అసెంబ్లీ ఎన్నికలు -2026 : తమిళనాడు సీఎం స్టాలిన్ ఓటమి
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజార్టీతో ఆయనపై విజయం సాధించారు. వీఎస్ బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్‌కు 74,202 ఓట్లు దక్కాయి.
సారాంశం
- తమిళనాడు, అస్సాం, కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి శాసనసభల ఎన్నికల ఫలితాలను ఆయా రాష్ట్రాలపై క్లిక్ చేసి తెలుసుకోండి.
- తమిళనాడులో సినీనటుడు విజయ్ టీవీకే పార్టీ దూసుకుపోతోంది. వందకుపైగా స్థానాలలో ఆధిక్యంలో ఉంది.
- పశ్చిమబెంగాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.
- కేరళలో యూడీఎఫ్ ముందంజలో ఉంది.
- కేరళలో కమ్యూనిస్టుల చివరి కోట పతనం అంచుకు చేరింది.
లైవ్ కవరేజీ
‘‘సుమారు 150 ఏళ్లు ప్రపంచానికి దూరంగా ఒక ద్వీపంలో బతికారు, వాళ్లకు షాపులు, డబ్బులు, టీవీలు, సినిమాలు అంటే ఏంటో తెలియదు’’
‘సర్’ వివాదం: హైదరాబాద్‌లో ‘చలో లోక్ భవన్’ నిర్వహించిన ‘ఇండియా’ కూటమి

ఫొటో క్యాప్షన్, ఇండియా కూటమి నిరసన ఓట్ల సవరణ ప్రక్రియలో అక్రమాలకు పాల్పడ్డారంటూ భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి ఇచ్చిన ‘సేవ్ డెమోక్రసీ’ పిలుపులో భాగంగా టీపీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘చలో లోక్‌భవన్ (రాజ్‌భవన్)’ ర్యాలీ జరిగింది.
నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో, టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, వివేక, అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కును కాపాడాలనే ప్రధాన డిమాండ్‌తో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీగా ముందుకు సాగారు. ఈ ర్యాలీలో ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలైన సీపీఎం, సీపీఐ, సమాజ్‌వాదీ పార్టీ, తెలంగాణ జన సమితి (టీజేఎస్), ఆర్జేడీ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.
ర్యాలీలో పాల్గొన్న మంత్రులందర్నీ అరెస్టు చేసి పంజాగుట్ట స్టేషన్‌కు , ఇతర నాయకులను వేర్వేరు పోలీసుస్టేషన్లకు తరలించారు.
ఆస్ట్రేలియాలో పోర్న్‌హబ్ ఎందుకు ఆగింది, మళ్లీ ఎందుకు మొదలైంది?
ఎనిమిది యుద్ధాలను ఆపిన నాకు నోబెల్ శాంతి బహుమతి లభించాలి: ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images
ఎవరూ చేయనివిధంగా ఎనిమిది యుద్ధాలను ఆపిన తనకు నోబెల్ శాంతి బహుమతి లభించాలని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్నారు.
‘‘బహుశా ప్రపంచం పూర్తిగా నాశనం కాకుండా నివారించాను. అందుకే నాకు నోబెల్ శాంతి బహుమతి లభించాలి. వాళ్ల నిర్ణయం ఏంటో నాకు తెలియదు. బహుశా నాలాంటివాళ్లకు ఇవ్వరనే అభిప్రాయం వాళ్లకున్నట్టుంది. ఇప్పుడా సమయం వచ్చిందేమో. పోయినసారి ఈ అవార్డు అందుకున్నవ్యక్తి చరిత్రలో అందరికన్నా అధ్యక్షుడు ట్రంప్ ఈ బహుమతికి ఎక్కువ అర్హుడని చెప్పారు. పరోక్షంగా ఇలా ఈ గౌరవం పొందడాన్ని నేను గౌవరంగా భావిస్తున్నా’’ అని ట్రంప్ అన్నారు.
