ఫొటో సోర్స్, PRAKASH MATHEMA / AFP via Getty Images
ఫొటో క్యాప్షన్, ఐదురోజుల తిహార్ పండుగ సందర్భంగా కఠ్మాండూలో నవంబర్8వ తేదీ ఆదివారం రాత్రి నింగి వెలుగులీనింది. ప్రజలు లక్ష్మీపూజ జరుపుకుని, దీపాలు వెలిగించారు. బాణాసంచా కాల్చారు.
ప్రచురణ
చదివే సమయం: 4 నిమిషాలు
భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు.
దేశవ్యాప్తంగా ప్రజలు దీపాలు వెలిగించి, బాణాసంచా కాల్చి ఈ దీపాల పండుగను జరుపుకుంటుండగా, విదేశాలలో కూడా దీపావళి ఆనందం కనిపించింది.
ఐదు రోజుల తిహార్ పండుగలో భాగంగా నేపాల్ రాజధాని కాఠ్మాండులో లక్ష్మీ పూజ సందర్భంగా బాణసంచా ప్రదర్శించగా, శ్రీలంకలోని కొలంబోలో ఉన్న శ్రీ పొన్నంబలమవనేశ్వరర్ ఆలయంలో పెద్ద సంఖ్యలో భక్తులు ప్రార్థనలు చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లోని కోబ్రా ఆపరేషన్స్ బేస్‌లో భద్రతా దళాల సిబ్బందితో కలిసి దీపావళి పండుగ జరుపుకున్నారు.
లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు, అలాగే ఆయనే స్వయంగా స్వీట్లు తయారు చేస్తూ కనిపించారు.
దుబయ్‌లోని బుర్జ్ ఖలీఫా పై 'హ్యాపీ దీపావళి' అనే సందేశం కాంతులీనుతూ కనిపించింది.
ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, వాయుకాలుష్యంపై ఆందోళనలు, బాణసంచా కాల్చడంపై ఆంక్షలు ఉన్నా, వాటిని ఉల్లంఘిస్తుండటంతో, దీపావళి తరువాత నగరాల్లో వాయు కాలుష్యం పెరుగుతోంది.
ఫొటో సోర్స్, @airnewsalerts
ఫొటో క్యాప్షన్, యూఏఈలోని బుర్జ్ ఖలీఫాను దీపావళి సందర్భంగా విద్యుద్దీపాలతో అలంకరించారు. ఆ భవనంపై "హ్యాపీ దీపావళి" అనే సందేశాన్ని హిందీ ఆంగ్ల భాషలలో కూడా ప్రదర్శించారు.
ఫొటో సోర్స్, PRAKASH MATHEMA / AFP via Getty Images
ఫొటో క్యాప్షన్, ఐదు రోజుల తిహార్ పండుగలో భాగంగా నేపాల్ రాజధాని కఠ్మాండూలోని స్వయంభూనాథ్ ఆలయాన్ని లక్ష్మీ పూజ కోసం అలంకరించారు.
ఫొటో సోర్స్, Sai Aung MAIN / AFP via Getty Images
ఫొటో క్యాప్షన్, మియన్మార్‌లోని యాంగోన్‌లో దీపావళి పండుగ సందర్భంగా ఒక ఆలయంలో భక్తులు దీపాలు వెలిగిస్తూ కనిపించారు.
ఫొటో సోర్స్, Ishara S. KODIKARA / AFP via Getty Images
ఫొటో క్యాప్షన్, శ్రీలంక రాజధాని కొలంబోలోని శ్రీ పొన్నంబలవనేశ్వరర్ ఆలయంలో, నవంబర్ 8వ తేదీ ఆదివారం దీపావళి పండుగ సందర్భంగా భక్తులు పూజలు నిర్వహించారు.
ఫొటో సోర్స్, TTD
ఫొటో క్యాప్షన్, తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం నిర్వహించారు
ఫొటో సోర్స్, DPR PMO/ANI Photo
ఫొటో క్యాప్షన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం బస్తర్‌లోని కరణ్‌పూర్‌లోని కోబ్రా ఆపరేషన్స్ బేస్‌లో భద్రతా దళాల సిబ్బందితో కలిసి దీపావళి పండుగను జరుపుకున్నారు. ఆయన సైనికులకు స్వీట్లు పంచిపెట్టి, దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
ఫొటో సోర్స్, @CongressSevadal
ఫొటో క్యాప్షన్, కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా, రాహుల్ గాంధీ దీపావళి వంటకాలు తయారుచేస్తున్న ఫోటోలను కాంగ్రెస్ సేవా దళ్ పంచుకుంది.
ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, ముహూర్త ట్రేడింగ్ సెషన్‌లో నటీమణులు పద్మిని కొల్హాపురే, పూనమ్ ధిల్లాన్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ఈ) మేనేజింగ్ డైరెక్టర్-సీఈఓ ఆశిష్ చౌహాన్ తదితరులు దీపావళి వేడుకలు జరుపుకోవడం కనిపించింది.
ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, దీపావళి పండుగ సందర్భంగా ఆదివారం ఉత్తర గోవాలోని పనాజీలో ప్రజలు నరకాసురుడి దిష్టిబొమ్మలను దహనం చేశారు.
ఫొటో సోర్స్, AFP via Getty Images
ఫొటో క్యాప్షన్, దీపావళి అంటే దీపాల వరుస అని అర్ధం. భారత్‌లో దీపావళి సందర్భంగా ఇళ్ల ముందు మట్టి ప్రమిదలు వెలిగిస్తారు.
ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, బాణసంచా వెలుగులతో దీపావళిని ఘనంగా జరుపుకోవడం భారత్‌లో హిందువుల సంప్రదాయం.
ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, పూజల్లో నైవేద్యంగా సమర్పించడంతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులకు పంచిపెట్టే మిఠాయిలు దీపావళి వేడుకల్లో కీలక భాగం.
ఫొటో సోర్స్, Narinder NANU / AFP via Getty Images
ఫొటో క్యాప్షన్, అమృత్‌సర్‌లో విద్యుద్దీపాల వెలుగులతో మెరిసిపోతున్న స్వర్ణ దేవాలయం.