రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆయిల్ రిఫైనరీని సందర్శించిన మార్కో రూబియో, సెర్గియో గోర్
అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రి మార్కో రూబియో బుధవారం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆయిల్ రిఫైనరీని సందర్శించారు.
ఈ పర్యటనలో రూబియోతో పాటు భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ కూడా ఉన్నారు. ఆయన ఈ పర్యటనకు సంబంధించిన ఒక ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు, అందులో వారితో పాటు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ఉన్నారు.
గోర్ ఆ పోస్ట్‌లో.. "మార్కో రూబియోతో కలిసి రిలయన్స్ ఇండస్ట్రీస్ జామ్‌నగర్ రిఫైనరీని సందర్శించే గౌరవం నాకు లభించింది. గత ఏడాది కాలంలో అమెరికా నుంచి భారతదేశం చేసే ఎల్‌పిజి దిగుమతుల వాటా 10 శాతం కంటే తక్కువ నుంచి 67 శాతానికి గణనీయంగా పెరిగింది" అని రాశారు.