ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.5 నుంచి 8.1 శాతానికి తగ్గింపు

ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) వడ్డీ రేటును ప్రభుత్వం తగ్గించింది. 2021-22 సంవత్సరానికి ఈపీఎఫ్‌ వడ్డీ రేటును 8.1 శాతంగా ఆమోదించింది. గత నాలుగు దశాబ్దాలలో ఇదే కనిష్టం.

లైవ్ కవరేజీ

  1. నేడు చంద్రబాబుతో విజయ్ సమావేశం-నదీ జలాలపై చర్చలు, నదుల అనుసంధానంపై నేడు ఏపీ, తమిళనాడు ముఖ్యమంత్రుల భేటీ

    నదీ జలాల పంపిణీ, అనుసంధానంపై నేడు ఏపీ, తమిళనాడు ముఖ్యమంత్రుల భేటీ
    ఫొటో క్యాప్షన్, నేడు చంద్రబాబుతో విజయ్ సమావేశం

    మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 2.30 గం.లకు విజయ్ తన క్యాంప్ ఆఫీస్ నుంచి బయల్దేరుతారు. సుమారు 4 గంటల సమయానికి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 4.10 గంటలకు విజయవాడ కనక దుర్గ ఆలయాన్ని సందర్శిస్తారు. దర్శనం తర్వాత 6 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి చేరుకుంటారు.

    గోదావరి-కావేరీ నదుల అనుసంధానం, కృష్ణా జలాల విడుదలపై చంద్రబాబుతో చర్చిస్తారు. అనంతరం ఇద్దరూ కలిసి విజయవాడలో జరుగుతున్న ఉత్సవ్‌ కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో విజయవాడ నుంచి తిరిగి తమిళనాడుకు బయల్దేరి వెళ్తారు విజయ్.

  2. రియాద్‌లో దాడులు: హైదరాబాదీ మృతి

  3. సీజేపీ నిరసన ప్రదర్శనల రిపోర్టింగ్‌లో జర్నలిస్టులకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి?

  4. జంతర్ మంతర్ ఇక నిరసనల వేదిక కాదు: దిల్లీ పోలీసులు

    దిల్లీ ప్రదర్శనలు,  జంతర్ మంతర్
    ఫొటో క్యాప్షన్, దిల్లీలో నిరసన ప్రదర్శనలకు చేపట్టేందుకు జంతర్ మంతర్‌కు బదులుగా మూడు ప్రత్యామ్నాయ ప్రదేశాలను ఎంపిక చేసినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు.

    దిల్లీలో నిరసనలు, ధర్నాలు నిర్వహించడానికి నిర్దేశించిన ప్రదేశాల జాబితా నుంచి జంతర్ మంతర్‌ను తొలగించారు .

    కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

    దిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ దీని గురించి నోటీస్ జారీ చేశారు.

    జంతర్ మంతర్‌కు బదులుగా తూర్పు దిల్లీలోని రామ్‌లీలా మైదాన్, బురారీ మైదాన్, సీబీడీ మైదాన్‌లలో నిరసనలు చేపట్టవచ్చని ఆ నోటీస్‌లో తెలిపారు.

    “పౌరులకు నిరసనలు, ప్రదర్శనలు నిర్వహించే హక్కును దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుతం ఉన్న నిర్దేశిత స్థలాలకు ప్రత్యామ్నాయాలను సమీక్షించే బాధ్యతను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీకి అప్పగించారు” అని ఆ నోటీస్‌లో పేర్కొన్నారు.

    ఈ మూడు ప్రదేశాలలో నిరసనలు, ధర్నాలు నిర్వహించడానికి విడివిడిగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ విడుదల చేస్తామని ఆ నోటీసులో పేర్కొన్నారు.

  5. జ్ఞానేశ్‌ కుమార్‌ను వదిలేది లేదు. వేచి చేస్తున్నాం: రాహుల్ గాంధీ

    రాహుల్ గాంధీ, నరేంద్రమోదీ, జ్ఞానేశ్ కుమార్
    ఫొటో క్యాప్షన్, నరేంద్రమోదీ ప్రభుత్వం జ్ఞానేశ్ కుమార్‌ను రక్షించేందుకు మిగతా వ్యవస్థలను కూడా దుర్వినియోగం చేస్తోందని రాహుల్ అన్నారు.

    ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌ కుమార్ అవినీతి గురించి తనకు తెలుసని, ఆయన్ను వదిలేది లేదని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు.

    “ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అడిగిన ప్రశ్నలనే మేం కూడా అడుగుతున్నాం. జ్ఞానేశ్ కుమార్ ఎందుకు రాజీనామా చేయడం లేదు? జ్ఞానేశ్ కుమార్ జీ.. మీ పరిస్థితేంటో మాకు తెలుసు. మీకు నిద్ర పట్టడం లేదు. మేం మిమ్మల్ని వదిలిపెట్టం. మీరు తప్పించుకోలేరు. మీ గతం మీ అవినీతి గురించి మాకు తెలుసు. మేం కేవలం వేచి చేస్తున్నాం” అని రాహుల్ గాంధీ అన్నారు.

    దిల్లీలో నిరసనకారులపై జరుగుతున్న పోలీసు చర్యల గురించి రాహుల్ స్పందిస్తూ, ప్రభుత్వం చాలా పెద్ద తప్పు చేస్తోందని అన్నారు.

    “ఓట్ల చోరీకి వ్యతిరేకంగా దిల్లీలో చాలా రోజులుగా నిరసనలు జరుగుతున్నాయి. అసలు ప్రశ్న ఏమిటంటే దిల్లీని ఎందుకు జైలుగా మార్చారు? నగరంలోకి రాకుండా ప్రజలను అడ్డుకుంటున్నారు. రైళ్లు, బస్సుల్లోనే వారిని నిలిపివేస్తున్నారు. ప్రభుత్వం చాలా పెద్ద తప్పు చేస్తోంది” అన్నారు.

  6. బీజేపీ వ్యతిరేక ఓట్లనే తొలగిస్తున్నారు: రేవంత్ రెడ్డి

    కాంగ్రెస్ తెలంగాణ, రేవంత్ రెడ్డి
    ఫొటో క్యాప్షన్, సోమవారం జరగనున్న ర్యాలీ కోసం దిల్లీకి చేరుకున్న రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

    బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) అమలుచేసిన రాష్ట్రాలలోనే ఆ పార్టీ గెలిచిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

    సోమవారం జరగనున్న కాంగ్రెస్ పాదయాత్ర కోసం దిల్లీకి చేరుకున్న రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

    "ముఖ్యంగా బీజేపీని వ్యతిరేకిస్తున్నది ఎవరంటే..దళితులు, ఆదివాసీలు, గిరిజనులు, మైనార్టీలు, యువత. బీజేపీని ఓడించాలనుకున్న ప్రజల ఓటు హక్కును తొలగించడానికి కుట్ర చేశారు. జ్ఞానేశ్‌కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని కమిషన్ సభ్యులు చెప్పారు. తప్పులు జరుగుతున్నాయని తెలిసినపుడు, ఆ అధికారిని తొలగించడానికి మోదీకి అభ్యంతరం ఏమిటి?, ఆయనకు అండగా ఎందుకు నిలబడుతున్నారు" అని రేవంత్ రెడ్డి అన్నారు.

  7. ఒమన్‌ సమీపంలో భారతీయ సిబ్బంది ఉన్న ట్యాంకర్‌పై డ్రోన్‌ దాడి

    ఒమన్, భారత నౌకలపై డ్రోన్ దాడి
    ఫొటో క్యాప్షన్, ఇద్దరు భారతీయులు గల్లంతైనట్లు కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్‌ ఆదివారం రాత్రి ధ్రువీకరించారు (ప్రతీకాత్మక చిత్రం).

    ఒమన్‌ సమీపంలో భారతీయ సిబ్బంది ఉన్న ట్యాంకర్‌పై ఆదివారం డ్రోన్‌ దాడి జరిగింది. నౌకలో ఉన్న 11 మంది భారతీయ నావికుల్లో తొమ్మిది మందిని రక్షించగా.. మరో ఇద్దరు గల్లంతయ్యారు. ఇద్దరు నావికులు కనిపించకుండా పోయిన విషయాన్ని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్‌ ఆదివారం రాత్రి ధ్రువీకరించారు.

    "అక్టోబర్ 11న సోహార్ యాంకరేజ్ వద్ద భారతీయ ట్యాంకర్ ఎం.టి. పెట్రో డాల్ఫిన్‌పై డ్రోన్ దాడి జరిగింది. ట్యాంకర్‌పై 11 మంది భారతీయ నావికులు ఉన్నారు. తొమ్మిది మందిని రక్షించారు, ఇద్దరు గల్లంతయ్యారు" అన్నారు.

