అసెంబ్లీ ఎన్నికలు -2026 : తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఓటమి

తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజార్టీతో ఆయనపై విజయం సాధించారు. వీఎస్ బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్‌కు 74,202 ఓట్లు దక్కాయి.

సారాంశం

లైవ్ కవరేజీ

  1. రాహుల్ తీరు ప్రజాస్వామ్యానికే అవమానకరం: కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విమర్శ, ఇంకా కాంగ్రెస్ గుణపాఠం నేర్చుకోలేదు అన్న సింధియా

    రాహుల్ గాంధీపై జ్యోతిరాదిత్య సింధియా విమర్శలు
    ఫొటో క్యాప్షన్, రాహుల్ గాంధీపై జ్యోతిరాదిత్య సింధియా విమర్శలు

    దిల్లీలో రాహుల్ గాంధీ, ప్రతిపక్ష నేతలు చేపట్టిన నిరసన ప్రజాస్వామ్యానికే అవమానమని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విమర్శించారు.

    " లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నుంచి జిల్లా పంచాయతీలు, సర్పంచుల వంటి స్థానిక సంస్థల ఎన్నికల వరకు నిరంతరం ఎన్నికలు జరిగే దేశంలో, ఆ వ్యవస్థపైనే అనుమానాలు వ్యక్తం చేయడం లేదా మచ్చ తీసుకురావడానికి ప్రయత్నించడం కాంగ్రెస్ పార్టీ అసలు ఉద్దేశాన్ని మరోసారి స్పష్టం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం గురించి మాట్లాడుతుంది, కానీ ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ రాజ్యాంగ వ్యవస్థలోని ప్రతి అంశాన్ని తక్కువ చేసి చూపడానికి లేదా అప్రతిష్టపాలు చేయడానికి వెనుకాడటం లేదు. అత్యవసర పరిస్థితిని (ఎమర్జెన్సీ) విధించి రాజ్యాంగాన్ని కాలరాసిన అదే కాంగ్రెస్ పార్టీ, నేడు ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రశ్నిస్తోంది. న్యాయవ్యవస్థ, ప్రధాన న్యాయమూర్తి, భారత సైన్యం, ఎన్నికల సంఘంపై కూడా ప్రశ్నలు లేవనెత్తిన పార్టీ ఇదే. కాంగ్రెస్ పార్టీ బలహీనపరచడానికి ప్రయత్నించని రాజ్యాంగ సంస్థ అంటూ ఏదీ లేదు" అని ఆయన విమర్శించారు.

  2. బెదిరించినా, భయపెట్టినా వెనక్కి తగ్గబోము: రాహుల్ గాంధీ, సోమవారం ఆందోళనలో పాల్గొన్న వారికి ధన్యవాదాలు చెప్పిన రాహుల్

    సుప్రీంకోర్టు వరకు మార్చ్ నిర్వహించిన "ఇండియా" బ్లాక్ నేతలు
    ఫొటో క్యాప్షన్, సోమవారం నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ గాంధీ, ఇతర నాయకులు

    రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలంతా ఐక్యంగా సాగుతున్నారని రాహుల్ అభిప్రాయపడ్డారు. సోమవారం జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వారికి ధన్యవాదాలు చెప్పిన రాహుల్, మొన్న యువకులపై దాడి చేసిన వారు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.

    ప్రధాన మంత్రి మాదిరిగానే వారికి కూడా నిలబడి పోరాడే ధైర్యం లేదన్నారు. కేవలం అధికారం, బలాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే పోరాడుతున్నారని విమర్శించారు./

    అందరూ కలిసి ఒక జట్టుగా పని చేస్తున్నారని, జరుగుతున్నవి వేర్వేరు నిరసనలు కావని, ఇదొక ఉద్యమమని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగాన్ని హరించేవారికి, ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కేవారికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ నిలబడతారని, ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గబోరని పేర్కొన్నారు. భారత ప్రజలు భయపడబోరని ప్రభుత్వానికి చూపించాల్సిన అవసరం ఉందన్నారు. కొట్టవచ్చు, బెదిరించవచ్చు, భయపెట్టేందుకు ప్రయత్నించవచ్చు అయినా తగ్గబోమని స్పష్టం చేశారు.

