మీరు ఈ వెబ్‌సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్‌సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.

నన్ను ప్రధాన వెబ్‌సైట్‌కు తీసుకెళ్లండి

అసెంబ్లీ ఎన్నికలు -2026 : తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఓటమి

తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజార్టీతో ఆయనపై విజయం సాధించారు. వీఎస్ బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్‌కు 74,202 ఓట్లు దక్కాయి.

సారాంశం

లైవ్ కవరేజీ

  1. నిర్బంధానికి, అరెస్ట్‌కు తేడా ఏమిటి? వీటి విషయంలో పౌరులకు ఎలాంటి హక్కులు ఉంటాయి?

  2. నన్ను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది - అభిజిత్ దీప్కే

    దిల్లీ పోలీసులు, ఐబీ సిబ్బంది తన ఇంటిని చుట్టుముట్టారని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే అన్నారు.

    "ఇంటి చుట్టూ ఉన్న నాలుగు వీధుల్లో ఐబీ సిబ్బంది, దిల్లీ పోలీసు అధికారులు తిరుగుతున్నారు. నేను బయటకు వెళ్లినప్పుడల్లా నంబర్ ప్లేట్లు లేని వాహనాలు నన్ను అనుసరిస్తున్నాయి. నేను తిరిగి రాగానే, ఐబీ, పోలీసు సిబ్బంది మా వాచ్‌మన్‌తో మాట్లాడి వివరాలు సేకరిస్తున్నారు. కాబట్టి, దిల్లీ పోలీసులు నన్ను అదుపులోకి తీసుకోవచ్చు" అని మీడియాతో అభిజిత్ చెప్పారు.

  3. భారత్, చైనాలను ఏకతాటిపైకి తేవాలని నేపాల్ ఎందుకు కోరుకుంటోంది?

  4. సూట్‌కేసులో పాములు, బల్లులను తరలిస్తున్న వ్యక్తిని అడ్డుకున్న అధికారులు

    జర్మనీలోని కోలాన్ బాన్ విమానాశ్రయంలో 90కి పైగా బల్లులు, విషపూరిత పాములను అక్రమంగా తరలించడానికి ప్రయత్నించిన వ్యక్తిని అధికారులు అడ్డుకున్నారు.

    45 ఏళ్ల మెక్సికన్ అగ్నిమాపక సిబ్బంది సభ్యుడు గ్రీన్ ఎగ్జిట్ గుండా వెళ్తున్న సమయంలో "అనుమానాస్పదంగా ఆందోళన చెందుతూ" కనిపించినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.

    ఆ వ్యక్తికి అధికారులు డ్రగ్స్ పరీక్ష నిర్వహించగా కొకైన్ ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. ఆ తర్వాత ఆయన సూట్‌కేసును తనిఖీ చేశారు. అందులో ఎలాంటి డ్రగ్స్ లభించలేదు. కానీ, షాంపూ, క్రీమ్ సీసాలు, ప్లాస్టిక్ కంటైనర్లు, సాక్సులలో దాచిన వైపర్లు, రాటిల్‌స్నేక్స్, ఇగువానాలతో పాటు ఇతర జాతుల పాములు, బల్లులు దొరికాయి.

    "విమానాశ్రయంలో సూట్‌కేసులలో తెచ్చే జ్ఞాపికల విషయంలో మా సహచరులు చాలా చూశారు. కానీ మెక్సికో నుంచి 37 సజీవ విషసర్పాలు, 55 బల్లులు రావడం ఇదే మొదటిసారి" అని కోలాన్ కస్టమ్స్ కార్యాలయ ప్రతినిధి జెన్స్ అహ్లాండ్ తెలిపారు.

    కొన్ని జంతువులను "అమానుషమైన పరిస్థితుల్లో" ఉంచినట్లు అహ్లాండ్ చెప్పారు. మరికొన్ని మెక్సికో నగరం నుంచి ఇస్తాంబుల్ మీదుగా ప్రయాణించే సమయంలో చనిపోయాయి.

