగౌరవ భావన ఉండాలని ప్రధాని మోదీ అన్నారు.

    ఆత్మగౌరవాన్ని పెంపొందించడంలో దేశ వారసత్వ సంపద కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.

    వారసత్వాన్ని, గుర్తింపును పరిరక్షించుకోవడానికి భారత్ ప్రస్తుతం అంకితభావంతో పనిచేస్తోందని ప్రధాని మోదీ చెప్పారు.

    "శతాబ్దాలుగా మన వారసత్వ సంపదను దోచుకుని విదేశాలకు తరలించారు. కానీ ఇప్పుడు వాటిని తిరిగి మనదేశానికి తీసుకొస్తున్నాం’’ అని ఆయన చెప్పారు.

    12 ఏళ్లలో 650కి పైగా పురాతన విగ్రహాలను భారత్‌కు తిరిగి తీసుకొచ్చినట్టు ప్రధాని తెలిపారు.

    "భారత్‌లోని సాంస్కృతిక కేంద్రాలకు ప్రపంచవ్యాప్తంగా కొత్త గుర్తింపు తీసుకొస్తున్నాం. గత కొన్నేళ్లలో దేశంలోని అనేక ప్రదేశాలకు యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు లభించింది’’ అని ఆయన అన్నారు.

    గతేడాది దీపావళికి కూడా యునెస్కో మానవాళి అమూర్త సాంస్కృతిక వారసత్వ జాబితాలో చోటు లభించిందని చెప్పారు.

    "ఇది కోట్లాది మంది భారతీయుల సమష్టి సంకల్పానికి ఫలితం" అని మోదీ అభివర్ణించారు. ఇదే నిబద్ధతతో దేశం భవిష్యత్తులోనూ ముందుకు సాగాలని అన్నారు.

    ‘‘ఇది విజయానికి ప్రతీక అయిన పండుగ. గెలుపును వేడుకగా జరుపుకునే సందర్భం’’ అని మోదీ పేర్కొన్నారు.

    శత్రువు ఎంత శక్తిమంతుడైనా సరే.. మనం సత్యం,మానవత్వంవైపు నిలబడితే చివరికి విజయం సాధిస్తామనే ధైర్యాన్ని ఈ పండుగ ఇస్తుందని అన్నారు.

    విజయదశమి అందించే ఈ సందేశం ఎప్పటినుంచో భారత మౌలిక భావనల్లో అంతర్భాగంగా ఉందని ప్రధాని మోదీ చెప్పారు.

  2. గరివిడి లక్ష్మి: ‘మూణ్నాలుగు జిల్లాలకు తెలిసిన నన్ను మొత్తం ప్రపంచానికి పరిచయం చేశారు’

  3. పుట్టిన రోజు సందడి తరువాత రాత్రి 9 గంటలకు అమ్మ పక్కన పడుకున్న ఆరేళ్ల పాప తెల్లారేసరికి మాయమైంది.. 8 రోజులైనా దొరకని ఆచూకీ

  4. కనిగిరి: మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి వచ్చిన మహిళ ఎందుకు ఏడ్చారు? మరో మహిళ పోలీసుల కాళ్లు ఎందుకు పట్టుకున్నారు?

  5. హైదరాబాద్: 1000 మందితో సెక్స్ చాటింగ్.. 82 మంది న్యూడ్ వీడియోలు, ఫోటోలు సేకరించిన ‘మహిళ’.. కానీ 'ఆమె' చివరికి 'అతడు' అని ఎలా తెలిసింది?

  6. ‘భారత్‌ను లక్ష్యంగా చేసుకున్నారు.. మనం అప్రమత్తంగా ఉండాలి’ - మోహన్ భగవత్

  7. దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు.. ఫోటోల్లో

  8. వందల కోట్ల రూపాయల విలువైన బ్రా ధరించిన కైలీ జెన్నర్‌పై జరుగుతున్న చర్చ ఏంటి?

  9. దసరా: మీకు పాలపిట్ట కనిపించిందా?

