మీరు ఈ వెబ్‌సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్‌సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.

నన్ను ప్రధాన వెబ్‌సైట్‌కు తీసుకెళ్లండి

అసెంబ్లీ ఎన్నికలు -2026 : తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఓటమి

తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజార్టీతో ఆయనపై విజయం సాధించారు. వీఎస్ బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్‌కు 74,202 ఓట్లు దక్కాయి.

సారాంశం

లైవ్ కవరేజీ

  1. ఆ కంటైనర్‌లో దొరికింది చైనా ఆయుధమా లేక మద్యం సీసానా? పాపువా న్యూ గినియాలో ఏం జరిగింది?

  2. ఏపీలో కూటమి హవాను తట్టుకుని గెలిచిన నలుగురు వైసీపీ నేతలు ఎవరు?

  3. సీడీఎస్ అగ్నివీర్‌ల సర్వీస్ కాలం పొడిగింపు...

    అగ్నివీర్ పథకంపై చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ ఎన్‌.ఎస్. రాజా సుబ్రమణి బుధవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో కీలక సమాచారం వెల్లడించారు.

    అగ్నివీర్ పథకం కింద నాలుగేళ్ల పాటు సైన్యంలో నియమితులైన యువతకు ఇప్పుడు మరో రెండేళ్ల పాటు అదనపు సర్వీస్ చేసే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు.

    "ఈ రోజు భారత రక్షణ దళాలకు, మన అగ్నివీర్‌లకు ఎంతో ముఖ్యమైన రోజు. కేంద్ర మంత్రివర్గం అగ్నివీర్‌లందరికీ భారత రక్షణ దళాల్లో చేరేందుకు మార్గం కల్పించింది" అని జనరల్ ఎన్‌.ఎస్. రాజా సుబ్రమణి అన్నారు.

    2022 జూన్ 14న అగ్నిపథ్ పథకాన్ని ప్రారంభించిన సమయంలోనే అగ్నివీర్‌ల పనితీరును నిరంతరం అంచనా వేస్తామని, ఎప్పటికప్పుడు ఈ పథకాన్ని సమీక్షిస్తామని ప్రకటించినట్లు ఆయన చెప్పారు.

    అగ్నివీర్‌ల తొలి బ్యాచ్ ప్రస్తుతం తమ నాలుగేళ్ల సర్వీస్ కాలాన్ని పూర్తి చేసుకునే దశకు చేరుకుందని, ఈ నాలుగేళ్లలో వారి పనితీరుపై నిర్వహించిన అంచనాల్లో మంచి ఫలితాలు వచ్చాయని, వారి సామర్థ్యంపై సానుకూల స్పందన లభించిందని ఆయన వెల్లడించారు.

    గతంలో ఉన్న నిబంధనల ప్రకారం, అర్హత, ప్రతిభ ఆధారంగా 25 శాతం మంది అగ్నివీర్‌లను మాత్రమే రెగ్యులర్ సైనిక బలగాల్లోకి తీసుకునేవారు. మిగిలిన 75 శాతం మంది నాలుగేళ్ల సర్వీస్ అనంతరం క్రమశిక్షణ, నైపుణ్యాలు కలిగిన యువతగా సమాజంలోకి తిరిగి వెళ్లాల్సి ఉండేది.

    అయితే సవరించిన విధానం ప్రకారం మిగిలిన 75 శాతం మంది అగ్నివీర్‌లకు మరో రెండేళ్ల పాటు అదనపు సర్వీస్ చేసే అవకాశం కల్పించనున్నట్లు జనరల్ సుబ్రమణి తెలిపారు.

    ఈ రెండేళ్ల అదనపు సర్వీస్ పూర్తయిన తర్వాత సాయుధ దళాల్లో చేరేందుకు ఆసక్తి ఉన్న అగ్నివీర్‌లందరినీ నిర్దేశించిన ఎంపిక ప్రమాణాల ఆధారంగా సైన్యంలోకి తీసుకునే అవకాశం ఉంటుందని ఆయన వెల్లడించారు.