దిల్లీ: సీమాపురీలో కూలిపోయిన భవనం, నలుగురు మృతి, మరో ఎనిమిది మందికి గాయాలు

ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, కూలిపోయిన భవనం దిల్లీలోని సీమాపురీ ప్రాంతంలో బహుళ అంతస్తుల భవనం కూలిపోయిన ఘటనలో నలుగురు మరణించారు.
ఈ ఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారని డీఎం అజయ్ కుమార్ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో చెప్పారు.
"ఇప్పటివరకు ముగ్గురు మహిళల మృతదేహాలను వెలికితీశారు. దీంతో పాటు చిన్నారిదిగా భావిస్తున్న మరో మృతదేహం కూడా లభ్యమైంది" అని ఆయన తెలిపారు.
"శిధిలాలు రోడ్డుపై పడిపోవడంతో పాదాచారులెవరైనా వాటి కింద చిక్కుకున్నారో లేదో కచ్చితంగా చెప్పలేం. చాలా జాగ్రత్తగా సహాయక చర్యలు చేపడుతున్నాం. దాదాపు 75 శాతం పనులు పూర్తయ్యాయి, ఇంకా 25 శాతం మిగిలి ఉన్నాయి. సహాయకార్యక్రమాలు పూర్తి కావడానికి ఇంకో నాలుగు నుంచి ఐదు గంటల సమయం పట్టొచ్చు" అని ఆయన అన్నారు.
‘‘ఇది ఐదారంతస్థుల భవనం. దానిని 25 గజాల స్థలంలో నిర్మితమైంది. ఒకటి లేదా రెండేళ్ల క్రితం కట్టిందని అంచనా వేశారు. ఆ భవనంలో ఒక ముస్లిం కుటుంబం నివసిస్తోంది’’ అని ఆప్ ఎమ్మెల్యే ఒకరు చెప్పారు.
నిన్న అద్వానీని కలిసిన ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, x.com/narendramodi
ఫొటో క్యాప్షన్, అద్వానీ, మోదీ ప్రధాని నరేంద్రమోదీ బీజేపీ సీనియర్ నేత ఎల్.కె. అద్వానీతో సమావేశమయ్యారు.
ఈ సమావేశం నిన్న(అక్టోబర్ 7) జరిగిన్టటు మోదీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
‘‘అద్వానీని ఆయన నివాసంలో కలిసి ఆశీర్వాదం తీసుకున్నా. దశాబ్దాలుగా అద్వానీ అందించిన ప్రజాసేవ, దేశానికి ఆయన చేసిన కృషి చెరగని ముద్రవేశాయి. దేశ ప్రగతిని బలోపేతం చేయడంలో అద్వానీది కీలకపాత్ర’’ అని మోదీ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఇవాళ బ్లాక్ డేగా పాటిస్తాం: కాంగ్రెస్

ఫొటో సోర్స్, Congress
ఫొటో క్యాప్షన్, ప్రియాంక గాంధీ ప్రధాన ఎన్నికల కమిషర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్బంగా రాహుల్ గాంధీ, ఇతర ప్రతిపక్షనేతలపై పోలీసుల చర్యలను కాంగ్రెస్ ఖండించింది. ఇవాళ(గురువారం) దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్టు ప్రకటించింది.
భారత ప్రజాస్వామ్యం కోసం బ్లాక్ డే పాటిస్తామని కాంగ్రెస్ తెలిపింది.
జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా రెండు రోజులుగా దిల్లీలో కాంగ్రెస్ నిరసనలు చేస్తోంది. నిరసనల సమయంలో మంగళవారం(అక్టోబర్ 6), బుధవారం(అక్టోబర్ 7)రాహుల్ గాంధీని, ఇతర నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు తర్వాత విడుదల చేశారు.
జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఈ నెల 10న కాక్రోచ్ జనతాపార్టీ నిరసన చేపట్టనుంది.
