అసెంబ్లీ ఎన్నికలు -2026 : తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఓటమి

తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజార్టీతో ఆయనపై విజయం సాధించారు. వీఎస్ బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్‌కు 74,202 ఓట్లు దక్కాయి.

సారాంశం

లైవ్ కవరేజీ

  1. కాంగ్రెస్‌లో నేహా బోరా వంటి నాయకులు ఎందుకు రాలేకపోతున్నారు?

  2. ‘రాహుల్! 2029లో ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండండి’: అమిత్ షా

    Amit Shah
    ఫొటో క్యాప్షన్, అమిత్ షా

    చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాంగ్రెస్ సహా ఇండియా కూటమి పార్టీలు నిరసనలు తెలుపుతున్న వేళ కేంద్ర హోం మంత్రి, బీజేపీ నేత అమిత్ షా.. రాహుల్ గాంధీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

    2029 ఎన్నికల్లో ఘోర పరాజయం కోసం కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు.

    ఏఎన్ఐ, పీటీఐ తదితర న్యూస్ ఏజెన్సీలతో మాట్లాడిన ఆయన... ‘‘ఎస్ఐఆర్ ముసుగులో చొరబాటుదారులను కాపాడాలనే మీ వ్యూహాన్ని ఈ దేశ ప్రజలు అర్థం చేసుకున్నారు. ప్రజలు ఇకపై ఎంత మాత్రం మీ కుతంత్రాలలో చిక్కుకోబోరని నేను రాహుల్ గాంధీకి స్పష్టం చేయాలనుకుంటున్నాను. 2029లో ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండాలని కూడా నేను రాహుల్ గాంధీ, ఆయన సహచరులకు చెప్పాలనుకుంటున్నాను. 2029 ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీని సొంతం చేసుకోబోతోంది.. కాంగ్రెస్ వరుసగా నాలుగోసారి పరాజయాన్ని మూటగట్టుకోబోతోంది. ఈ దేశ ప్రజలు నరేంద్ర మోదీకి, బీజేపీకి, ఎన్డీయేకు అండగా నిలుస్తున్నారు. మీరు ఈ నిజాన్ని తిరస్కరించలేరు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ తరఫున త్రిపుర, రాజస్థాన్, గుజరాత్, బెంగాల్, అస్సాం ప్రజలకు నేను మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.. దుష్ప్రచారాల మధ్య కూడా వారు నరేంద్ర మోదీపై, బీజేపీపై, ఎన్డీయేపై నమ్మకం ఉంచారు’’ అని అమిత్ షా అన్నారు.

  3. మోదీ ప్రభుత్వంలో మంత్రి మురుగన్ రాజీనామా

    L Murugan
    ఫొటో క్యాప్షన్, ఎల్.మురుగన్

    కేంద్ర సమాచార ప్రసార శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖల సహాయ మంత్రి ఎల్.మురుగన్ మంగళవారం తన మంత్రి పదవికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

    ఈ మేరకు ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

    తాను తమిళనాడుకు తిరిగి వెళ్లి బీజేపీని బలోపేతం చేయడానికి, 2029 లోక్‌సభ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధం చేయడానికి కృషి చేయాలని కోరుకుంటున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.

    తమిళనాడులో పార్టీని మరింత పటిష్టం చేయడానికి పూర్తి సమయం కేటాయించేందుకు వీలుగా మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.

  4. నల్లులను నిర్మూలించడానికి ప్రత్యేకమైన వాక్యూమ్ క్లీనర్.. అసలు ఇంట్లో నల్లులు చేరాయని తెలుసుకోవడం ఎలా?

  5. ‘మేం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను చాలా గౌరవిస్తాం, ఆయన తన బాధ్యతను నిర్వర్తిస్తారని ఆశిస్తున్నాం’.. రాహుల్ గాంధీ

    "మేము ప్రధాన న్యాయమూర్తిని చాలా గౌరవిస్తాం, ఆయన తన బాధ్యతను నిర్వర్తిస్తారని ఆశిస్తున్నాం"- రాహుల్ గాంధీ
    ఫొటో క్యాప్షన్, రాహుల్ గాంధి

    ఇండియా కూటమి నేతలతో తేనీటీ విందు అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌కు వ్యతిరేకంగా తమ నిరసన కొనసాగుతుందని రాహుల్ గాంధీ తెలిపారు.

