మీరు ఈ వెబ్‌సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్‌సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.

నన్ను ప్రధాన వెబ్‌సైట్‌కు తీసుకెళ్లండి

వైఎస్ వివేకా హత్య కేసు: అవినాష్ రెడ్డిని 25 వరకు అరెస్టు చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

తనను అరెస్టు చేయకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిలు వ్యాజ్యంపై వరుసగా రెండో రోజు మంగళవారం తెలంగాణ హైకోర్టులో విచారణ సాగింది.

లైవ్ కవరేజీ

  1. ‘2024 ఎన్నికలు అక్రమం’ - మాక్ పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ

  2. రాప్తాడు: తరగతి గదిలోకి వచ్చి రంపంతో విద్యార్థినిపై దాడి.. అసలేం జరిగింది?

    రాప్తాడులోని జడ్పీ హైస్కూల్లో తరగతి గదిలో పాఠాలు జరుగుతుండగా ఓ వ్యక్తి ఎలక్ట్రిక్ రంపంతో ప్రవేశించి ఓ బాలికపై దాడి చేశాడు. నిందితుడి కోసం గాలిస్తున్నట్టు అనంతపురం ఎస్పీ జగదీశ్ బీబీసీకి చెప్పారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక్కడ క్లిక్ చేసి పూర్తి కథనం చదవండి

  3. రాప్తాడు: తరగతి గదిలోకి వచ్చి రంపంతో విద్యార్థినిపై దాడి.. అసలేం జరిగింది?

  4. ఖర్గే నివాసంలో ‘మాక్ పార్లమెంట్’, జ్ఞానేశ్ కుమార్‌పై ‘ప్రజా అభిశంసన’

    ఇండియా కూటమితో పాటు ఇతర ప్రతిపక్షాలు కూడా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌పై ఆరోపిస్తున్నాయి. ఈ ప్రక్రియ కారణంగా దాదాపు 13 కోట్ల మంది ఓటర్ల పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించారని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఇది ప్రజల ప్రజాస్వామిక హక్కులపై నేరుగా జరిగిన దాడిగా ఆరోపిస్తున్నాయి. మరిన్ని వివరాలు ఇక్కడ క్లిక్ చేసి చదవండి

  5. జస్టిస్ ఫర్ జెహన్నే: 15వ శతాబ్దపు లైంగిక దాడి బాధితురాలి న్యాయపోరాటం ఏమైంది?

  6. ఆంధ్రప్రదేశ్‌ను 'బిహార్ ఆఫ్ సౌత్' అంటూ ఉత్తరాది రాష్ట్రంతో ఎందుకు పోలుస్తున్నారు?

    ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చెలరేగిన హింసాత్మక ఘటనలపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ మొదలైంది. ''ఏపీని దక్షిణాది బిహార్‌గా మార్చేశారు'' అంటూ ట్రోలింగ్, విమర్శలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.‌ హింసాత్మక ఘటనల ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఏపీ, బిహార్ మధ్య పోలికలు పెడుతూ కామెంట్లు పెడుతున్నారు.పూర్తి కథనం కోసం ఇక్క క్లిక్ చేయండి.

  7. ఆంధ్రప్రదేశ్‌ను 'బిహార్ ఆఫ్ సౌత్' అంటూ ఉత్తరాది రాష్ట్రంతో ఎందుకు పోలుస్తున్నారు?

  8. 'రామాయణ' సినిమాలో సీతగా నటించిన సాయిపల్లవిపై ఆన్‌లైన్‌లో విమర్శలేంటి?

  9. ఇమ్మోర్టల్ జెల్లీఫిష్: చంపినా మళ్లీ పుట్టే ఈ జీవిలాగా మనుషులు కూడా మారొచ్చా? పరిశోధకులు ఏం చేస్తున్నారు?

  10. జీఎస్‌ఎల్‌వీ ద్వారా కక్ష్యలోకి చేరిన ఎన్‌వీఎస్‌-03 నావిగేషన్ ఉపగ్రహం

    శ్రీహరికోట నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్18 రాకెట్ ద్వారా ఎన్‌వీఎస్-03 నావిగేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు ఇస్రో ప్రకటించింది.

    శుక్రవారం శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్18 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.ఈ రాకెట్ ఎన్‌వీఎస్-03 ఉపగ్రహాన్ని విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి చేర్చింది.

    జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్18/ఎన్‌వీఎస్-03 ప్రయోగం విజయవంతం కావడంతో శ్రీహరికోటలోనిసతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఇస్రో శాస్త్రవేత్తలుఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు.

    తదుపరి తరం నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థలో ఎన్‌వీఎస్-03 మూడో ఉపగ్రహం. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ సిరీస్ ద్వారా అందించే నావిగేషన్ సేవలను నిరంతరాయంగా కొనసాగించేందుకు దీన్ని రూపొందించారు.

