మీరు ఈ వెబ్‌సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్‌సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.
అసెంబ్లీ ఎన్నికలు -2026 : తమిళనాడు సీఎం స్టాలిన్ ఓటమి
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజార్టీతో ఆయనపై విజయం సాధించారు. వీఎస్ బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్‌కు 74,202 ఓట్లు దక్కాయి.
సారాంశం
- తమిళనాడు, అస్సాం, కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి శాసనసభల ఎన్నికల ఫలితాలను ఆయా రాష్ట్రాలపై క్లిక్ చేసి తెలుసుకోండి.
- తమిళనాడులో సినీనటుడు విజయ్ టీవీకే పార్టీ దూసుకుపోతోంది. వందకుపైగా స్థానాలలో ఆధిక్యంలో ఉంది.
- పశ్చిమబెంగాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.
- కేరళలో యూడీఎఫ్ ముందంజలో ఉంది.
- కేరళలో కమ్యూనిస్టుల చివరి కోట పతనం అంచుకు చేరింది.
లైవ్ కవరేజీ
కొలంబస్ కన్నా ముందే అమెరికాను చేరుకున్న వైకింగ్స్ ఎవరు?
పారా ఆసియా క్రీడలు: ఒకే ఈవెంట్‌లో భారత్‌కు స్వర్ణం, రజతం
జపాన్‌లోని నాగోయాలో జరుగుతున్న పారా ఆసియా క్రీడల్లో భారత షూటర్ మోనా అగర్వాల్ స్వర్ణ పతకం గెలుచుకోగా, అవని లేఖరా రజత పతకం సాధించింది.
ఆర్2 మహిళల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్‌లోని ఎస్‌హెచ్1 విభాగంలో ఇద్దరూ ఈ ఘనతను సాధించారు. ఫైనల్‌లో ఇద్దరు షూటర్ల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది.
మోనా 250.0 పాయింట్లు సాధించి స్వర్ణ పతకం గెలుచుకోగా, అవని 249.6 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.
దక్షిణ కొరియాకు చెందిన యున్రి లీ 227.9 పాయింట్లతో కాంస్య పతకాన్ని గెలుచుకుంది.
ఈ ఘనత సాధించినందుకు ఇద్దరు భారత షూటర్లను ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) అభినందించింది.
గుడ్ ఆఫ్టర్ నూన్...
నేను బీబీసీ ప్రతినిధి కమలాదేవి నల్లపనేని. ఇప్పటినుంచి రాత్రి 10గంటల వరకు ముఖ్యమైన వార్తలను అందిస్తాను.
టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కేసు: ముగ్గురు అరెస్ట్
ముంబైలో ఆదివారం సాయంత్రం టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు జరిపిన ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఏఎన్‌ఐ రిపోర్టు చేసింది. వీరిని రాజస్థాన్ పోలీసులు పట్టుకున్నారని తెలిపింది.
బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కాల్పుల కేసులో ముగ్గురు నిందితులను రాజస్థాన్‌లోని కోటా పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు హరియాణాకు చెందిన వారు కాగా, ఒకరు బిహార్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
వారంతా రైలులో పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నట్టు కోటా ఎస్పీ తేజస్వినీ గౌతమ్ ఏఎన్‌ఐతో చెప్పారు.
700 మందితో గ్యాంగ్ నడుపుతున్న లారెన్స్ బిష్ణోయీ ఎవరు? టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల తరువాత ఈ గ్యాంగ్ పేరు ఎందుకు వినిపిస్తోంది?
సల్మాన్ నుంచి టైగర్ దాకా.. బాలీవుడ్ నటులపై దాడులతో ఆందోళన
ఉత్తర కొరియా: 50 మీటర్ల ఈత కొలను, జారుడు బల్లలున్న ఆ విలాస నౌక ఎవరిది?
ఇరాన్ కొత్త రక్షణ మంత్రిగా మెహర్దాద్ అఖ్లాఖీ కెతాబ్చీ
ఇరాన్ రక్షణ మంత్రిగా మెహర్దాద్ అఖ్లాఖీ కెతాబ్చీ నియమితులైనట్టు బీబీసీ పర్షియన్ తెలిపింది. పార్లమెంట్ విశ్వాస పరీక్షలో 237 ఓట్లు పొంది రక్షణ మంత్రిగా నియమితులయ్యారు. ఇటీవa యుద్ధంలో మరణించిన అజీజ్ నాసిర్‌జాదే స్థానంలో ఆయన నియామకం జరిగింది.