  3. నేడు చంద్రబాబుతో విజయ్ సమావేశం-నదీ జలాలపై చర్చలు, నదుల అనుసంధానంపై నేడు ఏపీ, తమిళనాడు ముఖ్యమంత్రుల భేటీ

    నదీ జలాల పంపిణీ, అనుసంధానంపై నేడు ఏపీ, తమిళనాడు ముఖ్యమంత్రుల భేటీ
    ఫొటో క్యాప్షన్, నేడు చంద్రబాబుతో విజయ్ సమావేశం

    మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 2.30 గం.లకు విజయ్ తన క్యాంప్ ఆఫీస్ నుంచి బయల్దేరుతారు. సుమారు 4 గంటల సమయానికి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 4.10 గంటలకు విజయవాడ కనక దుర్గ ఆలయాన్ని సందర్శిస్తారు. దర్శనం తర్వాత 6 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి చేరుకుంటారు.

    గోదావరి-కావేరీ నదుల అనుసంధానం, కృష్ణా జలాల విడుదలపై చంద్రబాబుతో చర్చిస్తారు. అనంతరం ఇద్దరూ కలిసి విజయవాడలో జరుగుతున్న ఉత్సవ్‌ కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో విజయవాడ నుంచి తిరిగి తమిళనాడుకు బయల్దేరి వెళ్తారు విజయ్.

  4. గుడ్ మార్నింగ్

    బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం,

    నేను బీబీసీ ప్రతినిధి ఖగేశ్. మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమైన వార్తలను మీకు అందిస్తాను.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

  5. అందరినీ వద్దని బెదిరించిన ట్రంప్.. తాను మాత్రం రష్యా నుంచి డీజిల్ కొనే ఒప్పందం ఎందుకు చేసుకున్నారు?

  6. మాజీ ఎమ్మెల్యేను కొట్టి చంపారు

    అతర్ సింగ్ భఢానా
    ఫొటో క్యాప్షన్, అతర్ సింగ్ భఢానా

    రాజస్థాన్‌లోని భరత్‌పుర జిల్లాలో మాజీ ఎమ్మెల్యే బయానా అతర్ సింగ్ భఢానాను ఆదివారం కొట్టి చంపేశారు. జైపూర్‌లోని సవాయి మాన్‌సింగ్ ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిగిన అనంతరం సోమవారం ఉదయం ఆయన మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.

    హరియాణాలోని ఫరీదాబాద్‌లోని తమ పూర్వీకుల గ్రామంలో సోమవారం అతర్ సింగ్ భడానా అంత్యక్రియలను నిర్వహించారు.

    భడానా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు భరత్‌పుర్ ఎస్పీ రాజేశ్ మీనా సోమవారం రాత్రి తెలిపారు.

    “వైర పోలీస్ స్టేషన్ పరిధిలోని భౌండా గ్రామంలో క్రషర్‌కి వెళ్లే మార్గంపై భఢానా, గ్రామస్థుల మధ్య రెండేళ్లుగా వివాదం నడుస్తోంది. క్రషర్‌ పనులను నిలిపివేయాలనేది గ్రామస్థుల డిమాండ్” అని రాజేశ్ మీనా తెలిపారు.

    ఘటన జరిగిన నాటి నుంచి గ్రామ ప్రజలు, యువత తప్పించుకొని తిరుగుతున్నారు. చాలా ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయి. పరారీలో ఉన్నవారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు వైరా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ధీరేంద్ర తెలిపారు. శాంతి భద్రతల నేపథ్యంలో గ్రామంలో పోలీసులను మోహరించినట్లు తెలిపారు.

    ఫరీదాబాద్‌ సోనిపాలి గ్రామానికి చెందిన అతర్ సింగ్ భఢానా.. బయానా నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పనిచేశారు. అనంతరం కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. భఢానాకు ముగ్గురు కూతుళ్లు ఒక కుమారుడు ఉన్నారు. ముగ్గురు కూతుళ్లలో ఒకరు హిమాచల్ ప్రదేశ్‌ క్యాడర్‌కి చెందిన ఐఏఎస్ అధికారి కాగా, మరో ఇద్దరు డాక్టర్లు. కుమారుడు ఫరీదాబాద్‌లో ఉంటారు. భడానా భార్య బయానాలో నివసిస్తున్నారు.

