అసెంబ్లీ ఎన్నికలు -2026 : తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఓటమి

తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజార్టీతో ఆయనపై విజయం సాధించారు. వీఎస్ బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్‌కు 74,202 ఓట్లు దక్కాయి.

సారాంశం

లైవ్ కవరేజీ

  1. జుల్ఫికర్ అలీ భుట్టో: ‘నేను భారత పౌరుడిని’ అంటూ బెనజీర్ భుట్టో తండ్రి భారతీయ కోర్టుల్లో ఎందుకు పోరాడారు?

  2. తీరం దాటిన అర్నబ్ తుపాన్.. ఏపీలో భారీ వర్షాలు

    అర్నబ్ తుపాను
    ఫొటో క్యాప్షన్, అర్నబ్ తుపాను

    రాత్రి 2 నుంచి ఉదయం 8 గంటల మధ్య యానానికి నైరుతిగా(నరసాపురం వైపు) తీరం దాటిందని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది.

    తీరం దాటిన తర్వాతే తీవ్ర తుపానుగా బలహీనపడిన అర్నబ్ ప్రభావంతో రాష్ట్రమంతటా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.పూర్తి కథనం లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  3. తీరం దాటిన అర్నబ్ తుపాన్.. ఏపీలో భారీ వర్షాలు

  4. అర్నబ్ బీభత్సం - నీట మునిగిన శ్రీకాకుళం బస్టాండ్

    అర్నబ్ తుపాను శ్రీకాకుళం జిల్లాలోనూ బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురుగాలులతోపాటు భారీ వర్షం కురియడంతో శ్రీకాకుళం బస్టాండ్ నీట మునిగింది. బుకింగ్ కౌంటర్లలోకి నీరు చేరడంతో ఆర్టీసీ సిబ్బంది అవస్థలు పడ్డారు.

    శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో పరిస్థితి
    ఫొటో క్యాప్షన్, శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో పరిస్థితి
    నీటిలో మునిగిన శ్రీకాకుళం ఆర్టీసీ బస్టాండ్
    ఫొటో క్యాప్షన్, నీటిలో మునిగిన శ్రీకాకుళం ఆర్టీసీ బస్టాండ్
    నీట మునిగిన శ్రీకాకుళం డిపో వన్ బుకింగ్ కౌంటర్స్
    ఫొటో క్యాప్షన్, శ్రీకాకుళం డిపో వన్ బుకింగ్ కౌంటర్స్‌లోకి చేరిన వర్షపు నీరు
    అర్నబ్ తుపాను ప్రభావంతో ఉద్ధృతంగా వీస్తున్న గాలి
    ఫొటో క్యాప్షన్, అర్నబ్ తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో ఉద్ధృతంగా వీస్తున్న గాలి
  5. అర్నబ్ తుపాను బీభత్సం - కూకటివేళ్లతో చెట్లను పెకిలించేంత గాలి...

  6. కాకినాడ: ఇళ్లలోకి చొచ్చుకొచ్చిన సముద్రపునీరు

    ఇళ్లలోకి చొచ్చుకొచ్చిన సముద్రపు నీరు
    ఫొటో క్యాప్షన్, ఇళ్లలోకి చొచ్చుకొచ్చిన సముద్రపు నీరు

    కాకినాడపై అర్నబ్ తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. జగన్నాధపురం గోలీల పేట, ఇందిరా నగర్, ముత్తా నగర్ వరకు సముద్రపు నీరు చొచ్చుకొస్తోంది.

    సముద్రపు నీరు చేరడంతో ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి వెళ్ళిపోతున్నారు.

  7. అర్నబ్ తుపానుతో పంటలకు తీవ్ర నష్టం: అమిత్ షాకు సీఎం లేఖ

    అమిత్‌ షాకు చంద్రబాబు లేఖ
    ఫొటో క్యాప్షన్, అమిత్‌ షాకు చంద్రబాబు లేఖ

    కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. అర్నబ్ తుపాను తీవ్రతను గుర్తించి నష్టాలను అంచనా వేసేందుకు కేంద్ర బృందాలను త్వరగా పంపించాలని విజ్ఞప్తి చేశారు.