ఇరాన్ రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో అఖ్లాఖీకి నాలుగు దశాబ్దాలకుపైగా అనుభవం ఉందని అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ పార్లమెంటుకు తెలిపారు. ఇరాన్ క్షిపణి, రక్షణ కార్యక్రమాలలో పాలుపంచుకున్న అనేక మంది ప్రముఖ శాస్త్రవేత్తలు, సైనిక అధికారులతో అఖ్లాఖీ కలిసి పనిచేశారని పేర్కొన్నారు.
ఇటీవలి యుద్ధం తర్వాత ఇరాన్ తన రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకుందని, ఇది ప్రత్యర్థుల సైనిక అంచనాలు మారాయని పార్లమెంటులో చేసిన తొలి ప్రసంగంలో అఖ్లాఖీ అన్నారు.
క్షిపణి సామర్థ్యాల అభివృద్ధికి, ముఖ్యంగా ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులకు ప్రాధాన్యం ఇస్తానని పేర్కొన్నారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో ఈ నియామకం కీలకంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
పంజాబ్: ఉపాధి హామీ పథకం కూలీలపైకి దూసుకెళ్లిన కారు-8 మంది మృతి
పంజాబ్‌లోని సంగ్రూర్‌లో రోడ్డుపై పని చేస్తున్న ఉపాధి హామీ పథకం కూలీలపైకి ఒక కారు దూసుకెళ్లింది. అక్కడ పని చేస్తున్న వారిలో 8 మంది మృతి చెందారు. మరికొందరు కూలీలు గాయపడ్డారు.
సంగ్రూర్ జిల్లాలోని లెహ్రాగాగా-జఖల్ రోడ్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఆ రోడ్డుపై పని చేస్తున్న కూలీలను వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టిందని సంగ్రూర్ ఎస్పీ పల్విందర్ సింగ్ చీమా చెప్పారు. మృతి చెందిన 8 మందిలో ఆరుగురు మహిళలు ఉన్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ దాదాపు 25 మంది వరకు కూలీలు పని చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఒక మోటార్ సైకిల్ కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. మొత్తం ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ప్రమాదం జరిగిన తర్వాత కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీఐ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం ఆయన కోసం గాలిస్తున్నారు.
జంతర్ మంతర్ 2.0: ఈ నిరసనలకు ఎజెండాను ఎవరు నిర్దేశిస్తున్నారు, సీజేపీ తప్పటడుగులు వేస్తోందా?
గుడ్ మార్నింగ్
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం.
నేను బీబీసీ ప్రతినిధి ఖగేష్, మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమైన వార్తలను మీకు అందిస్తాను.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.
శాంతించండి: ప్రజలకు ఫ్రాన్స్ అధ్యక్షుడి పిలుపు
ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఆందోళనలు, దోపిడీలు దాడులకు దారితీయడంతో ప్రజలు సంయమనం పాటించాలని, శాంతియుతంగా ఉండాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ పిలుపునిచ్చారు.
ఎల్సీ పాలెస్‌నుంచి జాతినుద్దేశంచి ప్రసంగించిన ఆయన "పరిస్థితిని మరింత తీవ్రతరం చేయవద్దని" హెచ్చరించారు.
నిరసనకారుల "న్యాయబద్ధమైన డిమాండ్లకు" "విధ్వంసం, లూటీ చేసే వారికి" మధ్య తేడాను గుర్తించాలని మేక్రాన్ సూచించారు. హింసను ఎవరూ, ఎప్పుడూ సమర్థించబోరని దీనికి ఖచ్చితంగా శిక్షలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు.
పెరుగుతున్న ఇంధన ధరలు, జీవన వ్యయం సహా ప్రభుత్వ సేవలు సరిగా అందడం లేదని సుమారు 5,50,000 మంది ప్రదర్శనకారులు చాలావరకు శాంతియుతంగా వీధుల్లోకి వచ్చారు. ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం, పోలీసులు సుమారు 2,400 మందిని అరెస్టు చేశారు.