    అతర్ సింగ్ భఢానా... ఆదివారం సాయంత్రం 6 గంటలకు భౌండా గ్రామంలోని క్రషర్ వద్దకు వచ్చిన సమయంలో పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న గ్రామస్థులు ఆయనపై కర్రలతో దాడి చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

    తీవ్రంగా గాయపడిన భఢానాను తొలుత వైరలోని కమ్యానిటీ హెల్త్ సెంటర్‌కి తరలించారు. అనంతరం జైపూర్‌లోని సవాయి మాన్ సింగ్ ఆస్పత్రికి తీసుకెళ్లగా, అక్కడ ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు.

  7. దిల్లీ: ఇండియా కూటమి సుప్రీంకోర్ట్ పాదయాత్ర - 7 ఫోటోలలో

  8. ‘రిగ్గింగ్‌కు పాల్పడి ఎలక్షన్లు గెలిచినవారు ఇప్పుడు ఎన్నికల అక్రమాలంటూ మాట్లాడుతున్నారు’: అనురాగ్ ఠాకుర్

    అనురాగ్ ఠాకుర్
    ఫొటో క్యాప్షన్, అనురాగ్ ఠాకుర్

    రాహుల్ గాంధీ సహా ఇండియా కూటమి నేతల మార్చ్ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ సోమవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

    రాహుల్ అరాచకానికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.

    “రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అజెండా చాలా స్పష్టంగా ఉంది. అధికారం దక్కకపోతే సమాజంలో అరాచకానికి పాల్పడాలన్నట్లుగా ఉంది. అయితే, కోర్టుల ఎదుట తమ భావాలను వ్యక్తపరిచే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది” అని అనురాగ్ ఠాకుర్ అన్నారు.

    “రాహుల్ గాంధీకి సైతం తన అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉంది. అయితే రాహుల్, కాంగ్రెస్ తమని తాము చట్టానికి, రాజ్యాంగ వ్యవస్థలకు మించినవారిగా భావిస్తున్నారు” అని అనురాగ్ ఆరోపించారు.

    రాహుల్ గాంధీ, కాంగ్రెస్... రాజ్యాంగాన్ని విచ్ఛన్నం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

    “రిగ్గింగ్‌కు పాల్పడి ఎన్నికల్లో గెలిచినవారు ఇప్పుడు ఎన్నికల అక్రమాలపై మాట్లాడుతున్నారు” అని అనురాగ్ విమర్శించారు.

  9. రియాద్‌లో దాడులు: హైదరాబాదీ మృతి

  10. ఇండియా కూటమి ‘సుప్రీంకోర్ట్ మార్చ్’కు పెద్దసంఖ్యలో జనం

    ఇండియా కూటమి మార్చ్‌లో జనం
    ఫొటో క్యాప్షన్, ఇండియా కూటమి మార్చ్‌

    విపక్ష ఇండియా కూటమి సోమవారం బారాఖంబా నుంచి సుప్రీం కోర్టుకు మార్చ్ చేపట్టింది.

    కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్, నేహా బోరా సహా ఇతర ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు ఈ యాత్రలో పాల్గొన్నారు.

    ఇండియా కూటమిలో మార్చ్‌లో జనం భారీగా కనిపిస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి.

    మార్చ్‌లో పాల్గొనేందుకు జనం పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారని బీబీసీ ప్రతినిధి దిల్‌నవాజ్ పాషా నిర్ధరించారు.

    ఈ పాదయాత్రకు సంబంధించిన కొన్ని ఫోటోలు మీకోసం..

    రాహుల్ గాంధీ
    India bloc march to Supreme Court
  11. విపక్షాల పాదయాత్రకు అడ్డంకులు.. దారి మార్చుకుని సుప్రీంకోర్ట్‌కు చేరుకున్న రాహుల్ గాంధీ, ప్రతిపక్షాల నాయకులు

  12. సీజేపీ నిరసన ప్రదర్శనల రిపోర్టింగ్‌లో జర్నలిస్టులకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి?

  13. బారాఖంబా నుంచి సుప్రీంకోర్ట్‌కు విపక్ష నాయకుల పాదయాత్ర

    Rahul march to supreme court
    ఫొటో క్యాప్షన్, సుప్రీంకోర్ట్‌కు రాహుల్ గాంధీ నేతృత్వంలో విపక్ష నాయకుల పాదయాత్ర

    చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టుకు పాదయాత్ర చేస్తున్నాయి.

    అక్కడి నుంచి రిపోర్ట్ చేస్తున్న బీబీసీ హిందీ విలేఖరి దిల్‌నవాజ్ పాషా ఈ పాదయాత్రకు సంబంధించిన వివరాలు తెలిపారు.

