అసెంబ్లీ ఎన్నికలు -2026 : తమిళనాడు సీఎం స్టాలిన్ ఓటమి
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజార్టీతో ఆయనపై విజయం సాధించారు. వీఎస్ బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్‌కు 74,202 ఓట్లు దక్కాయి.
సారాంశం
- తమిళనాడు, అస్సాం, కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి శాసనసభల ఎన్నికల ఫలితాలను ఆయా రాష్ట్రాలపై క్లిక్ చేసి తెలుసుకోండి.
- తమిళనాడులో సినీనటుడు విజయ్ టీవీకే పార్టీ దూసుకుపోతోంది. వందకుపైగా స్థానాలలో ఆధిక్యంలో ఉంది.
- పశ్చిమబెంగాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.
- కేరళలో యూడీఎఫ్ ముందంజలో ఉంది.
- కేరళలో కమ్యూనిస్టుల చివరి కోట పతనం అంచుకు చేరింది.
లైవ్ కవరేజీ
విపక్ష ఎంపీలతో భేటీకి సీజేఐ సూర్యకాంత్ నిరాకరణ

ఫొటో సోర్స్, Arun Kumar/ The India Today Group via Getty Images
ఫొటో క్యాప్షన్, ప్రతిపక్ష పార్టీల ఎంపీలను కలవకపోవడానికి సీజేఐ కొన్ని కారణాలు చెప్పారు (ఫైల్ ఫోటో). విపక్ష పార్టీల ఎంపీలతో సమావేశమయ్యేందుకు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్ నిరాకరించారు. వారిని కలవలేకపోవడానికి కొన్ని కారణాలను సీజేఐ వివరించినప్పటికీ, లేఖ గోప్యతను దృష్టిలో ఉంచుకుని వాటిని బహిర్గతం చేసేందుకు నిరాకరించారు.
“విపక్ష నేతల లేఖ నాకు నిన్న అందింది. దానికి నిన్న రాత్రే సమాధానం ఇచ్చాను. కొన్ని కారణాలను వివరిస్తూ వారిని కలవలేనని తెలియజేశాను” అని సీజేఐ సూర్యకాంత్ సోమవారం మీడియాతో చెప్పారు.
‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’పై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సుప్రీంకోర్టు పర్యటన రద్దు కావడంపై కూడా సీజేఐని ప్రశ్నించగా, ఆయన స్పందిస్తూ.. “ఆ విషయంలో కోర్టులో విరుద్ధ ప్రయోజనాల (కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్) పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. అందుకే, మేం దీనిపై చర్చించాం. ఎలాంటి విరుద్ధ ప్రయోజనాలకైనా దూరంగా ఉండాలని నా సీనియర్ న్యాయ సహచరులు, నేను ఒకే అభిప్రాయానికి వచ్చాం” అని తెలిపారు.
సీజేఐను కలిసేందుకు సమయం కోరుతూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో కలిసి లేఖ రాసినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదివారం తెలిపారు.
యువత ఆగ్రహం ఎవరి మీద? ఎన్నికల సంఘంపైనా, మోదీ పైనా?
24 గంటల్లోగా నిరసనకు అనుమతి ఇవ్వకపోతే మరో ఆందోళన: సీజేపీ

ఫొటో సోర్స్, Reuters
ఫొటో క్యాప్షన్, జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలిపేందుకు తేదీ ఖరారు చేయాలని కోరుతూ పోలీస్ స్టేషన్‌కు వెళ్తున్నట్లు సీజేపీ తెలిపింది. దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలిపేందుకు పోలీసులు 24 గంటల్లోగా అనుమతి ఇవ్వకపోతే మరో ఆందోళనకు పిలుపునిస్తామని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రకటించింది.
సీజేపీ అధికారిక ఎక్స్ ఖాతాలో తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం ఉదయం 10 గంటలకు పార్టీ సహ కన్వీనర్లు ఆశుతోష్ రాంకా, సౌరవ్ దాస్, సీజేపీ లీగల్ హెడ్ రత్నా సింగ్ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లనున్నారు.
జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలిపేందుకు తేదీ ఖరారు చేయాలని కోరుతూ పోలీస్ స్టేషన్‌కు వెళ్తున్నట్లు సీజేపీ తెలిపింది.
