మీరు ఈ వెబ్‌సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్‌సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.

నన్ను ప్రధాన వెబ్‌సైట్‌కు తీసుకెళ్లండి

కేజ్రీవాల్‌ను మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి అనుమతించిన కోర్టు

దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను మార్చి 28వ తేదీ వరకు ఈడీ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది.

లైవ్ కవరేజీ

  1. రూ. 450.42 కోట్ల భారీ ధరకు అమ్ముడుపోయిన డైనోసార్ అస్థిపంజరం... ఏమిటి దీని ప్రత్యేకత?

  2. SIRలో తొలగించిన పేర్లున్న భారీ బ్యానర్‌తో ర్యాలీకి హాజరైన కార్యకర్తలు

    దిల్లీలోని రామ్ లీలా మైదాన్‌లో జరుగుతున్న ప్రతిపక్ష కూటమి ర్యాలీకి ఉదయం నుంచే కార్యకర్తలు రావడం మొదలైంది.

    అయితే, మధ్యాహ్నం అక్కడ వైవిధ్యభరితమైన దృశ్యం ఆవిష్కృతమైంది.

    సర్ ప్రక్రియలో ఓటర్ల జాబితా నుంచి తొలగించిన పేర్లు ముద్రించిన బ్యానర్లతో కొంతమంది కార్యకర్తలు నిరసన ప్రదేశానికి చేరుకున్నారు .

    ‘‘ఒక్క రాష్ట్రంలోనే లక్షల మంది పేర్లను తొలగించారు. కార్యకర్తలు బ్యానర్లపై తొలగించిన ఆ పేర్లను ముద్రించుకుని రామ్‌లీలా మైదాన్‌కు చేరుకుంటున్నారు’’ అని సోషల్ మీడియా ఎక్స్‌లో కర్ణాటక కాంగ్రెస్ సోషల్ మీడియా మాజీ హెడ్ శ్రీవత్స ట్వీట్ చేశారు.

    ‘‘జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసేవరకు ఊరుకోం’’

    'వోట్ బచావో దేశ్ బచావో ర్యాలీ'కి వచ్చిన ప్రజలను ఉద్దేశించి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రసంగించారు.

    ఆయన ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌లను లక్ష్యంగా చేసుకున్నారు.

    "ప్రధాని మోదీ తన శిష్యుడిని ఇక్కడ నిలబెట్టి అందరి ఓట్లను చీల్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించడానికే మేం అందరం ఇక్కడికి వచ్చాం. ఆయనను పదవి నుంచి తొలగించే వరకు మేం విశ్రమించం’’ అని ఖర్గే అన్నారు.

  3. విద్యార్థుల బర్త్ డే పార్టీ : 'పోలీసు సైరన్ విని భయంతో పరుగులు, ఇద్దరు విద్యార్థుల మృతి’ - అసలేం జరిగింది?

  4. మురసు తుపాను: సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటన రద్దు, అధికారులతో సమీక్ష

    పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడే అవకాశమున్న ‘మురసు’ తుపాను ప్రభావంపై ఆదివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. రాష్ట్రంపై తుపాను ప్రభావం, వర్షాలు, గాలుల అంచనా, జలాశయాల పరిస్థితిపై చర్చించారు. మురసు తుపాను నేపథ్యంలో ఆయన తన దిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు.

    విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం ప్రకారం..నవంబరు 2 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు అంచనా. నవంబరు 3న ఉదయం బాపట్ల సమీపంలో తీవ్ర తుపానుగా తీరం దాటే అవకాశం