    రాహుల్ గాంధీ, ప్రతిపక్ష నాయకులు ఒక బస్సు ఎక్కి బారాఖంబా మెట్రో స్టేషన్ బయట ఉన్న రోడ్డుపైకి చేరుకున్నారు.

    అక్కడ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, వామపక్ష పార్టీల కార్యకర్తలు, వందలాది మంది విద్యార్థులు ఉన్నారు.

    అక్కడి నుంచి రాహుల్, విపక్ష నాయకుల పాదయాత్ర మొదలైంది.

    బారాఖంబా మెట్రో స్టేషన్ నుండి మండీ హౌస్ వరకు ఉన్న రహదారిపై జనం లేరు. పోలీసులు ముందువైపు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ బారికేడ్ల వద్ద నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణలు జరిగే అవకాశం ఉంది.

    రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్, ప్రతిపక్షాలకు చెందిన పలువురు ఎంపీలు కూడా ఉన్నారు.

    ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బారాఖంబా నుంచి సుప్రీంకోర్టు వరకు పాదయాత్ర చేయనున్నట్లు ఇండియా కూటమి ప్రకటించింది.

  14. జంతర్ మంతర్ ఇక నిరసనల వేదిక కాదు: దిల్లీ పోలీసులు

    దిల్లీ ప్రదర్శనలు,  జంతర్ మంతర్
    ఫొటో క్యాప్షన్, దిల్లీలో నిరసన ప్రదర్శనలకు చేపట్టేందుకు జంతర్ మంతర్‌కు బదులుగా మూడు ప్రత్యామ్నాయ ప్రదేశాలను ఎంపిక చేసినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు.

    దిల్లీలో నిరసనలు, ధర్నాలు నిర్వహించడానికి నిర్దేశించిన ప్రదేశాల జాబితా నుంచి జంతర్ మంతర్‌ను తొలగించారు .

    కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

    దిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ దీని గురించి నోటీస్ జారీ చేశారు.

    జంతర్ మంతర్‌కు బదులుగా తూర్పు దిల్లీలోని రామ్‌లీలా మైదాన్, బురారీ మైదాన్, సీబీడీ మైదాన్‌లలో నిరసనలు చేపట్టవచ్చని ఆ నోటీస్‌లో తెలిపారు.

    “పౌరులకు నిరసనలు, ప్రదర్శనలు నిర్వహించే హక్కును దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుతం ఉన్న నిర్దేశిత స్థలాలకు ప్రత్యామ్నాయాలను సమీక్షించే బాధ్యతను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీకి అప్పగించారు” అని ఆ నోటీస్‌లో పేర్కొన్నారు.

    ఈ మూడు ప్రదేశాలలో నిరసనలు, ధర్నాలు నిర్వహించడానికి విడివిడిగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ విడుదల చేస్తామని ఆ నోటీసులో పేర్కొన్నారు.

  15. జ్ఞానేశ్‌ కుమార్‌ను వదిలేది లేదు. వేచి చేస్తున్నాం: రాహుల్ గాంధీ

    రాహుల్ గాంధీ, నరేంద్రమోదీ, జ్ఞానేశ్ కుమార్
    ఫొటో క్యాప్షన్, నరేంద్రమోదీ ప్రభుత్వం జ్ఞానేశ్ కుమార్‌ను రక్షించేందుకు మిగతా వ్యవస్థలను కూడా దుర్వినియోగం చేస్తోందని రాహుల్ అన్నారు.

    ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌ కుమార్ అవినీతి గురించి తనకు తెలుసని, ఆయన్ను వదిలేది లేదని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు.

    “ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అడిగిన ప్రశ్నలనే మేం కూడా అడుగుతున్నాం. జ్ఞానేశ్ కుమార్ ఎందుకు రాజీనామా చేయడం లేదు? జ్ఞానేశ్ కుమార్ జీ.. మీ పరిస్థితేంటో మాకు తెలుసు. మీకు నిద్ర పట్టడం లేదు. మేం మిమ్మల్ని వదిలిపెట్టం. మీరు తప్పించుకోలేరు. మీ గతం మీ అవినీతి గురించి మాకు తెలుసు. మేం కేవలం వేచి చేస్తున్నాం” అని రాహుల్ గాంధీ అన్నారు.