“మా శాంతియుత నిరసనకు తేదీ ఖరారు చేయాలని కోరుతూ పోలీస్ స్టేషన్‌కు వెళ్తాం. దిల్లీ పోలీసులు 24 గంటల్లోగా తేదీని కేటాయించాలి. లేకపోతే మేమే నిరసన తేదీని ప్రకటిస్తాం” అని పేర్కొంది.
నేహా బోరా గురించి దర్శకుడు దేవా కట్టా ట్వీట్

ఫొటో సోర్స్, Facebook/Deva Katta
ఫొటో క్యాప్షన్, దేవా కట్టా అఖిల భారత విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా గురించి టాలీవుడ్ దర్శకుడు దేవా కట్టా 'ఎక్స్' వేదికగా స్పందించారు.
"ఆమెతో మీరు ఏకీభవించవచ్చు, లేకపోవచ్చు... ఆమె పోరాట స్ఫూర్తితో మీరు మమేకం కావచ్చు, కాకపోవచ్చు... కానీ, మన రాజకీయాలు, రాజకీయ నాయకుల నేరపూరిత, నిరంకుశ పోకడలు సాధారణ విషయంగా మారిపోతుండటంపట్ల ఆమె వ్యక్తం చేస్తున్న ఆక్రోశం, ఆగ్రహాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతే... అప్పుడు నిజమైన 'యాంటీ-నేషనల్’ మీరే!!" అంటూ ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
నేడు ప్రతిపక్షాల మార్చ్: భద్రతా కారణాలతో దిల్లీలో 6 మెట్రో స్టేషన్లు మూసివేత

ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, ఆరు మెట్రో స్టేషన్లను దాదాపు 10 గంటల పాటు మూసివేయనున్నట్లు దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) ప్రకటించింది భద్రతా కారణాలతో సోమవారంనాడు ఆరు మెట్రో స్టేషన్లను దాదాపు 10 గంటల పాటు మూసివేయనున్నట్లు దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) ప్రకటించింది. ఈ స్టేషన్లలో ప్రయాణికుల రాకపోకలను అనుమతించబోమని డీఎంఆర్‌సీ తెలిపింది.
“భద్రతా కారణాల దృష్ట్యా 2026 అక్టోబర్ 12న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్‌లను మూసివేస్తాం” అని ఓ ప్రకటనలోపేర్కొంది.
ఆ తర్వాత భద్రతా సంస్థలు పరిస్థితిని సమీక్షిస్తాయని, అవసరాన్ని బట్టి తదుపరి సమాచారం అందిస్తామని తెలిపింది. అయితే, సంబంధిత అన్ని మెట్రో స్టేషన్లలో రైళ్లు మారేందుకు ప్రయాణికులకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.
మూసివేసిన ఆరు మెట్రో స్టేషన్లు:
పటేల్ చౌక్, జన్‌పథ్, రాజీవ్ చౌక్, మండీ హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్, బారాఖంబా రోడ్.
మరోవైపు, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు సోమవారం మార్చ్ నిర్వహించనున్నారు.
నేపాల్: గోర్ఖా జిల్లాలో విరుచుకుపడిన వరదలు

ఫొటో సోర్స్, Sovit Shrestha / AFPTV / AFP via Getty Images
ఫొటో క్యాప్షన్, నేపాల్‌లోని గోర్ఖా జిల్లా సల్లారి చుమ్నుబ్రిలో భవనాలను ముంచెత్తుతూ ధ్వంసం చేస్తున్న వరద నీరు. నేపాల్‌లోని మధ్య ప్రాంతంలో ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో ఐదుగురు గల్లంతయ్యారు. వరదల ధాటికి ఇళ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. గల్లంతైన వారి కోసం అధికారులు ఇంకా గాలిస్తున్నారు.
