‘త్రివర్ణ పతాకంతో సమస్య ఉన్నవాళ్లు పాకిస్తాన్‌కు
వెళ్ళిపోవాలి' అని దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్
అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
అభిజీత్ దీప్కేను దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని
ఆయన విమర్శించారు.
ప్రధానమంత్రి
నరేంద్ర మోదీపై ఆయన విమర్శలు చేశారు.
"మన జాతీయ జెండాను మనదేశంలో ఎగరేయకుండా పాకిస్తాన్‌లో ఎగరేయాలా?
భారత త్రివర్ణ
పతాకంతో సమస్య ఉన్నవాళ్లు పాకిస్తాన్‌కు వెళ్లిపోవాలి" అని ‘ఎక్స్’ లో చేసిన
పోస్ట్‌లో కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
అంతకుముందు అభిజీత్ దీప్కేను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న వీడియోను
కేజ్రీవాల్ షేర్ చేశారు.
"ఇది పూర్తిగా నియంతృత్వమే.
త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం నేరమా? మోదీకి అభిజిత్ దీప్కే అంటే ఎంత భయమో దీప్కే
అరెస్ట్‌తో అర్ధమవుతోంది" అని కేజ్రీవాల్ కామెంట్ చేశారు.
అభిజిత్ దీప్కేను అదుపులోకి తీసుకోవడంపై పశ్చిమ బెంగాల్
మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు.
"అసలు దిల్లీ పోలీసులు ఏం
చేస్తున్నారు? భారత జాతీయ జెండాను పట్టుకున్నందుకు అభిజీత్ దీప్కేను
నిర్బంధించారు. దీని గురించి ఒక్కసారి ఆలోచించండి. స్వతంత్ర భారతదేశంలో మన యువత తమ
ప్రజాస్వామ్య హక్కులను శాంతియుతంగా వినియోగించుకుంటున్నందుకు నిర్బంధంలోకి వెళ్తున్నారు’’
అని మమతాబెనర్జీ పోస్ట్ చేశారు.
"ఇది అప్రకటిత అత్యవసర పరిస్థితి తప్ప మరేమీ కాదు. అసమ్మతికి
భయపడే ప్రభుత్వం ఇప్పుడు ఒక తరాన్నే బెదిరించి, అణచివేయడానికి
ప్రయత్నిస్తోంది. తాను నియంత్రించలేని గొంతును సహించలేని ఫాసిస్ట్ పాలన ప్రవర్తన
ఇది." అని ఆమె విమర్శించారు.
‘‘మొదటి 50ఏళ్లు త్రివర్ణపతాకంపై ద్వేషం ప్రదర్శించారు. ఆ తర్వాత 25ఏళ్ల
పాటు త్రివర్ణ పతాకాన్ని మోస్తున్నట్టు నటించారు. ఇప్పుడు దేశభక్తి ఉన్న యువత చేతుల్లో
త్రివర్ణపతాకాన్ని చూసి భయపడుతున్నారు. ఇదే ఆరెస్సెస్, బీజేపీల తిరంగా యాత్ర’’ అని
రాజకీయ కార్యకర్త యోగేంద్ర యాదవ్ అన్నారు.