  5. అమెరికా: స్కూల్లో 16 ఏళ్ల బాలుడి కాల్పులు, ముగ్గురు పిల్లలు సహా టీచర్ మృతి

    అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలో ఒక ప్రాథమిక పాఠశాలలో జరిగిన కాల్పులు ఘటనలో టీచర్‌ సహా 5, 8, 11 ఏళ్ల వయసున్న ముగ్గురు పిల్లలు మరణించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

    బెండ్ నగరంలోని సిల్వర్ రైల్ ప్రాథమిక పాఠశాల వద్ద ఈ ఘటన జరిగింది.

    కాల్పులు జరిపిన వ్యక్తిని బెండ్ నగరానికి చెందిన 16 ఏళ్ల బాలుడిగా గుర్తించారు.

    తాళం వేసి ఉన్న తలుపులపై కాల్పులు జరుపుతూ బాలుడు పాఠశాలలోకి ప్రవేశించారు. పాఠశాలలోకి వెళుతున్న అనుమానితుడిని కమ్యూనిటీలోని ఓ గన్ మెన్ వెంబడించారని, ఆయన చేతిలోనే బాలుడు హతమయ్యాడని పోలీసులు తెలిపారు.

    ఘటనా స్థలంలో ఐదుగురు మృతి చెంది ఉన్నట్లు బెండ్ పోలీస్ చీఫ్ మైక్ క్రాంజ్ తెలిపారు.

    ఈ ఘటనలో ఏడేళ్ల బాలుడు, మరో ఉపాధ్యాయురాలు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు, ప్రస్తుతం వారిద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

  6. క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ: పెళ్లి చుట్టూ తిరిగిన డ్రామా మెప్పించిందా?

  7. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం.

    నేను బీబీసీ ప్రతినిధి వద్ది ప్రభాకర్, మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమైన వార్తలను మీకు అందిస్తాను.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

  8. రూ.10నాణేలతో రూ.1.23లక్షల స్కూటీ

  9. ‘‘నేను మాట్లాడేవన్నీ నా ఫోన్ రహస్యంగా వింటోందా? అందుకే ఆ యాడ్స్ వస్తున్నాయా?’’ అని మనకు ఎందుకు అనిపిస్తుంది?

  10. ‘‘మతం మారిన తర్వాత కులం ఆధారంగా రిజర్వేషన్ పొందలేరు’’: సుప్రీంకోర్టు

    ఇస్లాం మతంలోకి మారిన వ్యక్తి అంతకు ముందున్న తన సామాజిక హోదా ఆధారంగా వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడానికి అర్హుడు కాదని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.

    హిందూ మతాన్ని విడిచిపెట్టి ఇతర మతాన్ని స్వీకరించిన వ్యక్తి, గతంలోని సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్ ప్రయోజనాన్ని పొందలేరని గురువారం సుప్రీంకోర్టు పేర్కొన్నట్టు లైవ్ లా తెలిపింది.

    ఒక వ్యక్తి మతం మారిన తర్వాత గతంలో తన మతంలో ఎదుర్కొన్న సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా, మరో మతంలో నోటిఫైడ్ వెనుకబడిన తరగతిలో ఆ వ్యక్తిని చేర్చలేరని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ చంద్రశేఖర్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

    రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4) కింద రిజర్వేషన్ ప్రయోజనాన్ని పొందాలంటే సంబంధిత వెనుకబడిన తరగతికి చెందిన వ్యక్తి అయిఉండాలని ధర్మాసనం పేర్కొంది. కేవలం మతమార్పిడికి ముందు ఉన్న సామాజిక హోదా ఆధారంగా ఆ వ్యక్తిని కొత్త మతంలో వెనుకబడిన తరగతికి చెందినవారిగా పరిగణించలేమని తెలిపింది.

    1950 నాటి రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాలు) ఉత్తర్వును సుప్రీంకోర్టు ప్రస్తావించింది.

    "అందులోని మూడో పేరా ప్రకారం హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాలు కాకుండా వేరే ఏ మతాన్నైనా అనుసరించే వ్యక్తిని షెడ్యూల్డ్ కులాలకు చెందినవారిగా పరిగణించలేం" అని పేర్కొంది.