  10. సల్మాన్ నుంచి టైగర్ దాకా.. బాలీవుడ్ నటులపై దాడులతో ఆందోళన

  11. ట్రంప్ నిర్ణయంతో భారత్‌కు భారీ ఊరట, అమెరికాలో వ్యతిరేకత పెరగనుందా?

  12. ప్రేమ్ వత్సా: 8 డాలర్లతో కెనడా వెళ్లిన ఈ హైదరాబాద్ వ్యక్తి 52వేల కోట్లకు ఐడీబీఐ బ్యాంకును ఎలా కొన్నారు?

  13. తెలంగాణ: కాలేజీలో లైటింగ్ స్టాండ్ కూలి విద్యార్థిని మృతి,12మందికి గాయాలు

    దాండియా, ప్రమాదం
    ఫొటో క్యాప్షన్, ఎంవీఎస్ఆర్ కాలేజీలో దాండియా కార్యక్రమం జరిగింది.

    తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా నాదర్‌గుల్‌లోని ఎంవీఎస్ఆర్ కాలేజీలో దాండియా కార్యక్రమం సందర్భంగా ఏర్పాటుచేసిన లైటింగ్ స్టాండ్ కూలిపోవడంతో ఓ విద్యార్థిని మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారని ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది.

    “సాయంత్రం 7 నుంచి 8 గంటల మధ్య నాకు ఫోన్ వచ్చింది. ఎంవీఎస్ఆర్ కాలేజీలో దాండియా కార్యక్రమం జరుగుతోంది. బలమైన గాలులు వీచాయి. లైటింగ్, అలంకరణ కోసం ఏర్పాటు చేసిన స్తంభం ఒక్కసారిగా కూలిపోయింది. మీ బిడ్డ తలపై స్తంభం నేరుగా పడిందని నా స్నేహితుడు అశోక్ ఫోన్ చేసి చెప్పాడు. గాయం చిన్నదేనని, వెళ్లి చూడాలని చెప్పాడు. అయితే ఆస్పత్రి సిబ్బందిని అడిగితే.. ఆమెను ఆస్పత్రికి తీసుకొచ్చేసరికే మృతి చెందినట్లు తెలిపారు. సరైన భద్రతా చర్యలు తీసుకోలేదని, నిర్లక్ష్యం జరిగిందని కొందరు చెబుతున్నారు” అని మృతురాలి బంధువు సురేశ్ ఏఎన్ఐతో చెప్పారు.

    “సంగమం కార్యక్రమాలను ఏర్పాటు చేశాం. నిన్న సాంకేతిక, ఈ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాం. విద్యార్థుల ఆసక్తి, అభ్యర్థన మేరకు ముగింపు కార్యక్రమంగా దాండియా ఏర్పాటు చేశాం. విద్యార్థినులు నృత్యం చేస్తున్న ప్రాంతంలో స్టాండ్ పడటంతో ఈఈఈ విభాగానికి చెందిన సోనీ నారాయణ దాస్ అనే విద్యార్థినిని కోల్పోయాం. సుమారు తొమ్మిది మంది విద్యార్థులను ఆస్పత్రిలో చేర్చాం. యాజమాన్యం పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులకు అన్ని విధాలా అండగా ఉంటాం” అని కాలేజీ డైరెక్టర్ ప్రసన్న కుమార్ ఏఎన్ఐతో చెప్పారు.

    ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు ఏజెన్సీ రిపోర్ట్ చేసింది. మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి బాధ్యులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

  14. మార్కో రూబియో భారత పర్యటనలో దిల్లీ ఎందుకు లేదు, జై శంకర్ ఆయనను కలవడానికి ముంబయి వెళ్లడంపై విమర్శలు ఏంటి?

  15. కోల్‌కతా: దుర్గా పూజా మండపం వద్ద తొక్కిసలాట.. 19 మంది మృతి

  16. బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రానికి ఒంటరిగా ఆడ తాబేలు సుదీర్ఘ యాత్ర.. చివరికి ఆ ఆలివ్ రిడ్లే ఏమైంది?