పారిస్, మార్సెయిల్, ఇతర పట్టణాలు, నగరాల్లో కూడా అల్లరిమూకలు బయటకు వచ్చాయి. వారిలో కొందరు నల్లటి దుస్తులు ధరించి, ముసుగులు ధరించి కార్లకు, భవనాలకు నిప్పు పెట్టారు.
గుడ్‌నైట్.
ఈ లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.
ఈరోజు ముఖ్యమైన వార్తలు కొన్నింటిని ఇక్కడ చూడండి.
రగులుతున్న ఫ్రాన్స్.. ‘దుకాణాలు దోచుకున్నారు, కార్లు, భవనాలు తగలబెట్టారు’
ముంబయి: టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. పోలీసులు ఏమంటున్నారు?
ఫ్రాన్స్: తీవ్రస్థాయికి చేరిన నిరసనలు
అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఘర్షణలు
పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ సరిహద్దులో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణలు జరిగినట్టు వార్తలొచ్చాయి. ఈ ఘటనపై ఇరుదేశాలు భిన్నమైన వాదనలు విన్పిస్తున్నాయి.
పక్తియా ప్రావిన్స్‌లో అఫ్గాన్ భద్రతా బలగాలకు, పాకిస్తాన్ సైనికులకు మధ్య కొన్ని గంటల పాటు కాల్పులు జరిగాయని అప్గానిస్తాన్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని బఖ్తర్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
ఏడుగురు పాకిస్తానీ సైనికులు మరణించారని తాలిబాన్ ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ బఖ్తర్ వార్తాసంస్థ తెలిపింది. దీన్ని స్వతంత్రంగా ధృవీకరించలేదు.
అంతకుముందు, ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లోని అప్పర్ కుర్రం ప్రాంతంలో అఫ్గాన్ తాలిబాన్ ప్రభుత్వ బలగాలు ఎలాంటి కవ్వింపు లేకుండా కాల్పులు జరిపాయని పాకిస్తాన్ సైన్యం వాటికి సమర్థంగా బదులిచ్చిందని భద్రతా వర్గాలను ఉటంకిస్తూ రేడియో పాకిస్థాన్ తెలిపింది.
గత ఏడాదిగా ఇరు దేశాల మధ్య సాయుధ ఘర్షణలు, దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అఫ్గానిస్తాన్‌తో ఉన్న అన్ని వాణిజ్య మార్గాలను పాకిస్తాన్ మూసివేసింది.
కెనడా మిలటరీ బేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. పలువురి మృతి
ఆల్బర్టాలోని కెనడా సైనిక స్థావరానికి సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించినట్లు ఆ దేశ సైన్యం ప్రకటించింది.
ప్రమాద తీవ్రతను ఇంకా అంచనా వేస్తున్నామని, ఎంతమంది మరణించారు.. ఎంతమంది గాయపడ్డారు అనే వివరాలు ఆ తరువాతే వెల్లడిస్తామని ‘ది కెనడియన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్(సీఏఎఫ్) తెలిపింది.
అగ్నిప్రమాదం జరిగిన వేన్‌రైట్ కెనడియన్ ఫోర్సెస్ బేస్ ఆ దేశంలో కీలక మిలటరీ ట్రైనింగ్ కేంద్రం.
కాగా కనీసం ఏడుగురు మరణించారని కెనడానకు చెందిన టీవీ నెట్‌వర్క్ గ్లోబల్ న్యూస్ రిపోర్ట్ చేసింది.
ఫైర్ ట్రైనింగ్ ఎక్సర్‌సైజ్ జరుగుతున్న సమయంలో గ్యాస్ లైన్‌కు కానీ గ్యాస్ వెల్‌పై కానీ ఫైరింగ్ జరగడంతో ప్రమాదం జరిగినట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని మిలటరీ సోర్సెస్‌ను ఉటంకిస్తూ గ్లోబల్ న్యూస్ రిపోర్ట్ చేసింది.
కాగా సీఏఎఫ్, స్థానిక అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారని, మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారని కెనడా రక్షణ మంత్రి డేవిడ్ మెక్‌గింటీ చెప్పారు.
అద్దెకు గర్బా పార్టనర్: ‘నుదుటిపై ముద్దు’, ‘ఆఫ్టర్ పార్టీ’ ఆఫర్ల వెనుక అసలు నిజమేంటి?