    స్థానిక తీర రక్షక దళం గాలింపు, సహాయక చర్యలు చేపట్టిందని మంత్రి వివరించారు.

    గల్లంతైన వారిని గుర్తించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, సహాయక చర్యలకు పూర్తి మద్దతు అందించేందుకు సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని సర్బానంద సోనోవాల్‌ పేర్కొన్నారు.

  8. సీజేపీ: బాండ్‌పై సంతకం చేస్తే నిరసనలకు దూరంగా ఉంచగలరా? చట్టం ఏం చెబుతోంది?

  9. యువత ఆగ్రహం ఎవరి మీద? ఎన్నికల సంఘంపైనా, మోదీ పైనా?

  10. నేహా బోరా గురించి దర్శకుడు దేవా కట్టా ట్వీట్

    దేవా కట్టా, నేహా బోరా
    ఫొటో క్యాప్షన్, దేవా కట్టా

    అఖిల భారత విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా గురించి టాలీవుడ్ దర్శకుడు దేవా కట్టా 'ఎక్స్' వేదికగా స్పందించారు.

    "ఆమెతో మీరు ఏకీభవించవచ్చు, లేకపోవచ్చు... ఆమె పోరాట స్ఫూర్తితో మీరు మమేకం కావచ్చు, కాకపోవచ్చు... కానీ, మన రాజకీయాలు, రాజకీయ నాయకుల నేరపూరిత, నిరంకుశ పోకడలు సాధారణ విషయంగా మారిపోతుండటంపట్ల ఆమె వ్యక్తం చేస్తున్న ఆక్రోశం, ఆగ్రహాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతే... అప్పుడు నిజమైన 'యాంటీ-నేషనల్’ మీరే!!" అంటూ ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

  11. సీజేపీ ఆందోళనలు: పోలీసులు విమానంలోకి వచ్చి అరెస్టు చేయవచ్చా?

  12. ‘పోలీసులు మా ఫోన్లు లాక్కున్నారు, న్యాయవాదితో మాట్లాడే అవకాశం ఇవ్వలేదు’

    కాక్రోచ్ జనతాపార్టీ, దిల్లీ ఆందోళనలు, నిర్బంధం
    ఫొటో క్యాప్షన్, విలేఖరుల సమావేశంలో ప్రసంగిస్తున్న సీజేపీ నాయకులు

    పోలీసుల నిర్బంధం నుంచి విడుదలైన కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు నేరుగా ప్రధాని మోదీపై విమర్శల దాడి చేశారు.

    అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ రత్నా సింగ్ విలేఖరుల సమావేశంలో ప్రసంగించారు.

    నాయనమ్మ మృతి చెందడంతో అభిజీత్ దీప్కే స్వగ్రామానికి వెళ్లడంతో ఆయన ఈ సమావేశంలో పాల్గొనలేదు.

    “భారతదేశ చరిత్రలోనే నరేంద్ర మోదీ అత్యంత పిరికి ప్రధానమంత్రి” అని అశుతోష్ రాంకా అన్నారు.

    “ఇదే ప్రభుత్వం నీరవ్ మోదీ, విజయ్ మాల్యాలను విమానంలో ఎక్కించి దేశం నుంచి పంపించివేసింది. మమ్మల్ని మాత్రం విమానం నుంచి దించేసింది” అని సౌరవ్ దాస్ ఆరోపించారు.

    “మమ్మల్ని తీసుకెళ్లేటప్పుడు పోలీసులు మాకెలాంటి నోటీసులు ఇవ్వలేదు. మాఫియా డాన్లలా వచ్చి మమ్మల్ని తీసుకుపోయారు. మా ఫోన్లను బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్లను మహిళా పోలీసులు తీసుకున్నారు. కానీ ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదు” అని ఆయన అన్నారు.

    “నన్ను ఆర్‌కే పురంలో అశుతోష్‌ను బల్లభ్‌గఢ్‌కు, అభిజీత్‌ను కూడా ఎక్కడికో తీసుకువెళ్లారు. మమ్మల్ని తీసుకువెళ్తున్నప్పుడు, మా న్యాయవాదితో మాట్లాడటం మా ప్రాథమిక హక్కు అని అడిగా. కానీ నిర్బంధంలో ఉన్నప్పుడు ఎలాంటి హక్కులు ఉండవని మాకు చెప్పారు. నిరసనకారులతో దిల్లీ పోలీసులు ఇంకెంత క్రూరంగా వ్యవహరించారో” అని సౌరవ్ దాస్ అన్నారు.