నేపాల్‌లో అతిపెద్ద, సుదీర్ఘమైన పండుగ దశైన్ తొలి రోజు వేడుకలకు చిన్నారులు, స్థానికులు సిద్ధమవుతున్న సమయంలో గోర్ఖా జిల్లాలో ఈ వరదలు సంభవించాయి. వరదల్లో చిక్కుకున్న సుమారు 50 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వరదల్లో ప్రాణనష్టంపై అధికారులు ఇంకా ఎలాంటి నిర్ధరణ చేయలేదు. అయితే, ప్రాథమిక సమాచారం ప్రకారం చుమనుబ్రి గ్రామీణ మున్సిపాలిటీ పరిధిలో అత్యధిక నష్టం జరిగింది. కనీసం రెండు గ్రామాలు పూర్తిగా కొట్టుకుపోగా, పలు వంతెనలు కూడా వరదలకు ధ్వంసమయ్యాయని ఆ మున్సిపాలిటీ చైర్‌పర్సన్ నిమా లామా తెలిపారు.
గల్లంతైన ఐదుగురు పశువుల కాపరులని భావిస్తున్నట్లు నిమా చెప్పారు. సుమారు 100 ఆవులు కూడా కనిపించడం లేదని తెలిపారు. గోర్ఖా జిల్లా వ్యాప్తంగా వందలాది మంది నిరాశ్రయులయ్యారని జిల్లా సహాయ ప్రధాన అధికారి నేత్ర ప్రసాద్ శర్మ వెల్లడించారు.
రెండు నెలల క్రితం ముంచెత్తిన భారీ వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల నుంచే నేపాల్ ఇంకా కోలుకోలేదు. ఆ విపత్తులో వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. కీలకమైన ఇంధన మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి.వేలమంది మరణించగా, మరికొందరు గల్లంతయ్యారు.
సీజేపీ ఆందోళనలు: పోలీసులు విమానంలోకి వచ్చి అరెస్టు చేయవచ్చా?
జిబూటి తీరంలో పడవ మునగడంతో పిల్లలు సహా 139 మంది మృతి, హఫ్సా ఖలీల్

ఫొటో సోర్స్, International Organization for Migration
ఫొటో క్యాప్షన్, ఓబాక్ ఓడరేవు పట్టణానికి ఉత్తరాన ఉన్న గుహెరె సమీపంలో వలసదారులకు సహాయం చేస్తున్న ఐఓఎం సిబ్బంది జిబూటి తీరంలో పడవ మునిగిపోవడంతో కనీసం 139 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయారని, అందులో 15 మంది పిల్లలున్నారని ఐక్యరాజ్యసమితి వలసల విభాగం తెలిపింది. పలువురి ఆచూకీ ఇంకా తెలియడం లేదని తెలిపింది.
305 మందితో జిబూటి నుంచి యెమెన్‌కు బయల్దేరిన పడవ.. గురువారం రాత్రి ఓబాక్ ఓడరేవు పట్టణం సమీపంలో తిరగబడింది.
ఈ ఘటనలో సుమారు 82 మందిని రక్షించినట్లు అంతర్జాతీయ వలసల సంస్థ (ఐఓఎం) తెలిపింది.
ఆఫ్రికా ఖండంలోని హార్న్ ఆఫ్ ఆఫ్రికా ప్రాంతం నుంచి ఏటా వేలమంది వలసదారులు ప్రాణాలకు తెగించి ఈ ప్రయాణం సాగిస్తున్నారనీ, భద్రత, ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు చేరుకోవాలనే ఆశతో ప్రమాదకరమైన మార్గంలో వెళ్తున్నారని ఐఓఎం తెలిపింది.
గుడ్ మార్నింగ్
బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం,
నేను బీబీసీ ప్రతినిధి వద్ది ప్రభాకర్. మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమైన వార్తలను మీకు అందిస్తాను.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.
గుడ్‌నైట్.
లైవ్ పేజీ ఇంతటితో ముగిస్తున్నాం.
రేపు ఉదయం మరిన్ని తాజా వార్తలతో కలుద్దాం.
ఈరోజు ముఖ్యమైన వార్తలు కొన్నింటిని ఇక్కడ చూడండి.
దిల్లీలో నిరసనకారులపై దాడులు, హిందుత్వ సంఘాల ప్రస్తావన ఎందుకు వస్తోంది?