    “భారత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు, భారత న్యాయవ్యవస్థపై మాకు అపారమైన గౌరవం ఉంది. వారు తమ పాత్రను పోషించాల్సి ఉంది. వారు ఆ పాత్రను పోషిస్తారని ఆశిస్తున్నాం. అయితే, మేం రాజకీయాల్లో ఉన్నవాళ్లం. ఏం జరిగినా రాజకీయంగా మా ప్రతిఘటన కొనసాగుతుంది. ప్రజల నిరసన కూడా కొనసాగుతుంది. అంతిమంగా ఈ నిరసన విజయం సాధిస్తుంది” అని ఆయన అన్నారు.

    కాగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.

    స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌‌లో తీసుకున్న అనేక నిర్ణయాల గురించి ఎన్నికల కమిషనర్లకు సమాచారం ఇవ్వలేదని, ఈ నిర్ణయాలపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు పదేపదే అభ్యంతరాలు వ్యక్తం చేశారని పేర్కొంటూ ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ప్రచురించిన కథనం నేపథ్యంలో ఈ డిమాండ్ తెరపైకి వచ్చింది.

  6. చిన్నారుల్లో క్యాన్సర్‌.. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి

  7. విజయవాడలో సీఎం విజయ్: బెజవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి

    joseph vijay
    ఫొటో క్యాప్షన్, తమిళనాడు సీఎం విజయ్

    తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తన ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా మంగళవారం విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు.

    ఇంద్రకీలాద్రికి వచ్చిన తమిళనాడు ముఖ్యమంత్రికి ఆలయ అర్చకులు, అధికారులు సంప్రదాయ మర్యాదలతో ఘన స్వాగతం పలికి ప్రధానాలయంలోకి తోడ్కొని వెళ్లారు.

    సంప్రదాయ వస్త్రధారణతో ఆలయానికి చేరుకున్న విజయ్ క్యూలైన్లలో ఉన్న భక్తులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

    అనంతరం అంతరాలయంలో అమ్మవారిని దర్శించుకుని, విశేష పూజలు నిర్వహించారు. ​దర్శనానంతరం అనివేటి మండపంలో వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం పలికారు.

    సంప్రదాయ వస్త్రధారణలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్న సీఎం విజయ్‌కు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు అందజేశారు.

  8. నంబర్ ప్లేటే కదా అనుకోవద్దు.. ఇవన్నీ తెలుసుకోండి

  9. రాహుల్ గాంధీ ఇంట్లో ఇండియా బ్లాక్ నేతలకు టీ పార్టీ

    రాహుల్ గాంధీ
    ఫొటో క్యాప్షన్, రాహుల్ గాంధీ

    కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మంగళవారం ఇండియా కూటమి నేతలను తన ఇంట్లో తేనీటి విందుకు ఆహ్వానించారు.

    “ఈ రోజు ఇండియా కూటమి నేతలు, ప్రతిపక్ష ఎంపీలు, విద్యార్థి సంఘాలు, పౌర సమాజానికి చెందిన మిత్రులను మా ఇంటికి తేనీటి విందుకు ఆహ్వానించాను” అని ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

    “ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సాగుతున్న ఈ ప్రజా ఉద్యమంలో మనమంతా కలిసే ఉన్నాం. ఈ ఉద్యమం కొనసాగుతుంది” అని ఆయన పేర్కొన్నారు.

    సమావేశం అనంతరం నేతలందరూ మీడియాతో కూడా మాట్లాడతారని రాహుల్ గాంధీ తెలిపారు.

    రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్, జనతా పార్టీ నేతలు సహా ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

    గతేడాది చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో తీసుకున్న అనేక నిర్ణయాల గురించి ఎన్నికల కమిషనర్లకు సమాచారం ఇవ్వలేదని, ఈ నిర్ణయాలపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారని ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ప్రచురించిన కథనం నేపథ్యంలో ఈ డిమాండ్ తెరపైకి వచ్చింది.

    రాహుల్ గాంధీ ఇంట్లో తేనేటి విందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు.

  10. దీపావళి వరకు యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు ఉండవు: NPCI ప్రకటన

    దీపావళి వరకు యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు ఉండవు: NPCI ప్రకటన

    పండుగలను దృష్టిలో ఉంచుకుని యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) అమలును వాయిదా వేయాలని.. దీన్ని దీపావళి తర్వాత అమలుచేయాలని యూపీఐ, సేవల స్టీరింగ్ కమిటీ మంగళవారం నిర్ణయించింది.

    ఎండీఆర్ అమలు తేదీని ప్రత్యేకంగా ప్రకటిస్తామని కమిటీ తెలిపింది.

    వినియోగదారులకు యూపీఐ సేవలను పూర్తిగా ఉచితంగా కొనసాగిస్తూనే, వ్యాపార లావాదేవీలకు సవరించిన యూపీఐ మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ప్రకటించింది. ఈ విధానం 2026 అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది.

  11. సీట్లలో నల్లుల కారణంగా ఆగిపోయిన విమానం

  12. నియంత్రణ రేఖ వద్ద ల్యాండ్‌మైన్ పేలి నలుగురు యువకులు మృతి, భారత్‌పై పాకిస్తాన్ విమర్శలు, నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద ల్యాండ్‌మైన్ పేలింది.

    నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద ల్యాండ్‌మైన్ పేలి నలుగురు యువకులు మృతి
    ఫొటో క్యాప్షన్, నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద ల్యాండ్‌మైన్ పేలి నలుగురు యువకులు మృతి

    పాక్ పాలిత కశ్మీర్‌లోని పూంచ్ ప్రాంతంలో నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద ల్యాండ్‌మైన్ పేలింది. ఈ పేలుడులో నలుగురు యువకులు మరణించారు.

    దీనికి భారతే కారణమంటూ పాకిస్తాన్ పాలిత కశ్మీర్ సమాచార విభాగం ఆరోపించింది. సోమవారం సాయంత్రం నియంత్రణ రేఖ సమీపంలో ఉన్న మహేంద్ర మదర్‌పూర్ గ్రామంలో పేలుడు జరిగినట్లు సమాచార శాఖ ఒక ప్రకటన జారీ చేసిందని బీబీసీ ఉర్దూ కథనం తెలిపింది.

    ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆ నలుగురు యువకులు గ్రామం సమీపంలోని నీటి పైప్‌లైన్‌కు మరమ్మతులు కోసం వెళ్లారు. అకస్మాత్తుగా శక్తివంతమైన పేలుడు జరగడంతో దాని ధాటికి నలుగురూ అక్కడికక్కడే మరణించారు. "యువకులు ప్రయాణించిన ప్రాంతంలో భారత సైన్యం ల్యాండ్‌మైన్‌లను అమర్చింది" అని పూంచ్ డివిజన్ కమిషనర్ సర్దార్ వహీద్ ఖాన్ ఆరోపించారు.

    తవ్వకాలు ప్రారంభించడానికి ముందు అక్కడ మోహరించిన సైనికులతో ఆ నలుగురు యువకులు సంప్రదించారని జిల్లా అధికారి ఒకరు బీబీసీ ప్రతినిధి షాజాద్ మాలిక్‌కు తెలిపారు. ఆ ప్రాంతం నియంత్రణ రేఖకు చాలా దగ్గరగా ఉందని, అందువల్ల తవ్వకాలు జరపడానికి ముందు ఆ ప్రాంతాన్ని తనిఖీలు చేయాలని, దీనికి ఒక రోజు పడుతుందని యువకులకు సైనికులు చెప్పారు. యువకులు మాత్రం సైనికుల మాట పట్టించుకోకుండా తవ్వడం మొదలుపెట్టారని జిల్లా యంత్రాంగం చెబుతోంది. దీంతో పేలుడు జరిగి నలుగురూ మరణించారు. ఈ ఘటనపై భారత్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