    తుపాను వేళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను అమిత్ షాకు చంద్రబాబు వివరించారు.

    ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ప్రాణ నష్టం లేకుండా చూశామని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు.

    ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఉన్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఇతర కేంద్ర సిబ్బంది సహాయం మరింత కాలం అందించాలని విజ్ఞప్తి చేశారు.

  8. స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లోకి జియో ఫ్లాట్‌ఫామ్స్.. ధర ఎంతంటే?

    ఇవాళ స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశించిన జియో ప్లాట్‌ఫామ్
    ఫొటో క్యాప్షన్, ఇవాళ స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశించిన జియో ప్లాట్‌ఫామ్

    నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్‌కు చెందిన ఒక్కో షేరు రూ. 1,358 చొప్పున లిస్ట్ అయ్యింది.

    ఈ సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇషా అంబానీ మాట్లాడుతూ, 1977లో రిలయన్స్ తొలి పబ్లిక్ ఇష్యూకి వచ్చినప్పుడు తన తండ్రి ముఖేష్ అంబానీ ఎంతో శ్రమించారని తెలిపారు.రిలయన్స్‌ను సామాన్య ప్రజల వద్దకు తీసుకెళ్లాలనే నిర్ణయాన్ని మా తాత ధీరూభాయ్ అంబానీ తీసుకున్నారు. ఆ సమయంలో కంపెనీ రూ. 10 కోట్ల వాల్యుయేషన్‌తో రూ. 2.82 కోట్లు సమీకరించింది" అన్నారు.

    జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ స్టాక్ మార్కెట్ లిస్టింగ్ కోసం జరిగిన గంట మోగించే కార్యక్రమానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ నీతా అంబానీ, ఎన్‌ఎస్‌ఈ ఎండీ & సీఈఓ ఆశిష్ చౌహాన్ హాజరయ్యారు.

  9. నరసాపురం సమీపంలో తీరం దాటిన అర్నబ్ తుపాను

    నరసాపురం సమీపంలో తీరం దాటిన అర్నబ్ తుపాను
    ఫొటో క్యాప్షన్, నరసాపురం సమీపంలో తీరం దాటిన అర్నబ్ తుపాను

    అర్నబ్ తుపాను నర్సాపురానికి సమీపంలో తీరాన్ని దాటినట్టు ఆంధ్రప్రదేశ్ విపత్తుల సంస్థ ప్రకటించింది.

    రాత్రి 2 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య యానాంకు నైరుతిగా, నర్సాపురం సమీపంలో తీరం దాటినట్టు కొద్దిసేపటి కిందట ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఎక్స్ వేదికగా ప్రకటించారు.

    తీరం దాటిన తర్వాత ప్రస్తుతం ఈ తుపాను బలహీనపడిందని తెలిపారు. అర్నబ్ తీరం దాటినప్పటికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

    దీని ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ప్రఖర్ జైన్ తెలిపారు.

  10. ‘నర్సాపురం-యానాం మధ్య తీరాన్ని తాకిన అర్నబ్ తుపాను’

    అర్నబ్ తీవ్ర తుపాను తీరాన్ని తాకింది
    ఫొటో క్యాప్షన్, అర్నబ్ తీవ్ర తుపాను తీరాన్ని తాకింది

    ఈ తీవ్ర తుపాను నర్సాపురం, యానాం మధ్య ప్రాంతంలో తీరాన్ని తాకినట్టు మూర్తి ఏఎన్ఐకి చెప్పారు.

    అర్నబ్ తుపాను పూర్తిగా తీరం దాటేందుకు మరో రెండు మూడు గంటల సమయం పడుతుందని ఆయన పేర్కొన్నారు.