రష్యా-యుక్రెయిన్ మధ్య 'ఎనర్జీ సీజ్ ఫైర్' కుదిరిందన్న డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Reuters
ఫొటో క్యాప్షన్, రష్యా - యుక్రెయిన్ మధ్య ఎనర్జీ సీజ్ ఫైర్ కుదిరిందని డోనల్డ్ ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు. రష్యా యుక్రెయిన్‌ల మధ్య “ఇంధన వనరులపై దాడుల విరమణకు అంగీకారం కుదిరిందని ఇది తక్షణమే అమలులోకి వస్తుందని” అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ తెలిపారు.
దీనిపై రష్యా స్పందించలేదు.
ట్రంప్ ప్రకటన తనకు “కొత్త వార్త” అని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియన్‌స్కీ అన్నట్లు అమెరికా వార్తా వెబ్‌సైట్ ఆక్సియోస్ తెలిపింది.
అంతకుముందు రష్యా చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులను “తక్షణమే ఆపాలి” అని అధ్యక్షుడు ట్రంప్ యుక్రెయిన్‌ను హెచ్చరించారు. ట్రంప్- జెలియన్‌స్కీ మధ్య వివాదం నడుస్తున్న తరుణంలో ఈ ప్రకటన వచ్చింది.
“రష్యా మా ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను ఆపివేస్తే, మేం రష్యా చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులు చేయడం ఆపేస్తాం” అని జెలియన్‌స్కీ ఆదివారం చెప్పారు.
సుప్రీంకోర్టు వరకు పాదయాత్ర : రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, EPA
ఫొటో క్యాప్షన్, జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలవనున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు సుప్రీంకోర్టుకు సోమవారం పాదయాత్రగా వెళ్లి ప్రధాన న్యాయమూర్తికి వినతి పత్రం సమర్పించనున్నట్టు విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రకటించారు.
సుప్రీంకోర్టుకు చేరుకున్న తర్వాత ప్రధాన న్యాయమూర్తిని జస్టిస్ సూర్యకాంత్‌ను కలిసి దేశవ్యాప్త విజ్ఞప్తులతో కూడిన ఒక వినతిప్రతం సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు.
సోమవారం సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య సమయం ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఇప్పటికే సీజేఐకి లేఖలు రాశారు.
ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించాలనుకునే యువత, విపక్షాలు , పౌర సమాజం కులమతాలు, ప్రాంతాలకు అతీతంగా తనతో కలిసి రావాలని రాహుల్ గాంధీ కోరారు.
ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, అజిత్ డోభాల్, మోహన్ భాగవత్ భారత ప్రజల గొంతును నొక్కలేరని రాహుల్ అన్నారు.
“పేపర్లపై సంతకం చేయమని ఒత్తిడి చేశారు” - దీప్కే

ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, అరెస్ట్ పేపర్లతో సంతకం చేయాలని పోలీసులు తనపై ఒత్తిడి తెచ్చారని అభిజీత్ దీప్కే ఆరోపించారు తల్లిదండ్రులతో మాట్లాడేందుకు తాను నిరాకరించినట్టు పోలీసులు చేసిన వ్యాఖ్యలపై అభిజీత్ దీప్కే ఎక్స్‌లో స్పందించారు.
ఆదివారం ఉదయం పోలీసుల నిర్బంధం నుంచి విడుదలైన తర్వాత అభిజీత్ దీప్కే తన నాయనమ్మ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు స్వగ్రామానికి వెళ్లారు.
దిల్లీ పోలీసుల ప్రెస్‌మీట్ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన అభిజీత్ దీప్కే అనేక ప్రశ్నలు సంధించారు.
“మా నాయనమ్మతో కలిసి నివసించే నా కజిన్‌తో మాట్లాడటానికి అనుమతించమని అభ్యర్థించాను. కనీసం నా కజిన్ నంబర్ అయినా తీసుకోవడం కోసం కొన్ని నిమిషాల పాటు నా ఫోన్ ఇవ్వమని అడిగాను. ఆ విషయాన్ని వీడియో నుంచి ఎందుకు డిలీట్ చేశారు?” అని దీప్కే ప్రశ్నించారు.