    దేశానికి స్థానం, నావిగేషన్, సమయ నిర్ధరణ సేవలను స్వతంత్రంగా పొందే అవకాశం కల్పించే వ్యూహాత్మక ఉపగ్రహం ఇదని ఇస్రో చీఫ్ డాక్టర్ వి. నారాయణన్ అన్నారు.

    నావిగేషన్ ఉపగ్రహాలను సాధారణ ప్రజలకు ఉపయోగపడే పనుల కోసం కూడా వినియోగిస్తారని ఆయన తెలిపారు. రైళ్లను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడంతో పాటు వాహనాలు, సముద్ర నౌకల కదలికలను పర్యవేక్షించేందుకు ఇవి ఉపయోగపడతాయని చెప్పారు. 'వన్ నేషన్ వన్ టైమ్' ప్రాజెక్టులోనూ ఈ ఉపగ్రహం కీలక భాగమని వివరించారు.

    'గగన్' వ్యవస్థతో కలిసి నావిగేషన్ సేవలు అందించడం ద్వారా ప్రపంచ నావిగేషన్ వ్యవస్థలో భారత్ తన వంతు పాత్ర పోషిస్తోందని ఇస్రో చీఫ్ పేర్కొన్నారు.

  11. జస్టిస్ కౌల్ రాసిన పుస్తకంలో మాజీ సీజేఐ చంద్రచూడ్‌ గురించి ఏముంది?

  12. మనీషా భన్వాలా: ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళ రికార్డు

    ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో 59 కిలోల విభాగంలో స్వర్ణ పతకం గెలిచి, ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా మనీషా భన్వాలా నిలిచారు.

    కజకిస్థాన్ రాజధాని అస్తానాలో శుక్రవారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌లో అమెరికాకు చెందిన అబిగైల్ నెట్‌ను 8-6 తేడాతో ఓడించారు.

    ఒలింపిక్స్‌లో లేని ఈ వెయిట్ కేటగిరీలో మనీషా తన పోరును ప్రీ క్వార్టర్ ఫైనల్‌తో ప్రారంభించారు. ఈ దశలో కెనడాకు చెందిన లారెన్స్ బ్యూత్రెగార్డ్‌ను విక్టరీ బై ఫాల్ పద్ధతిలో ఓడించారు.

    క్వార్టర్ ఫైనల్‌లో మంగోలియాకు చెందిన బొలోర్తుయా ఖురెల్ఖూను 6-0 తేడాతో ఓడించారు. ఆ తర్వాత సెమీఫైనల్‌లో స్థానిక రెజ్లర్ అల్టిన్ షగయేవాను సాంకేతిక ఆధిక్యంతో ఓడించి ఫైనల్‌కు చేరుకున్నారు. దీంతో హరియాణాకు చెందిన మనీషా ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో స్వర్ణ పతకం సాధించారు.

    ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన రెండో భారత రెజ్లర్‌గా మనీషా నిలిచారు. అంతకుముందు 2010లో మాస్కోలో జరిగిన పోటీల్లో సుశీల్ కుమార్ 66 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించారు.

    ప్రస్తుత చాంపియన్‌షిప్‌లో మహిళల విభాగంలో పతకాలు సాధించిన నాలుగో భారత రెజ్లర్ మనీషా. ఆమె కంటే ముందు నీలం సిరోహి (50 కిలోలు), కాజల్ ధోచక్ (76 కిలోలు) రజత పతకాలు సాధించగా, తనూ శర్మ (72 కిలోలు) కాంస్య పతకం గెలుచుకున్నారు.

  13. ‘వన్డేల్లో వారికి చోటు ఇవ్వకపోవడం అన్యాయమే’: యువరాజ్ సింగ్

    అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ వంటి ఆటగాళ్లకు వన్డే జట్టులో రెగ్యులర్ స్థానం ఇవ్వకపోవడం వారి ప్రతిభకు అన్యాయం చేయడమేనని భారత మాజీ ఆల్-రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డారు.

    ముంబయిలో ఆయన పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ , "నిజం చెప్పాలంటే, అభిషేక్ శర్మ వన్డేలు ఆడటం చూడాలని కోరుకుంటున్నా. ఇషాన్ కిషన్, అభిషేక్ వైభవ్ సూర్యవంశీ వంటి ఆటగాళ్లను 50 ఓవర్ల క్రికెట్‌లో ఎంపిక చేయకపోతే, ఎక్కడో ఒకచోట మనం వారి ప్రతిభకు న్యాయం చేయడం లేదని అర్థం అని నేను గతంలోనే చెప్పా’’ అన్నారు.

