మీరు ఈ వెబ్‌సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్‌సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.

నన్ను ప్రధాన వెబ్‌సైట్‌కు తీసుకెళ్లండి

అసెంబ్లీ ఎన్నికలు -2026 : తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఓటమి

తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజార్టీతో ఆయనపై విజయం సాధించారు. వీఎస్ బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్‌కు 74,202 ఓట్లు దక్కాయి.

సారాంశం

లైవ్ కవరేజీ

  1. సెర్బియా: విద్యార్థుల ఉద్యమానికి తలవంచిన అధ్యక్షుడు వుచిచ్.. ఓటమిని అంగీకరిస్తున్నానంటూ ప్రకటన

    సెర్బియాలో సుదీర్ఘ కాలంగా పదవిలో ఉన్న అధ్యక్షుడు అలెక్సాండర్ వుచిచ్ ఎన్నికల్లో తన ఓటమినిఅంగీకరించారు.

    కొద్దికాలంగా సాగుతున్న విద్యార్థుల ఉద్యమానికి ఆయన తలవంచారు.

    ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే రాజధాని బెల్‌గ్రేడ్, నోవి సాడ్ సహా పలు నగరాల్లో ప్రజలు భారీగా వీధుల్లోకి వచ్చి విజయోత్సవాలు చేసుకున్నారు.

    అవినీతి, పరిపాలన నిర్లక్ష్యానికి నిరసనగా రెండేళ్ల క్రితం ప్రారంభమైన విద్యార్థుల ఉద్యమం ఈ ఎన్నికల్లో వివిధ వర్గాలకు చెందిన అభ్యర్థులతో బరిలోకి దిగి సంచలన విజయం నమోదు చేసింది.

    ఈఎన్నికల్లో ఓడిపోయామని స్పష్టంగా తెలుస్తోందని రైట్ వింగ్ నాయకుడు వుచిచ్ తన ఓటమిని అంగీకరించారు.

    97 శాతం పోలింగ్ కేంద్రాల ఓట్ల లెక్కింపు పూర్తికాగా.. విద్యార్థులకు 22 లక్షల 50 వేల ఓట్లు లభించాయని, అధికార పార్టీకి 16 లక్షల 70 వేల ఓట్లు వచ్చినట్టు సెర్బియా ఎన్నికల కమిషన్ తెలిపింది.

    ప్రాథమిక ఫలితాల ప్రకారం విద్యార్థుల నేతృత్వంలోని నిరసన ఉద్యమం 52.7 శాతం ఓట్లు సాధించగా, వుచిచ్‌కు చెందిన సెర్బియన్ ప్రోగ్రెసివ్ పార్టీ 39.2 శాతం ఓట్లు మాత్రమే సాధించింది.

    వుచిచ్ ఇప్పటికే రెండు సార్లు అధ్యక్షుడిగా పని చేశారు. రాజ్యాంగ పరిమితుల కారణంగా మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు వీలు లేకపోవడంతో 2017లో విడిచిపెట్టిన ప్రధానమంత్రి పదవిని తిరిగి దక్కించుకోవాలన్న లక్ష్యంతో తన పార్టీకి నాయకత్వం వహించారు.

  2. తీవ్ర తుపానుగా మారిన అర్నబ్.. విశాఖకు 300 కి.మీ. దూరంలో కేంద్రీకృతం

    పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ తుపాను అతి తీవ్ర తుపానుగా బలపడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

    అర్నబ్ తుపాను గంటకు 25 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని ఆ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

    మంగళవారం వేకువజామున విడుదల చేసిన బులెటిన్‌లో.. విశాఖకు 300 కి.మీ., కాకినాడకు 360 కి.మీ., మచిలీపట్నానికి 460, బాపట్లకు 530 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు తెలిపారు.

    సాయంత్రం వరకు పశ్చిమ-వాయువ్య దిశగా కొనసాగి, ఆ తర్వాత వాయువ్య దిశగా పయనమవుతుందని బులెటిన్‌లో వెల్లడించారు.

    బుధవారం ఉదయం బాపట్ల -విశాఖపట్నం మధ్య, యానాం సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందన్నారు.

    అర్నబ్ తుపాను ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని జైన్ తెలిపారు. అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు ఉంటాయని కూడా అంచనా వేశారు. కోస్తా తీరం వెంబడి గంటకు 90 నుంచి 100 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించారు.

    ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

    అర్నబ్ తుపాను కదలికలపై భారత వాతావరణ శాఖ కూడా వేకువజామున 3 గంటలకు ఒక బులెటిన్ విడుదల చేసింది.

    ఈ తుపాను మరింత బలపడి అత్యంత తీవ్రమైన తుపానుగా మారిందని పేర్కొంది. ఈ తుపాను తీరం దాటేటప్పుడు గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని కూడా వెల్లడించింది.

    ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతం, ఒడిశాలోని దక్షిణ తీర ప్రాంతంలో రెడ్ అలర్ట్ జారీ చేసింది.

  3. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం.

    నేను బీబీసీ ప్రతినిధి ఖగేష్, మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమైన వార్తలను మీకు అందిస్తాను.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి

  4. జింకను మింగేసిన కొండ చిలువ

  5. ఆంధ్రప్రదేశ్ స్థానిక పోరులో ‘నామినేషన్ల’ రగడ: ప్రజాస్వామ్యమా లేక బలప్రదర్శనా?

  6. ఆంధ్రప్రదేశ్: అర్నబ్ తుపాను సహాయక చర్యల కోసం 20 జిల్లాలకు రూ.27 కోట్ల నిధులు

    ఆంధ్రప్రదేశ్‌లో అర్నబ్ తుపాను సహాయక చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం 20 జిల్లాలకు రూ.27 కోట్ల నిధులు విడుదల చేసింది.

    బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాలకు రూ.2 కోట్ల చొప్పున నిధులు విడుదల చేశారు.

    శ్రీకాకుళం, మార్కాపురం, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, అల్లూరి, పోలవరం, మన్యం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీసత్యసాయి, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రూ.కోటి చొప్పున నిధులు మంజూరు చేస్తూ విపత్తుల నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ జి. సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

  7. ‘బ్రెజిల్ ఎప్పటికీ లొంగదు’ అన్న లూలా డ సిల్వా గెలుపు అమెరికాకు ఎలాంటి సందేశం?

    బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష నాయకుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా విజయం సాధించారు.

    ఈ విజయంతో 80 ఏళ్ల వర్కర్స్ పార్టీ అధినేత నాలుగోసారి బ్రెజిల్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్నారు.

    రెండో రౌండ్ అధ్యక్ష ఎన్నికల్లో ఆయన తన ప్రత్యర్థి, రైట్ వింగ్ లిబరల్ పార్టీ నాయకుడు ఫ్లావియో బోల్సోనారోపై స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు.

    లాటిన్ అమెరికాలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన బ్రెజిల్‌లో ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి లులాకు 51.76 శాతం ఓట్లు వచ్చాయి.

    జైల్లో ఉన్న మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో కుమారుడు ఫ్లావియో బోల్సోనారోకు 48.24 శాతం ఓట్లు లభించాయి.

    పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

  8. అర్నబ్: తుపాను ఎక్కడుంది? ఎప్పుడు తీరం దాటుతుంది, ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి?

  9. ‘బ్రెజిల్ ఎప్పటికీ లొంగదు’ అన్న లూలా డ సిల్వా గెలుపు అమెరికాకు ఎలాంటి సందేశం?

  10. ఇంజమామ్ ఉల్ హక్: సిక్స్ కొట్టాలని ఉందని సెహ్వాగ్ చెబితే, ఫీల్డర్లను ముందుకు తీసుకొచ్చిన పాకిస్తానీ కెప్టెన్

  11. సౌదీలో చిక్కుకున్న భారతీయ యాత్రికుల పరిస్థితి ఎలా ఉంది?

  12. పార్లమెంట్‌కు సమీపంలో నార్త్ బ్లాక్‌లో కమ్ముకున్న దట్టమైన పొగ– వెల్డింగ్ పనుల కారణంగా చెలరేగిన మంటలు

    పార్లమెంట్‌కు సమీపంలో నార్త్‌బ్లాక్‌లో సోమవారం ఒక్కసారిగా దట్టమైన పొగ కమ్ముకుంది.

    “పార్లమెంట్‌కు వెళ్తున్నప్పుడు, నార్త్‌బ్లాక్ వెనుకాల దట్టమైన పొగను గమనించాను. అక్కడ అగ్ని ప్రమాదం జరిగిం ఉండొచ్చని అనుమానం వచ్చింది. అంతా క్షేమంగా ఉంటారని భావిస్తున్నాను. అత్యవసర సిబ్బంది వేగంగా స్పందించాలని కోరుకుంటున్నాను” అని బీజేపీ ఎంపీ మిలింద్ డియోరా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు.

    “దిల్లీలోని నార్త్‌బ్లాక్‌లో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. ఓ భవనంలోని చిల్లర్ ప్లాంట్‌లో ఉపయోగించే ఫైబర్ ట్యాంక్‌కు మంటలు అంటుకున్నాయి. దీంతో నల్లటి పొగ భారీగా వ్యాపించింది. దీంతో సమీపంలోని ప్రజలు కొద్దిసేపు ఆందోళనకు గురయ్యారు” అని హిందూ పేర్కొంది.