  4. గుడ్ ఆఫ్టర్ నూన్

    నేను షేక్ అన్సారి. బీబీసీ ప్రతినిధిని. మధ్యాహ్నం నుంచి లైవ్ పేజీ వార్తలను మీకు అందిస్తాను.

  5. కువైట్‌ను ఆక్రమించుకుని సద్దాం హుస్సేన్ 'కొత్త దేశాన్ని' సృష్టించారు, కానీ అది 4 రోజులే ఎందుకు కొనసాగింది?

  6. న్యూజీలాండ్- భారత్ వన్డే మ్యాచ్ పునఃప్రారంభం, టీమిండియా లక్ష్యం 167 పరుగులు

    ఆక్లాండ్‌లో న్యూజీలాండ్, భారత్ మద్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌ వర్షం తరువాత మళ్లీ మొదలైంది.

    వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలగడంతో ఓవర్లను కుదించారు. దీంతో భారత్ టార్గెట్‌ను కూడా తగ్గించారు.

    పది ఓవర్లు దాటిన తర్వాత భారత్ 54 పరుగుల వద్ద ఉన్నప్పుడు వర్షం పడి మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. కాసేపటి తర్వాత వర్షం ఆగిపోవడం, మైదానంలో పరిస్థితులు ఆటకు అనుకూలంగా ఉండటంతో ఓవర్లు తగ్గించి మ్యాచ్‌ను కొనసాగిస్తున్నారు.

    అయితే అంతరాయం తర్వాత మ్యాచ్ ప్రారంభమైనందున డక్‌వర్త్‌లూయీస్ పద్ధతి ప్రకారం మ్యాచ్‌ ఓవర్లను కుదించారు. 40 ఓవర్లకే మ్యాచ్‌ను పరిమితం చేశారు. అటు లక్ష్యాన్ని కూడా 167కు తగ్గించారు.

  7. ఆస్ట్రేలియా: విషపు కప్పను అడ్డుకోవడానికి వందల కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారు?

  8. న్యూజీలాండ్-భారత్ మొదటి వన్డే : వర్షంతో ఆటకు అంతరాయం, ఇండియా 54/1

    ఆక్లాండ్‌లో జరుగుతున్న తొలి వన్డేలో వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలిగింది.

    న్యూజీలాండ్ నిర్దేశించిన 186 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 10.5 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది.

    లక్ష్య ఛేదన ప్రారంభించిన టీమిండియాకు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.

    ఓపెనర్ రోహిత్ శర్మ ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. కైల్ జేమీసన్ బౌలింగ్‌లో మిచెల్ శాంట్నర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

    అయితే ఆ తర్వాత కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.

    గిల్ 32 బంతుల్లో 17 పరుగులు చేయగా, కోహ్లీ 27 బంతుల్లో 29 పరుగులతో క్రీజ్‌లో నిలిచారు. క్లోహీ తాను ఎదుర్కొన్న బంతుల్లో ఐదు ఫోర్లు కొట్టాడు.

    మరోవైపు భారత్ బౌలర్లు రాణించడంలో కేవలం 40.2 ఓవర్లలోనే న్యూజీలాండ్ 185 పరుగులకు ఆలౌట్ అయింది.

  9. విశాఖ మేయర్‌గా ఎన్నికైన ముక్కా శ్రావణి ఎవరు?

  10. జవగళ్ శ్రీనాథ్, మహమ్మద్ షమీ సరసన అర్ష్‌దీప్

    న్యూజీలాండ్‌లో నాలుగు వికెట్లు తీసిన మూడో భారతీయ పేసర్‌గా అర్ష్‌దీప్ సింగ్ నిలిచాడని ఏఎన్ఐ పేర్కొంది.

    అంతకుముందు జవగళ్ శ్రీనాథ్, మహమ్మద్ షమీ మాత్రమే ఈ ఘనత సాధించారు.