  13. ప్రజాస్వామ్యానికి భారత్ తల్లి, ఇక్కడ సమస్యలపై బహిరంగంగా చర్చ జరుగుతుందన్న మోదీ, బ్లూమ్‌బెర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్‌లో ప్రసంగించిన ప్రధాని మోదీ

    ప్రధానమంత్రి మోదీ, బ్లూమ్‌బెర్గ్, దిల్లీ
    ఫొటో క్యాప్షన్, బ్లూమ్‌బెర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్‌లో ప్రసంగించిన ప్రధాని మోదీ

    ప్రజాస్వామ్యానికి తల్లిలాంటి భారత్‌లో వివిధ అంశాలపై బహిరంగంగా చర్చ జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు.

    మంగళవారం దిల్లీలో జరిగిన బ్లూమ్‌బెర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు.

    "ప్రజాస్వామ్యానికి భారత్‌ తల్లి. ఈ దేశంలో 100కు పైగా భాషలు ఉన్నాయి. సుమారు 80,000 రిజిస్టర్డ్ వార్తాపత్రికలు, పబ్లిషర్స్ ఉన్నారు. 1,000కి పైగా శాటిలైట్ టీవీ చానెళ్లు ఉన్నాయి. అంతేకాకుండా, సోషల్ మీడియా యుగంలో, దేశంలో 50 కోట్లకుపైగా యూట్యూబ్ వినియోగదారులు ఉన్నారు. 50 కోట్లకు పైగా ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు ఉన్నారు. వివిధ అంశాలపై బహిరంగ చర్చలు జరుగుతాయి, వివిధ విషయాలపై చర్చిస్తారు. ఇందులో డిజిటల్ పవర్ కీలకం" అని ఆయన అన్నారు.

    భారత్‌లో తొలిసారిగా జరుగుతున్న బ్లూమ్‌బెర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్ కార్యక్రమం అక్టోబర్ 15వ తేదీన ముగుస్తుంది.

  14. యెమెన్ ఎడారుల్లో సాగుతున్న యుద్ధం మరోసారి ప్రపంచాన్ని కుదిపేసే పరిణామాలకు దారి తీస్తుందా?

  15. రాజస్థాన్: మాజీ ఎమ్మెల్యేను గ్రామ ప్రజలే కొట్టి చంపారని కేసు, క్రషర్ వివాదంలో రాజస్థాన్ మాజీ ఎమ్మెల్యేను గ్రామస్తులు కొట్టిచంపినట్టు కేసు నమోదు

    రాజస్థాన్, బయానా, బీజేపీ, కాంగ్రెస్,
    ఫొటో క్యాప్షన్, రాజస్థాన్‌లోని బయానా మాజీ ఎమ్మెల్యేను స్థానిక ప్రజలు కొట్టి చంపారని కేసు నమోదైంది.

    రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో బయానా మాజీ ఎమ్మెల్యే అత్తర్ సింగ్ భదానా ఆదివారం నాడు హత్యకు గురయ్యారు.

    "కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు, సోమవారం 33 మంది వ్యక్తులపై, మరో 70 నుంచి 80 మందిపై కేసు నమోదు చేశాం" అని భరత్‌పూర్ జిల్లా ఎస్పీ రాజేశ్ మీనా బీబీసీ న్యూస్ హిందీతో ఫోన్‌లో మాట్లాడుతూ చెప్పారు.

    "గత రెండేళ్లుగా వేయిర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భోండా గ్రామంలో ఉన్న క్రషర్‌కు వెళ్లే దారి విషయంలో గ్రామస్థులకు, క్రషర్ యజమానికి (మరణించిన అత్తర్ సింగ్ భదానా) మధ్య వివాదం నడుస్తోంది. ఆ క్రషర్‌ను గ్రామస్థులు వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది" అని రాజేశ్ మీణా తెలిపారు.