    "ప్రస్తుతం ఈ తీవ్ర తుపాను నర్సాపురం, యానాం మధ్య తీర ప్రాంతంలో ఉంది. ఇది గంటకు మూడు కిలోమీటర్ల అతి తక్కువ వేగంతో కదులుతోంది. తుపాను కేంద్రం ఇప్పటికే తీరాన్ని తాకింది. పూర్తిగా తీరం దాటడానికి ఒకటి నుంచి రెండు గంటలు, లేదా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టవచ్చు. తీరం దాటిన తర్వాత, ఈ తుపాను ఉత్తర-వాయవ్య దిశగా పయనించే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 125 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి, ఇవి గంటకు 140 కిలోమీటర్ల వేగం వరకు కూడా ఉండవచ్చు. తీరం దాటిన తర్వాత ఈ గాలుల తీవ్రత క్రమంగా తగ్గుతుంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల తీవ్రత ఈ సాయంత్రం వరకు కొనసాగుతుంది; సాయంత్రం నుంచి వర్షాల తీవ్రత నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంది, అదే సమయంలో గాలుల వేగం కూడా క్రమంగా తగ్గుతుంది" అని తెలిపారు.

  11. అర్నబ్ తుపాను తీవ్రతను చూపే 11 ఫోటోలు

  12. ’24 గంటల్లో విద్యుత్ పునరుద్ధరణ, తెలంగాణ సాయం కోరాం ’ బీబీసీతో ఏపీ విద్యుత్‌శాఖా మంత్రి గొట్టిపాటి

    ఆంధ్రప్రదేశ్ విద్యుత్‌శాఖ మంత్రి  గొట్టిపాటి రవి కుమార్
    ఫొటో క్యాప్షన్, వర్షాలు తగ్గిన 24 గంటల్లోనే విద్యుత్‌ను పునరుద్ధరిస్తామన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్

    అర్నబ్ తుపాను ప్రభావం తగ్గిన 24 గంటల్లోనే అన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ను పునరుద్ధరిస్తామని ఏపీ విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ బీబీసీకి ఫోన్ ద్వారా తెలిపారు.

    తుపాను ప్రభావం ప్రస్తుతానికి ఏపీసీపీడీసీఎల్‌పై ఎక్కువ ప్రభావం చూపుతున్నందున తెలంగాణ సాయం కోరినట్టు మంత్రి తెలిపారు. విద్యుత్ పునరుద్ధరణకు అవసరమైన సామాగ్రి, మానవ వనరులు అందించాలని తెలంగాణ విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్‌తో మాట్లాడామన్నారు. అవసరమైతే ఆ శాఖ మంత్రితో కూడా చర్చిస్తామని గొట్టిపాటి పేర్కొన్నారు.

    ఇలాంటి సమయంలో పొరుగుల రాష్ట్రాలతో సమన్వయం చేసుకొని ముందుకు సాగడం తమ విధానంలో భాగమని మంత్రి తెలిపారు. గతంలో తమిళనాడు సహాయం తీసుకున్నామని, ఇప్పుడు తెలంగాణ హెల్ప్ కోరామని వివరించారు.

    ముందు జాగ్రత్తగా తుపాను ప్రభావిత ప్రాంతాలకు 15000లకుపైగా విద్యుత్ స్తంభాలు, ఇతర సామాగ్రిని తరలించామని మంత్రి తెలిపారు. తుపాను ప్రభావం శ్రీకాకుళం జిల్లా మొదలు కొని, కృష్ణా జిల్లా వరకు ఉంటుందన్నారు. ప్రస్తుతానికి వర్షాలు తగ్గకపోవడంతో పనులకు ఆటంకం కలుగుతోందని చెప్పారు. అయినా సరే విశాఖలో విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తి చేశామని, ఇప్పుడు అక్కడి సిబ్బందిని, సామాగ్రిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నామని అన్నారు.

    దాదాపు నాలుగు వందల వరకు ఫీడర్స్‌లో విద్యుత్ సరఫరా నిలిపివేసినట్టు మంత్రి వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ తీగలు తెగి సరఫరాకు అంతరాయం ఏర్పడితే మరికొన్ని చోట్ల ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అధికారులే సప్లై నిలిపివేశారని పేర్కొన్నారు. వర్షాలు తగ్గుముఖ పట్టిన వెంటనే గంటల వ్యవధిలోనే పునరుద్ధరణ పనులు పూర్తి చేస్తామని, అంత వరకు ప్రజలు విద్యుత్ తీగలు పట్టుకోవడం, స్తంభాలను తాకడం చేయవద్దని సూచించారు.