    ఆక్లాండ్‌లో న్యూజీలాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో, అర్షదీప్ 10 ఓవర్లలో 70 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.

    న్యూజీలాండ్‌ గడ్డపై వన్డేల్లో ఒక భారతీయ పేసర్ నమోదు చేసిన అత్యుత్తమ ప్రదర్శనల్లో ఇది నాలుగో స్థానంలో ఉంది.

    ఈ జాబితాలో మొదటి రెండు స్థానాల్లో జవగళ్ శ్రీనాథ్ (2003లో ఆక్లాండ్‌లో 4/23, 1995లో నేపియర్‌లో 4/52) ఉన్నాడు. మూడో స్థానంలో మహమ్మద్ షమీ (2014లో నేపియర్‌లో 4/55) ఉన్నాడు.

    ఈ ఏడాది ఆడిన ఐదు వన్డేల్లో, అర్ష్‌దీప్ 23.08 సగటుతో, 6.08 ఎకానమీ రేటుతో మొత్తం 12 వికెట్లు తీశాడు. ఇందులో 70 పరుగులకు 6 వికెట్లు తీయడం ఆయన అత్యుత్తమ ప్రదర్శన..

    ఈ ఇన్నింగ్స్ తర్వాత అర్ష్‌దీప్ మాట్లాడుతూ.. "ఇక్కడి వాతావరణం చాలా బాగుంది, పిచ్ కూడా బౌలర్లకు బాగా సహకరిస్తోంది. ఉపఖండం నుంచి వచ్చిన తర్వాత, ఇలాంటి పిచ్‌లపై బౌలింగ్ చేయడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అంతేకాకుండా, గాలి కూడా బౌలింగ్‌కు అనుకూలిస్తోంది" అని పేర్కొన్నాడు.

    షార్ట్ బాల్ వ్యూహం విజయవంతం కావడంపై స్పందిస్తూ, "పిచ్‌లో బౌలర్లకు ఏదో ఉందని అనిపించింది, అందుకే బంతిని సీమ్‌పై గట్టిగా వేస్తూ పిచ్ నుంచి లభించే సహకారాన్ని ఉపయోగించుకోవాలని ప్రయత్నించాం. బ్యాటర్లు ఆ లెంగ్త్‌లో షాట్లు ఆడటానికి ప్రయత్నించడంతో వికెట్లు దక్కాయి" అని వివరించారు.

  11. న్యూజీలాండ్‌తో మొదటి వన్డేలో భారత్ టార్గెట్ 186 పరుగులు

    ఆక్లాండ్‌లో జరుగుతున్న మొదటి మ్యాచ్‌లో భారత్‌ ముందు 186 పరుగుల లక్ష్యాన్ని న్యూజీలాండ్ ఉంచింది.

    భారత్ కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో న్యూజీలాండ్ కేవలం 40.2 ఓవర్లలోనే 185 పరుగులకు ఆలౌటైంది.

    ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శుభమన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నారు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజీలాండ్‌పై మొదటి బంతి నుంచే టీమిండియా పట్టుసాధించింది. భారత బౌలర్ల ఒత్తిడికి కివీస్ బ్యాటర్లు పెద్ద పెద్ద భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలమయ్యారు.

    ఓపెనర్ విల్ యంగ్ 9 పరుగులకే అవుట్ కాగా, హెన్రీ నికోల్స్ కూడా 9 పరుగులు మాత్రమే చేయగలిగాడు. టిమ్ సీఫర్డ్ 38 పరుగులు చేసి టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. డారిల్ మిచెల్ 28 పరుగులు చేసినా జట్టును ఆదుకోలేకపోయాడు.