    మతంమారిన తర్వాత ఒక వ్యక్తి తిరిగి హిందూ మతాన్ని స్వీకరించినప్పటికీ గతంలో తనకున్న వెనుకబడిన తరగతి హోదా, రిజర్వేషన్ ప్రయోజనాలు వాటంతట అవే తిరిగి లభించవని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది.

  11. దేశం విడిచి వెళ్లాలని నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు

    ఆమిర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్‌కు ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 28 నాటికి భారత్‌ను విడిచి పెట్టాలని అందులో సూచించింది.

    ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లో పాల్గొని విదేశీయుల చట్టాన్ని ఉల్లంఘించినట్టు ఇమ్రాన్ ఖాన్‌పై ఆరోపణలు ఉన్నాయి.

    అక్టోబర్ 10న ఆగస్టు రివల్యూషన్ గ్రౌండ్స్‌లో జరిగిన నిరసనల్లో ఇమ్రాన్ ఖాన్ పాల్గొన్నారు. ఆందోళనల్లో పాల్గొన్న ఆయన్ని పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నారు.

    ఇమ్రాన్ ఖాన్ అమెరికా పౌరుడని, నిరసనల్లో పాల్గొని విదేశీయుల చట్టాన్ని ఉల్లంఘించారని బీజేపీ నేత కృతి సౌమ్య ఆరోపించారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    "విదేశీయుల చట్టాన్ని ఖాన్ ఉల్లంఘించారని గామ్దేవీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఆ తర్వాత ఆ ఫిర్యాదును ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు పంపించాం" అని పోలీసులు తెలిపారు.

    ఖాన్‌ను అమెరికా పౌరుడిగా గుర్తించి, ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టంలోని 7, 29 సెక్షన్లు ఉల్లంఘించినట్టు నోటిసుల్లో పేర్కొన్నారు. దీని ఆధారంగానే నిర్దేశించిన గడువులోపు దేశం విడిచి వెళ్లాలని సూచించినట్టు పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక అధికారి వివరించారు.

  12. అంకితా భండారీ తల్లిదండ్రులను నిర్బంధించడాన్ని ఖండించిన రాహుల్ గాంధీ

    అంకితా భండారీ తల్లిదండ్రులను నిర్బంధించడాన్ని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఖండించారు.

    బాధితుల గొంతును ఈ ప్రభుత్వం నొక్కేస్తోందని, ప్రశ్నించేవారిని తప్పిస్తోందని ఆయన ఆరోపించారు.

    "ఉదయం 4 గంటలు, ప్రపంచమంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో అంకితా భండారీ తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. వారు చేసిన తప్పు ఏంటి?, ఇండియా గేట్ వద్ద ఎలాంటి హాంగామా లేకుండా, బాధతో నిశ్శబ్ధంగా కూర్చొని, సీబీఐ విచారణ పూర్తి అయ్యే వరకు దుష్యంత్ గౌతమ్‌ను గవర్నర్‌గా నియమించొద్దని కోరారు" అని ఎక్స్‌లో రాహుల్ గాంధీ పోస్టు చేశారు.

    "నేను, ప్రియాంక నిన్న వారిని కలిశాం. సీబీఐ దర్యాప్తు ఫలితాలు రాకముందే హడావుడిగా నియమాకాలు పూర్తి చేశారు. ప్రశ్నించిన తల్లిదండ్రులను చీకటిలో అదుపులోకి తీసుకున్నారు. బాధితుల గొంతును అణిచివేయడం, ప్రశ్నించే వారిని పక్కన పెట్టడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారింది.

    "న్యాయం కోసం జరుగుతున్న పోరాటాన్ని ఎవరూ అణచివేయలేరు, ఆపలేరు. అంకితా భండారీ కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటుంది. వారికి న్యాయం జరిగే వరకు మద్దతు ఇస్తుంది" అని తెలిపారు.

    ఇండియా గేట్ దగ్గర నిరసన చేస్తున్న అంకితా భండారీ తల్లిదండ్రులతోపాటు పలువురిని దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    కొంత సమయం వారిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఉదయం ఐదు గంటలకు విడుదల చేసినట్టు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.