దిల్లీ పోలీసులు ఫోన్ వాడుకోవడానికి ఎందుకు అనుమతించలేదు? నేను నా లాయర్‌తో మాట్లాడాలని అభ్యర్థించాను. దానికి కూడా నిరాకరించారని దీప్కే చెప్పారు.
సోమవారం తెల్లవారుజామున 3:30 గంటలకు తన తండ్రికి ఫోన్ చేస్తామని పోలీసులు చెప్పారని దీప్కే పేర్కొన్నారు.
“మరుసటి రోజు నన్ను చాలా కాలం రోజులు జైలుకు పంపుతారని మా నాన్నకు ఫోన్ చేసి చెప్పమన్నారు” అని ఆయన రాశారు.
“మా నానమ్మ మరణం తర్వాత మా కుటుంబానికి మీరు ఇంకెంత మానసిక వేదన కలిగించాలనుకున్నారు?” అని దీప్కే తన పోస్ట్ ద్వారా ప్రశ్నించారు.
“తెల్లవారుజామున 3:30 గంటలకు మా తల్లిదండ్రులకు ఫోన్ చేయడానికి ప్రయత్నించడం వల్ల ఉపయోగం ఏమిటి? వాళ్ళను మరింత బాధపెట్టాలనుకున్నారా? తెల్లవారు జామున 3.30 గంటలకు మీలో మానవత్వం ఉదయించిందా?. నాయనమ్మ చనిపోయి బాధలో ఉంటే అరెస్ట్ పేపర్ల మీద సంతకం చేయమని ఒత్తిడి చేశారు. మా లాయర్‌తో మాట్లాడే వరకు సంతకం చేయడానికి నేను నిరాకరించాను” అని దీప్కే వివరించారు.
‘నాయనమ్మ చనిపోయిన విషయం దీప్కేకు చెప్పాం’ : దిల్లీ పోలీసులు
అభిజీత్ దీప్కేతో పాటు ఇతర సీజేపీ నాయకుల్ని విమానంలోనే అదుపులోకి తీసుకోవడంపై వస్తున్న విమర్శలకు దిల్లీ పోలీసులు వివరణ ఇచ్చారు
షాదరా జోన్ డీసీపీ నేహా యాదవ్ సీజేపీ ఆరోపణలపై స్పందించారు.
దీప్కేతో పాటు మరో ఇద్దరికి దిల్లీలో నిరసన తెలిపేందుకు అనుమతి లేదని అందుకే వారిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
దీప్కే నాయనమ్మ మరణం గురించి తెలియగానే పోలీసులు ఆ విషయాన్ని ఆయనకు చెబుతున్నప్పుడు రికార్డు చేసిన వీడియోను ఆమె ప్లే చేశారు.
తర్వాత దీప్కేను స్వగ్రామానికి వెళ్లేందుకు అనుమతించారు. కానీ దీప్కే నిరాకరించారని డీసీపీ నేహా యాదవ్ పేర్కొన్నారు.
పునరాలోచించుకోవడానికి పోలీసులు సమయం ఇచ్చారని, అతను తన నిర్ణయాన్ని మార్చుకోలేదని కూడా ఆమె తెలిపారు.
తల్లిదండ్రులతో మాట్లాడేందుకు పోలీసులు అవకాశం కల్పించినా అభిజీత్ దీప్కే దాన్ని కూడా వద్దన్నారనే ఆరోపణలు ఉన్నాయి.
సీజేపీ నాయకులు దిల్లీ పోలీసులపై ప్రజల్లో ప్రతికూల అభిప్రాయాన్ని సృష్టించేందుకు ప్రయత్నించారని పోలీసులు ఆరోపించారు.
గత నిరసనల సమయంలో దీప్కే చట్టాన్ని ఉల్లంఘించారని ఈసారి కూడా అలాగే చేశారని దిల్లీ పోలీసులు ఆరోపించారు.

ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, అభిజీత్ దీప్కేతో పాటు ఇతర సీజేపీ నాయకుల అరెస్ట్‌పై డీసీపీ నేహాయాదవ్ వివరణ ఇచ్చారు ‘స్మైలింగ్ డిప్రెషన్’: మీ చిరునవ్వు వెనుక డిప్రెషన్ కూడా ఉండొచ్చు, ఒకసారి చెక్ చేసుకోండి
కోర్టు ధిక్కరణపై కేంద్ర హోంశాఖకు సుప్రీం నోటీసులు

ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, తమ ఆదేశాలను అమలు చేయకపోవడంపై సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు కేంద్ర హోంశాఖకు నోటీసులు జారీ చేసింది దిల్లీలో నిరసనలకు సంబంధించి అక్టోబర్ 9న ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించి, కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని సుప్రీంకోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడినట్టు లైవ్‌లా వెబ్‌సైట్ తెలిపింది.
అక్టోబర్ 10వ తేదీన కాక్రోచ్ జనతా పార్టీ సహా పలు ప్రతిపక్షాలు నిరసన ప్రదర్శనకు దిగనున్న నేపథ్యంలో రైళ్ల రాకపోకలు, మెట్రో సేవలను నిలిపివేయకుండా నియంత్రిత పద్ధతిలో నడపాలని అక్టోబర్ 9న సుప్రీం కోర్టు మౌఖిక ఆదేశాలిచ్చింది.
కోర్టు ఆదేశాలను ధిక్కరించి మెట్రో స్టేషన్లను మూసివేశారని, ఇది కోర్టు ధిక్కరణ అని చెప్పడానికి పిటిషనర్లు ప్రాథమికంగా తగిన ఆధారాలను సమర్పించారని సుప్రీం కోర్టు పేర్కొందని లైవ్ లా తెలిపింది.
ఈ వ్యవహారంపై సమాధానాలు దాఖలు చేయాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, దిల్లీ పోలీస్ కమిషనర్, డీఎంఆర్‌సీ ఛైర్మన్ డి.తారాలను సుప్రీం కోర్టు ఆదేశించింది.
అక్టోబర్ 13 లోగా కౌంటర్ అఫిడవిట్లు, కోర్టు ఆదేశాలను ఎంతవరకు అమలు చేశారో తెలిపే నివేదికలను దాఖలు చేయాలని సంబంధిత అధికారులందరినీ కోర్టు కోరింది.
ప్రస్తుతానికి వారికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది.
కేసు తదుపరి విచారణలో దాఖలు అయ్యే సమాధానాలు, ఆదేశాల అమలుపై సమర్పించిన నివేదికలను బట్టి తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఎవరీ నేహా బోరా? బీజేపీకి మద్దతు ఇచ్చే కుటుంబం నుంచి వచ్చి ఉద్యమాల ముఖచిత్రంగా ఎలా మారారు?
సెంట్రల్ దిల్లీలో కొనసాగుతున్న ఉద్రిక్తత

ఫొటో సోర్స్, Reuters
ఫొటో క్యాప్షన్, కన్నాట్‌ప్లేస్‌లో ఆందోళనకారుల్ని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకుంటున్నాయి పవన్ కాంత్ దిగవల్లి,
బీబీసీ ప్రతినిధి
సెంట్రల్ దిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి నిరసనకారులకు భద్రతా బలగాలకూ మధ్య ఘర్షణ కొనసాగుతోంది.
కన్నాట్‌ప్లేస్‌లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్, దిల్లీ పోలీసులను మోహరించారు.
మహిళా నిరసనకారులను దిల్లీ మహిళా పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి బస్సుల్లో ఎక్కించి తరలిస్తున్నారు.
ఎక్కడికక్కడ వేర్వేరు గుంపుల్లో నిరసనకారులు జంతర్ మంతర్ చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
పోలీసులు తమ పట్ల విచక్షణరహితంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థి సంఘాల నేతలు సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.
సెంట్రల్ దిల్లీలో ఇంటర్‌నెట్ పని చేస్తోంది. కొన్ని రోడ్లపై బారికేడ్లను తొలగిస్తున్నారు.
ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా వాహనాలు వెళ్లేందుకు అనుమతిస్తున్నారు.
ప్రతీ వాహనాన్నీ పోలీసు బలగాలు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి.
కన్నాట్‌ప్లేస్‌లో దుకాణాలను తెరిచారు. అయితే జంతర్ మంతర్‌కు వెళ్లే అన్ని మార్గాలనూ పోలీసులు మూసివేశారు.