    "మన దగ్గర కొంతమంది అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. , వారికి జట్టులో స్థానం సంపాదించడం కష్టమని నాకు తెలుసు. కానీ ఈ ఆటగాళ్లు రాణిస్తున్న తీరు చూస్తుంటే, వారికి త్వరలోనే జట్టులో స్థానం లభిస్తుందని ఆశిస్తున్నా" అన్నారు.

    ఈ ఆటగాళ్లు సాధించినదంతా వారి కఠోర శ్రమతోనే సాధ్యమైందని, ఆ ఘనత వారికే దక్కుతుందని యువరాజ్ అన్నారు.

  14. క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్ బైనాన్స్‌పై సైబర్ దాడి : హైజాకర్ల చేతిలో 6.3 బిలియన్ డాలర్ల క్రిప్టో కరెన్సీ

    ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్ అయిన బైనాన్స్‌పై సైబర్ ఎటాక్ జరిగింది. ఈ దాడిలో 6.3 బిలియన్ డాలర్ల విలువైన (దాదాపు 53వేల కోట్లరూపాయల విలువైన) క్రిప్టో కరెన్సీని హ్యాక్ చేశారు. చరిత్రలో ఇదే అతిపెద్ద హ్యాకింగ్‌ ఘటనగా భావిస్తున్నారు.

    హ్యాకింగ్‌కు గురైన ఆస్తుల్లో కొంత మొత్తాన్నితిరిగి స్వాధీనం చేసుకునే ప్రయత్నాలను ప్రారంభించినట్టు బైనాన్స్ తెలిపింది. మిగిలిన ఆస్తుల్లో చాలా వరకు ఇంకా హ్యాకర్ల చేతుల్లోనే ఉన్నాయి. ఈ ఘటన వల్ల జరిగిన నష్టాన్ని పూర్తిగా భరిస్తామని సంస్థ తెలిపింది.

    ఓ ఇంజినీర్‌ ల్యాప్‌టాప్‌ హ్యాకింగ్‌కు గురవడం ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని బైనాన్స్ వెల్లడించింది. దీని ద్వారా హ్యాకర్‌ అనుమతి లేకుండా డబ్బును విత్‌డ్రా చేసుకునే అవకాశం పొందినట్టు తెలిపింది.

    ఉత్తర కొరియాకు చెందిన 'ట్రేడర్‌ట్రెయిటర్‌' అనే హ్యాకింగ్‌ బృందం దీని వెనక ఉందని రెండు సంస్థలు ఆరోపించాయి.

    ఈ హ్యాకింగ్‌కు ఉత్తర కొరియాతో ఉన్న సంబంధాలపై బీబీసీ అడిగిన ప్రశ్నలకు బైనాన్స్ నేరుగా సమాధానం ఇవ్వలేదు. అయితే నేరస్తుల గుర్తింపును నిర్ధరించి వారిని చట్టం ముందు నిలబెట్టేందుకు తాము దర్యాప్తు సంస్థల భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నామని తెలిపింది.

  15. ‘పిల్లలకు చదువు చెప్పడంలో న్యాయం చేయలేకపోతున్నాం’.. దేశంలో లక్షకుపైగా ఏకోపాధ్యాయ పాఠశాలలు

  16. ఆదర్శ కుటుంబం- ఏకే 47 మూవీ రివ్యూ: వెంకటేశ్,త్రివిక్రమ్ కాంబో మ్యాజిక్ చేసిందా?

  17. అంతర్వేది తీరానికి చేరిన భారీ ఓడకు ఏమైంది? ఒడ్డుకు సమీపంలో ఎలా చిక్కుకుంది? అందులో ఏం ఉంది

  18. ‘పాతికేళ్ల కుర్రాళ్లకూ పక్షవాతం రావొచ్చు’.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి

  19. తెలంగాణలో నాలుగు రోజులపాటు వానలు, వాతావరణ శాఖ లేటెస్ట్ బులెటిన్

    ఇవాళ వర్షం కురిసే జిల్లాలు: సిద్ధిపేట, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, ములుగు, జనగాం, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం,

    రేపు(31 అక్టోబర్ 2026)వర్షం కురిసే జిల్లాలు: సిద్ధిపేట, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, ములుగు, జనగాం, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, నాగర్‌ కర్నూల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి,

    ఎల్లుండి(1 నవంబర్ 2026)వర్షం కురిసే జిల్లాలు: తెలంగాణ వ్యాప్తంగా చెదురుమదురు వానలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది

    సోమవారం(2 నవంబర్ 2026 )వర్షం కురిసే జిల్లాలు: కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాల్ పల్లి జిల్లాల్లో వానలు పడతాయని మిగతా జిల్లాల్లో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

  20. ‘నేను కుప్పకూలే వరకు నాలో ఆ లోపం ఉందనే విషయం తెలియదు’