  13. టీవీకే ఎమ్మెల్యే పల్లవి: ‘‘చంటి పిల్లాడిని సభలు సమావేశాలకు తిప్పుతూ పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నారు’’ అంటూ ఆమెపై విమర్శలేంటి?

  14. గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్‌‌కు భయపడాలా? బహిష్టు సమస్యల నుంచి సంతానలేమి వరకు.. దీనివల్ల కలిగే పరిణామాలు ఏంటి?

  15. జైలర్ 2-మూవీ రివ్యూ: సూపర్ హిట్ సినిమాల ఫార్ములానే మళ్లీ ఫాలో అయ్యారా? రజినీ సీక్వెల్ ఎలా ఉంది?

  16. పాకిస్తాన్: పాఠశాల భవనం పైకప్పు కూలి 18 మంది చిన్నారులు మృతి

    పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ప్రైవేటు పాఠశాల భవనం కూలి 19 మంది మృతి చెందారు. మరో 40 మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో 18 మంది చిన్నారులు కాగా, ఒక ఉపాధ్యాయిని కూడా ఉన్నారు.

    పెషావర్‌లోని దర్ కాలనీలో ఈ ఘటన జరిగిందని బీబీసీ ఉర్దూ పేర్కొంది.

    ప్రమాదం జరిగిన తర్వాత చనిపోయిన స్థితిలో ఉన్న 18 మంది చిన్నారులను ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఉపాధ్యాయిని మృతదేహాన్ని కూడా ఆసుపత్రికి తెచ్చారని లేడీ రీడింగ్ హాస్పిటల్ అధికార ప్రతినిధి మహమ్మద్ అసీమ్ తెలిపారు.

    ఈ ప్రమాదంలో మరో 40 మంది చిన్నారులు గాయపడ్డారు. వారు ఎల్ఆర్‌హెచ్‌లో చికిత్స పొందుతున్నారు . వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని మహమ్మద్ అసీమ్ అన్నారు.

  17. ఈసీఐకు సుప్రీం కోర్టు నోటీసులు

    భారత ఎన్నికల సంఘం సహా పలువురికి సుప్రీంకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసిందని ఏఐఎన్ వార్తాసంస్థ పేర్కొంది. లోక్‌సభ‌లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీసహా పలు ప్రతిపక్షాలు వేసిన పిటిషన్ విచారణలో భాగంగా నోటీసులు ఇచ్చింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపిస్తూ ఈ పిటిషన్ దాఖలు చేశారు.

    ఈ పిటిషన్‌పై స్పందన తెలియజేయాలని ఎన్నికల సంఘం, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషీకి కోర్టు సూచించింది. ఈసీ సర్‌ను నిర్వహిస్తున్న తీరును సవాలు చేస్తూ 13 పిటిషన్లు దాఖలు కాగా వారి ఒక పిటిషనర్ వైఖరిపై కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

    “పిటిషన్ దాఖలు చేసిన ఒక పిటిషనర్ ప్రవర్తన గురించి వచ్చే విచారణలో అడగాలనుకుంటున్నాం” అని రాహుల్ గాంధీ, ఇతర ప్రతిపక్ష నాయకుల పిటిషన్‌పై నోటీసులు జారీ చేస్తూ ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

    లోక్‌సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇతర 'ఇండియా' బ్లాక్ నాయకులతో కలిసి, భారత ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా అక్టోబర్ 12న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సర్‌కు సంబంధించి భారత ఎన్నికల సంఘం తీసుకుంటున్న నిర్ణయాలను సవాలు చేస్తూ ఈ పిటిషన్లు వేశారు.

  18. ప్రధాని మోదీ ముందున్న 10 సవాళ్లు ఏంటి?

  19. ‘‘5 నెలల్లోనే బియ్యం బస్తా రూ.700 పెరిగింది’’ - తెలుగు రాష్ట్రాల్లో బియ్యం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

  20. అంకిత భండారీ హత్య కేసు: ఇండియా గేటు వద్ద తల్లిదండ్రుల ఆందోళన, అంకిత తండ్రి చేస్తున్న 5 డిమాండ్లు ఏమిటి?