    మిడిల్ ఆర్డర్‌లో గ్లెన్ ఫిలిప్స్ 30 పరుగులతో పోరాడగా, కెప్టెన్ మిచెల్ సాంట్నర్ నాలుగు పరుగులకే వెనుదిరిగాడు. చివర్లో బ్లెయిర్ టిక్నర్ 23 బంతుల్లో 34 పరుగులు చేసి కొంత మెరుగైన స్కోరు అందించాడు. జాకబ్ డఫీ 15 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

    భారత్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్‌ చేసి 10 ఓవర్లలో 70 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. గుర్నూర్ బ్రార్ 3వికెట్లు పడగొట్టాడు. అన్షుల్ కాంబోజ్‌కు రెండు వికెట్లు దక్కాయి.

    ఒక దశలో 73/2గా నిలిచిన న్యూజీలాండ్ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి 146/9 స్థితికి చేరింది. చివర్లో టిక్నర్ కొంత ప్రతిఘటన చూపినప్పటికీ జట్టు స్కోరును 200 పరుగులు దాటించలేకపోయాడు.

  12. అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు అంగీకరిస్తున్నట్టు డోనల్డ్ ట్రంప్ ప్రకటన

    రిపబ్లికన్ పార్టీకి కంచుకోటలుగా ఉండే కొన్ని నియోజకవర్గాలలో డెమోక్రటిక్ అభ్యర్థులు విజయం సాధించిన తర్వాత, అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ న్యూయార్క్ టైమ్స్‌తో మాట్లాడారు.

    న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఆ ఇంటర్వ్యూలో.. మధ్యంతర ఎన్నికల ఫలితాలను పూర్తిగా అంగీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ చెప్పారు.

    ప్రతిపక్షంతో కలిసి పనిచేయడం గురించి కూడా మాట్లాడారు.

    "అవును, ఈ ఫలితాలను అంగీకరించడానికి నేను పూర్తిగా సిద్ధంగా ఉన్నాను" అని ట్రంప్ అన్నారు.

    " వారితో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాం," అని చెప్పారు.

    " కలిసి బహుశా ఒక మార్గాన్ని కనుగొనగలం," అని ట్రంప్ అన్నారు.

    అయితే, కొంతసేపటి క్రితం ట్రంప్ తన సోషల్ మీడియా హ్యాండిల్ 'ట్రూత్ సోషల్'లో 'వీటో' అని రాసి ఉన్న ఒక టోపీ ఫోటోను షేర్ చేశారు. .

    సెనేట్, హౌస్‌లో తన మెజారిటీని కోల్పోయిన తర్వాత కూడా ట్రంప్ తన అధ్యక్ష అధికారాలన్నింటినీ వినియోగిస్తానని సూచిస్తూ, ఆయన గతంలో బీబీసీ యూఎస్ వార్తా భాగస్వామి అయిన సీబీఎస్‌తో చెప్పారు.

  13. విరాట్, రోహిత్, గిల్‌కు కొత్త జెర్సీ

    ఆక్లాండ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్ జట్టు, ఆ దేశపు రగ్బీ దిగ్గజం కెవెన్ మీలాముతో సమావేశమైందని బీసీసీఐ పేర్కొంది.

    ఈ సమావేశంలో, భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి మీలాము రగ్బీ జెర్సీలను బహుకరించారు.

    "ఆట ప్రారంభానికి ముందు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు న్యూజిలాండ్ రగ్బీ దిగ్గజం కెవెన్ మీలామును కలిశారు. ఈ సందర్భంగా ఆయన వారికి ప్రత్యేకంగా రూపొందించిన రగ్బీ జెర్సీలు అందించారు" అని బీసీసీఐ తన 'ఎక్స్' ఖాతాలో పేర్కొంది.

    ఆక్లాండ్‌లో జరిగిన ఈ మొదటి వన్డేలో, టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మొదట బౌలింగ్ ఎంచుకున్నారు. 38 ఓవర్లు ముగిసే సరికి 9 వికెట్లు కోల్పోయి 181 పరుగులు మాత్రమే చేసింది. అర్షదీప్ నాలుగు వికెట్లు తీయగా, అన్షుల్ కాంబోజ్, గుర్నూర్ బ్రార్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

    2027 వన్డే ప్రపంచ కప్‌ను లక్ష్యంగా పెట్టుకున్న భారత్, ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ఈడెన్ పార్క్‌లో ప్రారంభించింది.