    ఈ హత్య జరిగినప్పటి నుంచి గ్రామంలోని చాలా మంది పరారీలో ఉన్నారు, చాలా ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయి. "పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నాం. ముందుజాగ్రత్త చర్యగా పోలీసు బలగాలను గ్రామంలో మోహరించాం" అని వేయిర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ ధీరేంద్ర బీబీసీతో ఫోన్‌లో మాట్లాడుతూ చెప్పారు.

    మరణించిన అత్తర్ సింగ్ భదానా ఫరీదాబాద్‌లోని పాలి గ్రామానికి చెందిన వ్యక్తి. ఆయన బయానా నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా పనిచేశారు, ఆ తర్వాత కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. ఆయన ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో క్రషర్ వద్దకు వెళ్లారు. అప్పుడే పెద్ద సంఖ్యలో గ్రామస్థులు వచ్చి కర్రలతో అత్తర్ సింగ్‌పై దాడి చేశారని చెబుతున్నారు.

  16. బోరుబావిలో 230 అడుగుల లోతుకు వెళ్లి 5 ఏళ్ల చిన్నారిని కాపాడిన 11 ఏళ్ల అబ్బాయి

  17. మరోసారి దిల్లీ పోలీసుల అదుపులో సీజేపీ నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా, జంతర్ మంతర్ వద్దకు వెళ్లేందుకు సీజేపీ నాయకులు ప్రయత్నం

    కాక్రోచ్ జనతా పార్టీ కో కన్వీనర్లు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాను మరోసారి అదుపులోకి తీసుకున్న పోలీసులు
    ఫొటో క్యాప్షన్, కాక్రోచ్ జనతా పార్టీ కో కన్వీనర్లు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాను మరోసారి అదుపులోకి తీసుకున్న పోలీసులు

    జంతర్ మంతర్ వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సీజేపీ నాయకులను దిల్లీ పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు. సీజేపీ కో కన్వీనర్లు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్ తోపాటు అజింక్య షిండే సహా అనేకమంది మద్దతుదారులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి, సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో, పార్టీకి చెందిన కొందరు మద్దతుదారులు జంతర్ మంతర్‌కు చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు ఉంది. "ఈ రోజు తెల్లవారుజామున త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని జంతర్ మంతర్‌లోకి ప్రవేశించిన వారిని దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అశుతోష్ రంకా, సౌరవ్ దాస్, అజింక్య షిండే బృందంలోని ఇతర సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. నరేంద్ర మోదీ, మీరు ఈ నిరసనలను ఆపలేరు" అని ఆపోస్టులో దీప్కే రాశారు.

  18. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌తో విజయ్ దేవరకొండ దంపతుల భేటీ, తమిళనాడు సీఎం ఎంతో ఇష్టమైన వ్యక్తిగా మారిపోయారన్న విజయ్ దేవరకొండ

    తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌తో విజయ్ దేవరకొండ దంపతుల భేటీ
    ఫొటో క్యాప్షన్, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌తో విజయ్ దేవరకొండ దంపతుల భేటీ

    తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌తో నటుడు విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులు సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన వివరాలను విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియాఖాతాల్లో పోస్టు చేశారు. కోలీవుడ్ స్టార్ తలపతి విజయ్‌తో గడిపిన సమయం ఎంతో అద్బుతంగా ఉందని పేర్కొన్నారు. పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ తమను ఎంతో ప్రేమతో ఆహ్వానించారని, జీవితం, పని, ప్రపంచం పట్ల తన ఆలోచనలు కూడా పంచుకున్నారని తెలిపారు. ఒక్క సమావేశంతోనే ఎంతో ఇష్టమైన వ్యక్తిగా మారిపోయారని అన్నారు.

  19. దిల్లీ: జంతర్‌మంతర్‌‌‌కు ‘తాళం’.. ఇక్కడి పోరాటాల చరిత్ర ఏంటి?