ప్రముఖ నటుడు నానా పాటేకర్ కన్నుమూత

ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, నానా పాటేకర్ ప్రముఖ బాలీవుడ్, మరాఠీ నటుడు నానా పాటేకర్ కన్నుమూశారు. 75ఏళ్ల నానా పాటేకర్ గోవాలో కన్నుమూసినట్టు ఆయన కుమారుడు మల్హర్ పాటేకర్ చెప్పారు. ఈ దురదృష్టకర వార్త నిజమేనని ధ్రువీకరించారు.
ఈ ఉదయం 5.20గంటలకు తీవ్రమైన గుండెపోటుతో తన నివాసంలో పాటేకర్ మరణించారు.
‘‘45 నిమిషాల పాటు సీపీఆర్ చేసినా నానా పాటేకర్‌ను కాపాడలేకపోయారు. ఈ ఘటనపై మెడికో లీగల్ కేసు(ఎంఎల్సీ) నమోదు చేసినట్టు, పోస్ట్ మార్టమ్ నిర్వహించనున్నట్టు మణిపాల్ ఆస్పత్రి ఆంకాలజీ విభాగం అధిపతి డాక్టర్ శేఖర్ సాళ్కర్ తెలిపారు’’ అని ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది.
దశాబ్దాలపాటు సాగిన కెరీర్లో హిందీ, మరాఠీ సినిమాల్లో ప్రముఖ నటుడిగా నానా పాటేకర్ గుర్తింపు పొందారు.
పరిందా, ప్రహార్: ది ఫైనల్ అటాక్, క్రాంతివీర్, అగ్ని సాక్షి, ఖామోషీ: ది మ్యూజికల్, అబ్ తక్ ఛప్పన్, వెల్కమ్ వంటి చిత్రాల్లో ఆయన నటనకు మంచి గుర్తింపు లభించింది.
నటనతో పాటు 'ప్రహార్: ది ఫైనల్ ఎటాక్' చిత్రానికి నానా పాటేకర్ దర్శకత్వం కూడా వహించారు. సినిమా, కళారంగానికి చేసిన సేవలకుగాను 2013లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.
నానా పాటేకర్ చివరిసారిగా విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ 'ఓ'రోమియో'లో కనిపించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదలయింది. ప్రకాశ్ ఝా రాజకీయ డ్రామా సిరీస్ ‘సంకల్ప్’తో ఓటీటీలోకి ప్రవేశించారు.
నానా పాటేకర్ తొలి హిందీ చిత్రం ‘గమన్’. 1978లో ఇది విడుదలయింది. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్లో హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణించారు.
2007లో వచ్చిన 'వెల్కమ్' అనే కామెడీ చిత్రంలో గ్యాంగ్‌స్టర్ ఉదయ్ శెట్టి పాత్రతో ప్రేక్షకులను అలరించారు నానా పాటేకర్. సీక్వెల్ అయిన 'వెల్కమ్ బ్యాక్' (2015)లో కూడా అదే పాత్రను పోషించారు.
బీబీసీ తెలుగు లైవ్ పేజ్‌కు స్వాగతం.
నిన్నటి లైవ్ పేజ్ వార్తలను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
జెన్ జెడ్, విపక్షాల ఉద్యమం: భారత్‌లో ప్రతిపక్షాల భాష ఎంత వేగంగా మారిందంటే..
ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం
ఆ నలుగురినీ న్యాయస్థానం ముందు నిలబెడతాం: రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Arun SANKAR / AFP via Getty Images
ఫొటో క్యాప్షన్, జంతర్ మంతర్ వెళ్లేందుకు ప్రయత్నించిన రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకుని, ఆ తర్వాత విడుదల చేశారు. ప్రతిపక్ష ఎంపీలతో కలిసి నిరసన కోసం జంతర్ మంతర్ వెళ్లేందుకు ప్రయత్నించిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంకా గాంధీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు బీబీసీ ప్రతినిధి దిల్నవాజ్ పాషా తెలిపారు.