    • తీరం దాటే సమయంలో గంటకు 100–110 కిలోమీటర్ల వేగంతో గాలులు
    • నవంబరు 2న దక్షిణ, మధ్య కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, అక్కడక్కడ అతిభారీ వర్షాలు.
    • నవంబరు 3, 4 తేదీల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు
    • అత్యంత భారీ వర్షాల అంచనా ఉన్న 20 మండలాల్లో ఏలూరు జిల్లాలో 9, కృష్ణాలో 5, ఎన్టీఆర్‌లో 5, బాపట్లలో ఒక మండలం ఉన్నాయి.
    • నవంబరు 3న జిల్లా సగటు వర్షపాతం ఏలూరులో సుమారు 179 మిల్లీ మీటర్లు, కృష్ణాలో 163, ఎన్టీఆర్‌లో 161, పశ్చిమ గోదావరిలో 147, గుంటూరులో 119, బాపట్లలో 104 మిల్లీమీటర్ల వర్షపాతం ఉండవచ్చని అంచనా
    • బుడమేరు వద్ద నవంబరు 3న సుమారు 32,500 క్యూసెక్కుల ప్రవాహం రావచ్చని అంచనా. ఎర్రకాల్వ, గోనెలవాగు, జల్లేరు, పంపా తదితర జలాశయాల్లో భారీ వరదకు అవకాశం
    • బలమైన గాలుల వల్ల 12 జిల్లాల్లో సుమారు 12,102 నుంచి 15,128 విద్యుత్‌ స్తంభాలు దెబ్బతినే అవకాశం ఉన్నట్లు ముందస్తు అంచనా
  5. ఏపీ వైపు ముంచుకొస్తున్న ‘మురసు’ తుపాను

    బంగాళాఖాతంలో మురసు తుపాను గడిచిన ఆరు గంటల్లో గంటకు 23 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.

    ప్రస్తుతం చెన్నైకి 560 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 660 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 640 కిలోమీటర్లు, నెల్లూరుకు 630 కిలోమీటర్లు, ఒంగోలుకు 680 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది.

    ఇది రేపు ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉంది.

    రేపు అర్ధరాత్రి నుంచి ఎల్లుండి తెల్లవారుజాము మధ్య నెల్లూరు, నరసాపురం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ పీఎల్ఎన్ మూర్తి తెలిపారు.

    తుపాను ప్రభావంతో రానున్న మూడు రోజులు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

    మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

  6. దిల్లీ: రామ్‌లీలా మైదాన్ వద్ద నేడు ప్రతిపక్షాల ర్యాలీ.. దిల్లీలో పరిస్థితిని చూపే 9 ఫోటోలు..

  7. రామ్‌లీలా: కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఇక్కడ చేస్తున్న ఆందోళన లక్ష్యం ఏంటి? బీజేపీ ఏం చేస్తోంది?

  8. సంక్షోభాలు వస్తే ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎలా సిద్ధమవుతున్నారు? ఏం చేస్తున్నారు?

  9. ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థలకు ప్రారంభమైన పోలింగ్

    ఆంధ్రప్రదేశ్‌లో 92 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.

    13 నగరపాలక సంస్థలు (మున్సిపల్ కార్పొరేషన్లు), 79 పురపాలక సంస్థలు/నగర పంచాయతీలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి.

    ఎన్నికల అధికారులు పోలింగ్ ఏర్పాట్లను పూర్తి చేయగా, పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చూసేందుకు పోలీసులు సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

    ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

  10. సీఈసీ రాజీనామా కోరుతూ నేడు దిల్లీలో ప్రతిపక్షాల భారీ ర్యాలీ

    దేశ రాజధాని దిల్లీలో ప్రతిపక్షాలు ఆదివారం(నేడు) భారీ ర్యాలీ నిర్వహించనున్నాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని, ఎన్నికల సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ జరిగే ఈ ర్యాలీకి వేలాది మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు.

    ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పిలుపునిచ్చిన ఈ ర్యాలీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో రామ్‌లీలా మైదానంలో ప్రారంభం కానుంది. దీనికి పది లక్షల మంది వరకు హాజరయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

    కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి చెందిన పలువురు కీలక నాయకులు ఈ ర్యాలీలో పాల్గొంటామని ప్రకటించారు. 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) కూడా ఈ ర్యాలీకి మద్దతు ప్రకటించింది.

    దేశవ్యాప్తంగా ముసాయిదా ఓటర్ల జాబితాల నుంచి 13 కోట్ల పేర్లను తొలగించిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ(ఎస్ఐఆర్)పై విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ర్యాలీ జరగనుంది.

    మరణించినవారు, తమ నమోదిత చిరునామాల నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయినవారి పేర్లను తొలగించి ఓటర్ల జాబితాను నవీకరించడమే ఈ ప్రక్రియ ఉద్దేశమని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) చెబుతోంది.