  13. ‘మధ్యాహ్నానికి గాలుల వేగం తగ్గే అవకాశం’ : ఏపీ వాతావరణ శాఖ

    అర్నబ్ తుపాను ప్రస్తుతానికి ఒకే చోట నిలిచి ఉందని, ఒకట్రెండు గంటల్లో తీరందాటుతుందని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం చెప్పారు.
    ఫొటో క్యాప్షన్, అర్నబ్ తుపాను ప్రస్తుతానికి ఒకే చోట నిలిచి ఉందని, ఒకట్రెండు గంటల్లో తీరందాటుతుందని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం చెప్పారు.

    అర్నబ్ తుపాను ప్రస్తుతానికి ఒకే చోట నిలిచి ఉందని, ఒకట్రెండు గంటల్లో తీరం దాటుతుందని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం చెప్పారు. ఏఎన్ఐతో మాట్లాడిన ఆమె తుపాను తీరం దాటే సమయంలో 150 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పారు.

    "ప్రస్తుతం ఈ తుపాను తీవ్రతను గమనిస్తే, కోనసీమ, కాకినాడ పరిసర ప్రాంతాలతోపాటు ఇతర తీరప్రాంత జిల్లాల్లో గాలి వేగం గంటకు 125 నుంచి 135 కిలోమీటర్ల వరకు ఉంది. ఇది గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం తుపాను దాదాపు ఒకే చోట నిలిచి ఉంది. ఒకటి రెండు గంటల్లో ఇది తీరాన్ని దాటే అవకాశం ఉంది. రాబోయే కొద్ది గంటల్లో ఈ తుపాను తీరాన్ని దాటుతుందని అంచనా. ఆ తర్వాత దీని తీవ్రత తగ్గి, 'తీవ్ర తుపాను'గా మారుతుంది. మధ్యాహ్నానికి ఇది మరింత బలహీనపడి కేవలం 'తుపాను'గా మారే అవకాశం ఉంది. తీరాన్ని దాటే సమయంలో ఇది 'అత్యంత తీవ్ర తుపాను' స్థితిలో ఉంటుంది. కొన్ని గంటల తర్వాత గాలి వేగం గంటకు 90 నుంచి 120 కిలోమీటర్ల వరకు ఉండవచ్చు. మధ్యాహ్నానికి గాలి వేగం మరింత తగ్గి, గంటకు 60 నుంచి 70 కిలోమీటర్లకు చేరుకుంటుందని అంచనా" అని నాగరత్నం తెలిపారు.

  14. అర్నబ్ తుపాను: ఇవాళ, రేపు, ఎల్లుండి పలు రైళ్లు రద్దు

    అర్నబ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే
    ఫొటో క్యాప్షన్, అర్నబ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే

    అర్నబ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే దీనికి సంబంధించిన తాజా వివరాలతో ఒక ప్రకటన విడుదల చేసింది.

    దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన వివరాల ప్రకారం ఇవాళ రేపు రద్దు అయిన రైళ్ల వివరాలు ఇవే

    ఇవాళ రద్దు అయిన రైళ్లు (28 అక్టోబర్)

    • 12727 విశాఖపట్నం- సికింద్రాబాద్
    • 12739 విశాఖపట్నం- సికింద్రాబాద్
    • 17206 కాకినాడ పోర్టు- సాయినగర్ షిర్డీ
    • 12737 కాకినాడ పోర్టు – లింగంపల్లి
    • 20707 సికింద్రాబాద్- విశాఖపట్నం
    • 20708 విశాఖపట్నం- సికింద్రాబాద్
    • 20833 విశాఖపట్నం- సికింద్రాబాద్
    • 12787 నర్సాపురం- నాగర్‌సోల్
    • 17255 నర్సాపురం- లింగంపల్లి
    • 20834 సికింద్రాబాద్- విశాఖపట్నం

    రేపు రద్దు అయిన రైళ్లు(29 అక్టోబర్)