    దిల్లీలో నిరసనకారులపై జరుగుతున్న పోలీసు చర్యల గురించి రాహుల్ స్పందిస్తూ, ప్రభుత్వం చాలా పెద్ద తప్పు చేస్తోందని అన్నారు.

    “ఓట్ల చోరీకి వ్యతిరేకంగా దిల్లీలో చాలా రోజులుగా నిరసనలు జరుగుతున్నాయి. అసలు ప్రశ్న ఏమిటంటే దిల్లీని ఎందుకు జైలుగా మార్చారు? నగరంలోకి రాకుండా ప్రజలను అడ్డుకుంటున్నారు. రైళ్లు, బస్సుల్లోనే వారిని నిలిపివేస్తున్నారు. ప్రభుత్వం చాలా పెద్ద తప్పు చేస్తోంది” అన్నారు.

  16. బీజేపీ వ్యతిరేక ఓట్లనే తొలగిస్తున్నారు: రేవంత్ రెడ్డి

    కాంగ్రెస్ తెలంగాణ, రేవంత్ రెడ్డి
    ఫొటో క్యాప్షన్, సోమవారం జరగనున్న ర్యాలీ కోసం దిల్లీకి చేరుకున్న రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

    బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) అమలుచేసిన రాష్ట్రాలలోనే ఆ పార్టీ గెలిచిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

    సోమవారం జరగనున్న కాంగ్రెస్ పాదయాత్ర కోసం దిల్లీకి చేరుకున్న రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

    "ముఖ్యంగా బీజేపీని వ్యతిరేకిస్తున్నది ఎవరంటే..దళితులు, ఆదివాసీలు, గిరిజనులు, మైనార్టీలు, యువత. బీజేపీని ఓడించాలనుకున్న ప్రజల ఓటు హక్కును తొలగించడానికి కుట్ర చేశారు. జ్ఞానేశ్‌కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని కమిషన్ సభ్యులు చెప్పారు. తప్పులు జరుగుతున్నాయని తెలిసినపుడు, ఆ అధికారిని తొలగించడానికి మోదీకి అభ్యంతరం ఏమిటి?, ఆయనకు అండగా ఎందుకు నిలబడుతున్నారు" అని రేవంత్ రెడ్డి అన్నారు.

  17. ఒమన్‌ సమీపంలో భారతీయ సిబ్బంది ఉన్న ట్యాంకర్‌పై డ్రోన్‌ దాడి

    ఒమన్, భారత నౌకలపై డ్రోన్ దాడి
    ఫొటో క్యాప్షన్, ఇద్దరు భారతీయులు గల్లంతైనట్లు కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్‌ ఆదివారం రాత్రి ధ్రువీకరించారు (ప్రతీకాత్మక చిత్రం).

    ఒమన్‌ సమీపంలో భారతీయ సిబ్బంది ఉన్న ట్యాంకర్‌పై ఆదివారం డ్రోన్‌ దాడి జరిగింది. నౌకలో ఉన్న 11 మంది భారతీయ నావికుల్లో తొమ్మిది మందిని రక్షించగా.. మరో ఇద్దరు గల్లంతయ్యారు. ఇద్దరు నావికులు కనిపించకుండా పోయిన విషయాన్ని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్‌ ఆదివారం రాత్రి ధ్రువీకరించారు.

    "అక్టోబర్ 11న సోహార్ యాంకరేజ్ వద్ద భారతీయ ట్యాంకర్ ఎం.టి. పెట్రో డాల్ఫిన్‌పై డ్రోన్ దాడి జరిగింది. ట్యాంకర్‌పై 11 మంది భారతీయ నావికులు ఉన్నారు. తొమ్మిది మందిని రక్షించారు, ఇద్దరు గల్లంతయ్యారు" అన్నారు.

    స్థానిక తీర రక్షక దళం గాలింపు, సహాయక చర్యలు చేపట్టిందని మంత్రి వివరించారు.

    గల్లంతైన వారిని గుర్తించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, సహాయక చర్యలకు పూర్తి మద్దతు అందించేందుకు సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని సర్బానంద సోనోవాల్‌ పేర్కొన్నారు.

  18. సీజేపీ: బాండ్‌పై సంతకం చేస్తే నిరసనలకు దూరంగా ఉంచగలరా? చట్టం ఏం చెబుతోంది?

  19. మియన్మార్‌లో పెరుగుతున్న బలవంతపు సైనిక నియామకాలు..