    అయితే, ఈ ర్యాలీకి కాంగ్రెస్ ఎంచుకున్న రోజు సరైనది కాదని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభిప్రాయపడింది.

    "వారు నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అయితే, నవంబర్ 1న ఈ ర్యాలీ నిర్వహించడాన్ని కూటమి నాయకులు కూడా ఇష్టపడలేదు. ఎందుకంటే దిల్లీ చరిత్రలో నవంబర్ 1 అత్యంత సున్నితమైన రోజు. 1984 అక్టోబర్ 31న ఇందిరా గాంధీ హత్యకు గురయ్యారు. ఆ తర్వాత నవంబర్ 1న దిల్లీలో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. సిక్కు సోదరులపై దాడులు జరిగాయి. రక్తపాతం చోటుచేసుకుంది.అలాంటి రోజునే రాహుల్ గాంధీ ర్యాలీకి ఎంచుకున్నారు" అని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు.

  11. ‘భారత్‌లో పేదరికం తగ్గింది, కానీ..’

  12. ‘2024 ఎన్నికలు అక్రమం’ - మాక్ పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ

  13. రాప్తాడు: తరగతి గదిలోకి వచ్చి రంపంతో విద్యార్థినిపై దాడి.. అసలేం జరిగింది?

    రాప్తాడులోని జడ్పీ హైస్కూల్లో తరగతి గదిలో పాఠాలు జరుగుతుండగా ఓ వ్యక్తి ఎలక్ట్రిక్ రంపంతో ప్రవేశించి ఓ బాలికపై దాడి చేశాడు. నిందితుడి కోసం గాలిస్తున్నట్టు అనంతపురం ఎస్పీ జగదీశ్ బీబీసీకి చెప్పారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక్కడ క్లిక్ చేసి పూర్తి కథనం చదవండి

  14. రాప్తాడు: తరగతి గదిలోకి వచ్చి రంపంతో విద్యార్థినిపై దాడి.. అసలేం జరిగింది?

  15. ఖర్గే నివాసంలో ‘మాక్ పార్లమెంట్’, జ్ఞానేశ్ కుమార్‌పై ‘ప్రజా అభిశంసన’

    ఇండియా కూటమితో పాటు ఇతర ప్రతిపక్షాలు కూడా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌పై ఆరోపిస్తున్నాయి. ఈ ప్రక్రియ కారణంగా దాదాపు 13 కోట్ల మంది ఓటర్ల పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించారని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఇది ప్రజల ప్రజాస్వామిక హక్కులపై నేరుగా జరిగిన దాడిగా ఆరోపిస్తున్నాయి. మరిన్ని వివరాలు ఇక్కడ క్లిక్ చేసి చదవండి

  16. ఇంటి నుంచి బయలుదేరి మూడు దశాబ్దాలు, కాలినడకనే ఖండాలు దాటిన సాహసికుడు

  17. జస్టిస్ ఫర్ జెహన్నే: 15వ శతాబ్దపు లైంగిక దాడి బాధితురాలి న్యాయపోరాటం ఏమైంది?

  18. పాకిస్తాన్ ప్రధానిపై ట్రోలింగ్- 'టాస్ గెలిచినా అభినందనలు చెబుతారేమో' అంటూ వ్యాఖ్యలు చేస్తున్న యూజర్లు

  19. ఆంధ్రప్రదేశ్‌ను 'బిహార్ ఆఫ్ సౌత్' అంటూ ఉత్తరాది రాష్ట్రంతో ఎందుకు పోలుస్తున్నారు?

    ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చెలరేగిన హింసాత్మక ఘటనలపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ మొదలైంది. ''ఏపీని దక్షిణాది బిహార్‌గా మార్చేశారు'' అంటూ ట్రోలింగ్, విమర్శలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.‌ హింసాత్మక ఘటనల ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఏపీ, బిహార్ మధ్య పోలికలు పెడుతూ కామెంట్లు పెడుతున్నారు.పూర్తి కథనం కోసం ఇక్క క్లిక్ చేయండి.

  20. ఆంధ్రప్రదేశ్‌ను 'బిహార్ ఆఫ్ సౌత్' అంటూ ఉత్తరాది రాష్ట్రంతో ఎందుకు పోలుస్తున్నారు?