    • 12703 హౌరా- సికింద్రాబాద్ ట్రైన్
    • 17015 భువనేశ్వర్ – సికింద్రాబాద్
    • 22881 పుణె- భువనేశ్వర్
    • 17205 సాయినగర్ షిర్డీ- కాకినాడ పోర్ట్

    శుక్రవారం రద్దు అయిన రైళ్లు(30 అక్టోబర్)

    • 20809 సంబల్‌పూర్- హెచ్ఎస్ నాందేడ్
    • రీ షెడ్యూల్ అయిన రైళ్లు(బయల్దేరాల్సిన సమయానికి కంటే మూడు గంటలు ఆలస్యంగా నడుస్తాయి)
    • 12805 విశాఖపట్నం- లింగంపల్లి
    • 17221 కాకినాడ పోర్టు – ఎల్టీటీ ముంబై
    • 12806 లింగంపల్లి- విశాఖపట్నం
    • 18046 చర్లపల్లి- షాలీమర్
    • 18519 విశాఖపట్నం- ముంబై ఎల్టీటీ (నిన్న బయల్దేరాల్సిన రైలు ఇవాళ ఉదయం నాలుగు గంటలకు రీ షెడ్యూల్ చేశారు)
  15. అర్నబ్: నిలకడగా తుపాను తీరం దాటే ప్రక్రియ

    నిలకడగా కొనసాగుతున్న తుపాను తీరం దాటే ప్రక్రియ
    ఫొటో క్యాప్షన్, నిలకడగా కొనసాగుతున్న తుపాను తీరం దాటే ప్రక్రియ

    అర్నబ్ తుపాను తీరం దాటే ప్రక్రియ రెండుగంటలుగా నిలకడగా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.

    తీరం దాటే ప్రక్రియ నరసాపురానికి 30 కిమీ దూరంలోనే కేంద్రీకృతమై కొనసాగుతోందని తెలిపింది.

    తుపాను మధ్యాహ్ననికి పూర్తిగా తీరం దాటే అవకాశం ఉందని, తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు కొనసాగుతాయని, వర్షాలు కురుస్తాయని ఇవాళ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

  16. యానాంలో కుండపోత- నీటమునిగిన పలు ప్రాంతాలు

    యానాంలో కుండపోత- నీటమునిగిన పలు ప్రాంతాలు
    ఫొటో క్యాప్షన్, యానాంలో కుండపోత- నీటమునిగిన పలు ప్రాంతాలు

    యానాంలో మంగళవారం సాయంత్రం నుంచి ఏకధాటిగా వానలు పడుతున్నాయని బీబీసీ ప్రతినిధి గరికిపాటి ఉమాకాంత్‌ తెలిపారు.

    “ప్రస్తుతం నేను ఆంధ్రప్రదేశ్ కాకినాడ నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుదుచ్చేరి రాష్ట్రంలోని యానాంలో ఉన్నాను. నిన్నటి నుంచి ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తూనే ఉంది. రాత్రి 4 గంటల తర్వాత గాలుల ప్రభావం ఉన్నప్పటికీ వర్షం జోరు తగ్గింది. మళ్లీ ఉదయం ఆరు గంటల 20 నిమిషాల నుంచి వర్ష ఉద్ధృతి పెరిగింది” అని వివరించారు.

    అర్నబ్ తుపాను ప్రభావంతో యానాంను ఆనుకొని వెళ్లే జాతీయ రహదారిపై చెట్లు నేల కూలాయి. తుపాను ఈ ప్రాంతంలో భారీ విధ్వంసం సృష్టించింది.

    తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో యానాం అధికారులు ముందు జాగ్రత్తగా చాలా ప్రాంతాల్లోని ప్రజలను శిబిరాలకు తరలించారు. అక్కడ పరిస్థితులు తెలుసుకునేందుకు మంత్రి మల్లాదికృష్ణారావు శిబిరాలను పరిశీలించారు. అనంతరం సముద్రం నీరు చొచ్చుకొని వచ్చిన సావిత్రి నగర్‌ను కూడా సందర్శించారు. అక్కడ వరద బాధితులతో మాట్లాడారు. అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు.