    “మా ఫోన్‌ను ఏం చేశారోనని మాకు ఆందోళనగా ఉంది. మా ఫోన్‌ను క్లోన్ చేశారని అనుమానంగా ఉంది. రేపు మా ఫోన్‌ను క్లోన్ చేసి సాక్ష్యంగా సమర్పిస్తారు” అని సౌరవ్‌దాస్ అన్నారు.

  13. చీర ధరించి 1600 మీటర్ల పరుగు పందాన్ని 9 నిమిషాల్లో పూర్తి చేసిన కవిత..

  14. భారత టెక్ దిగ్గజాలపై అమెరికా చర్యలు: గ్రీన్ కార్డుల జారీలో తీవ్ర ఆలస్యం తప్పదా?

  15. ‘నా కోచ్‌లో మగవాళ్లు మద్యం తాగుతున్నారు’ అంటూ కుటుంబ సభ్యులకు చెప్పిన అస్సాం యువతి తర్వాతి రోజు శవంగా కనిపించారు..

  16. తనిఖీలు,నిర్బంధాలు,ఇంటర్‌నెట్ బంద్, ఎక్కడికక్కడ బారికేడ్లు.. దిల్లీలో ఇప్పటిదాకా ఏం జరిగింది, బీజేపీ ఏమంది?

  17. ముకేశ్ అంబానీని 'ప్రధానమంత్రి' అంటూ కామెంట్ చేసిన ఎలాన్ మస్క్, వీరి మధ్య వివాదం ఏంటి?

  18. "రైలు ఎక్కి తనిఖీలు చేశారు, పోలీసుల నిర్బంధాలు చూస్తే భయమేస్తోంది"-తెలుగు రాష్ట్రాల యువకులు ఇంకా ఏం చెప్పారు?

  19. కాక్రోచ్ జనతా పార్టీ నిరసన నేపథ్యంలో 250కి పైగా రైళ్లు రద్దు

    రైల్వే స్టేషన్ (ఫైల్ ఫోటో)
    ఫొటో క్యాప్షన్, రైల్వే స్టేషన్ (ఫైల్ ఫోటో)

    కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసన ప్రదర్శన నేపథ్యంలో, న్యూదిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే 250కి పైగా రైళ్లను అధికారులు రద్దు చేశారు.

    పీటీఐ వార్తాసంస్థ కథనం ప్రకారం, అక్టోబర్ 9న మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఆయా ప్రారంభ స్టేషన్ల నుంచి బయలుదేరాల్సిన ప్యాసింజర్ రైళ్లను రైల్వేబోర్డు ఆదేశాల మేరకు రద్దు చేశారు.

    అంతేకాకుండా, అక్టోబర్ 10న ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య న్యూదిల్లీ లేదా హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్‌కు చేరుకోవాల్సిన రైళ్లు కూడా రద్దయ్యాయి.

    రైల్వే మాజీ అధికారులు, ప్రయాణికుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఈ చర్యను తప్పుబట్టాయి.

    "ఇంత భారీ సంఖ్యలో రైళ్లను రద్దు చేయడం ఆందోళనకారుల ముందు తలవంచడమే" అని రైల్వే బోర్డు మాజీ సభ్యుడు (ఇంజనీరింగ్) సుబోధ్ జైన్ పేర్కొన్నారు.

    దేశంలోని ఏదైనా ప్రాంతంలో నిరసనలు లేదా ఉద్యమాల కారణంగా ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దు కావడం తన అనుభవంలో లేదని ఆల్ ఇండియా రైల్వేమెన్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి శివ్ గోపాల్ మిశ్రా పీటీఐతో అన్నారు.

    అకస్మాత్తుగా రైళ్లు రద్దు కావడం వల్ల వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

    మరోవైపు, దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) కూడా 57 మెట్రో స్టేషన్ల ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను మూసివేసింది.

  20. జంతర్‌ మంతర్ నిరసన: ముందస్తు అరెస్టులు, భారీ సంఖ్యలో కేంద్ర బలగాలు