    ఈ సిరీస్‌తో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి వన్డే ఫార్మాట్‌లోకి అడుగుపెట్టారు. న్యూజిలాండ్‌లో వన్డేల్లో భారత్ చివరిసారిగా ఫిబ్రవరి 2019లో విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన రెండు సిరీస్‌లలో భారత్ వరుసగా 3-0, 1-0 తేడాతో ఓటమిని చవిచూసింది (రెండవ పర్యటనలో రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి).

  14. “నేను బరిలో ఉండుంటేనా...” అమెరికా మధ్యంతర ఎన్నికలపై ట్రంప్ స్పందన

    రిపబ్లికన్ పార్టీకి ప్రతికూల ఫలితాలు వస్తున్న వేళ డోనల్ట్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్'లో స్పందించారు.

    "నేను ఎన్నికల బరిలో లేను. ఒకవేళ నేను ఉండి ఉంటే, మనం భారీ మెజారిటీతో గెలిచేవాళ్లం" అని ట్రంప్ రాసుకొచ్చారు.

    ఈ ఎన్నికల్లో తాను అభ్యర్థిని కాదని, ఒకవేళ బరిలో ఉండి ఉంటే ఫలితాలు వేరేగా ఉండేవని.. తన పార్టీ భారీ మెజారిటీతో గెలిచి ఉండేదని ఆ పోస్ట్‌లో ట్రంప్ పేర్కొన్నారు.

    మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థుల ఓటమికి వారే కారణమని, తనకు సంబంధం లేదని అర్థం వచ్చేలా ట్రంప్ చేసిన ప్రకటన ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

  15. హైదరాబాద్‌లో ‘7 కోట్ల రూపాయల’ ఫేక్ కరెన్సీ స్వాధీనం

    హైదరాబాద్ శివారు ప్రాంతంలో నకిలీ కరెన్సీ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి ‘7 కోట్ల రూపాయల’ ఫేక్ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.

    అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు, షాద్‌నగర్ ఎస్‌ఓటి కలిసి ఈ రాకెట్‌ను పట్టుకున్నాయి.

    పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేసి, మొత్తం రూ. 6.78 కోట్ల నకిలీ రూ. 500 కరెన్సీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు.

    జాతీయ రహదారి -65పై పోలీసులు నవంబర్ 1న తనిఖీలు చేపట్టారు. ఒక కారును ఆపి తనిఖీలు చేస్తే అసలు గుట్టు బయటపడింది. మడుపోజు కరుణాకర్, చిన్నొల్ల మాణిక్య రెడ్డి, చెరుకుపెల్లి రత్నాకర్ రెడ్డి, కరణం అజయ్ కుమార్‌ను అరెస్టు చేశారు.

    ఈ రాకెట్‌లో ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తులను గుర్తించేందుకు తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి చెప్పారు.

  16. రంగా కార్పొరేటర్‌గా గెలిచిన బెజవాడకు ఇప్పుడు రాధా మేయర్

  17. ఏడు విమానాలకు బాంబు బెదిరింపులు, యూరప్ వ్యాప్తంగా కలకలం

    యూరప్ వ్యాప్తంగా 7 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో భద్రతా సిబ్బంది తనిఖీలు చేపట్టారు. వీటిలో రెండు యూకే నుంచి బయలుదేరాయి.

    డబ్లిన్, లిస్బన్ నుంచి బయలుదేరిన రెండు రైనాఎయిర్ విమానాలు రోమ్‌లో ల్యాండ్ చేసి సోదాలు చేశారు. అయితే, ఎటువంటి పేలుడు పదార్థాలు లభించలేదని ఆ నగరంలోని ఫియుమిసినో విమానాశ్రయ వర్గాలు బీబీసీకి తెలిపాయి.