  17. ఇజ్రాయెల్ ఎన్నికలు: ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి, నెతన్యాహు ఏమన్నారు?

  18. కాకినాడలో అర్నబ్ బీభత్సం- విద్యుత్ లేక అంధకారం

    అర్నబ్, కాకినాడ,ఆంధ్రప్రదేశ్,
    ఫొటో క్యాప్షన్, కాకినాడలో అర్నబ్ బీభత్సం- విద్యుత్ లేక అంధకారం

    అర్నబ్ తుపాను తీరం దాటుతున్న సమయంలో కాకినాడ జిల్లాలో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. అధికారుల హెచ్చరికలతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. రాత్రంతా కురిసిన వర్షం ధాటికి పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

    ‘అర్నబ్’ ప్రభావం కాకినాడ జిల్లాలోని చాలా ప్రాంతాలపై పడింది. పగడాలపేట సహా పలు తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. వారి కోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి అక్కడ వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పించారు.

  19. అర్నబ్ విధ్వంసం: నేలకొరిగిన చెట్లు, కూలిన వేలాది విద్యుత్ స్తంభాలు

    అర్నబ్ తుపాను, ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం, కాకినాడ, చంద్రబాబు నాయుడు.
    ఫొటో క్యాప్షన్, కూలిన విద్యుత్ స్తంభాలు, నేలకొరిగిన చెట్లు, రెండు రోజుల పాటు తుపాను ప్రభావం, సీఎంకి వివరించిన అధికారులు

    అర్నబ్ తుపానుకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఆర్టీజీఎస్ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మరో రెండు రోజుపాటు దీని ప్రభావం ఉంటుందని తెలిపారు.

    ఇవాళ ఉదయం 6 గంటల తర్వాత తుపాను తీరం దాటుతోందని వేకువజామున అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ప్రభావంతో ఇవాళ, రేపు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ అధికారులు తెలిపారు.

    తుపాన్ ప్రభావంతో చాలా ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయని, కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా విద్యుత్ నిలిపేశామన్నారు.

    పడిపోయిన చెట్లను వెంటనే తొలగించాలని... తీవ్రత తగ్గాక విద్యుత్ పునరుద్దరణకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

    చెరువులు, కాల్వలు పొంగి పొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. జిల్లాల వారీగా తాము చేపడుతున్న సహయక చర్యలను కలెక్టర్లు వివరించారు.

    కోనసీమ జిల్లాలో సుమారు 6వేల విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

  20. నర్సాపురానికి సమీపంలో తీరం దాటుతున్న అర్నబ్ తుపాను, 125 కిలోమీటర్ల వేగంతో గాలులు

    నర్సాపురానికి సమీపంలో తీరం దాటుతున్న అర్నబ్ తుపాను, 125 కిలోమీటర్ల వేగంతో గాలులు
    ఫొటో క్యాప్షన్, నర్సాపురానికి సమీపంలో తీరం దాటుతున్న అర్నబ్ తుపాను, 125 కిలోమీటర్ల వేగంతో గాలులు

    బంగాళాఖాతంలో ఏర్పడిన అతి తీవ్ర తుపాను అర్నబ్ తీరం దాటే ప్రక్రియ కొనసాగుతోంది. నర్సాపురానికి 30 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతానికి తుపాను కేంద్రీకృతమై ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

    అత్యంత తీవ్ర తుపానుగా మారిన అర్నబ్ తుపాను 3 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా కదులుతోంది. ప్రస్తుతానికి తుపాను కేంద్రం నర్సపురానికి సమీపంలో ఉందని ఐఎండీ తన తాజా బులెటిన్‌లో పేర్కొంది. ప్రస్తుతం తుపాను నర్సాపురానికి 30కిమీ, యానాంకు 55 కిమీ, కాకినాడకు 70కిమీ, మచిలీపట్నానికి 90కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.

    ఈ తుపాను తీరం దాటే క్రమంలో, తీరం దాటాక, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లో గంటకు 125-135 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఆ సంస్థ ప్రకటించింది.

    తుపాను ప్రభావంతో పోలవరం, కాకినాడ, కోనసీమ,తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణా సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.