    నార్త్‌బ్లాక్‌లో వెల్డింగ్ వర్క్ చేస్తుంటే చిన్న అగ్ని ప్రమాదం జరిగింది. వెల్డింగ్ నుంచి వచ్చిన నిప్పు రవ్వలు సమీపంలోని ట్యాంక్‌కు వ్యాపించి మంటలు చెలరేగి పొగ వ్యాపించింది అని ఏఏఎన్ఎస్ పేర్కొంది.

    ఘటన జరిగిన వెంటనే మంటలను ఆర్పేశారు. కొన్ని ప్రాంతాల్లో రాకపోకలను పునరుద్ధరించారు. ఎవరూ గాయపడినట్టు రిపోర్ట్ కాలేదు.

    సోమవారం 11 గంటలకు అగ్ని ప్రమాదం సమాచారం అందింది. సమాచారం వచ్చిన వెంటనే ఘటనా స్థలానికి 6 ఆగ్నిమాపక యంత్రాలను పంపి మంటలను అదుపు చేసినట్టు దిల్లీ ఫైర్ డిపార్ట్‌మెంట్ చెప్పింది.

  13. రాహుల్ గాంధీ కాన్వాయ్‌కు ప్రమాదం

    ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌ రహదారిపై రాహుల్ గాంధీ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఆయన కాన్వాయ్‌లోని వాహనాలే ఒకదానికొకటి ఢీకొన్నాయి.

    అందరూ క్షేమంగా ఉన్నారని పవన్ ఖేరా చెప్పినట్టు బీసీసీ ప్రతినిధి ప్రేరణ తెలిపారు.

    చాలా స్వల్ప ప్రమాదమని, ఎవరికీ ఎలాంటి తీవ్రమైన గాయాలు కాలేదని న్యూస్ ఏజెన్సీ పీటీఐ పేర్కొంది.

    రాహుల్ గాంధీ లఖ్‌నవూ నుంచి సుల్తాన్‌పూర్ వెళ్తుండగా హాలియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదం జరిగిందని ఐఏఎన్‌ఎస్ రిపోర్టు చేసింది.

    ప్రమాదంలో కారు బానెట్ ధ్వంసమైనట్టు వివరించింది.

    ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ రాహుల్ గాంధీ వెంటనే వేరే వాహనంలో సుల్తాన్‌పూర్ వెళ్లినట్టు తెలిపింది. ఎంపీ-ఎంఎల్‌ఏ కోర్టు ముందు హాజరయ్యేందుకు రాహుల్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

  14. న్యూజీలాండ్‌తో జరిగే మూడో టీ20కి ఇషాన్ కిషన్ దూరం

    తొడ కండరాలు పట్టేయడంతో న్యూజీలాండ్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌కి కూడా ఇషాన్ కిషన్ దూరంకానున్నట్టు బీసీసీఐ ప్రకటించింది.

    న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లోని తొలి టీ20 మ్యాచ్‌లో కుడి తొడ కండరాలు గాయంతో రెండో టీ20కి దూరమయ్యాడు. ఆయన స్థానంలో వైభవ్ సూర్యవంశీ ఆడాడు. రెండో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన వైభవ్ ఆకట్టుకోలేకపోయాడు.

    ఇషాన్ కిషన్ ప్రస్తుతం కోలుకుంటున్నాడని బీసీసీఐ తెలిపింది. అతను ఇంకా మ్యాచ్ ఆడే స్థాయికి పూర్తి ఫిట్‌నెస్‌ సాధించలేదని వెల్లడించింది. అందుకే అక్టోబర్ 27న వెల్లింగ్‌టన్‌లో జరగనున్న మూడో టీ20 మ్యాచ్‌కు దూరమవుతున్నట్టు పేర్కొంది. బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఇషాన్ కోలుకుంటున్నాడని చెప్పింది. కుమార్ కుశాగ్ర మూడో టీ20 మ్యాచ్‌లో ఆడతాడని వెల్లడించింది.

  15. మోదీని ఉద్దేశించి ఖర్గే చేసిన వ్యాఖ్యలేంటి, క్షమాపణ చెప్పాలని బీజేపీ ఎందుకు డిమాండ్ చేస్తుంది?

  16. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ‘అర్నబ్’ తుపానుగా మారినట్టు ఐఎండీ ప్రకటన

    తూర్పు-మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి ‘అర్నబ్’ తుపానుగా మారిందని ఐఎండీ ప్రకటించింది.

    ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ ఒడిశా తీరాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

    ఈరోజు (అక్టోబర్ 26) ఉదయం 5:30 గంటలకు తుపాను 15.4° ఉత్తర అక్షాంశం, 88.9° తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఉందని ప్రకటించింది. శ్రీ విజయపురం (అండమాన్ దీవులు)కు వాయువ్య దిశలో 590 కిలోమీటర్ల దూరంలో, ఒడిశాలోని గోపాలపూర్‌కు ఆగ్నేయ దిశలో 610 కి.మీ దూరంలో, విశాఖపట్నానికి తూర్పు-ఆగ్నేయ దిశలో 650 కి.మీ దూరంలో, కాకినాడకు తూర్పు-ఆగ్నేయ దిశలో 730 కి.మీ దూరంలో, మచిలీపట్నానికి తూర్పు దిశలో 830 కి.మీ దూరంలో, బాపట్లకు తూర్పు దిశలో 910 కి.మీ దూరంలో ఉంది.

    మరింత బలపడనున్న తుపాను

    అర్నబ్ తుపాను పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఈ అర్ధరాత్రి నాటికి తీవ్ర తుపానుగా, అక్టోబర్ 27 నాటికి అత్యంత తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అక్టోబర్ 28 ఉదయం బాపట్ల- విశాఖ మధ్య తీరాన్ని దాటే అవకాశముంది.

    తీరాన్ని దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. అలాగే ఈదురుగాలుల వేగం 140 కిలోమీటర్ల వరకు చేరే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.

  17. జేబులో రూ. 300తో బస్సెక్కి బెంగళూరు వచ్చిన కుర్రాడు ఇండియాలో అగ్రశ్రేణి నటుల్లో ఒకరిగా ఎలా ఎదిగారు?

  18. బ్రెజిల్‌ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన లులా డా సిల్వా, మూడు వారాల్లోనే మారిన ఫలితం

    బ్రెజిల్‌కు చెందిన సీనియర్ వామపక్ష నేత, ప్రస్తుత అధ్యక్షుడు లుయిజ్ ఇనాసియో లులా డా సిల్వా మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తీవ్ర పోటీ, పరస్పర విమర్శల మధ్య సాగిన ఎన్నికల్లో ఆయన తన రైట్‌వింగ్ ప్రత్యర్థి ఫ్లావియో బోల్సోనారోను ఓడించి పీఠాన్ని కైవశం చేసుకున్నారు.

    లులా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించడం ఇది నాల్గోసారి. ఆయన 2003 జనవరి నుంచి 2010 డిసెంబర్ వరకు వరుసగా రెండు సార్లు బ్రెజిల్ అధ్యక్షుడిగా పని చేశారు. అనంతరం 2003జనవరిలో మళ్లీ అధ్యక్ష పదవి చేపట్టారు. ఇప్పుడు నాల్గోసారి గెలుపొందారు.

    అయితే, ఆదివారం జరిగిన తుది దశ ఓటింగ్‌లో లులా గెలుపొందడం అంత సులభంగా జరగలేదు. చాలా ఒడిదుడుకులు, సవాళ్లను ఎదుర్కొని ఈ విజయం సాధించారు.

    అక్టోబర్ 4న జరిగిన తొలి దశలో లులాపై బోల్సోనారో ఆధిక్యం సాధించారు. అయితే కేవలం మూడు వారాల్లోనే ఆ ఫలితాన్ని తలకిందులు చేసి లులా విజయం సాధిస్తారని అంచనాలు లేవు.

    లాటిన్ అమెరికాలో ఇటీవల కనిపిస్తున్న రాజకీయ ధోరణికి భిన్నంగా కూడా లులా విజయం సాధించారు. అక్కడి ఓటర్లు అధికారంలో ఉన్న నేతలను తిరస్కరిస్తూ, మితవాద పార్టీలకు మద్దతు ఇస్తున్నారు. అర్జెంటీనా, చిలీ, కొలంబియా వంటి దేశాల్లో ప్రస్తుతం కన్జర్వేటివ్ నేతలే అధికారంలో ఉన్నారు.

    లులా ఒక మాజీ మెటల్ వర్కర్. ఆయన 1989లో తొలిసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. అప్పటి నుంచి వామపక్ష రాజకీయాల్లో ప్రధాన నాయకుడిగా ఉంటూ వచ్చారు. 2003లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యేనాటికి ఆ దేశం చాలా సవాళ్లను ఎదుర్కొంటోంది.

    ఇప్పుడు ఆయన పదవీ కాలం 2027 జనవరి 5 న ప్రారంభంకానుంది. ఇప్పుడు కూడా ఆయనకు అనేక సవాళ్లు ఎదురుకానున్నాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తో ఉన్న విభేదాలు ఆయనకు ఎదురయ్యే ప్రధాన ఛాలెంజ్.

  19. బుకాంగి: కాలువలోకి వచ్చిన ఆడ సొర చేపను ఎన్నిసార్లు వెనక్కు పంపినా ఎందుకు మళ్లీమళ్లీ అక్కడికే వచ్చింది? ఇప్పుడది ఎక్కడుంది