ఆ తర్వాత కొద్దిసేపటికి విపక్ష నేతలను పోలీసులు విడుదల చేశారు.
"నరేంద్ర మోదీ, అమిత్ షా, మోహన్ భాగవత్, జ్ఞానేష్ కుమార్ ఏం చేసినా సరే, మేం వారిని వదిలిపెట్టబోం. ఆ నలుగురినీ న్యాయస్థానం ముందు నిలబెడతాం" అని రాహుల్ గాంధీ అన్నారు.
మరోవైపు పోలీసులు తమతో దురుసుగా ప్రవర్తించారని ప్రియాంకా గాంధీ ఆరోపించారు.
"ఎన్నికల కమిషనర్‌ను కలవడానికి వెళ్తున్న ఎంపీలతో వారు ఎలా ప్రవర్తిస్తున్నారో చూడండి. వారు ఎంపీలైన మమ్మల్ని కొడుతున్నారు. పోలీసులు నన్ను చాలా చోట్ల గాయపరిచారు. మమ్మల్ని నెట్టేసి నేలపై పడేశారు. మేం ఇక్కడి నుంచి కదిలేది లేదు. నేను ఇక్కడి నుంచి కదలను" అన్నారామె.
మోనాల్.. అందమైన ఈ పక్షి తన కూత స్థాయిని ఎందుకు పెంచింది?
'తోపులాటలో కిందపడిన రాహుల్ గాంధీ'

ఫొటో సోర్స్, X/AshutoshRanka
ఫొటో క్యాప్షన్, రాహుల్ గాంధీ కిందపడినట్లు వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు( స్క్రీన్ గ్రాబ్) జంతర్ మంతర్‌కు సమీపంలో పోలీసులకు నిరసనకారులకు మధ్య జరిగిన తోపులాటలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కిందపడినట్లు కనిపిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించడం లేదు.
సీజేపీ ప్రతినిధి అశుతోష్ ఈ వీడియోను ఎక్స్‌లో పోస్టు చేస్తూ దిల్లీ పోలీసులపై విమర్శలు చేశారు.
"దిల్లీ నుంచి సిగ్గుచేటు దృశ్యాలు వస్తున్నాయి. దిల్లీ పోలీసులు జాతీయ స్థాయిలో ఎంతలా తలవంపులు తెస్తున్నారో దేశమంతా గమనిస్తోంది" అని రాశారు.
పంతానికి పోయి 40 ఏళ్ల నుంచి అన్నం తినడమే మానేసిన అవ్వ... మరి ఆమె భోజనం ఏమిటి?
అణువుల అసమానత రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలకు రసాయన శాస్త్రంలో నోబెల్

ఫొటో సోర్స్, Jonathan Nackstrand/AFP/Getty Images
ఫొటో క్యాప్షన్, కైరాలిటీని వివరిస్తున్న నోబెల్ రసాయన శాస్త్ర కమిటీ చైర్మన్ హీనర్ లింకే. సృష్టిలోని అణువుల అసమానత రహస్యాన్ని ఛేదించినందుకుఫ్రెంచ్ శాస్త్రవేత్త హెన్రీ బి. కాగన్, జపాన్‌కు చెందిన కెన్సో సోయ్‌లకు ఈ ఏడాది రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. అణువుల ప్రతిబింబ రూపం కాకుండా నిజ రూపాన్ని మాత్రమే ప్రకృతి ఎలా ప్రత్యేకంగా తయారుచేయగలుగుతుందో ఈ పరిశోధకులు కనుగొన్నారు.
ఉదాహరణకు, ప్రోటీన్లను తయారుచేసే అమైనో ఆమ్ల అణువులు ఒకదానికొకటి అద్దంలో కనిపించే ప్రతిబింబాల్లాంటి రెండు రూపాల్లో ఉంటాయి.