    డబ్లిన్ విమానం దిగే వరకు ఇటాలియన్ వైమానిక దళం దానికి రక్షణగా నిలిచింది. అధికారులు పోలాండ్, స్పెయిన్, బల్గేరియాలోని విమానాల్లో కూడా తనిఖీలు చేపట్టారు.

    ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోయినప్పటికీ, కావాలనే గగనతల ప్రయాణానికి అంతరాయం కలిగించేందుకు గందరగోళపరిచేందుకు ఇలాంటి ప్రయత్నాలు జరిగాయా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.

    "దురుద్దేశపూర్వక బూటకపు బెదిరింపులు"గా యూకే ప్రభుత్వం అభివర్ణించింది.

    "ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన విమానయాన భద్రతా వ్యవస్థలలో ఒకటి తమ వద్ద ఉందని, ఇలాంటి దురుద్దేశపూర్వక బూటకపు బెదిరింపులతో పాటు, ఏవైనా ముప్పులను ఎదుర్కొనే శక్తి ఉంది" అని ఒక ప్రకటనలో పేర్కొంది.

    ప్రయాణీకుల విమానాల్లో బాంబు బెదిరింపులు "అంత తరచుగా జరగవని", అందువల్ల తాజా ఘటనలు "అసాధారణమైనవని" విమానయాన భద్రతా నిపుణుడు పాల్ మేసన్ అన్నారు.

  18. మిడ్‌టర్మ్ ఎలక్షన్స్ : ట్రంప్‌ నిర్ణయాలకు ఈ ఫలితాలు కళ్లెం వేస్తాయా?

  19. ఫ్లోరిడాలో రిపబ్లికన్ అభ్యర్థిపై భారత సంతతికి చెందిన పియా దండియా విజయం

    అమెరికా మధ్యంతర ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కొన్నిచోట్ల ఫలితాలు వస్తున్నాయి.

    డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, భారత సంతతికి చెందిన పియా దండియా ఫ్లోరిడాలోని 22వ కాంగ్రెస్ నియోజకవర్గం స్థానాన్ని గెలుచుకున్నట్టు ఛానల్ సీబీఎస్ పేర్కొంది. ఆమె రిపబ్లికన్ అభ్యర్థి కేసీ ఆస్కార్‌ను ఓడించారు.

    2026 మధ్యంతర ఎన్నికలకు ముందు ఫ్లోరిడా గవర్నర్ రాన్ డెసాంటిస్ చేపట్టిన కాంగ్రెస్ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా తిరిగి ఏర్పడ్డ ఈ కొత్త నియోజకవర్గంలో దండియా విజయం డెమోక్రటిక్ పార్టీకి దక్కిన ఘనతగా నిలిచింది.

    దండియా గతంలో హార్లెమ్‌లో ఉపాధ్యాయురాలిగా, ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. ఆమె వైట్ హౌస్ ఫెలోగా కూడా సేవలందించారు. ఆపిల్‌లో కూడా పనిచేశారు.

    ఎన్ఆర్ఐ సంతతి అయిన దండియా పామ్ బీచ్ కౌంటీలో పుట్టి పెరిగారు. తన ప్రచారంలో విద్య, ద్రవ్యోల్బణ సవాళ్లు, ఆర్థిక అవకాశాలను కీలక అంశాలు ప్రస్తావించారు.

    ఆగస్టులో జరిగిన డెమోక్రటిక్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో దండియా గెలుపొందారు.

    దాండియా ప్రత్యర్థి అయిన కేసీ అస్కార్ నేపుల్స్‌కు చెందిన ఒక వ్యాపారవేత్త, మెరైన్ కార్ప్స్ మాజీ సైనికుడు. ప్రచార సమయంలో, ఆయన తనను తాను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన ప్రభుత్వ విధానాల మద్దతుదారుగా అభివర్ణించుకున్నారు.

  20. ధన త్రయోదశి: బంగారం, వెండి భవిష్యత్‌ ఏంటి?