  17. గరివిడి లక్ష్మి: వెండితెరపై బుర్రకథ ఎలా ఉంది?

  18. రష్యాపై అమెరికా ఆంక్షలను అడ్డుకున్న ట్రంప్

    డోనల్డ్ ట్రంప్
    ఫొటో క్యాప్షన్, రష్యాపై ఆంక్షల బిల్లుపై సెప్టెంబరులోనే డోనల్డ్ ట్రంప్ సంతకం చేశారు, ఆదివారం నుంచి అమల్లోకి రావాల్సి ఉంది.

    యుక్రెయిన్‌పై యుద్దం చేస్తున్న రష్యాను శిక్షించడానికి అమెరికా కాంగ్రెస్ ఇటీవల ఆమోదించిన రష్యా ఆంక్షల చట్టంలోని పలు ఆంక్షలను అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తన అధ్యక్ష అధికారంతో అడ్డుకున్నారు.

    ఈ ఆంక్షలలో కొన్నింటిని నిలిపివేయడం అమెరికా జాతీయ ప్రయోజాల దృష్ట్యా అవసరమమని శుక్రవారం రాత్రి జారీచేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులలో ట్రంప్ పేర్కొన్నారు.

    ఈ ఆంక్షల బిల్లుపై ట్రంప్ సెప్టెంబర్‌లోనే సంతకం చేయడంతో అది చట్టంగా మారి ఆదివారం నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా శుక్రవారం రాత్రి ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు.

    నవంబర్‌లో జరగబోయే మధ్యంతర ఎన్నిక కంటే ముందే అమెరికాలో ఇంధన ధరలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా రష్యా నుంచి డీజిల్‌ను దిగుమతి చేసుకోనున్నట్లు ట్రంప్ ప్రకటించిన కొన్ని రోజులకే ఈ నిర్ణయం వెలువడింది. ఈ నవంబర్ ఎన్నికలే కాంగ్రెస్‌పై ఏ పార్టీ నియంత్రణ కలిగి ఉంటుందో నిర్ణయిస్తాయి.

    ట్రంప్ తాజా నిర్ణయాన్ని అటు రిపబ్లికన్లు, ఇటు డెమెక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకించారు.

    ఈ ఆంక్షల చట్టానికి దివంగత రిపబ్లికన్ సౌత్ కరోలినా సెనేటర్ లిండ్సే గ్రాహం పేరు పెట్టారు, ఆయన జూలై 11న మరణించడానికి ముందు అమెరికాలో యుక్రెయిన్‌కు బలమైన మద్దతుదారుగా ఉన్నారు.

    ఈ చట్టం ప్రధానంగా రష్యా ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకుంది. అలాగే రష్యా నుంచి చమురు, గ్యాస్‌లను ఎక్కువగా కొనుగోలు చేసే మొదటి ఐదు దేశాలపై ముఖ్యంగా చైనా భారత్‌లపై 100 శాతం వరకు సుంకాలను విధించే విస్తృత అధికారాలను ట్రంప్‌కు కల్పించింది.

    అదనంగా, ఈ చట్టంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, రష్యా ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు, బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థలతో పాటు ప్రస్తుత ఆంక్షల నుండి తప్పించుకోవడానికి రష్యా ఉపయోగిస్తున్న రహస్య నౌకాదళంపై కూడా ఆంక్షలు ఉన్నాయి.

    అమెరికాకు చెందిన 20 మంది ప్రజాప్రతినిధుల ఉమ్మడి బృందం అక్టోబర్ 18 నుండి అమలులోకి రానున్న ఈ కొత్త చట్టాన్ని గౌరవించాలని కోరుతూ గురువారం ట్రంప్‌కు ఒక లేఖ రాసింది.

  19. గుండెలో బ్లాకేజీ ఉన్నవారందరికీ యాంజియోప్లాస్టీ అవసరమా? - 8 ప్రశ్నలు -జవాబులు