భూమిపై ఉన్న జీవులన్నీ ఈ రెండు రూపాలలో కేవలం ఒకే ఒక్క రూపంతోనే పనిచేస్తాయి.
అసలు జీవసృష్టి ఇటువంటి ప్రతిబింబ రూపాలలో కేవలం ఒక వైపు అణువుకే ఎందుకు ప్రాధాన్యత ఇస్తుందనే ప్రశ్నకు ఈ నోబెల్ గ్రహీతలు సమాధానం ఇచ్చారు.
ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఈ గుణాన్ని "కైరాలిటీ" అని పిలుస్తారు. ఇటువంటి కైరల్ అణువులకు కుడి, ఎడమ చేతి రూపాలు ఉంటాయి. ఇవి చూడటానికి సరిగ్గా మన రెండు చేతుల లాగా ఉంటాయని అనుకోవచ్చు. ఒకేలా కనిపించినప్పటికీ, ఒకదానిపై ఒకటి ఇవి సరిగ్గా అమరవు.
ప్రకృతి తన జీవక్రియల కోసం అవసరమైన రూపాన్ని మాత్రమే దాదాపుగా ప్రత్యేకంగా తయారుచేసుకుంటుంది. ల్యాబ్‌లో జరిపే రసాయన చర్యలు మాత్రం సాధారణంగా కుడి, ఎడమ చేతి అణువులను 50-50 నిష్పత్తిలో సమాన మిశ్రమంగా సృష్టిస్తాయి.మందుల తయారీ విషయానికి వస్తే ఇది అత్యంత ప్రాముఖ్యమైనది. ఈ రెండు రూపాలు మన శరీరంతో పరస్పర చర్య జరిపినప్పుడు వేర్వేరుగా స్పందిస్తాయి. అంటే, వాటిలో ఒక రూపం రోగాలను నయం చేసే గుణాలను కలిగి ఉంటే, మరొక రూపం అసలు ఎటువంటి ప్రభావం చూపకపోవచ్చు, లేదా హాని కూడా కలిగించవచ్చు.
ఈ ఉదయం నోబెల్ ప్రైజ్ విలేకరుల సమావేశంలో ఫోన్ ద్వారా మాట్లాడుతూ కెన్సో సోయ్, "ఇది నా జీవితంలోనే అత్యంత ఉత్సాహభరితమైన రోజుల్లో ఒకటి" అని ఆనందం వ్యక్తం చేశారు.
జంతర్ మంతర్: రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, రాహుల్ గాంధీని వాహనంలోకి ఎక్కిస్తున్న పోలీసులు ఎన్నికల సంఘం, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగాదిల్లీలో ప్రతిపక్షాల నిరసన బుధవారం కూడా కొనసాగింది.
ప్రతిపక్ష ఎంపీలతో కలిసి నిరసన కోసం జంతర్ మంతర్ వెళ్లేందుకు ప్రయత్నించిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంకా గాంధీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది.
'దేశద్రోహులు, నమ్మకద్రోహులపై మా పోరాటం ఆగేది లేదు' అని కాంగ్రెస్ ఎక్స్ పోస్ట్‌లో రాసింది.
పోలీసులు తమపై దాడి చేసి, నిరసన ప్రదేశం వైపు వెళ్లకుండా అడ్డుకున్నారని ఇండియా కూటమి ఎంపీలు తెలిపారు.

ఫొటో సోర్స్, X/INcindia
ఫొటో క్యాప్షన్, అంతకుముందు, జంతర్ మంతర్‌కు వెళ్లకుండా అడ్డుకోవడంతో రోడ్డుపై పడుకుని నిరసన తెలుపుతున్న ప్రియాంకా గాంధీ తదితరులు. 
ఫొటో సోర్స్, X/INcindia
ఫొటో క్యాప్షన్, జంతర్ మంతర్ సమీపంలో పోలీసు వాహనం ఎక్కిన నిరసనకారులు 
ఫొటో సోర్స్, X/INcindia
ఫొటో క్యాప్షన్, అంతకుముందు, జంతర్ మంతర్ సమీపంలో రోడ్డుపై రాహుల్ గాంధీ 
ఫొటో సోర్స్, Congress
ఫొటో క్యాప్షన్, జంతర్ మంతర్ సమీపంలో పరిస్థితి 
ఫొటో సోర్స్, Congress
ఫొటో క్యాప్షన్, బస్సు ఎక్కుతున్న రాహుల్ గాంధీ 
ఫొటో సోర్స్, X/INcindia
ఫొటో క్యాప్షన్, జంతర్ మంతర్‌కు బస్సులో వెళుతున్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే 
ఫొటో సోర్స్, Congress
ఫొటో క్యాప్షన్, వాహనంపైకి ఎక్కిన నిరసనకారులు విపక్ష ఎంపీలతో కలిసి జంతర్ మంతర్‌కు రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, బుధవారం జంతర్ మంతర్ వద్దకు వెళ్లి నిరసన చేపడతామని రాహుల్ గాంధీ తెలిపారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇతర విపక్ష నేతలు జంతర్ మంతర్‌కు బయలుదేరారు.
బుధవారం మధ్యాహ్నం ఓ ప్రైవేట్ రెస్టారెంట్లో విపక్ష నేతలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విందు భోజనం ఏర్పాటు చేశారు. విందు అనంతరం జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారు.
"ఇండియా కూటమి పక్షాలన్నీ నేడు జంతర్ మంతర్ వద్ద జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసన చేపడతాయి. మా డిమాండ్ నెరవేరే వరకు ఈ ఆందోళనలు కొనసాగిస్తాం" అని మల్లికార్జున్ ఖర్గే స్పష్టం చేశారు
చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలంపై కోచ్ గౌతమ్ ఏమన్నారంటే..

ఫొటో సోర్స్, ISHARA S. KODIKARA/AFP via Getty Images
ఫొటో క్యాప్షన్, అగార్కర్ పదవీకాలం గత నెలలో ముగియగా, ఆ ఖాళీ స్థానాన్ని భర్తీ చేసేందుకు బీసీసీఐ మంగళవారం దరఖాస్తులను ఆహ్వానించింది. భారత పురుషుల క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌తో కలిసి పనిచేయడం తనకు దక్కిన గొప్ప గౌరవమని కోచ్ గౌతమ్ గంభీర్ అన్నారు. చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్ పదవీకాలం ముగియడంతో గంభీర్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.
"ప్రియమైన అజిత్ భాయ్, మీతో కలిసి పనిచేయడం నాకు దక్కిన గొప్ప గౌరవం. ఆ మూడు ఐసీసీ ట్రోఫీలే మీ నమ్మకానికి నిదర్శనం. చరిత్ర మీ పట్ల మరింత ఉదారంగా ఉంటుందని నేను కచ్చితంగా చెప్పగలను. అన్నింటికీ ధన్యవాదాలు. మీ భవిష్యత్తు ప్రయత్నాలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు" అని తెలిపారు.
అగార్కర్ పదవీకాలం గత నెలలో ముగియగా, ఆ ఖాళీ స్థానాన్ని భర్తీ చేసేందుకు బీసీసీఐ మంగళవారం దరఖాస్తులను ఆహ్వానించింది.
ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తారా లేదా అనే దానిపై పలు వారాలుగా ఊహాగానాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
అగార్కర్ పదవీకాలంలో భారత్ 2024, 2026 టీ20 ప్రపంచకప్‌లతో పాటు 2025 ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20లు, టెస్టుల నుంచి రిటైర్ అయిన తర్వాత పరిస్థితిని కూడా ఆయన సమర్థవంతంగా నిర్వహించారు.
